Kalasi Vachina Adrustam – 270 | Telugu Romantic Suspense Stories
Kalasi Vachina Adrustam - 270 | Telugu Romantic Suspense Stories

కథ,కథనం: శివ రెడ్డి "నమస్తే, సర్ నా పేరు అక్షర , తను నా చెల్లెలు జాహ్నవి , డిగ్రీ కాలేజీ లో రెండో సంవత్సరం చదువుతూ ఉంది, కాలేజీ లో తనకి ఓ ఇబ్బంది వచ్చింది, తన సీనియర్ ఒకరు తనని బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. తాను కాలేజీ మానేజిమెంట్ వాళ్ళ అబ్బాయి , తన మీద కాలేజీ లో కంప్లైంట్ చేద్దాము అంటే , తన చదువుకి అడ్డం అవుతుంది అని భయపడుతూ ఉంది. "మీరు ఉండేది ఎక్కడ?" "సర్ మా సొంత ఊరు అనంతపురం జిల్లా, ముదిగుబ్బ, మా అయన ఇక్కడ పని చేస్తాడు, తను మా దగ్గరే ఉంది చదువుకొంటు ఉంది?" "మీ వూరు ఏది" అన్నాను అప్పటి వరకు వాళ్ళను చెప్పేది వింటూ ఉన్నాను కానీ వాళ్ళను అంతగా గమనించ లేదు, కానీ తన ఊరు పేరు చెప్పగానే వాళ్ళ వైపు చూసాను, చూడగానే వాళ్ళను ఎక్కడో చూసినాను అనిపించింది. "ముదిగుబ్బ " అంది అక్షర. "మీరు హెడ్మాస్టర్ రామి రెడ్డి గారి అమ్మాయి కదూ ?" అన్నాను తన వైపు చూస్తూ. "మీకు మా నాన్న గారు తెలుసా?" అంది నా వైపు చూస్తూ "మీరు,నువ్వు శివా కదూ , నేను అక్షర, ఇది నా చెల్లెలు" అంది తాను నన్ను గుర్తించి. "మా శివా మీకు తెలుసా, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, మా అవసరం మీకు ఉండదు అనుకుంటా, మీ ప్రాబ్లమ్ శివా కి చెప్పండి. తను సాల్వ్ చేసాడు , మా అవసరం ఉంటె అప్పుడు శివా నే మాకు చెప్తారు లెండి, మీరు శివా తో వెళ్ళండి, శివా రేపు మాత్రం నేను చెప్పిన టైం కి వచ్చేయండి" అన్నాడు. వాళ్ళను తీసుకొని ఆఫీస్ నుంచి బయటకు వచ్చాము, "శివా, మా ఇంటికి వెళ్దాం పద అక్కడే చెప్తాను తనకి వచ్చిన problem ఏమిటో" అంది అక్షర తను వచ్చిన స్కూటీ ని స్టార్ట్ చేసి తన సిస్టర్ ని ఎక్కించుకొని తన ఇంటి వైపు నడుపుతూ, తన వెనుకే బైక్ తో ఫాలో అయ్యాను. ఓ 20 నిమిషాలకు తన ఇంటికి చేరుకున్నాము, అదో అపార్ట్‌మెంట్ అందులో రెండో అంతస్తులో కి తీసుకొని వెళ్లి , తనతో ఉన్న కీస్ తో డోర్ ఓపెన్ చేసి లోపలి కి తీసుకొని వెళ్ళింది. "శివా , ఎన్ని రోజులు అయ్యింది నిన్ను చూసి, ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు. మనం కలిసి దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది." అంది మా ఇద్దరి కలియక గుర్తుకు తెచ్చుకుంటూ. "అవును చాలా రోజులు అయిపోయింది, మీ నాన్న గారు ఎలా ఉన్నారు, మీ అన్న శ్రీను ఎలా ఉన్నారు?" "నాన్న చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది , అమ్మ ఊళ్లోనే ఉంది , శ్రీను అన్న మీకు టచ్ లో లేడు అని తెలిసింది, తను ఊళ్లోనే ఉన్నాడు , తను మా చిన్నాన్న కొడుకు సొంత అన్నయ్య కాదులే" "నాకు తెలుసు తను మీ సొంత అన్న కాదు అని, సారీ మీ నాన్న గారు పోయారని తెలియదు" "నేను జాను కి గుర్తు లేదు అనుకుంటా?" అన్నాను తన చెల్లి వైపు చూస్తూ. "నాకు కొద్దీ కొద్దిగా మీ పేరు గుర్తు ఉంది , కానీ నాకు గుర్తుకు రావడం లేదు." "మన ఉరికి తిరుణాలకు వచ్చాడు నువ్వు 4, లేదా 5 తరగతిలో ఉన్నావు అనుకుంటా, మన ఊరిలో రెండు రోజులు మాత్రమే ఉన్నాడు” "మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ...
📖 ఇకపై అన్ని పార్ట్స్ / ఎపిసోడ్ లు చదవాలంటే సబ్స్క్రిప్షన్ తప్పకుండా తీసుకోవాలి.
నెలకి ₹30 రూపాయలు మాత్రమే, ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే, తర్వాత ధర పెరుగును
ధన్యవాదాలు 🙏
📖 To read all parts/episodes, you must take a subscription.
Only ₹30 per month – this offer is valid for a limited time, the price will increase later.
Thank you 🙏