Tollywood NewsTrending News

‘ఆదిపురుష్‌’ సినిమా ఎఫెక్ట్‌… వాళ్ల పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉందా?

‘ఆదిపురుష్‌’ సినిమా ఎఫెక్ట్‌… వాళ్ల పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉందా?

‘ఆదిపురుష్‌’ సినిమా ఎఫెక్ట్‌… వాళ్ల పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉందా?

‘ఆదిపురుష్‌’ సినిమా ఎఫెక్ట్‌… వాళ్ల పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉందా?
‘ఆదిపురుష్‌’ సినిమా ఎఫెక్ట్‌… వాళ్ల పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉందా?

గత రెండు రోజులుగా ఇదే చర్చ సోషల్‌ మీడియాలో నడుస్తోంది. ఇదంతా ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ సినిమా గురించే. ముంబయిలో ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున షోస్‌ వేస్తున్న విషయం తెలిసిందే. సింగిల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లో ఈ సినిమాను భారీ స్థాయిలో ఎక్కువ షోలతో రిలీజ్‌ చేస్తున్నారు. దీని కోసం సిబ్బంది నిద్ర, తిండి తిప్పలు మొత్తం థియేటర్‌లోనే అనేది ఈ చర్చ సారాంశం. శుక్రవారం విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ కోసం నార్త్‌లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉన్నాయట.

పీవీఆర్ మల్టీప్లెక్స్ నాలుగు రోజులు ఉండగానే లక్షకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయట. 16 నుండి మూడు రోజుల పాటు మల్టీప్లెక్స్‌ స్టాఫ్‌కి సరైన నిద్ర, విశ్రాంతి దొరకకపోవచ్చు అని అంటున్నారు. మొదటి వీకెండ్‌లో వీలైనన్ని ఎక్కువ షోలు వేసేలా ప్రయత్నాలు చేస్తుండటమే కారణం. ఉత్తరాది రాష్ట్రాల్లో సినిమా ప్రదర్శనకు ఎలాంటి పరిమితులు లేవు. తెల్లవార్లూ షోలు వేసినా ఇబ్బంది లేదు. దీంతో వీలైనన్ని ఎక్కువ షోలు పడేలా మల్టిప్లెక్స్‌లు అనుకుంటున్నాయట. దీంతో తొలి మూడు రోజులు 24 గంటలూ సినిమా ఆడే అవకాశం ఉందట.

దీని కోసం స్టాఫ్‌ ఇంటికి వెళ్లకుండా అక్కడే షిఫ్ట్‌ల వారీగా పని చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారట. తిండి, వసతి సదుపాయాలతో పాటు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చేలా ప్లాన్స్‌ జరుగుతున్నాయట. ‘దృశ్యం 2’, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలకు కూడా ఇలానే కాస్త హంగామా చేశారు. ఇప్పుడు ‘ఆదిపురుష్‌’ అంతకుమించి అనేలా ప్లాన్స్‌ వేస్తోందట మల్టిప్లెక్స్‌ టీమ్‌.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button