KALASI VACHINA ADRUSTAM

Kalasi Vachina Adrustam – 274 | Telugu Romantic Suspense Stories

Kalasi Vachina Adrustam - 274 | Telugu Romantic Suspense Stories

కథ,కథనం: శివ రెడ్డి

“యావుర్రా మీది , లేచి పోతారా లేకా కాళ్ళు ఇంచి సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి అప్పగించ మంటారా” అన్నాడు శ్రీని తో వచ్చిన పెద్దాయన.
 
“తప్పయిపోయింది అన్నా , పోతున్నాము” అంటూ కింద కుచోన్న వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళతో పాటు ఈడ్చు కొంటూ పోయారు.
 
ఈ లోపల చుట్టూ ఉన్న షాప్ ల వాళ్ళు కూడా అక్కడ జాయిన్ అయ్యారు, “ఇంకా రెండు తగిలించాల్సింది ఆ నా కొడుకులకు, మన ఉరి వాళ్ళు కాదు” అన్నారు ఎవరో.
 
“ఎవరయితే ఏందీ , ఆడబిడ్డలను ఏడిపిస్తే ఆ నా కొడుకులకి ఆ యబ్బి చేసినట్లు చెయ్యాల్సిందే”
 
“శ్రీను , వాళ్ళను నీతో తీసుకొని వేళ్ళు , ఆయబ్బి తోడుగా ఉంటె వాళ్ళను ఎవ్వరు ఏమీ అనరులే” అంటూ తోడుగా వచ్చిన పెద్దోళ్లు వాళ్ళు వచ్చిన వైపు వెళ్లారు.
 
ఆ తరువాత sreenu  చెప్పాడు వాళ్ళు అక్కడే ఎదో షాప్ పెట్టుకొని ఉన్నారు , ఈ ఆడపిల్లలు ఆ షాప్ దగ్గరి కి వెళ్లి జరిగింది చెప్పారు అని.
 
వాళ్ళు 4 ఉన్నట్లు ఉన్నారు అమ్మాయిలూ, ఇద్దరు శ్రీను తమ్ముడి వయస్సు వాళ్ళు , మిగిలిన ఇద్దరు లంగా ఓణీ లో ఉన్నారు. శ్రీను లాగా కాలేజీ లో ఉండవచ్చు అనుకొన్నా.
 
“ఎమ్మా, నీకు చెప్పలేదు మొన్న వచ్చినప్పుడు , ఈ అన్న రూమ్ లోనే నేను ఉండేది, శివ రెడ్డి అన్నా, నేను తిరుణాలకు రమ్మంటే వచ్చినాడు” అన్నాడు తాను చేయి పట్టుకొని తీసుకొని వెళ్లిన అమ్మాయి వైపు చూస్తూ.
 
“అన్నా ఈ యమ్మీ మన ఇంటి పక్కనే ఉంటుంది పేరు అక్షర , ఇదుగో ఈ యమ్మీ అక్షర పెద్దమ్మ  కూతురు, వేళ్ళు ఇద్దరు వాళ్ళ చెల్లెళ్లు” అంటూ అందరినీ పరిచయం చేశారు.
 
ఆ తరువాత మా చుట్టూ ఉంటూ మాతో పాటే తిరుణాల మొత్తం తిరగ సాగారు, వాళ్ళ చెల్లెళ్లు నా రెండు చేతులు చెరో వైపు పట్టుకొని నడవ సాగారు.
దాదాపు, 11 వరకు తిరిగాము తిరుణాల మొత్తం ఓ చోట ఎదో పౌరాణిక నాటకం జరుగుతూ ఉంది, ఇంకో చోట హరికథ చెప్తూ ఉన్నారు. అక్కడ నిలబడుతూ ఉండగా రెండు చేతులు పట్టుకున్న పిల్లలు “కాళ్లు నస్తున్నాయి, ఇంటికి పోదాం పద” అని ఒకరు అంటే, ఇంకొకరు “నాకు నిద్ర కూడా వస్తుంది” అంది.
ఈ లోపు అక్షర తన ఫ్రెండ్స్ తో ఎదో మాట్లాడి నా వైపు వచ్చింది, “ఓ సారి ఇంటికి వెళ్లి వాళ్ళను దిగబెట్టి వద్దాము మేము పాస్ కి కూడా వెళ్ళాలి అంది” అంది సిగ్గు పడుతూ.
 
శ్రీని కి చెప్పకుండా డైరెక్ట్ గా నాకు వచ్చి పాస్ కి వెళ్ళాలి అని చెప్పడం నాకు కొత్తగా అనిపిస్తూ ఉండగా “సరే ఓ సారి ఇంటికి వెళ్లి వద్దాం పదండి, శ్రీను ఇంకా ఎం మిగిలింది వచ్చాక చూద్దాం పద” అన్నాను.
 
“అన్నా మనం గుడిలోకి వెళ్ళలేదు, పూజలు అర్థరాత్రి దాటాక స్టార్ట్ అవుతాయి, పద తొందరగా వాళ్ళను దిగబెట్టి వద్దాం” అంటూ ఇంటి దారి పెట్టాము.
ఇంటి దగ్గరకు చేరగానే, “మేము వచ్చి పిలుస్తాము, అప్పుడు వెళదాం” అంది అక్షర మమ్మల్ని చూసి.
 
మేము లోపలి వెళ్ళగానే ఇంట్లో శ్రీను అమ్మ వైపు వాళ్ళు వచ్చినట్లు ఉన్నారు అందరు పెద్ద వాళ్ళు, మేము అక్కడ ఉండడం ఎందుకు అని పైకి వచ్చాము.

 

 

312ic

**మరిన్ని కథలు చదవండి**:

మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]


**మమ్మల్ని ఫాలో చేయండి**:
 కింద ఇచ్చిన సోషల్ మీడియా ఐకాన్ క్లిక్ చేసి నన్ను ట్విట్టర్ లో ఐన పేస్ బుక్ లో ఐన కాంటాక్ట్ అవ్వొచ్చు థాంక్స్ . #తెలుగుకథలు #కలసివచ్చినఅదృష్టం #తెలుగురొమాంటిక్‌స్టోరీస్
  Facebook Telegram (software) - Wikipedia Twitter Logo Images - Free Download on Freepik
మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి! #తెలుగుకథలు,

**స్టోరీ షేర్ చేయండి**

Kalasi Vachina Adrustam – 266, Telugu Romantic Suspense Stories,Kalasi Vachina Adrustam

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button