Tollywood NewsTrending News

ఇద్దరిలో ఎవరికి?

ఇద్దరిలో ఎవరికి?

ఇద్దరిలో ఎవరికి?

 ఇద్దరిలో ఎవరికి?
ఇద్దరిలో ఎవరికి?
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! ఇటీవల పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కాగానే బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు తారక్‌.

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ (Devara)చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇటీవల పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కాగానే బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు తారక్‌. హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందుతున్న ‘వార్‌-2’ (War 2) చిత్రానికి ఆయన సైన్‌ చేసిన సంగతి తెలిసిందే! యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ (yash raj Films) నిర్మించనున్న ఈ చిత్రంలో హృతిక్‌ రోషన్‌తో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్‌. ఈ ఇద్దరి మధ్య జరిగే యుద్థం నెక్స్ట్‌ లెవల్లో ఉంటుందని బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అయాన్‌ ముఖర్జీ (Ayan mukharji)దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట.

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీని (Kiara adwani) ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఆమె హృతిక్‌ రోషన్‌కు జోడీనా? లేక ఎన్టీఆర్‌కి జోడీనా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కియారా రామ్‌ చరణ్‌ సరసన ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో నటిస్తోంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button