Tollywood NewsTrending News

ఈ వీడియోలు చూసి ఆదిపురుష్ ‘హిట్టో.. ఫట్టో’ మీరే చెప్పమంటున్న కృతి సనన్..!

ఈ వీడియోలు చూసి ఆదిపురుష్ ‘హిట్టో.. ఫట్టో’ మీరే చెప్పమంటున్న కృతి సనన్..!

ఈ వీడియోలు చూసి ఆదిపురుష్ ‘హిట్టో.. ఫట్టో’ మీరే చెప్పమంటున్న కృతి సనన్..!

 ఈ వీడియోలు చూసి ఆదిపురుష్ ‘హిట్టో.. ఫట్టో’ మీరే చెప్పమంటున్న కృతి సనన్..!
ఈ వీడియోలు చూసి ఆదిపురుష్ ‘హిట్టో.. ఫట్టో’ మీరే చెప్పమంటున్న కృతి సనన్..!

ఈమధ్య కాలంలో భారతదేశంలో ఏదైనా సినిమాకి ఇంత హైప్ వచ్చిందా అని అనుకుంటే అది ఒక ‘ఆదిపురుష్’ #Adipurush సినిమాకి మాత్రమే. ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) రాముడు, జానకి గా వేసిన ఈ ‘ఆదిపురుష్’ #AdipurushReview సినిమాని ఓం రౌత్ (OmRaut) దర్శకత్వం చేపట్టాడు. ఇది ఆదికావ్యం ‘రామాయణం’ #Ramayanam ఆధారంగా తీసిన సినిమా అని విడుదలకి ముందు చెప్పి ఎక్కువగానే ప్రచారాలు చేశారు. చినజీయర్ స్వామి #ChinnaJeeyarSwami లాంటివాళ్ళని కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ప్రత్యేక అతిధిగా పిలవటం, అతను రావటంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగి, ప్రేక్షకులు ఎలా అయినా చూడాలి ఈ సినిమాని అనుకున్నారు.

Kriti Sanon (3).jpg

అయితే విడుదల అయ్యాక ఈ సినిమాకి వచ్చినన్ని విమర్శలు, ట్రోల్స్ అన్ని వైభాగాల్లోనూ పాత్రలు, మాటలు, సన్నివేశాలు, గ్రాఫిక్స్, ఒకటేమిటి అన్నిటి మీద వచ్చాయి. కొందరయితే ఈ సినిమాని నిషేదించాలని కూడా అన్నారు. దర్శకుడు ఓం రౌత్, మాటల రచయిత మనోజ్ ముంతషీర్ శుక్ల (Manoj Muntashir Shukla) కి చంపేస్తాం అంటూ హెచ్చరికలు కూడా క్షత్రియ కర్నిసేన జారీ చేసింది. ఇంతటి విమర్శలు, నిరసనలు ఈ సినిమా అందుకుంటూ ఉంటే, ఇందులో జానకి పాత్ర వేసిన కృతి సనన్ మాత్రం ఇంకోలా చూస్తోంది.

ఆమె పాపం ఈ సినిమాకి వచ్చిన విమర్శలను తట్టుకోలేక పోయి ఉండొచ్చు ఏమో మరి ఏకంగా అయిదారు వీడియోలు పోస్ట్ చేసింది. “చప్పట్లు, అరుపుల మీద మాత్రమే దృష్టి పెడితే బాగుంటుంది. జై శ్రీరామ్’ అంటూ పోస్ట్ చేసింది. అంటే ఆమె చాల థియేటర్స్ కి వెళ్లి ప్రేక్షకులతో సినిమా చూసిందిట, అప్పుడు అరిచిన అరుపులు, చప్పట్లు ఆమె పోస్ట్ చేసింది. ఆమెకి తెలియదేమో ఆమె వేసిన జానకి పాత్రని కూడా బాగా విమర్శించారు.

kritisanonSita.jpg

అయితే ఈమె పెట్టిన వీడియో లకి నెటిజన్స్ చాలా కోపంగా సమాధానాలు చెపుతూ ఆమెని విమర్శించారు. “కృతి ఈ ‘ఆదిపురుష్’ సినిమా ఒక పెద్ద మిస్టేక్ అయిపోయిందని దీన్ని వదిలేసి, ముందుకు సాగిపో. రామాయణ ఆధారంగా వచ్చిన సినిమాల్లో వరస్ట్ సినిమా ఇది,” అని ఒకతను పెట్టాడు. ఇంకొకతను ఈ సినిమాలో రామాయణాన్ని మొత్తం మార్చేశారు. ఇది నా ఒక్కడికే నచ్చకపోవటం#AdipurushControversy కాదు, చాలామందికి నచ్చలేదు. అసలు ఈ సినిమాని థియేటర్స్ లో నుండి తీసెయ్యాలి, బాన్ చెయ్యాలి అని అన్నాడు.

ఇంకో యూసర్ అయితే మరీ ఘోరంగా తిట్టాడు. “నువ్వు దృష్టి అరుపులు, చప్పట్ల మీద కాదు, నీ దృష్టి సినిమా మీద అది ఎలా తీస్తున్నారు అన్నదానిమీద పెడితే బాగుంటుంది,” అని పెట్టాడు. “నీకు నువ్వు అలా బాగుంది అనుకొని సర్దిచెప్పుకోకు, మీ అందరికీ సిగ్గులేదు,” అని చెప్పాడు ఇంకొకడు. ఇలా కృతి సనన్ పెట్టిన వీడియోల మీద కూడా నెట్టింట విమర్శిస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker