Srungara Kathamaalika

Srungara Kathamaalika – 224

Srungara Kathamaalika - 224

Mahesh.thehero 

పెద్దయ్యా పెద్దయ్యా …… కళ్ళు మూసుకోకండి నన్ను చూడండి నన్ను చూడండి మీకేమీ కాదు మీకేమీ కాదు హాస్పిటల్ కు వెళుతున్నాము అంటూ బుగ్గలను స్పృశిస్తూ కళ్ళు మూతలుపడకుండా ప్రయత్నిస్తున్నాను .
పెద్దయ్య : తల్లి నా తల్లి తల్లి బాబూ …… నా తల్లి అంటూ కలవరిస్తున్నారు .
ఏమిటో అర్థం కాక పెద్దయ్యా …… ఇలానే స్పృహలో ఉండండి అంటూ అరచేతిలో చేతినివేసి ధైర్యాన్ని ఇస్తున్నాను .
చెప్పినట్లుగానే నిమిషానికొక కిలోమీటర్ దాటినట్లు 15 నిమిషాలలో హాస్పిటల్ చేరుకుని నేరుగా తీసుకెళ్లి బస్సుని అత్యవసర విభాగం దగ్గర ఆపాడు .
ప్రయాణీకులు సహాయం చెయ్యడంతో జాగ్రత్తగా ఎత్తుకుని కిందకుదిగి స్ట్రెచర్ పై పడుకోబెట్టాము .
హాస్పిటల్ స్టాఫ్ …… వేగంగా ICU కు తీసుకెళ్లారు . వెనుకే వెళ్ళాను – కొంతమంది తోడుగా వచ్చారు .
కండక్టర్ వచ్చి నా బ్యాగు అందించి ప్రయాణీకులంతా వేచిచూస్తున్నారు వెళ్లక తప్పదు బాబూ , పెద్దాయనకు ఏమీకాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని వెళ్లారు – తోడుగా వచ్చిన ప్రయాణీకులు కూడా భుజం తట్టి వెళ్లిపోయారు . 

డాక్టర్ బయటకువచ్చి ఆక్సిడెంట్ అయ్యి చాలాసేపు అయ్యింది రక్తం చాలా పోయింది హాస్పిటల్లో *** గ్రూప్ బ్లడ్ ఒక్కటే ఉంది మరొక ప్యాకెట్ అయినా అవసరమౌతుంది లేకపోతే ప్రాణాలకే ప్రమాదం .
డాక్టర్ గారూ ……. నాదీ అదే బ్లడ్ తీసుకోండి .
డాక్టర్ : please come in అంటూ లోపలికి పిలుచుకునివెళ్లి ఖాళీగా ఉన్న బెడ్ చూయించి బ్లడ్ తీసుకున్నారు . ప్రక్కనే తల్లీ తల్లీ …… అంటూ కలవరిస్తున్న పెద్దాయనకు ఒకవైపు బ్లడ్ ఎక్కిస్తూనే తగిలిన గాయాలను శుభ్రం చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు . 
” ( వీడెవడండీ బాబూ ……. ప్రతీ స్టోరీలో లీటర్ల లీటర్ల బ్లడ్ ఇచ్చేస్తున్నాడు అని కోప్పడకండి – మనం బ్లడ్ ఇవ్వడం వలన ఒక ప్రాణం నిలబడుతుంది . ఇలా ప్రతీసారీ గుర్తుచేయ్యడం వలన xossipy ఫ్రెండ్స్ రక్తదానం చేస్తారని చిరు ఆశ – నేను ఇప్పటికే రెండుసార్లు ఇచ్చాను , వాళ్ళు థాంక్స్ చెప్పిన క్షణం కలిగిన ఫీలింగ్ అలాంటిది మరి , లవ్ యు గయ్స్ …….. మీ మహేష్ ) ” .
బ్లడ్ ఇచ్చి బయటకువచ్చి కూర్చున్నాను . 
గంట తరువాత డాక్టర్ బయటకువచ్చి సరైన సమయానికి తీసుకొచ్చారు – సరైన సమయానికి బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణం కాపాడావు – కాసేపట్లో స్పృహలోకి వస్తారు వెళ్లి చూడవచ్చు .
థాంక్ గాడ్ ……. థాంక్యూ డాక్టర్ …….
డాక్టర్ : ఇంతకీ నీకు ……. పెద్దాయనకు ఏమౌతారు .
నో డాక్టర్ …… బస్సులో వెళుతుంటే అంటూ జరిగింది వివరించాను .
డాక్టర్ : గుడ్ అంటూ చేతులు కలిపారు . ఎవరోకూడా తెలియని పెద్దాయన ప్రాణాలు కాపాడావు .
ఆ క్షణం కలిగిన ఫీలింగ్ ……., డాక్టర్ గారూ ……. పెద్దాయన దగ్గర మొబైల్ ఏమైనా ……..
డాక్టర్ : నర్స్ …… చూసుకోండి , sorry రౌండ్స్ కు వెళ్ళాలి .
నో నో నో , మీరు sorry చెప్పడం ఏమిటి …… క్యారి ఆన్ డాక్టర్ ……. 
పెదాలపై చిరునవ్వులతో వెళ్లారు డాక్టర్ గారు .

నర్స్ వచ్చి విషయం తెలుసుకుని , నో సర్ …… వారి దగ్గర ఎటువంటి మొబైల్ లేదు . 
అవునా …… , బహుశా అక్కడే పొదల్లో పడిపోయి ఉంటుంది – ఇప్పుడెలా ……..
నర్స్ : సర్ …… లోపల తల్లీ తల్లీ …… అంటూ కలవరిస్తూనే ఉన్నారు అని పిలుచుకునివెళ్లారు .
తలకు – చేతులకు – కాళ్లకు ……. కట్లు కట్టి ఉండటం చూసి చాలా దెబ్బలు తగిలాయని బాధవేసింది . ప్రక్కనే వెళ్లి నిలబడ్డాను .
సగం కళ్ళతోనే నన్ను గుర్తుపట్టి బాబూ …… అంటూ కన్నీళ్ళతో చేతిని అందుకోబోయారు .
పెద్దయ్యా పెద్దయ్యా …….. కదలకండి అంటూ చేతిని అందుకుని అరచేతిలో చేతినివేసి బెడ్ పై ఉంచాను .
పెద్దయ్య : నా ప్రాణాలు కాపాడావు , నీ రుణం …….
పెద్దయ్యా ……. కాసేపు మాట్లాడకుండా రెస్ట్ తీసుకోండి అని కన్నీళ్లను తుడిచాను . పెద్దయ్యా …… మీవాళ్ళు ఎక్కడ ఉంటారు .
పెద్దయ్య : మొబైల్ మొబైల్ ……. అంటూ తలెత్తి స్స్స్ స్స్స్ …….
కదలకండి పెద్దయ్యా నొప్పివేస్తుంది . చూసాము మీ మొబైల్ లేదు ఆక్సిడెంట్ అయినప్పుడు అక్కడే పడిపోయిందేమో ………
పెద్దయ్య : నెంబర్ నెంబర్ ……. నా కొడుకుది **********
ఇదిచాలు పెద్దయ్యా ……. ఇక మీరు ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి అని కాల్ చేసాను . బ్రదర్ కంగారుపడకండి మీ నాన్నగారికి చిన్న ఆక్సిడెంట్ అయ్యింది – కంగారుపడకండి సరైన సమయానికి హాస్పిటల్ కు తీసుకెళ్లడం వలన సేఫ్ గా ఉన్నారు . 
ఏ హాస్పిటల్ ఏ హాస్పిటల్ సర్ …….
వైజాగ్ ******** హాస్పిటల్ – కంగారుపడకండి బ్రదర్ ……. సేఫ్ అని డాక్టర్స్ చెప్పారు .
సర్ ……. వెంటనే వచ్చేస్తాను – అప్పటివరకూ నాన్నగారు జాగ్రత్త please please సర్ ……..
ప్రక్కనే ఉన్నాను బ్రదర్ …….
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ , ఇప్పుడే వచ్చేస్తాను .
నర్స్ : సర్ …… బ్లడ్ ఇచ్చారుకదా నీరసంగా ఉంటుంది , మీరుకూడా కూర్చోండి అని బెడ్ ప్రక్కనే ఛైర్ వేసింది – ఆపిల్ కూడా ఇచ్చారు .
థాంక్స్ చెప్పాను .

అర గంటలో ఒక తమ్ముడు ICU లోపలికివచ్చి పెద్దయ్యను చూసి , నాన్నగారూ నాన్నగారూ అంటూ కన్నీళ్ళతో ప్రక్కన చేరారు . 
అప్పటికే పెద్దయ్య కొద్దికొద్దిగా మాట్లాడుతున్నారు . కృష్ణా …… నాకేమీ కాలేదు కంగారుపడకు – ఈ బాబు వల్లనే నేను ప్రాణాలతో ఉన్నాను .
తమ్ముడు కన్నీళ్లను తుడుచుకుని థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ అంటూ రెండు చేతులతో నమస్కరించాడు .
నాకు చేతనైనది చేసాను – అంతదానికి …….
పెద్దయ్య : దేవుడిలా వచ్చావు బాబూ ……. 
పెద్దయ్యా …… థాంక్స్ చెప్పారు కదా చాలు పెద్దయ్యా ……. , మీరు సేఫ్ గా ఉన్నారు అంతకంటే సంతోషం ఇంకేమి కావాలి .
పెద్దయ్య : మంచి మనసు బాబూ నీది , కృష్ణా ……. అక్కయ్య ? .
తమ్ముడు : నిన్న సంతకు వెళ్లిన పిన్నీ వాళ్ళతోపాటు ఆటోలో వచ్చారు నాన్నగారూ …….. 
( సంతకు వెళ్లిన పిన్ని వాళ్ళతోపాటు …… దేవత అయి ఉండరులే ) 
పెద్దయ్య : హమ్మయ్యా …… , కృష్ణా …… ఆక్సిడెంట్ విషయం తల్లికి చెప్పలేదు కదా ……..
కృష్ణ : కంగారుపడతారని అక్కయ్యకు – అమ్మకు చెప్పలేదు నాన్నగారూ …… – బుజ్జితల్లికి తెలిస్తే ఏడ్చేస్తుంది .
( బుజ్జితల్లి ……. నా బుజ్జితల్లి అయి ఉండదులే ) 
పెద్దయ్య : అవునవును తాతయ్య అంటే ప్రాణం నా బుజ్జితల్లికి – నన్ను ఇలా చూస్తే ఏడ్చేస్తుంది . కానీ బుజ్జితల్లిని వెంటనే చూడాలనిపిస్తోంది కృష్ణా …….
( ప్రయాణమంతా తాతయ్య తాతయ్య ….. అంటూ కలవరిస్తూనే ఉంది – నా బుజ్జితల్లినేనా …… ) 
కృష్ణ : నాన్నగారూ ……. ఒకరోజైనా రెస్ట్ తీసుకోవాలి .
పెద్దయ్య : ఒకరోజంతానా …… ? , మన బుజ్జితల్లిని చూడకుండా ఉండటం నావల్లకాదు – కృష్ణా …… తనను తన బుజ్జినవ్వులను చూశానంటే వెంటనే కోలుకుంటాను .
నిజమే పెద్దయ్యా …… ప్రాణమైనవాళ్ళతో ఉంటే హాస్పిటల్స్ – మందులు అవసరం లేదు కానీ ట్రీట్మెంట్ కోసం మీకిచ్చిన మత్తు ఇంజక్షన్ పవర్ తగ్గేవరకైనా ఇక్కడే ఉండాలి లేకపోతే కదులలేరు .
పెద్దయ్య : నువ్వు చెబుతున్నావు కాబట్టి సరే బాబూ ……..

హాస్పిటల్ స్టాఫ్ ఒకరు లోపలికివచ్చి ట్రీట్మెంట్ బిల్ సర్ అంటూ రిసిప్ట్ ఇచ్చి కౌంటర్ లో పే చెయ్యండి అనిచెప్పి వెళ్ళిపోయాడు .
తమ్ముడు జేబులన్నీ వెతికి కంగారులో డబ్బు మరిచిపోయాను అంటూ మెడలో ఉన్న చైన్ తియ్యబోయాడు .
తమ్ముడూ …… ఆగు నేను పే చేస్తాను .
కృష్ణ : సర్ …… ఇప్పటికే మీరు ……
పర్లేదు తమ్ముడూ , నువ్వు …… నాన్నగారి దగ్గర ఉండు పే చేసి వస్తాను కావాలంటే ఇంటికివెళ్లాక ఇవ్వు ( ఆ బుజ్జితల్లి …… నా బుజ్జితల్లి ఏమో చూడాలికదా – చూసి ఇప్పటికే గంట పైనే అయ్యింది , ఈ హృదయం ఎలా తట్టుకొంటోందో ఏమిటో ) అని లేచాను .
పెద్దయ్య ….. చేతులకు కట్లు ఉన్నా దండం పెట్టడానికి ప్రయత్నించారు . పెద్దయ్యా ……. మీరు పెద్దవారు , మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలా చెయ్యకూడదు అని ఆపి వెళ్లి కౌంటర్ లో పే చేసివచ్చి ICU బయటే కూర్చున్నాను .
10 నిమిషాల తరువాత కృష్ణ బయటకువచ్చి రెస్ట్ తీసుకుంటున్నారు సర్ అని ప్రక్కన కూర్చున్నాడు . సర్ ……. ఆక్సిడెంట్ ఎలా జరిగింది .
జరిగింది వివరించాను . 
కృష్ణ : సర్ ……. మీరు నిజంగా దేవుడు – మీరు చూడకపోయుంటే మరింత ఆలస్యం అయ్యేది – నాన్నగారికి ఏమైనా జరిగిఉంటే అమ్మ – అక్కయ్య – బుజ్జితల్లి అంటూ కన్నీళ్లు కారుస్తున్నాడు .
అంతా దైవేచ్చ కృష్ణా ……. , బాధపడకు త్వరలోనే కోలుకుంటారు అని ధైర్యం చెప్పాను .

కృష్ణ మొబైల్ మ్రోగడంతో తీసి చూసి , సర్ …… అక్కయ్య చేస్తోంది ఖచ్చితంగా బుజ్జితల్లినే చేయించి ఉంటుంది తాతయ్యను అడుగుతుంది అని మరింత కంగారుపడిపోతున్నాడు .
భుజంపై చేతినివేసి మాట్లాడమని ధైర్యం చెప్పాను .
కృష్ణ : సరే సర్ అంటూ ఎత్తాడు . ” మావయ్యా …… ” స్పీకర్ మూసి బుజ్జితల్లే సర్ …… , బుజ్జితల్లీ …… అమ్మకు ఇవ్వు – తాతయ్యనా …… తాతయ్య తాతయ్య ఇక్కడే నాదగ్గరే ఉన్నారు – మాట్లాడాలా …… ? అదీ అదీ పనిలో ఉన్నారు బుజ్జితల్లీ ……. అమ్మకు ఇవ్వు బంగారూ ……. , అక్కయ్యా …… మీరు టిఫిన్ తినండి ఆలస్యం అవుతుంది వచ్చేస్తాము కదా ……. , సరే సరే వీలైనంత తొందరగా వచ్చేస్తాము అని కట్ చేసి హమ్మయ్యా …… అనుకున్నాడు . 
మంచిపనిచేశావు కృష్ణా …… లేకపోతే పెద్దయ్యను చూసేంతవరకూ కంగారుపడతారు . 
కృష్ణ : అదే భయంగా ఉంది సర్ ……. అక్కయ్య – బుజ్జితల్లి – అమ్మ – ఊరి జనం …. చెప్పనేలేదు కదూ మా ఊరి పెద్ద మా నాన్నగారే సర్ , నాన్నగారి మాటంటే అందరికీ గౌరవం , సర్పంచి కూడా నాన్నగారు చెప్పినట్లే వింటారు .
అందరి ఆశీస్సులు ఉండటం వల్లనే మీ నాన్నగారికి ఏమీకాలేదు . ఆయన ఇక్కడ హాస్పిటల్లో ఉండటం కంటే అంతమంది ఆత్మీయుల మధ్యనే త్వరగా కోలుకుంటారు .

10 గంటల సమయంలో నర్స్ బయటకువచ్చి సర్ …… మిమ్మల్ని పిలుస్తున్నారు .
లోపలికివెళ్లాము .
పెద్దయ్య : నాన్నా కృష్ణా ……. హాస్పిటల్ నాకు పడదని తెలుసుకదా , మత్తు మొత్తం పోయినట్లుంది – నన్ను తొందరగా నా బుజ్జితల్లి దగ్గరకు తీసుకెళ్లు చూడు చేతులు – కాళ్ళు కదిలిస్తున్నాను అని పిల్లాడిలా బ్రతిమాలుతున్నారు – లేవడానికి ప్రయత్నిస్తున్నారు .
నాకు – కృష్ణకు మరియు నర్సుకు కూడా నవ్వు వచ్చేసింది . పెద్దయ్యా ……. ఒక్క నిమిషం ఆగండి డాక్టర్ ను పిలుచుకునివస్తాను , వారు పర్లేదు అంటే మరుక్షణమే తీసుకెళ్లిపోతాము ( బుజ్జితల్లి ఎవరో చూడకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళేది లేదు ) .
నర్స్ : సర్ ….. ఆగండి నేను పిలుచుకునివస్తాను అని వెళ్ళి డాక్టర్ తోపాటు వచ్చారు .

డాక్టర్ గారిని ఆడిగేలోపు …… , డాక్టర్ డాక్టర్ …… నేను బానే ఉన్నాను , నొప్పులేమీ లేవు – నన్ను ఇంటికి పంపించేయ్యండి ఇక్కడ భయం వేస్తోంది అంటూ అటూ ఇటూ కదులుతున్నారు పెద్దయ్య .
కృష్ణ : నాన్నగారూ ……. సైలెంట్ గా ఉండండి , ఆ విషయం చెప్పాల్సినది డాక్టర్ గారు . డాక్టర్ గారూ …… 
డాక్టర్ : త్వరగానే కోలుకున్నారు పెద్దయ్యా …… . పొలం పనులు చేసినవాళ్ళు కదా చూస్తేనే తెలిసిపోతోంది – పేషెంట్ కు ఎక్కడ ఇష్టమో అక్కడికే తీసుకెళ్లండి .
కృష్ణ : డాక్టర్ గారూ …….
డాక్టర్ : కంగారుపడాల్సిన అవసరమే లేదు , కావాల్సినది రెస్ట్ తీసుకోవడం అదేదో ఆయన ఇష్టప్రకారం ఇంటిలోనే తీసుకోవచ్చు , అలా అయితేనే ఆత్మీయుల మధ్యన మరింత త్వరగా కోలుకుంటారు – మందులు రాసిస్తాను , డ్రెస్సింగ్ కోసం రెండు రోజులకొకసారి పిలుచుకునివస్తే సరిపోతుంది – డిశ్చార్జ్ చేస్తున్నట్లు సంతకం చేశారు . 

కృష్ణ : థాంక్యూ డాక్టర్ గారూ ……..
డాక్టర్ : థాంక్స్ మీ నాన్నగారిని సేవ్ చేసినవారికి చెప్పండి – ట్రీట్మెంట్ చేసినందుకు మేము ఫీజ్ తీసుకున్నాము కదా ……..
డాక్టర్ గారూ …… అవన్నీ అయిపోయాయి – ఇప్పుడు మళ్లీ మొదటికి వస్తారు కృష్ణా ……. స్టార్ట్ చెయ్యకు .
కృష్ణ : అలాగే సర్ అంటూ పెదాలపై నవ్వుతూ …… , నాన్నగారూ …… సంతోషమే కదా , మీ ఇష్టప్రకారమే ఇంటికి వెళదాము – అంబులెన్స్ ను సెట్ చేస్తాను .
పెద్దయ్య : అంబులెన్స్ లో వెళితే మీ అక్కయ్య – అమ్మ – మన బుజ్జితల్లి భయపడిపోతారు , బండి తెచ్చావుకదా వెనుక కూర్చుంటాను .
భలేవారు పెద్దయ్యా ……. ఇంకేమైనా ఉందా , కృష్ణా …… మందుల రిసిప్ట్ ఇవ్వు , మందులు తీసుకుని క్యాబ్ తీసుకొస్తాను – అంతలోపు నాన్నగారిని వీల్ చైర్ లో బయటకు తీసుకురా ……..
కృష్ణ : అలాగే సర్ అంటూ రిసిప్ట్ ఇచ్చాడు . 
హాస్పిటల్లోని మెడికల్ షాప్ లో మెడిసిన్ తీసుకుని , బయటకువెళ్లి క్యాబ్ బుక్ చేసుకుని వచ్చాను .
కృష్ణ : చూడండి సర్ …… వీల్ చైర్ వద్దు నడుస్తాను అన్నారు . బ్రతిమిలాడి వీల్ చైర్లో తీసుకురావాల్సి వచ్చింది .
పెద్దయ్యా …… త్వరగా కోలుకోవాలంటే తప్పదు అని జాగ్రత్తగా వెహికల్లో కూర్చోబెట్టాను . 
పెద్దయ్య : అదికాదు బాబూ …… ఇంటిదగ్గర చాలా పనులున్నాయి . ఇంతకీ చెప్పనేలేదు కదూ మావాడి పెళ్లి , ఈపాటికి పెళ్ళికొడుకుని చేయాల్సింది ……. అందరూ కంగారుపడుతుంటారు .
కృష్ణ : పర్లేదు నాన్నగారూ …… కావాలంటే పెళ్లిని పోస్ట్ ఫోన్ చేయిద్దాము – మీరు కోలుకోవడం ముఖ్యం – అమ్మ అక్కయ్య నుండి ఈపాటికి 100 పైనే కాల్స్ వచ్చాయి – వస్తున్నాము అని మెసేజ్ పెడుతున్నాను కానీ మాట్లాడే ధైర్యం లేదు .
పెద్దయ్య : వద్దు వద్దు కృష్ణా …… , నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలియదా , అయినా నాకేమైంది – కట్లు విప్పి పెళ్ళిపనులు చెయ్యడానికి రెడీగా ఉన్నాను – మనసులో ఏమీ పెట్టుకోకు , నిన్ను ఎంత ప్రేమించింది ఆ పిల్ల నా కోడలు , నా వలన పెళ్లి ఆపడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు , మన ఇంటికీ మంచిదికాదు – ఏదీ మొబైల్ ఇవ్వు అని కాల్ చేశారు , అయ్యో ……. వచ్చేస్తున్నాము తల్లీ …… మీరు మొదలుపెట్టండి 15 నిమిషాలలో అక్కడ ఉంటాము . కృష్ణా ……. ఏర్పాట్లన్నీ రెడీ పదా వెళదాము .
( బుజ్జితల్లి – పెళ్లి ……. యాహూ …… నా దేవత దగ్గరకే వెళుతున్నాము ) కృష్ణా …… బైక్ ఎక్కడ నేను ఫాలో అవుతాను .
కృష్ణ : నో నో నో సర్ …… , బండి ఎక్కడికీ వెల్లదు మీరు కారులో కూర్చోండి అని ముగ్గురమూ బయలుదేరాము .

పెద్దయ్యను ఏ మెయిన్ రోడ్డులోనైతే వైజాగ్ హాస్పిటల్ కు చేర్చానో అదే రోడ్డులో వెనక్కువచ్చి ఆక్సిడెంట్ అయిన ప్లేస్ కు 100 అడుగుల దూరంలో రైట్ సైడ్ మట్టి రోడ్డు ద్వారా లోపలికి పోనివ్వమని డ్రైవర్ కు చెప్పాడు కృష్ణ .
కృష్ణా ……. అదిగో అక్కడే మీ నాన్నగారిని చూసాను – మొబైల్ అక్కడే పడి ఉంటుంది . 
కృష్ణ : డ్రైవర్ …… అక్కడికి పోనివ్వండి .
పెద్దయ్య : కృష్ణా …… నాకు మళ్లీ చూడాలని లేదు – నువ్వు వెళ్లు – బండిని కూడా అక్కడే వదిలేసెయ్యి – ఇక జీవితంలో ఆ బండిని చూడకూడదు .
కృష్ణ : అలాగే నాన్నగారూ అంటూ కిందకుదిగాడు .
వెనుకే వెళ్లి ఆ ప్రాంతమంతా వెతికినా – రింగ్ చేసినా ఉపయోగం లేకపోయింది . వదిలెయ్యండి సర్ వెళదాము , ఈ బుల్లెట్ బండి అంటే నాన్నగారికి చాలా ఇష్టం – ఎప్పుడూ ఇలా జరగలేదు అని బాధపడుతూ కారులోకి చేరాము .

పెద్దయ్యా ……. బుల్లెట్ ను బాగా నడుపుతారని కృష్ణ చెప్పాడు , ఇంతకీ ఎలా జరిగింది .
పెద్దయ్య : ఉదయం 5 గంటలకు నా బిడ్డ – మనవరాలు బెంగళూరు నుండి వస్తున్నారని తెలిసి తీసుకెళ్లడానికి సంతోషంగా బస్ స్టాండ్ కు బయలుదేరాను . మట్టి రోడ్డు నుండి ఇక్కడ టర్న్ అవ్వగానే రాంగ్ రూట్ లో వస్తున్న లారీని తప్పించబోయి చివరన ఢీకొట్టాను – ఎలా కిందపడ్డానో తెలియదు , దేవుడిలా వచ్చి పెద్దయ్యా పెద్దయ్యా అంటూ నన్ను పలకరించి కాపాడటమే గుర్తు అంటూ మళ్లీ దండం పెట్టారు .
పెద్దయ్యా ……. కృష్ణ …… నువ్వుకూడానా ? , మొదలెట్టేశారా ….. ?  అంటూ నవ్వుకున్నాము . 

పెద్దయ్యా – కృష్ణా ……. మిమ్మల్ని రక్షించిన బస్సులోనే మీ అమ్మాయి మహి – బుజ్జితల్లి కీర్తీ బెంగళూరు నుండి వచ్చారు .
పెద్దయ్య : మహి – కీర్తీ ……. మీకెలా? , అంటే ట్రైన్ మిస్ అవ్వడంతో బెంగళూరు నుండి మా వాళ్ళను క్షేమంగా తీసుకొచ్చిన దేవుడు కూడా మీరేనా ? .
షాక్ – మీకెలా తెలుసు పెద్దయ్యా ……. 
పెద్దయ్య : నా కూతురు కాల్ చేసిన ప్రతీసారీ చెప్పింది మీ గురించి , నాన్నగారూ ….. మీరేమీ కంగారుపడకండి దేవుడి లాంటి వ్యక్తి తోడుగా వస్తున్నారని .
మరొక స్వీట్ షాక్ , పెద్దయ్యా ……. మహి గారు నిజంగానే దేవుడు అన్నారా …… ? లేక మీరు ……..
కృష్ణ : నాతో కూడా చెప్పారు సర్ – దేవుడు అనలేదు కానీ ఇంచుమించు అదే అర్థం వచ్చేలా చెప్పారు . అప్పటికి కానీ మాకు కంగారు తగ్గలేదు – అంతదూరం నుండి ఒంటరిగా అంటే చాలా చాలా భయం వేసింది . అక్కయ్య – మా ప్రాణమైన బుజ్జితల్లిని క్షేమంగా తీసుకొచ్చినందుకు గానూ థాంక్యూ థాంక్యూ sooooo మచ్ సర్ ……. , సర్ …… ఇదే మా చిన్న ఊరు – ఊరు చిన్నదే అయినా ప్రేమ , ఆప్యాయతలలో చాలా చాలా పెద్దది . మేమిద్దరు దేవుడు అని దండాలు పెడితేనే ఇబ్బందిగా ఫీల్ అయ్యారు – నాన్నగారిని కాపాడారని తెలిస్తే ఊరంతా ……. చెప్పను మరొకనిమిషంలో మీరే చూస్తారుకదా అని పెద్దయ్యతోపాటు నవ్వుతున్నాడు . అంతలోనే క్యాబ్ పెళ్లి పందిరి – తోరణాలు – షామియానా మరియు చిరునవ్వులు చిందిస్తున్న జనాలు గల ఇంటి ముందు ఆగింది .
పెద్దయ్య : కృష్ణా …… ఆక్సిడెంట్ అని చెప్పకు తట్టుకోలేరు , బుల్లెట్ నుండి కిందపడ్డాను అని చెప్పు – బాబూ …… నువ్వుకూడా …….
నిజం చెప్పి అంతమందిని బాధపెట్టడం నాకూ ఇష్టం లేదు పెద్దయ్యా – జరిగినదేదో జరిగిపోయింది , మంచి నిర్ణయం తీసుకున్నారు .

నా గుండె వేగంగా కొట్టుకోవడంతో నా దేవత – బుజ్జి ఏంజెల్ కోసం కళ్ళు ఆతృతతో వెతకసాగాయి – అదిగో నా బుజ్జి ఏంజెల్ ……. బుజ్జి బుజ్జి పిల్లలతో చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిబుజ్జిపరుగుతో ఆడుకోవడం చూసి మనసు శాంతించింది .
అంతలో వెనుక పెద్దయ్య ప్రక్కన కూర్చున్న కృష్ణ ….. క్యాబ్ దిగగానే నేనూ దిగాను పెద్దయ్యను పట్టుకోవడానికి …….
బయట బుజ్జిబుజ్జి పిల్లలతో ఆడుకుంటున్న బుజ్జి ఏంజెల్ చూసి మమ్మీ – అమ్మమ్మా ……. తాతయ్య వచ్చారు అంటూ సంతోషంతో పరుగునవస్తూ , తన తాతయ్య వొళ్ళంతా కట్లను చూసి మమ్మీ – అమ్మమ్మా …… అంటూ ఏడుస్తూ కేకలువేసింది .

ఆ పాటికే పెళ్ళికొడుకు శాస్త్రం కోసం వచ్చిన ఊరిజనం చూసి కంగారుపడుతూ అయ్యా – పెద్దయ్యా – అన్నా ……. ఏమైంది అంటూ తలా ఒకచెయ్యివేసి లోపలికి నడిపించుకుపోతుంటే …….. 
పెద్దయ్య ఆపి నాకేమీ కాలేదులే ఇప్పటికే పెళ్లి పనులు ఆలస్యం అయ్యాయి బయటే కూర్చోబెట్టమన్నారు .
నిమిషంలో చెక్క మంచం మెత్తగా రెడీ చేసి కూర్చోబెట్టి , ఏమైంది ఏమైంది చాలా దెబ్బలు తగిలాయి అంటూ బాధపడుతూ చుట్టూ చేరారు .
బుజ్జితల్లీ బుజ్జితల్లీ …… ఏడుస్తున్న బుజ్జితల్లిని పిలిచి ఒడిలో కూర్చోబెట్టుకోబోతుంటే …….
బుజ్జితల్లి : వద్దు తాతయ్యా ……. మీకు నొప్పివేస్తుంది .
పెద్దయ్య : నా బంగారం తాతయ్య అంటే ప్రాణం అంటూ ప్రక్కన కూర్చోబెట్టుకుని కన్నీళ్లు తుడిచారు .
బుజ్జితల్లి : తాతయ్యా ……. ఏమైంది అంటూ బుజ్జి కన్నీళ్ళతో అడిగింది .
అంతలో దేవత – దేవత అమ్మగారు వచ్చి చూసి కన్నీళ్ళతో ప్రక్కన చేరారు .
పెద్దయ్య : బుజ్జితల్లీ – తల్లీ – శ్రీమతిగారూ ……. ఏమీకాదు చూడండి నవ్వుతున్నాను .
దేవత : కన్నీళ్ళతో తమ్ముడూ ఏమైందిరా …… ? .
జనాలు : కృష్ణా ఏమైంది ఏమైంది ………
కృష్ణ : తెల్లవారుఘామున బస్ స్టాండ్ కు వెళుతూ …… లారీ ……
అందరూ : లారీనా ……. అంటూ మరింత కంగారుపడిపోతున్నారు .
కృష్ణ : లేదు లేదు మన రోడ్ టర్నింగ్ లో లారీ లైట్స్ సడెన్ గా పడటంతో పట్టుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న గడ్డిలో పడ్డారు .
పెద్దయ్య : అంతే అంతే పొదల్లోకి వెళ్లిపోవడం వలన చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే ……..
కృష్ణ : నాన్నగారు స్పృహకోల్పోయి పడి ఉండటం , బస్సులో వెళుతున్న ఈ అన్నయ్య చూసి సమయానికి హాస్పిటల్ కు తీసుకెళ్లి బ్లడ్ ఇచ్చి కాపాడారు .

బుజ్జితల్లి : అంకుల్ ……. అంటూ పరుగునవచ్చి హత్తుకుంది .
కీర్తీ తల్లీ …… అంటూ ప్రాణంలా ఎత్తుకోగానే , థాంక్యూ థాంక్యూ అంకుల్ అంటూ ముద్దులుపెడుతూనే ఉంది .
కృష్ణ చెప్పినట్లుగానే దేవత అమ్మగారు – చుట్టూ జనమంతా థాంక్యూ థాంక్యూ బాబూ – తమ్ముడూ ……. అంటూ దండాలు పెడుతున్నారు .
దేవత అయితే నావైపు ఆరాధనతో చూస్తున్నారు – కన్నీళ్ళతో రెండు చేతులు జోడించి నమస్కరించారు .
పెద్దయ్య ……. దేవత నుదుటిపై ముద్దుపెట్టి , చూస్తున్నావుగా బాబూ …… మేము చెప్పినదే నిజమైంది కదూ అంటూ నవ్వుతూ చెప్పారు .
వీరి ఆప్యాయతలలో మీ మంచితనం తెలుస్తోంది పెద్దయ్యా …… , వీరంతా మీ చుట్టూ ఉండగా మీకేమీ కాదు .

సర్ సర్ …… క్యాబ్ ఫేర్ ఇస్తే వెళతాను అని డ్రైవర్ అడగలేక అడిగాడు .
Sorry sorry బ్రదర్ …… అంటూ బుజ్జితల్లిని ఎత్తుకునే పర్సు తీసేంతలో – కృష్ణ లోపలికివెళ్లి డబ్బు తీసుకొచ్చేన్తలో ……. 
ఎంత బాబూ ఎంత అంటూ ఊరిజనం పోటీపడుతూ ఇచ్చి పంపించారు . బాబూ ……. ఎంతసేపని నిలబడతారు కూర్చో …… – మా పెద్దయ్యను కాపాడిన మీరు , మాకు దేవుడితో సమానం అంటూ కుర్చీలు వేశారు . 
పర్లేదు అండీ ఇక నేను వెళతాను అని దేవత రియాక్షన్ కోసం చూసాను .
అంకుల్ అంటూ బుజ్జితల్లి బుజ్జిచేతులతో నా నోటిని మూసింది – దేవత కళ్ళల్లో రెండు భావాలు ( వెళ్లిపో – ఉండిపో ) – బాబూ …… పెళ్లి చూసుకుని వెళ్లు అని ఊరిజనం – అవును బాబూ ……. పెళ్లి చూసుకుని మా ఆతిథ్యం స్వీకరించి మీకిష్టమైనన్ని రోజులు ఉండండి , మిమ్మల్ని సేవించుకుని కాస్తయినా రుణం తీర్చుకునే అవకాశం కల్పించు బాబూ అంటూ పెద్దయ్య వారి శ్రీమతి కోరారు .
కృష్ణ : నాన్నగారూ …… ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం …….
పెద్దయ్య : నాన్నా …… కృష్ణా ……. పెళ్లి అంటే మనవైపు నిర్ణయం మాత్రమే కాదు – ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్న ఆ అమ్మాయిని బాధపెట్టకూడదు . ఇప్పటికిప్పుడు లేచి పెళ్ళిపనులు చెయ్యడానికి నేను రెడీగా ఉన్నాను . 
కృష్ణా …… సహాయం చేయడానికి మేమూ ఉన్నాము కదా …….
పెద్దయ్య : ఇంకేమిటి కృష్ణా …….. , ఇంతమందికి ఆదర్శప్రాయమైన మనమే ఇలా చెయ్యకూడదు .
కృష్ణ : అయితే మీ ఇష్టం నాన్నగారూ …….
పెద్దయ్య : శ్రీమతి గారూ – తల్లీ ……. పెళ్ళికొడుకుని చెయ్యడానికి అన్నీ సిద్ధమేకదా ………
దేవత కన్నీళ్లను తుడుచుకుని , రెడీ చేసాము నాన్నగారూ ……..
పెద్దయ్య : ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకండి , గుడికి వెళ్లి పెళ్లి పందిరి కోసం ఉంచిన వాటికి పూజచేసి తీసుకొచ్చి నీ తమ్ముడిని పెళ్ళికొడుకుని చెయ్యి తల్లీ ……
కృష్ణ : అన్నయ్యా ……. మీరెక్కడకూ వెళ్ళడానికి వీలులేదు , నాన్నగారు చెప్పినట్లు పెళ్లి – ఆతిథ్యం స్వీకరించాల్సిందే ……..
బుజ్జితల్లీ …… వెళ్ళిపొమ్మన్నావు కదా …….
బుజ్జితల్లి : మళ్లీ నోటిని మూసేసి ప్రాణంలా ముద్దుపెట్టి sorry అంకుల్ అంటూ గట్టిగా హత్తుకుంది .
దేవత ……. నాదగ్గరికివచ్చి , ఉండండి మహేష్ గారూ అనిచెప్పి లోపలికి వెళ్లిపోయారు . 
యాహూ ……. అంటూ లోలోపలే సంతోషంతో కేకలువేసి , బుజ్జితల్లిని ఎత్తుకుని పెద్దయ్య దగ్గరకువెళ్లి , పెద్దయ్యా …… కంఫర్ట్ గా ఉందా అని నొప్పిలేకుండా కూర్చునేలా చేసాను .
థాంక్యూ అంకుల్ అంటూ బుజ్జితల్లి సంతోషంతో పదేపదే ముద్దులుపెడుతోంది – ప్రాణంలా హత్తుకుంటోంది .

బుజ్జితల్లి అమ్మమ్మ గారు వచ్చి , బాబూ ….. రాత్రంతా ప్రయాణం – ఉదయం నుండీ హాస్పిటల్లోనే ఉన్నావట కదా లోపలికివచ్చి స్నానం చెయ్యి బాబూ ……. 
పెద్దమ్మా …… ఎవరు చెప్పారు ? .
పెద్దమ్మ : నా కూతురు చెప్పింది బాబూ …… నా కూతురిని జాగ్రత్తగాతీసుకొచ్చావు – నా భర్తను కాపాడి పెళ్లి జరుగుతోంది అంటే నీవల్లనే – మా దేవుడితో సమానం , ముందు లోపలికి రా బాబూ నీ ఇల్లే అనుకో , పై గదికి వెళ్లు ఎవ్వరూ ఉండరు అంటూ బుజ్జితల్లిని అందుకోబోయారు .
బుజ్జితల్లి : ఊహూ …… అంకుల్ తోనే ఉంటాను – పైకి నేను తీసుకెళతాను అని ముద్దుముద్దుగా ముద్దులుపెట్టి గట్టిగా హత్తుకుని చెప్పింది . అంకుల్ స్నానం చేసేవరకూ బెడ్ పైననే బుద్ధిగా కూర్చుంటాను .
బుజ్జితల్లి నా బుజ్జితల్లి మాటలకు ఎంత ఆనందం వేసిందో మాటల్లో చెప్పలేను .
పెద్దమ్మ : మా బుజ్జితల్లి ఒక్కసారి ఇష్టపడితే ఇంతే వదలనే వదలదు – బంగారుకొండ అని చేతితో ముద్దుపెట్టి సరే నువ్వే తీసుకెళ్లు మీ అంకుల్ ను – బాబూ …… ఏమనుకోకు కాస్త తొందరగా వస్తావు కదూ , ఎందుకంటే నువ్వు వస్తేనేకానీ పెళ్ళికొడుకు కదలడు – మా బుజ్జితల్లి అమ్మ గుడికి కదలడు – బుజ్జితల్లి తాతయ్య …… ఇక సరే సరి .
పెద్దమ్మా …… నాకోసం …….
పెద్దమ్మ : ఆ దేవుడే వచ్చి చెప్పినా ఇప్పుడు విననే వినరు – నువ్వంటే అంత ఇష్టం అయిపోయావు – స్టార్ట్ చేస్తే నేనూ ఊరుకోను .
పెద్దమ్మా ……. నా అదృష్టం , సరే వెంటనే వచ్చేస్తాను – బుజ్జితల్లీ ఎటువైపు అని అడిగి పైకివెళ్ళాను .

కీర్తీ తల్లీ …… కింద ఉద్వేగ వాతావరణంలో నీ బుజ్జి బార్బీ డ్రెస్ సరిగ్గా చూడలేదు , sooooo క్యూట్ అంటూ బెడ్ పై కూర్చోబెట్టాను . చుట్టూ చూసి ఇల్లు కూడా బాగుంది – మినిట్స్ లో ఫ్రెష్ అయ్యివచ్చేస్తాను అంటూ హైఫై చూయించాను .
బుజ్జితల్లి బుజ్జిచేతితో హైఫై కొట్టి అంతేనా అంకుల్ అని బుంగమూతితో అడిగింది .
మా బుజ్జితల్లి బుంగమూటలో కూడా ముద్దొచ్చేస్తోంది .
బుజ్జితల్లి : ఆ ఆ ముద్దులే అడుగుతున్నాను – ముద్దొస్తోంది అంటున్నారు కానీ వచ్చినప్పటి నుండీ ఎంతో ఆశతో చూస్తున్నాను ఒక్క ముద్దైనా పెట్టారా …… ? – మా మంచి అంకుల్ కు నేనెన్ని ముద్దులుపెట్టాను .
ఓ ఓ …… ఆదా సంగతి , sorry sorry బుజ్జితల్లీ …… ఒక్క ముద్దుతో తనివితీరదు – తెల్లవారుఘామున 5 గంటలకు నా బుజ్జితల్లిని వదిలి వెళ్లిపోయానా 6 గంటలు 7 గంటలు 8 గంటలు 9 10 …. 11 గంటలు అంటే దాదాపు 6 గంటల తరువాత నా ప్రాణాన్ని చూశాక గానీ నా ప్రాణం నిలబడలేదు – నిన్ను చూశాకనే ఈ గుండె నార్మల్ గా కొట్టుకుంది – నీకు దూరంగా ఉన్న ఆ 6 గంటలు నేను నేనులా లేను – అంకుల్ అంటూ పరుగునవచ్చి హత్తుకోగానే ఆ 6 గంటల్లోని ప్రతీ నిమిషం కాదు కాదు ప్రతీ క్షణానికొక ముద్దుపెట్టాలని ఉన్నా ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా …….. ? , ఇప్పటికి కూడా …….
బుజ్జితల్లి : అంకుల్ అంటూ లేచి నామీదకు జంప్ చేసి బుగ్గలపై ముద్దుపెట్టి , అడ్డు ఎవరు అంకుల్ మీకు కానివ్వండి .
నా బుజ్జితల్లీ ….. నా కీర్తీ తల్లీ …… నా బుజ్జి ఏంజెల్ …… నిన్ను మనసారా గుండెలపై హత్తుకున్నాకే నేను శ్వాసిస్తున్నానని తెలిసింది అంటూ నిమిషం పాటు ముద్దులవర్షం కురిపించి , రోజంతా ముద్దులుపెడుతూనే ఉండాలని ఉంది .
బుజ్జితల్లి : నేను రెడీ అంకుల్ …….
కానీ మనం కిందకు వెలితేనే కానీ పెళ్ళిపనులు మొదలుపెట్టరట అంటూ ప్రాణం లా హత్తుకున్నాను .
బుజ్జితల్లి : అంకుల్ ……. నిన్నటివరకూ మమ్మీ వస్తేనే కానీ అమ్మమ్మా – తాతయ్య వాళ్ళు పెళ్ళిపనులు మొదలెట్టము అన్నారు – ఇప్పుడు మీరు వెలితేనే ……. , అంటే మమ్మీ కంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం అందరికీ – మిమ్మల్ని దేవుడు అన్నారుకదా …… , ఇప్పుడు నేనూ చెబుతున్నాను మా అంకుల్ నిజంగా దేవుడే …….. లవ్ యు అంకుల్ …….
లవ్ యు అన్నావా బుజ్జితల్లీ నా బుజ్జితల్లీ ……. లవ్ యు లవ్ యు sooooo మచ్ బుజ్జితల్లీ అంటూ మళ్లీ ముద్దులు కురిపిస్తున్నాను .
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులు చిందిస్తూనే , అంకుల్ ……. కిందకు వెళ్లాలన్నారు అని గుర్తుచేసే నవ్వుతోంది .
నా ముద్దుల కీర్తీ తల్లి మాయలో పడి మరిచేపోయాను అంటూ ముద్దులుపెడుతూనే వదల్లేక వదల్లేక బెడ్ పై కూర్చోబెట్టి , గేమ్ ఆడుతూ ఉండు ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని మొబైల్ ఇచ్చి , బ్యాగుతోపాటు బాత్రూమ్లోకి వెళ్ళాను .

బ్యాగులోనుండి బ్రష్ పేస్ట్ తీసుకుని కాలకృత్యాలు తీర్చుకుని ఫ్రెష్ గా తలంటు స్నానం చేసి బ్యాగులోని డ్రెస్ వేసుకుని బయటకువచ్చాను .
బుజ్జితల్లి : నో నో నో అంకుల్ …… , మమ్మీ …… అమ్మమ్మ చేత మావయ్యకోసం కొన్న కొత్త డ్రెస్ మీకోసం పంపించారు .
మావయ్య పెళ్ళికోసం కొన్న డ్రెస్ కదా ……. , ఇష్టంతో తీసుకుని ఉంటాడు కృష్ణ పర్లేదులే …….
బుజ్జితల్లి : ఈ కొత్త డ్రెస్ వేసుకోకపోతే మొదట మమ్మీ ఆ వెంటనే అమ్మమ్మ – మావయ్య చివరగా కాదు కాదు ముఖ్యంగా నేను ఏడుస్తాను .
అమ్మో అమ్మో ……. న బుజ్జితల్లి కంట కన్నీళ్లు చూస్తే ఈ అంకుల్ తట్టుకోగలడా వెంటనే మార్చేసుకుంటాను . 
బుజ్జితల్లి : గుడ్ బాయ్ అంటూ అందించి అటువైపుకు తిరిగింది .
హ హ హ …… ఉమ్మా ఉమ్మా …… అంటూ డ్రెస్ మార్చుకుని బుజ్జితల్లిని రెండుచేతులతో అమాంతం ఎత్తుకుని ముద్దుచేస్తూ కిందకువచ్చాను – దేవత కనిపించగానే ముద్దులు ఆపేసాను .
బుజ్జితల్లి : మమ్మీ అంటే అంత భయమా అంకుల్ …….
చాలా అంటే చాలా అంటూ చిలిపినవ్వులతో తలదించుకుని బయటకు నడిచాను .
బుజ్జితల్లి : వెనుకకు చూసి అంకుల్ …… మమ్మీ కూడా మీలానే నవ్వుతోంది – డ్రెస్ సూపర్ అంటున్నారు .
వెంటనే వెనక్కు తిరిగిచూస్తే నవ్వడం ఆపేసి కోపంతో చూస్తున్నారు .
ప్చ్ ………

కృష్ణ : అన్నయ్యా ……. సూపర్ గా ఉన్నారు , నాకంటే మీకే డ్రెస్ బాగుంది అని నా ప్రక్కన చేరారు .
పెద్దయ్య : మా ఇంటి దేవుడు వచ్చాడు , పెళ్ళిపనులు మొదలెట్టండి – భాజా భజంత్రీలు మ్రోగించండి – తల్లీ మహీ శ్రీమతిగారూ ……..
దేవత : రెడీ నాన్నగారూ అంటూ పూజాసామాగ్రితో బయటకువచ్చారు .
లోపల చూడలేదు కానీ కొత్త పట్టుచీరలో ముత్తైదువుల మధ్యన అందమైన నవ్వులతో దివినుండి భువిపైకి దిగివచ్చిన దేవతలా ఉండటం కన్నార్పకుండా చూస్తున్నాను .
బుజ్జితల్లి : ఏమిటి అంకుల్ చూస్తున్నారు ? , మమ్మీ …… బ్యూటిఫుల్ కదా …… కనురెప్ప కూడా వెయ్యడం లేదు .
అవునవును ……. లేదు లేదు బుజ్జితల్లీ అలాంటిదేమీ లేదు .
అంతలో నా ప్రక్కనుండి దేవత ముసిముసినవ్వులతో ముందుకువెళ్లారు . రోడ్డుపై ఆగి నావైపు చూస్తున్నట్లు చూస్తూ తమ్ముడూ రారా అని పిలిచి నవ్వుతూ వెళ్లారు .

కృష్ణ : నాన్నగారూ జాగ్రత్త వెళ్ళొస్తాము అని పాదాలను స్పృశించి ఆశీర్వాదం తీసుకున్నాడు . 
కృష్ణా …… మాలో కొంతమంది ఇక్కడే ఉంటారులే , వాళ్ళు చూసుకుంటాము కదా పదా గుడికి వెళదాము .
కృష్ణ : సరే , అన్నయ్యా …… రండి అని నా గుండెలపై ఉన్న బుజ్జితల్లి బుగ్గపై చేతితో ముద్దుపెట్టాడు .
దేవత మరియు ఊరి ఆడాళ్లందరి వెనుక బుజ్జితల్లిని ముద్దుచేస్తూ దగ్గరలోని గుడికి వెళ్ళాము .

గుడిలో దేవత చేతులమీదుగా పందిరి కొమ్మలకు పూజ జరిగింది . మేళ తాళాలతో పందిరి కొమ్మలను తీసుకుని ఇంటికి చేరుకున్నాము . శాస్త్రం ప్రకారం నిమిషాలలో పందిరి నిర్మించడంతో కృష్ణ పంచె కట్టుకునివచ్చి పందిరి కింద కూర్చున్నాడు . 
ఇక అక్కడున్న అందరి చూపూ బుజ్జితల్లిపైనే పడింది . పెద్దమ్మ వచ్చి బుజ్జితల్లీ ……. తోడు పెళ్లికూతురు తమరే మేడం , కొద్దిసేపు మీ అంకుల్ ను వదిలి మీ మావయ్య దగ్గరికి చేరాల్సిందే …….
బుజ్జితల్లీ ……. తోడు పెళ్లికూతురు ? ప్రాణంలా ముద్దుపెట్టబోయి దేవతను చూసి ఆగిపోయి పెద్దమ్మకు అందించాను .
దేవత ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
బుజ్జితల్లి : చూసి నవ్వి , అంకుల్ ……. స్నానం పూర్తవగానే వచ్చేస్తాను అంతవరకూ మీరు ఇదిగో ఇక్కడే నా ఎదురుగానే ఉండాలి అని ముద్దుముద్దుమాటలతో ముద్దుపెట్టి అమ్మమ్మా …… అంటూ వెళ్ళింది .
పెద్దమ్మ : మా బుజ్జి బంగారానికిమా అందరికంటే అంకుల్ అంటేనే ఇష్టం అన్నమాట , మీ అంకుల్ ……. నిన్ను వదిలి ఎక్కడకూ వెళ్లకుండా మేము చూసుకుంటాములే అని ముద్దుచేస్తూ కృష్ణ ప్రక్కన కూర్చోబెట్టారు .

చూడటానికి ముచ్చటెయ్యడంతో కెమెరామెన్ ఫోటోలు తీస్తున్నా , నా మొబైల్ తీసి ఫోటోలు తియ్యడం చూసి బుజ్జితల్లి ముద్దుముద్దుగా నవ్వుతోంది .
పెళ్ళికొడుకు – తోడు పెళ్లికూతురికి పసుపు పూసే కార్యక్రమం దేవతతో మొదలయ్యింది . వారి తమ్ముడి ముఖం – చేతులు – ఛాతీ – పాదాలకు మొత్తం పసుపు పూసి , నావైపు చూసి చిరునవ్వులు చిందిస్తూ బుజ్జితల్లి ముఖానికి – మెడకు – బుజ్జి చేతులకు – బుజ్జిబుజ్జి పాదాలకు పూసి లవ్ యు రా అంటూ కురులపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . ఇద్దరికీ హారతి ఇచ్చి నుదుటిపై కుంకుమ పెట్టి ఇద్దరు వెనుక చేరి అమ్మా కానివ్వు అని పిలిచారు .
బుజ్జితల్లి : అమ్మమ్మా …… ఆగు , మమ్మీ తరువాత ఫస్ట్ అంకుల్ ఆ తరువాత మీ ఇష్టం అలా అయితేనే మావయ్య ప్రక్కన కూర్చుంటాను .
కృష్ణ : లవ్ యు బుజ్జితల్లీ …… , నా కోరికనే నువ్వు చెప్పావు అని బుజ్జిచేతిని అందుకుని ముద్దుపెట్టాడు .
అందరూ సంతోషంతో నవ్వుతున్నారు .
బుజ్జితల్లీ ……. ముందు పెద్దవారు అని బుజ్జితల్లి ప్రేమకు ప్రాణంలా చూస్తున్నాను .
బుజ్జితల్లి : తాతయ్య – అమ్మమ్మ – మావయ్య – మమ్మీ ……. అందరూ చెప్పారుకదా మీరు దేవుడని కాబట్టి మీరు ఫస్ట్ , అలా అయితే లేకపోతే ……..
అందరితోపాటు పెద్దయ్య కూడా సంతోషంతో నవ్వుతున్నారు బుజ్జితల్లి ముద్దుమాటలకు ……..
పెద్దమ్మ : సరే బుజ్జి మేడం గారూ …… , తమరెలా చెబితే అలా …… , బుజ్జిదానివైనా సరిగ్గా చెప్పావులే …… ఉమ్మా ఉమ్మా …… 
బుజ్జితల్లి : ముద్దులుకూడా అంకుల్ తరువాతనే అంటూ బుజ్జిచేతితో ఆపడం చూసి సంతోషపు నవ్వులు విరిసాయి . 
పెద్దమ్మ తియ్యదనంతో బుంగమూతిపెట్టుకుని , బాబూ …… రండి అని పిలిచారు .
పెద్దమ్మా ……. ఏదో చిన్నతనం పెద్దవారు ముందు .
పెద్దమ్మ : నువ్వు కాకుండా మరొకరు దగ్గరకు వెళితే కొట్టేలా ఉంది బాబూ …… ( నవ్వులు ఆగడం లేదు ) , చిన్నదైనా సరిగ్గా చెప్పింది – ఇలా సంతోషాలు పరిమాలిస్తున్నాయి ఆటే కారణం నువ్వు – మొదట నువ్వు పసుపు రాయడమే కరెక్ట్ అంటూ చేతిని పట్టుకుని పందిరి కిందకు చేర్చి పసుపు అందించారు .

Sorry మేడం అంటూ దేవతవైపు చూసాను . 
దేవత : తియ్యదనంతో నవ్వుతూ కానివ్వండి అంటూ అందమైన కళ్ళతో సైగచేశారు .
బుజ్జితల్లీ …….. మీ మమ్మీ పర్మిషన్ ఇచ్చేసారు అంటూ సంతోషంతో దేవత చేసినట్లు ముందు కృష్ణ ముందుకువెళ్ళాను .
బుజ్జితల్లి బుంగమూతిపెట్టుకోవడం చూసి , అన్నయ్యా …… మొదట బుజ్జితల్లికి పసుపు రాయండి లేకపోతే నన్ను కూడా కొట్టేలా ఉంది . 
అధికాదు బుజ్జితల్లీ ….. శాస్త్రం ప్రకారం , మమ్మీ కూడా మొదట ……..
బుజ్జితల్లి : మమ్మీకి …… నాకంటే వాళ్ళ తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం .
దేవత : అవును నిజమే నాకు నా తమ్ముడంటేనే ఎక్కువ ఇష్టం అంటూ బుజ్జి బుగ్గను గిల్లేసారు . 
చుట్టూ సంతోషాల నవ్వులు చూసి పెద్దయ్య ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు .
బుజ్జితల్లి : అంకుల్ …… మమ్మీలా మీకు కూడా మావయ్య అంటేనే ఇష్టం కదా అంటూ బుంగమూతి పెట్టుకుంది .
లేదు లేదు లేదు మీ తాతయ్యకు – అమ్మమ్మకు – మమ్మీకు – మీ మావయ్యకు …… నాకు మా బుజ్జితల్లి అంటేనే ప్రాణం అంటూ సంతోషంతో మొదట బుజ్జితల్లికి సున్నితంగా పసుపు రాసి హ్యాపీనా అంటూ కృష్ణ ముందుకు వెళ్ళాను . 
లవ్ యు అంకుల్ అంటూ లేచి , కృష్ణకు పసుపు రాయడానికి వొంగిన నా బుగ్గపై తియ్యనైన ముద్దుపెట్టింది .
దేవత : మొదట పసుపు రాసింది నేనుకదా బుజ్జితల్లీ ……. , నాకు పెట్టలేదే ముద్దు . 
బుజ్జితల్లి : నాకు మమ్మీకంటే అంకుల్ అంటేనే ఇష్టం కాబట్టి , ఆ మాత్రం తెలియదా మమ్మీ ………
దేవత ఈ ఈ …… అంటూ ఏడుపు నటించడం చూసి , సరే సరే ఏడవకు మమ్మీ … అంటూ దేవతకు ముద్దుపెట్టి కూర్చుంది .
దేవత : ఇప్పుడు హ్యాపీ ……. , లవ్ యు బంగారూ …… అంటూ ముద్దుపెట్టబోతే ……..
మమ్మీ స్టాప్ ……. అంకుల్ ఇంకా ముద్దుపెట్టలేదు అంటూ నోటికి అడ్డంగా బుజ్జిచేతిని అడ్డుపెట్టింది .
మహీ మహీ ……. అవునుకదా , కాస్త కంట్రోల్ చేసుకో లేకపోతే కీర్తితో దెబ్బలు తింటావు అని చుట్టూ ఉన్న ఆడవాళ్ళంతా నవ్వుతున్నారు .
దేవత ……నావైపు చిరుకోపంతో చూస్తున్నారు .
Sorry sorry మేడం అంటూ లోలోపలే ఎంజాయ్ చేస్తూ కృష్ణకు పసుపు పూసి బుజ్జితల్లి కురులపై ప్రాణమైన ముద్దుపెట్టి వెనక్కువచ్చాను .
దేవత : ఆగండాగండి ఎంతైనా మా ఇంటి దేవుడు , హారతి కూడా ఇవ్వాలి .
అవునవును బాబూ అంటూ పెద్దమ్మ …… నా చేతికి అందించడంతో హారతి తీసి ఇద్దరికీ బొట్టుపెట్టి చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జితల్లి కురులపై ముద్దుపెట్టి వెనక్కువచ్చాను .
బుజ్జితల్లి : లవ్ యు అంకుల్ ……..
చుట్టూ ఆడవాళ్లు : ఇక నీ బుజ్జితల్లికి ముద్దుపెట్టుకో మహీ ……. అంటూ ఆటపట్టించి నవ్వుతున్నారు .
దేవత : తియ్యనికోపంతో ……. ఇప్పుడైనా ముద్దుపెట్టొచ్చా బుజ్జిమేడం గారూ అని అడిగారు .
బుజ్జితల్లి : లవ్ యు మమ్మీ అంటూ ముద్దుపెట్టింది .
దేవత : హ హ హ లవ్ యు బంగారూ అంటూ కురులపై ముద్దుపెట్టి బుజ్జి బుగ్గను గిల్లేసారు .
బుజ్జితల్లి : స్స్స్ ……. చూడండి తాతయ్యా – అంకుల్ అంటూ రుద్దుకోవటం చూసి చాలా చాలా ఆనందం వేసింది .
పెద్దయ్య : నొప్పివేస్తోందా బుజ్జితల్లీ …… , స్నానం అయిన తరువాత ఇద్దరమూ కలిసి మీ మమ్మీ బుగ్గలను గిల్లేద్దాములే సరేనా …….
బుజ్జితల్లి : థాంక్యూ తాతయ్యా …….
దేవత ……. బుజ్జితల్లివైపు తియ్యనైన కోపంతో చూడటం చూసి నవ్వుకున్నారు . 
నెక్స్ట్ పెద్దమ్మతో కంటిన్యూ అయిన కార్యక్రమం ముత్తైదువులందరూ పూయడంతో పూర్తయ్యింది . ఆ వెంటనే చిన్నా పెద్దా మొదలుకుని అందరూ తడి పసుపును చేతుల్లోకి తీసుకుని వారికిష్టమైన వారికి పరుగులుపెట్టించి మరీ పూసే కార్యక్రమం బహు ముచ్చటగా జరిగింది . పెద్దమ్మ …… పెద్దయ్యకు – ఆడవాళ్లు …… వారి వారి భర్తలకు …….
బుజ్జితల్లి ……. నాదగ్గరికి పరుగునవచ్చి రెండుచేతులూ చాపడంతో లవ్ యు లవ్ యు అంటూ ఎత్తుకోగానే , అంకుల్ …… అంటూ రెండుచేతులతో నా ముఖం మొత్తం పూసేసి నవ్వుతోంది .
అమ్మ దొంగా …… ఉండు నీకూ పూస్తాను .
బుజ్జితల్లి : నా వొళ్ళంతా పసుపే కదా అంకుల్ ఇంకెక్కడ పూస్తారు అంటూ కిందకుదిగి పరుగుతీసింది . 
బుజ్జితల్లీ బుజ్జితల్లీ అంటూ పసుపు అందుకుని వెనుకే పరుగుతీసాను . బుజ్జితల్లి వెళ్లి దేవత వెనుక దాక్కుంది – అంతే చేతులుకట్టుకుని కదలకుండా తలదించుకున్నాను .
దేవత : నాకు పూయడానికే వచ్చారా ? .
భయంతో నో నో నో అన్నట్లు తలఊపాను . 
దేవత రెండుచేతులతో నా బుగ్గలపై పూసి పరుగున వారి అమ్మ దగ్గరకు చేరారు .
స్వీట్ షాక్ చెంది , దేవతకు పసుపు పూయాలన్న కోరికను కంట్రోల్ చేసుకుని , బుజ్జితల్లీ ……. దొరికావు అంటూ ప్రాణంలా హత్తుకున్నాను . 
దేవత …… ఆరాధనతో చూడటం గమనించలేకపోయాను .

పెద్దమ్మ వచ్చి పందిరి స్నానానికి వేలయ్యింది బుజ్జితల్లీ – బాబూ …… , ఇప్పటికే ఆలస్యం అయ్యింది అందరికీ ఆకలివేస్తుంటుంది అని బుజ్జితల్లిని ఎత్తుకునివెళ్లి కృష్ణ ప్రక్కన కూర్చోబెట్టి జల్లెడ ద్వారా మొదట దేవత నీళ్లు పోశారు .
పెద్దమ్మ : బాబూ …… నెక్స్ట్ నువ్వే పొయ్యి లేకపోతే గోల గోల చేసేస్తోంది బుజ్జి రాక్షసి అంటూ ఆహ్వానించారు .
మరింత ఆలస్యం చెయ్యడం ఇష్టం లేక దేవతతోపాటు నీళ్లుపోసి , అందరూ పంచుతున్న ఆప్యాయతకు పరవసించిపోయాను . 
తరువాత ముత్తైదువులంతా నీళ్లుపోసి బుజ్జితల్లి ఒంటిపై పసుపు పూర్తిగా పోయేలా చేసి బుజ్జిబుజ్జిగా వణుకుతున్న బుజ్జితల్లిని – కృష్ణను లోపలికి తీసుకెళ్లారు . 
అంకుల్ …….. డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను . 
పెద్దమ్మ : అప్పుడే మీ అంకుల్ దగ్గరికి వెళ్ళడానికి లేదే బుజ్జి రాక్షసి , బట్టలు మార్చుకున్నాక లోపల కూడా పూజ ఉంది . కావాలంటే మీ అంకుల్ …… నీ ఎదురుగానే కూర్చుంటాడులే ……. 
బుజ్జితల్లి : ఇంకెంతసేపు అమ్మమ్మా …… 
Sorry బుజ్జితల్లీ ……. త్వరగా పూర్తి చేస్తాములే అని అందరూ నవ్వుకున్నారు .

అందరూ పసుపును శుభ్రం చేసుకుని లోపలికి వెళుతున్నారు .
పెద్దమ్మ వచ్చి పెద్దయ్య కు అంటించిన పసుపును తడిగుడ్డతో శుభ్రం చేసి , బాబూ ……. లోపలికివచ్చి నీకిష్టమైన గదిలోకివెళ్లి శుభ్రం చేసుకో – బుజ్జితల్లి వచ్చే సమయానికి ఎదురుగా కనిపించకపోతే మాపై కోప్పడుతుంది .
Sorry పెద్దమ్మా ……. , నా వలన ……
పెద్దమ్మ – పెద్దయ్య : లేదు లేదు బాబూ …… , మాకు చాలా సంతోషం – చూశావుకదా ఆలస్యమైనా మీ ఇద్దరివలన ఎంత సంబరంలా జరిగింది – అందరూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూనే ఉండటం చూసి చాలా చాలా ఆనందం వేసింది – అందుకు మేమే కృతజ్ఞతలు చెప్పుకోవాలి – మాకోసమే వచ్చిన దేవుడు బాబూ ……. నువ్వు .
పెద్దమ్మా ……..
పెద్దయ్య : చెప్పాముకదా బాబూ …… ఇక నువ్వు అలవాటు పడాల్సిందే అని నవ్వుకున్నారు – వెళ్లు బాబూ …….

లోపలికివెళ్లి పైకివెళ్ళాను . నేను స్నానం చేసిన గదిలోకివెళ్ళాను . 
లోపల దేవత …… బుజ్జితల్లి తడిచిన డ్రెస్ ను విప్పుతున్నారు . Sorry sorry మేడం – బుజ్జితల్లీ ……. ఎవ్వరూ లేరు అనుకున్నాను అని వెనుతిరిగాను .
పర్లేదు అంకుల్ ……. బుజ్జితల్లి నవ్వుతోంది .
అక్కడే ఆగండి మహేష్ గారూ …… , ఎంత ధైర్యం నా గదిలోకి రావడానికి …… అని కాస్త కోపంతోనే అడిగారు . 
అదీ అదీ ….. ఇంతకుముందు ఇక్కడే ఫ్రెష్ అయ్యాను మేడం అని వణుకుతూ బదులిచ్చాను .
ముసిముసినవ్వులు వినిపించడంతో వెనక్కుతిరుగబోతే …….
దేవత : స్టాప్ …… , డ్రెస్ చేంజ్ చేసుంటున్నామని తెలిసికూడా చూడబోతున్నారు , నాకు తెలుసు మీరు బ్యాడ్ బాయ్ అని మళ్ళీ ముసిముసినవ్వులు …….
బుజ్జితల్లి : నాకైతే ఇష్టమే మమ్మీ ……..
దేవత : కీర్తీ ….. ష్ ష్ …… , ఎంత ధైర్యం నా గదిలో స్నానం చేయడానికి …….
అదీ అదీ బుజ్జితల్లి ……. sorry sorry
బుజ్జితల్లి : అవును మమ్మీ …… నేనే పిలుచుకునివచ్చాను అంకుల్ ను .
దేవత : ష్ ష్ ……. కీర్తీ , వెళ్ళండి ప్రక్కగదిలోకి వెళ్ళండి .
బ్యాగ్ లో టవల్ …….
దేవత : మీకోసం ప్రక్కగదిలో ఉంచాను వెళ్ళండి .
Sorry అంటూ తుర్రుమన్నాను .
గట్టిగా నవ్వుకున్నట్లు దేవత – బుజ్జితల్లి నవ్వులు వినిపించాయి . ప్రక్క గదిలోకివెళ్ళిచూస్తే బెడ్ పై టవల్ తోపాటు మరొక జత కొత్తబట్టలు కూడా ఉండటం చూసి ఆశ్చర్యం వేసింది . దేవత నవ్వుతోంది – కవ్విస్తోంది – వెంటనే కోప్పడుతోంది ఏమీ అర్థం కావడం లేదు . అందుకే అన్నారు కాబోలు ” ఆడువారిమాటలకు అర్థాలేవేరు ” అని నవ్వుకుని శుభ్రం చేసుకునివచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకువచ్చేసరికి , కృష్ణను – బుజ్జితల్లిని ప్రక్కప్రక్కనే కూర్చోబెట్టి కార్యక్రమం జరిపిస్తున్నారు .
అంకుల్ …… మీకోసమే సోఫా కూర్చోండి అని బుజ్జితల్లి ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
లవ్ యు బుజ్జితల్లీ ….. పర్లేదులే ……
దేవత : కూర్చోండి అని ఆర్డర్ వెయ్యడంతో …….. బుద్ధిగా కూర్చోవడం చూసి నవ్వుకున్నారు .
పూజా కార్యక్రమం పూర్తవగానే , అయిపోయింది అంటూ కృష్ణ బుగ్గపై ముద్దుపెట్టి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది .
దేవత …… అసూయతో చూడటం చూసి వారి ఫ్రెండ్స్ తోపాటు నాకూ నవ్వువచ్చేసింది .
అప్పటికే 2 గంటలు అవ్వడంతో బయట భోజనాలు మొదలుపెట్టారు . తృప్తిగా భోజనాలు చేసి పెళ్లిలో కలుద్దాము అని ఊరిజనమంతా వెళ్లిపోయారు .

 

238ic

dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Srungara Kathamaalika
స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl
dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Sudha kataksham

స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl

Donate ===>>UPI ID :pdfs2@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి …. for Free only 

Admin account id :Facebook links UMESH KING

TelegraM :JABBARDASTH

PAGE LINK  Telugu Srungara Kathalu

GROUP LINK : ROLE PLAY PLOT

Twitter linkUMESH KING

Continue parts kosam naa facebook ki message cheyandi]

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button