Kalasi Vachina Adrustam – 272 | Telugu Romantic Suspense Stories
Kalasi Vachina Adrustam - 272 | Telugu Romantic Suspense Stories

కథ,కథనం: శివ రెడ్డి మేము శుక్రవారం సాయంత్రం బయలుదేరి వెళ్ళాము, శనివారం , అదివారం రెండు రోజులు జరుగుతుంది. ముఖ్యంగా ఆదివారం పగలు అమ్మ వారికీ బలులు ఇవ్వడం జరుగుతుంది. ఆ రెండు రోజులు రాత్రిళ్ళు జాగారం చేస్తారు రక రకాల ప్రోగ్రాములతో. చుట్టూ పక్కల గ్రామాల నుంచి జనాలు వస్తారు, అన్ని రకాల అంగళ్ళు వెలుస్తాయి ఆ రెండు రోజులు అక్కడ. శ్రీను వాళ్ళు బాగానే ఉన్నవాళ్లు , ఇంట్లో ఇద్దరే అబ్బాయిలు శ్రీను పెద్దోడు చిన్నోడు 5 తరగతి చదువుతూ ఉన్నాడు ఊర్లోని బడిలో, వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తాడు. 5 ఎకరాల పొలం 20 ఎకరాల చేన్లు ఉన్నాయి, ఎప్పుడు ఎదో ఒక పంట వేస్తూ ఉంటాడు శ్రీను వాళ్ళ నాన్న. టౌన్ లో లాగా బాగానే కట్టుకున్నాడు ఇల్లు, కింద రెండు పడక గదులు పైన ఒకటి, నన్ను పై రూమ్ లో ఉండమన్నారు, ఆ రూమ్ ముందు చాలా ఓపెన్ స్పేస్ ఉంది. నాకు ఇంట్లో వాళ్ళు ముందే తెలియడం వలన పెద్దగా ఇబ్బంది అనిపించ లేదు బాగానే కలిసి పోయాను. మేము వెళ్ళగానే కాఫీ తాగి రూమ్ లోకి వెళ్లాను దాదాపు 5 అవుతూ ఉంది. నువ్వు రెడీ అయ్యి కిందకు రా తినేసి తిరుణాలకు వెళ్దాం అన్నాడు శ్రీను. అది పూర్తిగా పెద్ద టౌన్ కాదు, అలాగా అని చిన్న పల్లెటూరు కూడా కాదు , కానీ డెవలప్ అవుతున్న ఊరు. ఇల్లు ఒక దానికి అనుకోని ఇంకోటి కట్టారు , అంటే రెండు ఇళ్లకు కలిసి ఒకే గోడ , మొదటి అంతస్తు లో రెండు ఇళ్లను వేరు చేయడానికి చేతి ఎత్తు గోడ మాత్రమే కట్టారు, ఇటువైపు నుంచి నిలబడితే సరిగ్గా మనిషి నడుం దాకా వస్తుంది ఆ గోడ, శ్రీను ఇంటికి కుడి వైపు , ఎడం వైపు రెండూ కూడా శ్రీను వాళ్ళ ఇంటి లాగే కట్టారు , ఆ తరువాత ఇల్లు పూర్తిగా మొదటి అంతస్తు కట్టారు, అంటే ఈ మూడు ఇల్లు మాత్రం మొదటి అంతస్తు ఓకే పడక గది దాని ముందు చాలా ఓపెన్ స్పేస్, ఆ పడక గది ముందు చిన్న బాత్రూం. రెండు వైపులా పూర్తిగా కట్టడం వలన వీళ్ళ ఓపెన్ స్పేస్ లో కూచోవడానికి , ఎండా కాలం పడుకోవడానికి చాలా బాగుంది. ఆ తరువాత తెల్సింది ఆ మూడు ఇల్లు అన్నదమ్ములవి అని అందుకే ఒకే రకంగా కట్టుకున్నారు అని. కుడి వైపు మీద నుంచి ఏవో మాటలు వినిపిస్తూ ఉన్నాయి, బాత్రూం కి వచ్చినప్పుడు, కానీ ఎవరో తెలియలేదు. అయినా కొత్త ఊరు మనకు ఎందుకులే అని ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చు కొని కిందకు వెళ్లాను, నా కోసమే ఎదురు చూస్తూ ఉన్నట్లు అందరు 6.30 రాత్రి భోజనాలకు కూచోన్నారు. వాళ్లతో పాటు తినేసి శ్రీను , తన తమ్ముడితో కలిసి తిరుణాలకు బయలు దేరాము. గుడి ఉరి బయట ఉన్నది, అక్కడ పొలాల్లో తిరునాళ్ల జరుపుతయారు, ఎటు చూసినా చిన్న చిన్న అంగళ్ళు, రంగు రంగుల దుస్తుల్లో జనాలు చుట్టూ పక్కల పల్లెల నుంచి బల్ల మీద, వారికి అందుబాటులో ఎం ఉంటె ఆ వాహనాల మీద వచ్చారు , ఆర్గనైజర్స్ ఎవరో కానీ చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేశారు. బైక్స్ కి పార్కింగ్ ఓ వైపు , ఎద్దుల బండ్ల నిలుపుకోవడానికి మరో వైపు. ఆ ఏరియా మొత్తం ఫ్లడ్ లైట్స్ వెలుతురులో నిండి పోయింది. ఆదివారం అమావాస్య , కానీ ఆ లైట్స్ వెలుతురులో చీకటి పారిపోయినట్లు ఉంది. చూద్దామన్నా ఆ చుట్టూ పక్కల ఎక్కడా కనపడలేదు. శ్రీను తమ్ముడు ఏవో కావాలంటే ఓ కొట్టు దగ్గర ఆగి తనకు కావలసిన వాటిని కొనిపించి ముందుకు కదిలాము. కొద్దిదూరం పోగానే, ఓ అబ్బాయిల గుంపు, ఓ అమ్మాయిల గుంపు వెనుక నిలబడి కామెంట్స్ చేస్తూ ఉన్నారు, అందరు కాలేజీ లో చేరిన పిల్లల లాగా అగుపిస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిలో ఇవన్నీ సాధారణంగా జరిగేవె శృతి మీరనంత వరకు బాగానే ఉంటుంది అవి కొద్దిగా శృతి మీరితేనే ఇబ్బంది, వాళ్ళ వెనుక మేము షాప్స్ చూసుకొంటూ మెల్లగా నడుస్తూ ఉన్నాము. కొద్ది దూరం వెళ్ళగానే ఉన్నట్లు ఉంది కరెంటు పోయింది పెద్ద సౌండ్ చేస్తూ. ఆ సౌండ్ వినగానే నాకు అర్థం అయ్యింది ఏంటి అంటే, ట్రాన్స్ఫార్మర్ లోడ్ భరించ లేక పెళ్లి పోయింది అని. అంత వరకు వెలుగు భయానికి దాక్కొన్న చీకటి, ఒక్క సారిగా దాడి చేసినట్లు ఎదుటి మనిషి కనబడ నట్లు ఆవరించింది. అక్కడ అక్కడా బీడీలు సిగరెట్లు తాగేవాళ్ళు వెంటనే అగ్గి పుల్లలు వెలిగించగా, అక్కడ ఉన్న కొట్టు వాళ్లకు ఇలాంటిది ఎదో జరుగుతుంది అని వాళ్లకు బాగా అలవాటు ఉన్నట్లు వెంట వెంటనే ఎవరి స్తోమతకు తగ్గట్లు వాళ్ళు, లాంతర్లు , చిన్న బుడ్డీలు...
📖 ఇకపై అన్ని పార్ట్స్ / ఎపిసోడ్ లు చదవాలంటే సబ్స్క్రిప్షన్ తప్పకుండా తీసుకోవాలి.
నెలకి ₹30 రూపాయలు మాత్రమే, ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే, తర్వాత ధర పెరుగును
ధన్యవాదాలు 🙏
📖 To read all parts/episodes, you must take a subscription.
Only ₹30 per month – this offer is valid for a limited time, the price will increase later.
Thank you 🙏