Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 27 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 27 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories – 27 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్
Naa Autograph Sweet Memories – 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

 ఇద్దరూ ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి మహేష్ కూడా బయట నుండి వచ్చాడు.

హాల్లో పక్కపక్కనే కూర్చున్న సుమిత్ర, రాముల వైపు చూసి…వాళ్ళిద్దరి మొహాలు ప్రశాంతంగా ఉండటం చూసి నవ్వుకుంటూ సుమిత్ర వైపు చూసి అంతా ఓకే కదా అన్నట్టు సైగ చేసాడు.
సుమిత్ర కూడా అంతా ఓకే అన్నట్టు సైగ చేసింది…..దాంతో వాళ్ళు ముగ్గురూ కలిసి కొద్దిసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు.
తరువాత వాళ్ళు ముగ్గురూ రాత్రి భోజనం అయిపోయిన తరువాత కొటలోపలికి వెళ్లారు.
సుమిత్ర : మనం ఇప్పుడు సైకో మెట్రిక్ అనే పధ్దతిని ఉపయోగిస్తున్నాము…..

మహేష్ : సైకో మెట్రిక్…..అంటే….ఏంటి….
సుమిత్ర : ఈ పద్ధతిలో ఏ మనిషి అయినా సరె…..చనిపోయిన వ్యక్తి ఆత్మతో మాట్లాడగలుగుతాడు…కొద్దిసేపు ఆ వ్యక్తి మనిషిని ఆవహించి తన గురించి పూర్తిగా చెప్పేస్తాడు….మోహిని గురించిన పూర్తి వివరాలు మనకు కేవలం రంజిత్ సింగ్ యొక్క ఆత్మ ఒక్కటే మనకు చెప్పగలదు….

అంటూ సుమిత్ర అక్కడ గదిలొ ఉన్న లైట్లన్ని ఆర్పేసి రంజిత్ సింగ్ ఉన్న పెయింటింగ్ దగ్గర ఒక రౌండ్ టీపాయ్ లాంటిది వేసి దాని చుట్టూ మూడు కుర్చీలు వేసి ఒక చైర్ లో తను కూర్చుంటూ….వాళ్ళను కూడా కూర్చోమన్నది.
రాము, మహేష్ చైర్స్ లో కూర్చోగానే సుమిత్ర తన హ్యాండ్ బ్యాగ్ లో జర్నలిస్ట్ లు వాడే చిన్న రికార్డర్ తీసి టీపాయ్ మిద పెట్టి రికార్డ్ బటన్ ఆన్ చేసి టీపాయ్ మధ్యలో ఒక క్యాండిల్ వెలిగించి….వాళ్ళీద్దరి వైపు చూసి చేతులు చాపి, “ఇప్పుడు ముగ్గురం ఒకరి చేతులను ఒకరం పట్టుకుని ఉందాం…..ఇప్పుడు ఏం జరిగినా….ఎన్ని కేకలు వినిపించినా….ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి చేతులు ఒకరం విడవకూడదు….మన మధ్యలోకి వచ్చి ఎనర్జీ అనేది బయటకు వెళ్లకూడదు….” అంటూ సుమిత్ర కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదువుతున్నది.
రాము, మహేష్ ఇద్దరూ సుమిత్ర మొహం లోకి టెన్షన్ గా ఏం జరగబోతుందా అన్నట్టు చూస్తున్నారు.
సుమిత్ర కళ్ళు మూసుకుని మంత్రాలు చదవడం మొదలు పెట్టిన ఐదు నిముషాలకు అక్కడ పక్కనే ఉన్న లైట్లు వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి.
కాని తాము లైట్లు మొత్తం ఆపేసామని విషయం గుర్తుకొచ్చిన రాము మహేష్ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ వాళ్ళీద్దరూ ఒకరి చేతిని ఒకరు ఇంకా గట్టిగా పట్టుకుంటూ సుమిత్ర వైపు చూసారు.
కాని సుమిత్ర మాత్రం ఇవేమి పట్టనట్టు కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతూ ఉంటుంది.
అలా మంత్రాలు చదువుతున్న సుమిత్ర ఒక్కసారిగా తలను గట్టిగా విదిలిస్తూ ఏవో మాటలు గట్టిగా అంటుంటుంది.
ఆమె ఏం చెబుతుందో అర్ధం కాక వాళ్ళిద్దరూ సుమిత్ర వైపు అలాగే గట్టిగా చేతులు పట్టుకుని చూస్తూ ఉంటారు.
అలా పది నిముషాల పాటు సుమిత్ర ఏవో మాటలు మాట్లాడుతుంటె అక్కడ గదిలో ఉన్న లైట్లు స్పీడుగా వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి.
అది చూసి రాము, “అరేయ్….చేతులు వదిలిపెట్టకు,” అంటూ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు.
తరువాత సడన్ గా సుమిత్ర ముందు ఉన్న టీపాయ్ మిద తల పెట్టి కదలకుండా ఉండిపోయింది.

అలా ఒక్క నిముషం కదలకుండా ఉండిపోయిన తరువాత సుమిత్ర మళ్ళీ తల పైకెత్తి స్పీడుగా ఊపిరి పీలుస్తుండటం చూసి రాము కంగారుగా, “సుమిత్రా నువ్వు బాగానే ఉన్నావు కదా….” అనడిగాడు.
సుమిత్ర ఇక వాళ్ల చేతులు వదిలేసి, “హా…హా….అంతా బాగానే ఉన్నది….నేను బాగానే ఉన్నాను,” అంటూ వాళ్ళిద్దరి వైపు చూసి, “ఇక గెస్ట్ హౌస్ కి వెళ్దాం పదండి,” అని అనగానే ముగ్గురూ అక్కడ నుండి బయలుదేరి గెస్ట్ హౌస్ లోకి వచ్చి తమ రూమ్ లో కూర్చుని రికార్డర్ ఆన్ చేసారు.
కాని అందులో రికార్డ్ అయిన మాటలు ఏమీ అర్ధం కాకపోవడంతో రాము తల ఎత్తి సుమిత్ర వైపు, మహేష్ వైపు అయోమయంగా చూసాడు.

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button