Tollywood NewsTrending News

డింపుల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. అందుకేనా.!!

డింపుల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. అందుకేనా.!!

డింపుల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. అందుకేనా.!!

డింపుల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. అందుకేనా.!!
డింపుల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. అందుకేనా.!!

సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.. తాజాగా ఓ హీరోయిన్ చేత పూజలు చేయిస్తూ కనిపించారు. సినీ రాజకీయ ప్రముఖుల జీవితాల్లో ఏం జరగబోతోందో తన పాండిత్యం ద్వారా ముందే చెప్పబోయే ఈ జ్యోతిష్యుడు అంటే చాలామందికి అపారమైన నమ్మకం. తమ జాతకాల్లో ఉన్న దోషాలు.. ఈయన చేత పూజలు చేయిస్తే దూరమవుతాయని కొందరు నమ్ముతుంటారు. గతంలో రష్మిక మందన్నా, నిధి అగర్వాల్‌ వంటి స్టార్‌ హీరో హీరోయిన్లు వేణు స్వామి దగ్గర ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మరో ప్రముఖ హీరోయిన్‌ చేరింది. ఆమె మరెవరో కాదు ఇటీవల ఓ పోలీస్‌ ఉన్నతాధికారితో గొడవ పెట్టుకుని వార్తల్లో నిలిచిన డింపుల్‌ హయతీ. ఇప్పుడీ వివాదం నుంచి ఉపశమనం పొందేందుకు ఆమె వేణుస్వామిని ఆశ్రయించినట్లు సమాచారం. Also Read – జిమ్‌లో బాహుబలి పాట వింటూ అకీరా నందన్ వర్కవుట్స్ డింపుల్‌ ఇంట్లోనే వేదమంత్రాల నడుమ వేణుస్వామి ప్రత్యేక పూజలు, యాగాలు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఇలా ఈ హీరోయిన్ ఇంట వేణు స్వామి ఇలా ప్ర‌త్యేక‌మైన పూజ‌లు నిర్వ‌హించ‌టానికి కార‌ణం.. ఆమె జాతకంలో శని ఉందని అంటున్నారు నెటిజన్లు. ఆమె కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక మంచి హిట్ ను అందుకున్నది లేదు. ఈ మధ్య అవకాశాలు ఏమో కానీ వివాదాల్లో ఎక్కువ ఆమె పేరు వినిపిస్తుంది. ఇలాంటి విష‌యాల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి పూజా కార్య‌క్ర‌మాల్లో డింపుల్ హ‌యాతి పాల్గొంద‌నే టాక్ న‌డుస్తోంది. మరి ఈ పూజల పలితం అమ్మడికి ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం డింపుల్ .. కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ లో ఒక స్పెషల్ సాంగ్ చేస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. Also Read – షూటింగ్ స్పాట్‌‌లో ‘సలార్‌’ విలన్‌‌కు ప్రమాదం..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button