వీడియో: తారకరత్న చిన్న కర్మలో భార్య అలేఖ్య రెడ్డి కన్నీరు!
వీడియో: తారకరత్న చిన్న కర్మలో భార్య అలేఖ్య రెడ్డి కన్నీరు!

వీడియో: తారకరత్న చిన్న కర్మలో భార్య అలేఖ్య రెడ్డి కన్నీరు!
vసినీ నటుడు నందమూరి తారకరత్న.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషాద వార్త అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 23 రోజులపాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందిన తారకరత్న.. సరిగ్గా మహాశివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. తాజాగా తారకరత్న చిన్న కర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు.
ఇటీవల సినీ నటుడు నందమూరి తారకరత్న.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషాద వార్త అందరికీ తెలిసే ఉంటుంది. దాదాపు 23 రోజులపాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందిన తారకరత్న.. సరిగ్గా మహాశివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు. దీంతో తారకరత్న లేని లోటు కారణంగా అటు నందమూరి ఫ్యామిలీలో.. ఇటు నందమూరి అభిమానులలో విషాదం నెలకొంది. తాజాగా తారకరత్న చిన్న కర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ నెల 18న తారకరత్న మరణించగా.. 20న ఆయన అంత్యక్రియలు జరిగాయి.
ఇక తాజాగా నిర్వహించిన తారకరత్న చిన్న కర్మ కార్యక్రమంలో నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు. తారకరత్న పేరెంట్స్ మోహనకృష్ణ, సీత.. చెల్లెలు రూపతో పాటు బాలకృష్ణ ఫ్యామిలీ.. రామకృష్ణ, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ, ఇతర కుటుంబ సభ్యులు చిన్న కర్మలో పాల్గొని.. తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులే కాకుండా పలువురు సినీ ప్రముఖులు సైతం తారకరత్న చిన్న కర్మలో పాల్గొన్నారు. ఇక తారకరత్న చిన్నకర్మ కార్యక్రమంలో.. ఆయన భార్య అలేఖ్యా రెడ్డి తీవ్ర దుఃఖానికి లోనయ్యారు.
ఎంతో ప్రేమగా.. అన్యోన్యంగా ఇన్నాళ్లు భర్త ప్రేమను పొందిన అలేఖ్య.. భర్త ఇక లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తారకరత్నని తలచుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యింది. దీంతో దుఃఖంతో ఏడుస్తున్న తల్లిని పెద్ద కుమార్తె నిషిక ఓదార్చిన దృశ్యం చూస్తే గుండెలు తరుక్కుపోతాయి. కూతురితో పాటు భావోద్వేగాన్ని ఆపుకోలేకపోతున్న అలేఖ్యను కుటుంబ సభ్యులంతా ఓదార్చే ప్రయత్నం చేశారు. భర్త చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటిస్తూ అలేఖ్య కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం తారకరత్న చిన్న కర్మ కార్యక్రమంలో ఆయన భార్య అలేఖ్య విలపించిన దృశ్యాలు అందరినీ కలచి వేస్తున్నాయి.