ఆదిపురుష్ సినిమా గురించి తరణ్ ఆదర్శ్ అలాంటి కామెంట్లు చేశారా?
ఆదిపురుష్ సినిమా గురించి తరణ్ ఆదర్శ్ అలాంటి కామెంట్లు చేశారా?
ఆదిపురుష్ సినిమా గురించి తరణ్ ఆదర్శ్ అలాంటి కామెంట్లు చేశారా?
ఈ సినిమా అంచనాలను ఏ మాత్రం అందుకొలేదని తరణ్ ఆదర్శ్ చెప్పుకొచ్చారు. దర్శకుడు ఓం రౌత్ కు తను కోరుకున్న నటీనటులను, అత్యంత భారీ బడ్జెట్ ను కేటాయించినా భారీ గందరగోళాన్ని సృష్టించాడని తరణ్ ఆదర్శ్ అన్నారు. తరణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ కు 37,000కు పైగా లైక్స్ రావడం గమనార్హం. అయితే ప్రభాస్ ఈ సినిమాలో రాముని పాత్రలో నటించడం వల్లే తరణ్ ఆదర్శ్ ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇచ్చారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఆదిపురుష్ మరీ అద్భుతమైన సినిమా అని చెప్పబోమని అయితే బ్యాడ్ మూవీ మాత్రం కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఆదిపురుష్ మూవీ ప్రదర్శితమవుతున్న థియేటర్ కు ఒక కోతి హాజరు కావడం గమనార్హం. అనుకోని అతిథిలా వచ్చిన కోతిని చూసి చాలామంది నెటిజన్లు జై శ్రీరామ్ అని కామెంట్లు చేశారు.
ఆదిపురుష్ (Adipurush) సినిమా కలెక్షన్ల ఆధారంగా ఈ సినిమా తుది ఫలితం తేలే అవకాశం ఉంటుంది. ఈ సినిమా గురించి నెగిటివ్ గా ప్రచారం చేయవద్దని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రభాస్ కు కెరీర్ పరంగా కలిసి రావాలని వరుస బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.