Tollywood NewsTrending News

టాలీవుడ్ స్టార్లు.. వెబ్ సిరీస్ లు వద్దు..!

టాలీవుడ్ స్టార్లు.. వెబ్ సిరీస్ లు వద్దు..!

టాలీవుడ్ స్టార్లు.. వెబ్ సిరీస్ లు వద్దు..!

టాలీవుడ్ స్టార్లు.. వెబ్ సిరీస్ లు వద్దు..!
టాలీవుడ్ స్టార్లు.. వెబ్ సిరీస్ లు వద్దు..!

వెంకీ- తమన్నా అనగానే అందరికీ ‘ఎఫ్ 2 ‘ ‘ఎఫ్ 3 ‘ వంటి సినిమాలు గుర్తుకొస్తాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఆ రెండు సినిమాలు బాగా ఆడాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం అది కాదు. వెంకటేష్ తన 37 ఏళ్ళ సినీ కెరీర్లో ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సినిమాలే ఎక్కువగా తీశాడు. వెంకటేష్ వేరే జోనర్లో తీసిన సినిమాలు కూడా బాగా ఆడాయి. అందుకు కారణం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అనే చెప్పాలి.

వాళ్ళు వెంకటేష్ ను తన ఫ్యామిలీ మెంబర్లా భావించేంతలా వెళ్ళింది వ్యవహారం. అలాంటి వెంకీ ‘రానా నాయుడు’ సిరీస్ లో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతుంటే అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇంటిమేట్ సీన్స్ లో జాగ్రత్తలు వహించినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వెంకటేష్ ఇమేజ్ కు పెద్ద మచ్చ పడినట్టు అయ్యింది. ఈ విషయంలో రానాని కూడా ట్రోల్ చేశారు నెటిజన్లు. ఇప్పుడు తమన్నా కూడా అలాంటి విమర్శలే ఎదుర్కొంటుంది.

‘జీ కర్దా’ అనే వెబ్ సిరీస్ లో తమన్నా (Tamanna) నటించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ లో తమన్నా మునుపెన్నడూ చూడనంత బోల్డ్ గా కనిపించింది. ఆమెతో ఈ రేంజ్లో బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటిస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. అంతేకాదు ఈ సిరీస్ లో డబుల్ మీనింగ్ డైలాగులు కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. ఇందువల్ల నెటిజన్లు టాలీవుడ్ స్టార్స్ ను వెబ్ సిరీస్ లలో నటించొద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాంటి ఆలోచనలు ఉంటే వెనక్కి తీసుకోవాలని కూడా వారు కోరుకుంటున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button