Trending News

శంకర్ సెంటిమెంట్ తో సాయితేజ్ మూవీ టైటిల్.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ?

శంకర్ సెంటిమెంట్ తో సాయితేజ్ మూవీ టైటిల్.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ?

శంకర్ సెంటిమెంట్ తో సాయితేజ్ మూవీ టైటిల్.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ?

శంకర్ సెంటిమెంట్ తో సాయితేజ్ మూవీ టైటిల్.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ?
శంకర్ సెంటిమెంట్ తో సాయితేజ్ మూవీ టైటిల్.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ?

మెగా హీరోలలో ఒకరైన సాయితేజ్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. ఇతర స్టార్ హీరోల అభిమానులు సైతంసాయితేజ్ ను ఎంతగానో అభిమానిస్తారు. విరూపాక్ష సినిమాతో సాయితేజ్ కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. విరూపాక్ష మూవీ సక్సెస్ తో క్రేజ్ ను మరింత పెంచుకున్న సాయితేజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ ను రిపీట్ చేస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

విరూపాక్ష సక్సెస్ వల్ల సాయితేజ్ రెమ్యునరేషన్ ను పెంచారని ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. సాయితేజ్ సంపత్ నంది కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. గాంజా శంకర్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని బోగట్టా. శంకర్ టైటిల్ తో తెరకెక్కిన చిరంజీవి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సాయితేజ్ కు సైతం అదే సెంటిమెంట్ కలిసొస్తుందేమో చూడాలి.

సాయితేజ్ కెరీర్ పరంగా ఎదగడంతో పాటు మరిన్ని భారీ బ్లాక్ బస్టర్ హిట్లు సాధించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారు. నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా సాయితేజ్ ముందడుగులు వేయాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాయితేజ్ టైర్1 రేంజ్ కు ఎదగాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూనే మరోవైపు కొత్త డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి సాయితేజ్ ఆసక్తి చూపిస్తున్నారు.

సాయితేజ్ కెరీర్ ప్లానింగ్ బాగుందని కామెంట్లు వినిపిస్తుంది. మరో ఆరు వారాల్లో పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో మూవీ థియేటర్లలో విడుదల కానుంది. జులై 28వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.సాయితేజ్ సంపత్ కాంబో మూవీ గురించి బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button