Naa Autograph Sweet Memories – 38 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్
Naa Autograph Sweet Memories - 38 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 38 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ సుందర్ చనిపోయిన దగ్గర నుండి తనకు రాముతో ప్రశాంతంగా గడపడానికి టైం దొరకకపోవడంతో చాలా అసహనంగా ఉన్నది రేణుకకి. దాంతో రేణుక సునీత వైప్ చూస్తూ, “మీరు వెళ్ళి పడుకోండి సునీత….నేను కొద్దిసేపు రాముతో మాట్లాడి వస్తాను,” అన్నది. రేణుక అలా అనగానే వాళ్ళిద్దరి సంగతి తెలిసిన సునీత చిన్నగా నవ్వుతూ, “సరె….ఎక్కువ సేపు కబుర్లతో కాలక్షేపం చేయకుండా తొందరగా వచ్చేయ్….మళ్ళి పొద్దున్నె జర్నీ చేయాలి….ఈ ప్రాబ్లం నుండి బయటపడితే నేను మీ ఇద్దరి విషయం మీ అమ్మకు చెప్పి పెళ్ళి చేయించేస్తాను….అప్పుడు మీ ఇద్దరూ మీ ఇష్టం వచ్చినట్టు ఉందురుగారు,” అన్నది. సునీత అన్న మాటలకు రేణుక నవ్వుతూ సిగ్గుపడుతూ తల వంచుకున్నది. కాని నిజం తెలిసిన రాము మాత్రం రేణుకకు తను ఈ కాలం వాడిని కాదని అసలు సంగతి చెప్పినా అర్ధం చేసుకోకుండా తన మీద ఆశలు పెంచుకోవడంతో ఎలా నచ్చచెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. రాము ఆలోచించడం గమనించిన సునీత అతని దగ్గరకు వచ్చి, “ఎక్కువగా ఆలోచించకు రాము….అంతా మంచే జరుగుతుంది. నీకు రేణుక మీద ఉన్న ప్రేమ, ఆమెను ఎలాగైనా కాపాడాలన్న తపన నాకు అర్ధమవుతున్నాయి….రేణుక చాలా అదృష్టవంతురాలు. మీ ఇద్దరూ సంతోషంగా ఉండటమే నాకు కావాలి,” అంటూ చిన్నగా భుజం మీద తట్టింది. దాంతో రాము తల ఎత్తి సునీత వైపు చూస్తూ, “అది కాదు సునీత గారు….మీకు ఇంతకు ముందే చెప్పాకదా….నేను మీ కాలం వాడిని కాదు….మీరు 1960 కాలానికి చెందిన వారైతే….నేను 2010 కాలానికి చెందిన వాడిని….ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నేను రేణుక కన్నా యాభై ఏళ్ళు చిన్నవాడిని….అలాంటప్పుడు రేణుకని పెళ్ళి ఎలా చేసుకుంటాను….అదీ కాక నేను ఈ కాలంలోకి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు….మళ్ళి ఎలా వెళ్తానో, ఎప్పుడు వెళ్తానో కూడా తెలియదు….ఇలాంటి పరిస్థితుల్లో నేను రేణుకని ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు అర్ధం కావడం లేదు….కాని ఒక్కటి మాత్రం నిజం సునీత గారు,” అంటూ రాము రేణుక వైపు చూస్తూ, “రేణుక…..నువ్వంటే నాకు చాలా ఇష్టం…..నీ కోసం నా ప్రాణాలు అయినా ఇస్తాను….నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేను ఏదైనా చేస్తాను,” అన్నాడు. రాము అలా ఎమోషనల్ గా అనగానే రేణుక కూడా అతని కళ్ళల్లోకి చూసింది….రాము కళ్ళల్లో తన మీద ప్రేమ కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. వెంటనే తన చైర్ లోనుండి లేచి రాము పక్కనే ఉన్న చైర్ లో కూర్చుని అతని భుజం మీద తల పెట్టి తన చేత్తో రాము చేతిని పట్టుకుని దగ్గరగా కూర్చున్నది. వాళ్ళిద్దరూ అలా బాగా ఎమోషనల్ అవడం చూసిన సునీత వాళ్ళను కదిలించడం ఇష్టం లేక, “చూడు రాము….నువ్వు ఇక్కడకు ఎలా వచ్చావో తెలియదంటున్నావు….నీ దారిలోకే వద్దాము….నువ్వు చెప్పేదాని ప్రకారం అయితే నువ్వు ఇప్పుడు రేణుక కన్నా యాభై ఏళ్ళు చిన్నవాడివి అంటున్నావు….ఇప్పుడు నీ వయసు ఎంత?” అంటూ రాము ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చున్నది. సునీత అలా ఎందుకడిగిందో అర్ధం కాక, “నా కాలం లెక్కప్రకారం ఇప్పుడు నా వయస్సు 24 ఏళ్ళు….” అన్నాడు రాము. సునీత : ఏం చదువుకున్నావు. రాము : M.B.A అయిపోయింది….సివిల్స్ రాసాను…రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాను…. సునీత : అంటే….ఇప్పుడు నువ్వు మా కాలంలో ఉన్నానంటున్నావు….మాకు అర్ధమయ్యేట్టు చెప్పు…. రాము : అదీ….అదీ….M.B.A అంటే కంపెనీల్లో దాదాపు పెద్ద పోస్ట్ లాంటిది….మీ లెక్కలో చెప్పాలంటే M.A, M.Com తో సమానమైనది…. సునీత : మరి సివిల్స్ అంటే….. రాము : సివిల్స్ అంటే…..IAS, IPS, IFS…..మొదలైనవి….అంటే కలెక్టర్, పోలీసుల్లో SP హోదా లాంటివి…. సునీత : అంటే బాగానే చదువుకున్నావు….ఇప్పుడు చెప్పు….నువ్వు ఈ కాలం ప్రకారం రేణుక కన్నా పెద్దవాడివా, చిన్నవాడివా. రాము : మా కాలం ప్రకారం అయితే చిన్నవాడిని…..ఇప్పుడి వయసు ప్రకారం చూసుకుంటే రేణుక వయసు 20 ఏళ్ళు, నా వయసు 24 ఏళ్ళు….రేణుక కన్నా పెద్దవాడిని. సునీత : పాతకాలంలో ఒక సామెత ఉన్నది తెలుసా….When in Rome, do as the Romans...