hi
Trending News

Panch Prasad : చావు బ్రతుకుల అంచుల్లో జబర్దస్త్ కమెడియన్.. కన్నీళ్లు పెట్టిస్తున్న మాటలు..!

Panch Prasad : చావు బ్రతుకుల అంచుల్లో జబర్దస్త్ కమెడియన్.. కన్నీళ్లు పెట్టిస్తున్న మాటలు..!

Panch Prasad : చావు బ్రతుకుల అంచుల్లో జబర్దస్త్ కమెడియన్.. కన్నీళ్లు పెట్టిస్తున్న మాటలు..!

Panch Prasad : చావు బ్రతుకుల అంచుల్లో జబర్దస్త్ కమెడియన్.. కన్నీళ్లు పెట్టిస్తున్న మాటలు..!

 

Panch Prasad  : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది ఫేమస్ అయిపోయారు. కనీసం అప్పటి వరకు ఎవరికీ తెలియని వారు కూడా ఈ షో పుణ్యమా అని రాత్రికి రాత్రే స్టార్లు అయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో బాగా చెప్పుకోదగ్గ కమెడియన్ అంటే అందరికీ టక్కున పంచ్‌ ప్రసాద్ గుర్తుకు వస్తాడు ఆయన తనదైన పంచ్‌ లతో బాగానే అలరిస్తున్నాడు.

అయితే ఆయన గత కొంత కాలంగా కిడ్నీ ఫెయిల్యూర్‌ తో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నారని చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే వాటిపై తాజాగా ఆయన స్పందించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నాకు పెండ్లైన మొదట్లో ముక్కు నుంచి రక్తం వచ్చేది. దాంతో ఆస్పత్రికి వెళ్లి చెకప్ చేయించుకున్నాను.

కాలికి చీము రావడంతో..

రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపారు. ఆ తర్వాత డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలో నాకు విపరీతమైన నడుము నొప్పి, జ్వరం వచ్చాయి. డాక్టర్లు పరీక్షలు చేసినా కనిపెట్టలేకపోయారు. చివరకు ఎమ్ ఆర్‌ ఐ తీయగా నడుము కింద నుంచి కాలి వరకు ఎముకకు చీము వచ్చినట్టు గుర్తించారు. మందులు వాడినా పెద్దగా ఫలితం రాలేదు.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. నాకు కిడ్నీ డోనర్ కూడా దొరికారు. త్వరలోనే ఆపరేషన్ చేయించుకుంటున్నాను. కానీ నా కాలికి చీము రావడం వల్ల కొద్ది రోజులు ఆపరేషన్‌ ను వాయిదా వేస్తామని డాక్టర్లు చెప్పారు అని వివరించాడు పంచ్‌ ప్రసాద్‌. ఆయన త్వరగా కోలుకుని, మళ్లీ జబర్దస్త్ లో కనిపించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక పంచ్ ప్రసాద్ ఆపరేషన్‌ ఖర్చు తానే భరిస్తానని కిరాక్‌ ఆర్పీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button