Tollywood NewsTrending News

సినీ పరిశ్రమలో మరో విషాదం.. యువ నటి మృతి..!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. యువ నటి మృతి..!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. యువ నటి మృతి..!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. యువ నటి మృతి..!
సినీ పరిశ్రమలో మరో విషాదం.. యువ నటి మృతి..!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంత మాత్రం తగ్గడం లేదు. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. కొందరు అనారోగ్య సమస్యలతో, ఇంకొందరు వయసు సంబంధిత సమస్యలతో మరణించారు.ఇంకొంతమంది అయితే గుండెపోటుతో మరణించారు. మొన్నటికి మొన్న కన్నడ నటుడు నితిన్ గోపి కూడా గుండె పోటుతో మరణించడం జరిగింది. అలాగే దర్శకుడు వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శరన్ రాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ తర్వాత క్యాన్సర్ తో మంగళ్ ధిల్లాన్ అనే నటుడు మరణించాడు. ఇక తాజాగా మరో నటి యాక్సిడెంట్ పాలై మరణించిన సంగతి తెలిసిందే.

వివరాల్లోకి వెళితే.. పార్క్‌ సూ రియాన్‌ అనే కొరియన్ నటి దురదృశావశాత్తు.. మెట్లపై నుండి కింద పడి మరణించింది.జూన్‌ 11న ఆమె మెట్లు దిగుతుండగా జారి కిందపడ్డారు. దీంతో ఆమె తలకు బలమైన గాయం అయింది. గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు ఆమెకు ఐసీయూలో చికిత్స అందించినా ఆమె బ్రెయిన్‌ డెడ్‌ అయిపోయిందని వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారట. దీంతో వాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలుస్తుంది. ఇక బతకదని తెలియడంతో అవయవదానానికి కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

పార్క్‌ సూ రియాన్‌ 2018లో మ్యూజిక్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జేటీబీసీ డ్రామా స్నో డ్రాప్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈమె స్నో డ్రాప్‌ ద్వారా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఆమె మరణవార్తకి చింతిస్తూ కొరియన్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker