Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 175 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories - 175 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories - 175 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in prasad_rao16 [caption id="attachment_2075" align="aligncenter" width="589"] Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్[/caption] హాస్పిటల్ చేరుకున్న తరువాత రాముకి వెంటనే డాక్టర్లు ట్రీట్ మెంట్ చేసి తలకు కట్టు కట్టి….బయట కంగారుగా ఉన్న ప్రసాద్ దగ్గరకు వచ్చి, “ప్రసాద్ గారూ….ఇంకో గంటలో రాము గారికి సృహ వస్తుంది,” అన్నాడు. ఆ మాట వినగానే ప్రసాద్ ఆనందతో డాక్టర్ చేతులు పట్టుకుని, “చాలా థాంక్స్ డాక్టర్….” అన్నాడు. “కొట్టిన వాడు ఎవడో కాని మనిషి ఎక్కడ కొడితె బాగా డ్యామేజ్ జరుగుద్దో తెలిసిన వాడు….కాకపోతే రాము గారి అదృష్టం బాగుండటంతో…దెబ్బ వేరే చోట తగిలింది,” అన్నాడు డాక్టర్. “అలాగా….సరె….వాడి గురించి తరువాత ఎంక్వైరీ చేస్తాను….నేను రాము సార్ ని చూడొచ్చా,” అనడిగాడు ప్రసాద్. “తప్పకుండా….కాకపోతే ఆయన్ను కదిలించకండి,” అంటూ డాక్టర్ తన పక్కనే ఉన్న నర్స్ కి ఏం మందులు వాడాలో వివరంగా చెబుతున్నాడు. ప్రసాద్ వెంటనె రాము ఉన్న రూమ్ లోకి వెళ్ళాడు. లోపల బెడ్ మీద రాము హాస్పిటల్ డ్రస్ లో పడుకుని ఉన్నాడు….అతని తలకు కట్టుకట్టి ఉన్నది.ప్రసాద్ వెంటనె అక్కడ సోఫాలో ఉన్న రాము బట్టల్లో నుండి ఫోన్ తీసుకుని రాము వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పి ప్రమాదం ఏమీ లేదని….హాస్పిటల్ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసాడు. ప్రసాద్ ఫోన్ పెట్టేసిన పావుగంటకు ఇంట్లో అందరూ కంగారుగా హాస్పిటల్ కి వచ్చారు. కాని శివరామ్ ఊర్లో లేకపోయే సరికి తనకు తెలిసిన డాక్టర్లకు ఫోన్ చేసి విషయం చెప్పి రాముని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. వాళ్ళందరూ వచ్చిన తరువాత ప్రసాద్ వాళ్ళకు రాము యూనిఫామ్, ఫోన్, రివాల్వర్ అన్నీ ఇచ్చి వాళ్లతో సాయంత్రం వస్తానని చెప్పి హాస్పిటల్ నుండి బయటకు వచ్చాడు. ఆ వారం రోజులు ఇంట్లో కూడా ఎవరో ఒకరు రాముని అంటిపెట్టుకుని ఉండేవారు. ఒకరోజు రాము ఇంట్లో ఉండి ఏం తోచక పోవడంతో ప్రసాద్‍కి చెప్పి కేసు ఫైల్స్ ఇంటికి తెప్పించుకుని చూస్తున్నాడు. పక్కనే శివరాం తమ్ముడు వినయ్ కూర్చుని రాముకి హెల్ప్ చేస్తూ మధ్యమధ్యలో జోక్‍లు వేస్తున్నాడు. ఇంతలో షర్ట్, జీన్స్ వేసుకుని ఒక అమ్మాయి రాము ఉన్న బెడ్‍రూమ్ లోకి వచ్చి రాము వైపు చూసి నవ్వుతూ, “హాయ్ బావా….” అని అన్నది. అప్పటి వరకు ఆమెను చూసి ఉండకపోవడంతో రాము ఆమె వైపు ఎవరన్నట్టు చూసాడు. దాంతో పక్కనే కూర్చున్న వినయ్ వెంటనే రాము వైపు చూస్తూ, “అన్నయ్యా…ఈమె మా అమ్మ కజిన్ బ్రదర్ కూతురు…బాంద్రాలో ఉంటారు….పేరు శిరీష…చాలా అల్లరి చేసుద్ది,” అన్నాడు. వినయ్ అలా అనగానే శిరీష ఉడుక్కుంటున్నట్టు, “వినయ్….నువ్వు నోరు మూసుకో…నీకన్నా నేను చాలా మంచిదాన్ని,” అంటూ రాము వైపు తిరిగి, “రామూ బావా…మిమ్మల్మి ఇప్పుడె మొదటిసారి చూడటం…నిజంగా శివరామ్ బావని చూసామంటే…మిమ్మల్ని చూడక్కర్లేదు…ఇద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారు….” అంటూ రాము వైపు డౌట్‍గా చూస్తూ, “అయినా ఇన్నేళ్ళూ ఎక్కడకు వెళ్ళారు….సడన్‍గా వచ్చారు….నా చిన్నప్పటి నుండీ శివరామ్ బావని తప్పితే మిమ్మల్ని చూడలేదు,” అంటూ చనువుగా బెడ్ మీదకు ఎక్కి రాము పక్కనే కూర్చున్నది. శిరీష తన గురించి ఏమీ తెలియనట్టు అడిగేసరికి రాము వెంటనే వినయ్ వైపు చూసాడు. రాము చూపులో అర్ధం తెలుసుకున్నట్టుగా వినయ్ కూడా వెంటనే శిరీష వాళ్ళకు ఏమీ తెలియదన్నట్టు తల అడ్డంగా ఊపాడు. వీళ్ళిద్దరూ కళ్ళతోనే సైగలు చేసుకోవడం గమనించిన శిరీష వెంటనే రాము వైపు చూస్తూ, “ఏంటి…ఇద్దరూ సైగలు చేసుకుంటున్నారు…ఏమయింది…ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పు,” అన్నది. రాము వెంటనే శిరీష వైపు చూసి నవ్వుతూ, “ఏం లేదు…నేను వచ్చిన దగ్గర నుండీ నువ్వు కనిపించలేదు కదా… అందుకని వినయ్‍ని ఎందుకు రాలేదు అన్నట్టు చూసాను….వాడు దానికి తెలియదు అన్నట్టు తల ఊపాడు,” అన్నాడు. రాము అలా అనగానే వినయ్ కూడా రాము చెప్పింది కరెక్ట్ అన్నట్టు తల ఊపాడు. శిరీష : (రాము వైపు చూస్తూ) చూడు బావా…నేను వినయ్ కంటే ఆరు నెలలు పెద్ద దాన్ని…నేను ఎప్పుడు నెలకు ఒకసారి ఇక్కడకు వస్తూనే ఉంటాను…నువ్వే ఎప్పుడూ కనిపించలేదు…ఇంతకు ముందు రెండు మూడు సార్లు వచ్చినప్పుడు నీ గురించి ఇంట్లో వాళ్ళు మాత్లాడుకుంటుంటే విన్నాను…తరువాత నిన్ను చూద్దామని వస్తే నువ్వు ట్రైనింగ్‍కి వెళ్ళావని చెప్పారు…తరువాత నేను ఎప్పుడు వచ్చినా నువ్వు డ్యూటీ అని బిజీగా ఉన్నావు….అందుకనే నేను కలవడానికి కుదరలేదు….ఇప్పటికి కుదింది…. రాము : అవునా...అయినా వచ్చిన దగ్గర నుండీ ఎదుటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉన్నావు… ఇక మాకు మాట్లాడటానికి ఛాన్స్ ఎక్కడ ఉన్నది చెప్పు….. శిరీష : నేను అంత ఎక్కువ మాట్లాడుతున్నానా…. రాము : లేదు…చాలా తక్కువ మాట్లాడుతున్నావు…నీ మాటలతో పోల్చుకుంటే మాకు అసలు మాటలు రానట్టె….(అంటూ వినయ్ వైపు చూసి నవ్వాడు.) దాంతో వినయ్ కూడా అవునన్నట్టు తల ఊపుతూ గట్టిగా నవ్వాడు. అంతలో వినయ్‍కి తన ఫ్రండ్ వచ్చినట్టు ఇంట్లో పనిచేసే అతను వచ్చి చెప్పడంతో వినయ్ అక్కడ నుండి వెళ్తూ శిరీష వైపు చూసి…. వినయ్ : శిరీ….నువ్వు అన్నయ్యని ఇబ్బంది పెట్టకు…ఒంట్లో బాగుండ్లేదు… శిరీష : అలాగే…నువ్వు వెళ్ళు….నేను చూసుకుంటాలే…. వినయ్ : (రాము వైపు చూస్తూ) అన్నయ్యా….జాగ్రత్త….ఏమైనా అవసరం అయితే పిలువు….హర్ష కూడా ఇంట్లోనే ఉన్నాడు…. రాము : అలాగేరా…నువ్వు ప్రశాంతంగా వెళ్ళు….నాకు బాగానే ఉంది కదా….. రాము అలా అనగానే వినయ్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వినయ్ అలా వెళ్ళిపోగానే శిరీష వెంటనే రాము చేతిలో ఫైల్ లాక్కుంటూ…. శిరీష : ఏంటి బావా….ఒంట్లో బాగోలేక పోయినా  ఈ ఫైల్స్ ముందేసుకుని కూర్చున్నావు…. రాము : (చేతిలో ఫైల్స్ ని పక్కన పెడుతూ) ఏంటి….చెప్పు…..(అంటూ నవ్వుతూ శిరీష వైపు చూసాడు.) శిరీష : నేను నిన్ను చూడటానికి వస్తే నువ్వు ఫైల్స్ ముందేసుకుని కూర్చుంటున్నావు….నాకిదేమీ నచ్చలేదు…. మొదటి పరిచయంలోనే ఇంత చనువుగా ఉండె సరికి రాముకి కూడా సరదాగా ఉన్నది. రాము : (నవ్వుతూ శిరీష వైపు చూస్తూ) అయినా వినయ్‍ని పట్టుకుని నాలుగు తన్నాలి…. శిరీష : వినయ్‍ని కొట్టడం దేనికి….వాడేం చేసాడు….(అంటూ రాము అలా ఎందుకు అన్నాడో అర్ధం కాకపోవడంతో అయోమయంగా చూసింది.) శిరీష అలా అయోమయంగా తన వైపు చూడంటం చూసి రాముకి నవ్వొచ్చింది. రాము అలా నవ్వడంతో శిరీష ఇంకా ఉడుక్కుంటూ…. శిరీష : ఏంటి బావా…అలా నవ్వుతావు….(అంటూ పక్కనే ఉన్న దిండుని తీసుకుని రాము మీదకు విసిరేసింది.) రాము : (తన మీద పడిని దిండుని పట్టుకుని పక్కన పెడుతూ) ఏం లేదు…ఇంత అందమైన మరదలు ఉన్నదని వినయ్ నాకు ఎప్పుడూ చెప్పలేదు…నీ గురించి తెలిసుంటే…ఎప్పుడో నిన్ను కలిసేవాడిని….అందుకే వినయ్‍ని కొట్టాలి అని...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker