Tollywood NewsTrending News

అలాంటి వరం పొందబోతున్న చిరంజీవి.. భలే ప్లాన్ చేశారంటూ?

అలాంటి వరం పొందబోతున్న చిరంజీవి.. భలే ప్లాన్ చేశారంటూ?

అలాంటి వరం పొందబోతున్న చిరంజీవి.. భలే ప్లాన్ చేశారంటూ?

అలాంటి వరం పొందబోతున్న చిరంజీవి.. భలే ప్లాన్ చేశారంటూ?
అలాంటి వరం పొందబోతున్న చిరంజీవి.. భలే ప్లాన్ చేశారంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి యంగ్ జనరేషన్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎనిమిది మంది హీరోయిన్లు నటిస్తున్నారని తెలిసిందే. చిరంజీవి సరసన ఎనిమిది మంది హీరోయిన్లను ఎంపిక చేయడానికి దర్శకుడు భారీ స్థాయిలోనే కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయిందని ముల్లోక వీరుడు అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

ఈ సినిమాలో చిరంజీవి మూడు లోకాలను చుట్టి వచ్చే వరం పొందుతాడని ఆ వరం నేపథ్యంలో సినిమా ఉండనుందని సమాచారం. ఈ సినిమా చందమామ కథలా ఉంటుందని ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశపరచదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భోళా శంకర్ మూవీ విడుదలైన వెంటనే చిరంజీవి ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

బింబిసార సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన వశిష్ట ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బింబిసార సక్సెస్ తో వశిష్ట రెమ్యునరేషన్ సైతం పెరిగింది. జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఈ సినిమా ఉండనుందని ఫ్యాన్స్ ను కచ్చితంగా మెప్పించేలా ఈ మూవీ ఉంటుందని సమాచారం. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వశిష్ట ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

చిరంజీవి నుంచి ఆఫర్ రావడంతో ఈ దర్శకుడు బింబిసార2 సినిమాను సైతం వదులుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే ఈ దర్శకుడి నిర్ణయం తెలివైన నిర్ణయమో కాదో తెలియాలంటే మాత్రం మరి కొంతకాలం ఆగాల్సిందే. మల్లిడి వశిష్టకు బదులుగా మరో డైరెక్టర్ బింబిసార2 సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. చిరంజీవి వరుస సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. వశిష్ట స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను అందుకోవాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button