Shrungara Kathamaalika 233: Bujjithalli Katha | Telugu Romantic Stories
Shrungara Kathamaalika 233: Bujjithalli Katha | Telugu Romantic Stories

Mahesh.thehero
బుజ్జితల్లితోపాటు అందరమూ వెళ్లి ప్లేట్స్ డస్ట్ బిన్ లో పడేసి నీల్లుతాగి కిల్లీలు నములుతూ వచ్చి సోఫాలలోకూర్చున్నాము .
మాకు అన్నట్లు చెల్లెమ్మ – దేవత ……. తియ్యనైనకోపాలతో చూస్తున్నారు .
బుజ్జితల్లి నవ్వుకుని , పరుగున పైకివెల్లి ముగ్గురికీ ఇచ్చివచ్చింది .
వినయ్ మొబైల్ మ్రోగింది .
బుజ్జితల్లి : అంకుల్ ……. మీకెక్కడి నుండి ఆస్ట్రేలియా నుండా ? .
వినయ్ : పో కీర్తీ తల్లీ …….
అన్నయ్యా ……. NRI నుండి అంటూ లేచివెళ్లి మాట్లాడివచ్చి , రిజిస్టర్ ఆఫీస్ దగ్గర wait చేస్తున్నాడు అని బుజ్జితల్లికి వినిపించకుండా చెవిలో చెప్పాడు .
బుజ్జితల్లిని కొన్నిగంటలపాటు ఈ సంబరాల నుండి దూరంగా సిటీకి తీసుకెళ్లడం మంచిపనికాదు , బుజ్జితల్లికి చెబితే …… అమ్మో విననే వినదు , ఇప్పుడెలా ……..
అంతలోనే చెల్లెమ్మ కిందకువచ్చి , బుజ్జితల్లీ ……. మీ డాడీకి భోజనం తినిపించడం అయ్యిందికదా ….. రా వెళదాము , ప్రతీ ఫొటోలో మా అక్కయ్యతోపాటు మా బంగారం ఉండాల్సిందే ………
అవునవును నాకోరిక కూడా ఇదే …….
బుజ్జితల్లి : డాడీ …… మీరిక్కడే ఉంటారుకదా …….
నేనెక్కడికి వెళతాను బుజ్జితల్లీ …….. , వెళ్లినా ఏర్పాట్లుచూసుకుని గంటలో నీముందు ఉంటానుకదా ……
బుజ్జితల్లి : గంటనా ……. నో నో నో అంటూ చేతిని చుట్టేసింది .
లేదు లేదు లేదు …… నా బుజ్జితల్లిని చూడకుండా నేనుండగలనా , వెళ్లు బుజ్జితల్లీ ……. ఈరోజు చెల్లెమ్మ మీఅత్తయ్య ఏమి కోరినా తీర్చాలి మనం .
చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా ……. , అయితే మీరూ రండి ఫోటోలు తీసుకుందాము .
చెల్లెమ్మా ……. గెస్ట్స్ అందరూ అయిపోయాక మనదే రాజ్యం ఒక్క ఫోటో కాదు టెన్స్ – హండ్రెడ్స్ – థౌజండ్స్ తీసుకుందాము .
చెల్లెమ్మ : నిజమే అన్నయ్యా ……. , కానీ అప్పటికి అలసిపోయి ఉంటాను , మాఅన్నయ్య అక్కయ్య బుజ్జితల్లిలతో ఫ్రెష్ గా ఉన్నప్పుడే తీసుకోవాలి , బుజ్జితల్లీ …….. మీ డాడీ ఇప్పుడే ఏమన్నారో చెప్పు ……..
బుజ్జితల్లి : బుజ్జిబుజ్జినవ్వులు …….
సరే సరే తమ్ముళ్ళూ ……… 5 మినిట్స్ అంటూ చెల్లెమ్మ – బుజ్జితల్లి వెనుకే స్టేజీ మీదకువెళ్లి , బుజ్జితల్లి మధ్యలో చెల్లెమ్మ ప్రక్కనే నిలబడ్డాను .
ఆశ్చర్యం …….. దేవత వచ్చి నా ప్రక్కనే నిలబడ్డారు . నిజమేనా అంటూ చేతిని గిల్లుకున్నాను .
చెల్లెమ్మ : నిజమే అన్నయ్యా ……. ఎంజాయ్ ఎంజాయ్ ……..
ఆఅహ్హ్ …….. లవ్ యు చెల్లెమ్మా , ఈ ఫీలింగ్ ఏదో బ్యూటిఫుల్ …….
చెల్లెమ్మ తియ్యదనంతో నవ్వుతోంది .
సూరీ ……. అంటూ మొబైల్ విసిరి క్లిక్ అని సైగచేసాను . ఒకటికాదు ……..
సూరి : మాకు తెలియదా అన్నయ్యా అన్నట్లు విడియోగ్రాఫర్ – ఫోటోగ్రాఫర్ తోపాటు క్లిక్ మనిపిస్తూనే ఉన్నాడు – 10 నిమిషాలపాటు రకరకాల పొజిషన్స్ లో బోలెడన్ని తీసుకున్నాము .
స్టేజీకి రెండువైపులా గెస్ట్స్ చాలామంది ఉండటం చూసి , చెల్లెమ్మా చెల్లెమ్మా ……. లాస్ట్ లో అనిచెప్పి చెల్లెమ్మ నుదుటిపై – బుజ్జితల్లి బుగ్గపై – ఆ ప్రాసెస్ లో దేవతపెదాలపై ముద్దుపెట్టబోయి డేంజర్ అంటూ భయంతో కిందకుదిగి బిక్కుబిక్కుమంటూ వెనక్కు తిరిగిచూస్తూ , దేవత హ్యాపీగా ఉండటం చూసి హమ్మయ్యా ……. అనుకుని బుజ్జితల్లికి డౌట్ రాకుండా తమ్ముళ్లతోపాటు బయటకువెళ్ళాను .
తమ్ముళ్లూ ……. ఇలా అందరమూ వచ్చేస్తే ఎలా ? .
అంతే సూరి పరుగునవెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు – నేను కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ వినయ్ కారుదగ్గరకువెళ్లి గట్టిగా పట్టుకున్నాడు .
నవ్వు వచ్చేసింది . గోవ …….. అనేంతలో …….. ,
గోవర్ధన్ : అన్నయ్యా …….. , సరే అన్నయ్యా …….
గోవర్ధన్ ……. ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యి , ఒకవేళ బుజ్జితల్లి అడిగితే …… ఒకవేళ ఏమిటి ఖచ్చితంగా అడుగుతుంది , ఎట్టిపరిస్థితుల్లోనూ సిటీకి వెళ్లారు అనిమాత్రం చెప్పకు …….
గోవర్ధన్ : కీర్తీ తల్లికి అపద్ధం చెప్పే ధైర్యం నాకుందా అన్నయ్యా ……..
నాకు కూడా లేదు తమ్ముడూ కానీ తప్పదు – వదిలి సిటీకి పోయాను అని తెలియగానే ………
గోవర్ధన్ : అమ్మో …… బుజ్జికన్నీళ్ళు ఆగవు .
కాబట్టి ఇక్కడే ఎక్కడో ఏర్పాట్లు చూసుకుంటున్నారు బుజ్జితల్లీ ……. , నిన్ను వదిలి ఎక్కడికి పోతారు చెప్పు అని నన్ను ఎలాగోలా మరిపించాలి వచ్చేన్తవరకూ ……..
గోవర్ధన్ : సరే అన్నయ్యా ……..
థాంక్యూ తమ్ముడూ ……. , సూరీ ……. త్వరగా వచ్చేయ్యాలి స్టార్ట్ చెయ్యి అనిచెప్పి వెనుక కూర్చోగానే పోనిచ్చాడు .
20 నిమిషాలలో వైజాగ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు చేరుకున్నాము .
వినయ్ : అన్నయ్యా …… అదిగో అక్కడ వేచిచూస్తున్నారే వారే , ఆయనను పిలుచుకునివస్తాను .
వద్దు తమ్ముడూ ……. , మనం ఆడిగినవెంటనే ఒప్పుకున్న ఆయన గొప్పవారు పైగా పెద్దవారు , మనమే వెళదాము .
వినయ్ : ఇద్దరికీ ఒకరినొకరిని పరిచయం చేసారు .
మా కోరికను మన్నించినందుకు చాలా చాలా థాంక్స్ పెద్దన్నా …….
పెద్దన్న : నీ గురించి ఈ అబ్బాయి చెప్పాడు – ఉదయం స్వయంగా గ్రామం వచ్చి నీ గురించి తెలుసుకున్నాను – బాబూ …… గాయం పరిస్థితి ఏమిటి ? .
అందరమూ ఆశ్చర్యపోయాము . పెద్దన్నా …… గ్రామానికి వచ్చారా ? .
గ్రామానికే కాదు , మీరు అంగరంగవైభవంతో జరిపించిన పెళ్లిని కనులారా వీక్షించి , నూతన వధూవరులను ఆశీర్వదించి , ఆతిథ్యం స్వీకరించి నా శ్రీమతికోసం మీరిచ్చిన గిఫ్ట్ కూడా తీసుకునే ఇక్కడికి వచ్చాను అని చూయించారు – అలాంటి వివాహం , విందుభోజనంలోని వంటలు ……. ఆహా ….. ఈ కడుపు సరిపోలేదు అద్భుతాన్ని చూసి తరించాను .
థాంక్స్ పెద్దన్నా …….
వినయ్ కూడా సంతోషించి పెద్దన్నా రిజిస్ట్రేషన్ …….. ? .
పెద్దన్న : sorry బాబు …… మీ ఆతిథ్యం మాయలోపడి ఇక్కడకు రావడానికి ఆలస్యం అయ్యింది , నేనొచ్చే ముందే ఆఫీసర్ భోజనానికి వెళ్లారట , మళ్లీ ఎప్పుడు వస్తారో అసలు వస్తారో లేదో తెలియడం లేదు .
వినయ్ : పత్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయి , నిమిషాలలో అయిపోయేది , ప్చ్ …… అక్కడ కీర్తితల్లి అప్పుడే …….
సూరి : రేయ్ అన్నయ్యకు గుర్తుచేసి బాధపెడుతున్నావు , రా వెళ్లి ఎప్పుడొస్తారో కనుక్కుందాము . అన్నయ్యా ……. 3 గంటలకు వెళ్లారట 4:30 కు వస్తారట ……
ఇంకా గంట వేచిచూడాలా ……. ? , పెద్దన్నా …… మీకు క్యాష్ కావాలా ? ట్రాన్స్ఫర్ చేయించాలా ? .
పెద్దన్న : ఏదైనా ok బాబూ అంటూ అకౌంట్ నెంబర్ ఇచ్చారు .
అక్కడికక్కడే బ్యాంక్ మేనేజర్ కు కాల్ చేసి , పెద్దన్నది వేరే బ్యాంక్ అకౌంట్ అయినా నిమిషాలలో మార్పించేసాను .
పెద్దన్న : బాబూ ……. రిజిస్ట్రేషన్ పూర్తికాకముందే …….
మీరు మనఃస్ఫూర్తిగా ఒప్పుకోవడమే మా అదృష్టం , ఈ పత్రాలు పెద్దయ్య – సర్పంచ్ గారి పేర్లపై మార్పు చెందడం ఊరందరి సంతోషం , అలా చేయడం కోసం ఏమైనా చేస్తాను .
15 నిమిషాలకొకసారి గోవర్ధన్ కాల్ చేసి , నా బుజ్జితల్లి …… నాకోసం బుజ్జిబుజ్జి పాదాలతో కళ్యాణమండపం మొత్తం చుట్టేస్తోందని – కనిపించకపోయేసరికి కంగారుపడుతోందని , డాడీ డాడీ ……. అంటూ కలవరిస్తోందని – ఏడవబోతే చెల్లెమ్మ ఎత్తుకుని వచ్చేస్తారు ఏదైనా ముఖ్యమైన పనిమీద వెళ్ళిఉంటారు అని ముద్దులతో నవ్వించి తన ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తోందని – బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ ఆడుకుంటోందని చెప్పడంతో రిలాక్స్ అయ్యాను – నా మనసంతా కూడా నా బుజ్జితల్లి దగ్గరే ఉంది .
4:30 కు గోవర్ధన్ కాల్ చేసి బుజ్జితల్లినే కాదు అన్నయ్యా …… , పెళ్లికూతురు – మహి అక్కయ్య – పెద్దయ్యా వాళ్ళందరూ కంగారుపడుతున్నారు కొద్దిగాకాదు చాలా …….
ఇక కొద్దిసేపు మ్యానేజ్ చెయ్యి తమ్ముడూ ………
ఆఫీసర్ రాక రాక 4:45 కు వచ్చారు . మాకంటే ముందు మరొక రిజిస్ట్రేషన్ ఉండటం అదొక అర గంట తరువాత మా రిజిస్ట్రేషన్ పూర్తయ్యేసరికి 6 గంటలు అయిపోయింది . పెద్దయ్య – సర్పంచ్ గారి తరతరాల ఆస్థులు వారివారి పేర్లపై మారడం చూసి , తమ్ముళ్లకు అందించి పెద్దన్నా ……. థాంక్యూ థాంక్యూ sooooo మచ్ అంటూ చేతులుకలిపాను – పెద్దన్నా …… అర్జెంట్ గా వెళ్ళాలి తప్పుగా అనుకోకండి , వీలుకుదిరినప్పుడు గ్రామానికి రండి …….
పెద్దన్న : తప్పకుండా బాబూ …… , ఊరి దేవుడు ఆహ్వానిస్తే రాకుండా ఉంటానా …… ? .
పెద్దన్నా ……. మీరుకూడానా ? .
తమ్ముళ్ళిద్దరూ …….. సంతోషంతో నవ్వుకున్నారు . తమ్ముళ్లూ ……. కారులో ఎంతసేపైనా నవ్వుకుంటూ వెళదాము – మొబైల్ ఏ క్షణంలోనైనా స్విచ్ ఆఫ్ అయిపోయేలా ఉంది – ఎంతమంది నుండి ఎన్ని కాల్స్ వచ్చాయో చూడండి అంటూ మొబైల్ చూయించాను .
తమ్ముళ్లు : హండ్రెడ్స్ …….
రిజిస్ట్రేషన్ సమయంలో సైలెంట్ లో ఉంచానుకదా ……
తమ్ముళ్లు : అన్నయ్యా ……. ఇక్కడే ఉండండి కారు తీసుకొస్తాము – ముగ్గురమూ సంతోషంతో బయలుదేరాము . బుజ్జితల్లీ – చెల్లెమ్మా …… నా దేవతకు కూడా లవ్ యు లవ్ యు నిమిషాలలో మీముందు ఉంటాను , తమ్ముళ్లూ …… ఫాస్ట్ ఫాస్ట్ …… , అవును తమ్ముళ్లూ ……. మీ ఫ్రెండ్ ఫస్ట్ నైట్ ఎక్కడ మన ఇంటిలోనా లేక చెల్లెమ్మ ఇంటిలోనా ……. ? .
తమ్ముళ్లు : దానికి కూడా ఊరి సాంప్రదాయం ఉంది అన్నయ్యా ……..
ఫస్ట్ నైట్ కు కూడానా ……. ? .
తమ్ముళ్లు : అవును …… , పెళ్ళికొడుకు – పెళ్లికూతురు …… ఇరువురి ఇళ్ళల్లోనూ శోభనపు గదులను రెడీ చేస్తారు , శోభన ముహూర్త సమయానికి ఎక్కడన్నది కాలమే నిర్ణయిస్తుంది అని నమ్మకం , ఇప్పటివరకూ పెళ్ళైన అందరి శోభనాలూ అలానే జరిగాయి , ఒకరి శోభనం పెళ్ళికొడుకు ఇంటిలో మరొకరి శోభనం పెళ్లికూతురి ఇంటిలో అలా ……. అంటూ సిగ్గుపడుతూ బదులిచ్చారు .
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ …… , కృష్ణ – చెల్లెమ్మ …… తొలి కార్యం ఎక్కడ నిర్ణయించబడిందో ……. , ( ఇంతకీ పూలతో అందంగా కాదు కాదు సెక్సీ గా శోభనపు గదులను రెడీ చేశారో లేదో – నా దేవత , సిస్టర్స్ ఉన్నారుకదా భయమేల అని సిగ్గుపడ్డాను )
వినయ్ : హైవే నుండి గ్రామపు సిమెంట్ రోడ్డువైపు టర్న్ అవుతుండగా , అన్నయ్యా అన్నయ్యా ……. అదిగో బస్టాండ్ వైపుకు వెళుతున్నాడే వాడే ఉదయం మీగురించి – పెళ్లికూతురుని తీసుకురావడానికి ఏ అర్హత ఉంది అని తప్పుగా మాట్లాడినది .
సూరీ స్టాప్ ……..
వినయ్ : రేయ్ సూరీ తొందరగా ఆపరా , వాడి అంతు చూసివస్తాను అని కారు ఆగగానే దిగబోయాడు .
వినయ్ – సూరీ ఆగండి అని కిందకుదిగి , నేను …… మీతో రావడం లేదు వెళ్లిపోండి అని ఆస్థిపత్రాలను అందించి డోర్ వేసాను .
అంతే ఆకాశంలో మేఘాలు గుద్దుకుని భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి మెరుపులు ……. – పైన దట్టమైన మేఘాలు కమ్ముకుని చీకటి మరింత త్వరగా పడింది .
తమ్ముళ్ళిద్దరూ …… అన్నయ్యా అన్నయ్యా అంటూ కిందకుదిగబోయారు .
తమ్ముళ్లూ ……. ఈ అన్నయ్యపై ఏమాత్రం అభిమానం ఉన్నా వెళ్లిపోండి – తెలిసి అన్నా తెలియక అన్నా ……. అతడు చెప్పినదే నిజం , సత్యం ఇదిగో మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది – నిజమే కదా ఆ ఇంటికి నేనెవరిని , మంచితనంతో నిండిన ఇంటిలో పరాయి వ్యక్తి ఉంటే ఇప్పుడు అర్హత గురించి మాత్రమే మాట్లాడిన వాళ్ళు రేపు అసహ్యంగా మాట్లాడితే ……. , నా దేవత – పెద్దమ్మ గురించి అలా మాట్లాడితే ఈ హృదయం తట్టుకోలేదు . ఈరోజు ఒకడు అన్నాడు రేపు ఇద్దరు మర్నాడు …….. ఎలా వచ్చానో అలానే వెళ్లిపోవడం న్యాయం – పెళ్లి చూసుకుని వెళ్ళమనలేదు కానీ ……..
తమ్ముళ్లు : అన్నయ్యా …… అలా జరగనే జరగదు – ఎవడైనా అలా అంటే వాళ్ళ అంతు చూస్తాము .
దెబ్బలు మానిపోతాయి తమ్ముళ్లూ …… – కానీ ఒక మాట మనసుల్లో ఉండిపోతుంది – సమయానికి బయటకువచ్చి అరాచకం సృష్టిస్తుంది , పెద్దయ్య – పెద్దమ్మ ……. ప్రేమ మరువలేనిది వారికెప్పుడూ ఋణపడిఉంటాను అనిచెప్పండి .
సూరి : అన్నయ్యా ……. మీ దేవత – బుజ్జితల్లి – మీ చెల్లెమ్మను చూడకుండా ……
కన్నీళ్లను తుడుచుకుని తమ్ముళ్లూ ……. మీరు ఇక్కడ ఉన్న ఒక్కొక్క క్షణం బాధ అంతకంతకూ రెట్టింపు అవుతూనే ఉంటుంది . రేపో ఎల్లుండో ……. నా దేవత – బుజ్జితల్లి బెంగళూరుకు వెళ్ళిపోతారు , అధిచూసి నా హృదయం ఏమాత్రం తట్టుకోలేదు ……. స్స్స్ అంటూ గాయం పై చేతినివేసుకున్నాను .
అన్నయ్యా అన్నయ్యా ……..
నో నో దిగకండి , మనసుకు తగలబోవు నొప్పితో పోలిస్తే ఇది ఎంత ……. , తమ్ముళ్లూ …….. నేను ఈ చుట్టుప్రక్కల గ్రామాలలోనే ఉంటాను – నెంబర్ మార్చి మీకుమాత్రమే ఇస్తాను , ఎటువంటి అవసరం వచ్చినా కాల్ చెయ్యండి , ఎంత డబ్భైనా సరే ……. మన గ్రామం త్వరలోనే ” ఆదర్శగ్రామం ” లా ప్రతీ గ్రామానికీ ఆదర్శం కావాలి .
తమ్ముళ్లు : మీరు లేని గ్రామం ఎలామారితే ఏమి ఆనందం అన్నయ్యా – వాడు కానీ నాకు మళ్లీ కనిపిస్తే వాడిని నా చేతులతో పాతేసి సంతోషంగా జైల్ కు పోతాను .
నవ్వుకుని తమ్ముళ్లూ …… మనం విడిపోతున్నాము కానీ గుడ్ బై మాత్రం కాదు .
అన్నయ్యా ……..
ఈ అన్నయ్యపై ఏమాత్రం గౌరవం ఉన్నా వెళ్లిపోండి ……. , ఇది మీ దేవుడి ఆజ్ఞ …..
సూరి : అన్నయ్యా ……. మీరు కారులో …….
ఈ కారు ……. నాబుజ్జితల్లికోసం , నావెనుక వచ్చారో నామీద ఒట్టు …….
తమ్ముళ్లు : అన్నయ్యా అన్నయ్యా …… ఎంతమాట అన్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు .
వినయ్ : సూరీ …… త్వరగా పోనివ్వు , అన్నయ్యను ఆపే శక్తి బుజ్జితల్లికి – మహి అక్కయ్యకు – పెళ్లికూతురికి తప్ప ఎవ్వరికీ లేదు .
సూరి : అవునవును అంటూ గేర్ మార్చి గ్రామంవైపుకు వేగంగా పోనిచ్చాడు .
ఒక్కసారిగా మొదలవ్వడం మొదలవ్వడమే ఉరుములు మెరుపులతో పెద్దగా వర్షం క్షణాలలో పూర్తిగా తడిచిపోయాను – వర్షంలో కుట్లపై చేతినివేసుకుని హృదయం నుండి తన్నుకువస్తున్న కన్నీళ్ళతో నెమ్మదిగా బస్టాండ్ వైపు sorry బుజ్జితల్లీ లవ్ యు లవ్ యు రా – లవ్ యు చెల్లెమ్మా ……. నన్ను క్షమించండి , నాలుగురోజులైనా నా దేవత హృదయంలో స్థానం సంపాదించుకోలేకపోయాను – నా దేవత లేని ఈ విలువలేని దేవుడి జీవితం వృధా అందుకే వెళ్లిపోతున్నాను . అడుగులు భారమైపోతున్నాయి – బుజ్జితల్లి దేవతను వదిలి వెళ్లలేకపోతున్నాను – కన్నీళ్ళతో గ్రామపు రోడ్డు శిలాఫలకం దగ్గరికి చేరి , శిలాఫలకం పై ఉన్న పెద్దయ్యకు చెప్పకుండా వెళ్లిపోతున్నానని వర్షంలో గజగజావణుకుతూ క్షమాపణలు చెప్పి , ప్రారంభోత్సవం – తొలి అడుగులు వేసినట్లుగా ముద్రించిన నా బుజ్జితల్లి పేరు కనిపించగానే పెదాలపై తియ్యనైన నవ్వులు , లవ్ యు బుజ్జితల్లీ …… అంటూ ముద్దులుపెడుతూనే కుట్లకు నీళ్లు తగలడం వలన నొప్పివేసి అక్కడే కూర్చుండిపోయాను , నిమిషాలలో చలికి – నొప్పికి గజగజావణికిపోతూనే స్పృహకోల్పోయి బుజ్జితల్లీ – దేవత , బుజ్జితల్లి – దేవత అని కలవరిస్తూనే శిలాఫలకంపై వాలిపోయాను ఆ భయంకరమైన వర్షంలో ….
247c
**మరిన్ని కథలు చదవండి**:
మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]
**మమ్మల్ని ఫాలో చేయండి**:
**మమ్మల్ని ఫాలో చేయండి**:

**స్టోరీ షేర్ చేయండి**
**స్టోరీ షేర్ చేయండి**