30 ఏళ్లకు.. పెళ్లి.. పిల్లలు అని ప్లాన్ చేసుకున్నా.. కానీ..
30 ఏళ్లకు.. పెళ్లి.. పిల్లలు అని ప్లాన్ చేసుకున్నా.. కానీ..
30 ఏళ్లకు.. పెళ్లి.. పిల్లలు అని ప్లాన్ చేసుకున్నా.. కానీ..
విజయ్ వర్మతో (Vijay Varma) ప్రేమలో ఉన్నానంటూ ప్రకటించినప్పటి నుంచి మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah)వార్తల్లో ఉన్నారు. మీడియాలో ఎక్కడ చూసిన తమన్నా, ప్రేమ వ్యవహారం, పెళ్లి గురించే ప్రస్తావన. అందుకు తగ్గట్లే తమన్నా కూడా స్పందిస్తున్నారు.
విజయ్ వర్మతో (Vijay Varma) ప్రేమలో ఉన్నానంటూ ప్రకటించినప్పటి నుంచి మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah)వార్తల్లో ఉన్నారు. మీడియాలో ఎక్కడ చూసిన తమన్నా, ప్రేమ వ్యవహారం, పెళ్లి గురించే ప్రస్తావన. అందుకు తగ్గట్లే తమన్నా కూడా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’(Lust storis 2) వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి కాస్త ఓపెన్‌గా మాట్లాడుతుంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్ షూటింగ్‌లోనే విజయ్ వర్మతో అనుబంధం పెరిగిందని చెప్పింది తమన్నా. ‘‘అవును మేమిద్దరం ప్రేమలో పడ్డాం, జీవితంలో ఇలాంటి వ్యక్తి కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశా, నాకు రక్షణగా ఉంటాడనే నమ్మరం ఉందని చెప్పిన మిల్కీబ్యూటీ వివాహం విషయంలో ఒత్తిడిగా ఉన్నారా? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. Tamannaah loves Vijay varma)
‘‘ఆడ, మగ, ఇద్దరిలో ఎవరికైనా పెళ్లి అనేది ఓ ముఖ్యమైన బాధ్యత. పెళ్లి జరగాలంటే సమయం రావాలంటారు పెద్దలు. అది నిజమే. కానీ మనకు నచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం కాదు.. ఆ బాధ్యతకు మనం సిద్థంగా ఉన్నామా లేదా అన్నది ఆలోచించాలి. ఆ నమ్మకం కలిగినప్పుడే వివాహబంధంలోకి అడుగుపెట్టాలి. పెళ్లంటే పార్టీ కాదు, పార్టీలా సెలబ్రేట్ చేసుకోవడం అంతకన్నా కాదు. అది చాలా కాలం కలిసి ఉండే విషయం. అందుకే ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. నా కెరీర్ ప్రారంభమైనప్పుడు 10 ఏళ్లు బిజీగా ఉంటాననుకున్నా. 30 ఏళ్లకు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకున్నా. పరిస్థితుల దృష్ట్యా నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఈ విషయంలో నేటి తరాన్ని ప్రశంసించాలి. పాతతరం లాగా ఒకరిని చూసి వారు అభిప్రాయాలు మార్చుకోవడం లేదు. నేను కూడా మొదట్లో పక్కవారి ఆలోచనలకు ప్రభావితమయ్యే దానిని. ఇప్పుడు అలా లేను. ప్రతి విషయంలోనూ నాకంటూ నిర్ణయాల తీసుకుంటున్నా’’ అని అన్నారు. తాజాగా తమన్నా నటించిన ‘జీ కర్దా’ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలైంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ ఈ నెల 29న నెట్‌ఫ్లిక్స్‌లో స్ర్టీమింగ్ కానుంది.