Naa Autograph Sweet Memories – 183 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in
Naa Autograph Sweet Memories - 183 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories - 183 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in prasad_rao16 [caption id="attachment_2075" align="aligncenter" width="589"] Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్[/caption] అంతా విన్న రాము తల ఊపుతూ ఏదో ఆలోచిస్తున్న వాడిలా కళ్ళు మూసుకుని, “ప్రసాద్….ఒకసారి ఆ జిమ్ ట్రైనర్ అశోక్ ఇంటికి వెళ్దాం పద,” అంటూ చైర్లో నుండి లేచి బయటకు నడిచాడు. ప్రసాద్ కూడా చైర్లో నుండి లేచి రాము వెనకాలే వెళ్ళాడు. ఇద్దరూ కలిసి జిమ్ ట్రైనర్ అశోక్ వాళ్ళింటికి వెళ్ళారు….ఇల్లంతా బూబు పట్టి ఉన్నది. ఒక్కో రూమ్ వెదుకుతుండగా రాముకి కళ్ళ ముందు ఇంతకు ముందు జరిగిన మర్డర్ కదలాడుతున్నది. అలా వెదుకుతున్న రాముకి గోడ మీద ఒక పోటో కనిపించింది. అందులో జిమ్ ట్రైనర్ అశోక్, అతనితో పాటు ఇంకొక ఆమె ఉన్నది. రాము అక్కడ ఉన్న కానిస్టేబుల్‍ని పిలిచి ఆ ఫోటో చూపించి, “అందులో ఉన్న ఆమె ఎవరు….ఎక్కడ ఉంటుంది కనుక్కో,” అన్నాడు. దాంతో ఆ కానిస్టేబుల్ ఆ ఫోటో తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. రాము ఇంకా అక్కడ ఇల్లు మొత్తం చూసి తనకు అనుమానం వచ్చినవి సెల్‍లో ఫోటోలు తీసుకుని స్టేషన్‍కి వచ్చేసాడు. రాము, ప్రసాద్ వచ్చిన అరగంటకు కానిస్టేబుల్ ఒకామెను తీసుకువచ్చి రాము ముందు నిలబెట్టి, “సార్….ఈ ఫోటోలో ఉన్నది ఈమే సార్…..జిమ్ ట్రైనర్ అశోక్ తల్లి సార్,” అన్నాడు. “సరె….నువ్వెళ్ళు,” అంటూ రాము కానిస్టేబుల్‍ని పంపించి ఆమె వైపు తిరిగి, “అమ్మా….మీరు అశోక్‍తో కలిసే ఉంటున్నారా….లేక విడిగా ఉంటున్నారా,” అన్నాడు. ఆమె : లేదయ్యా….కలిసే ఉంటున్నాను…. రాము : అక్కడ కూర్చోమ్మా….(అంటూ చైర్ చూపించి….ఆమె కూర్చోగానే) ఇప్పుడు చెప్పమ్మా….అశోక్ చనిపోయే ముందు పది రోజులు విచిత్రంగా ప్రవర్తించాడని మా ఎంక్వైరీలో తెలిసింది…..ఏం చేసేవాడు…. ఆమె : (ఒక్క నిముషం ఆలోచిస్తున్నట్టు రాము వైపు చూస్తూ) కొద్దికొద్దిగా వాడిలో మార్పు వచ్చింది….ఒకరోజు నాతో అసలు మాట్లాడలేదు…తరువాత రోజు నాతో వాడు మాట్లాడిన విధానం చూస్తే ఎవరో పరాయి మనిషితో మాట్లాడినట్టు మాట్లాడాడు….కాని ఆ పది రోజులు మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తించాడు…. రాము : విచిత్రంగా అంటె….ఏం చేస్తుంటాడు….అంటే….అతని లైఫ్ స్ట్రైల్‍లో కాని, ఫుడ్ హ్యాబిట్‍లో కాని ఏమైనా మార్పు వచ్చిందా…. ఆమె : జిమ్‍లో ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఆపేసాడు….ఇంతకు ముందు అసలు పేపర్ కూడా చదివేవాడు కాదు…వాడి భార్య మాత్రం ఇంగ్లీష్ పేపర్లు చదవడం మొదలుపెట్టాడు అని ఒకసారి చెప్పింది….వీడికి అసలు ఇంగ్లీష్ చదవడమే రాదు….అలాంటి వాడు పొద్దస్తమానం ఇంగ్లీష్ పేపర్ వదలకుండా చదివేవాడు….దానికి తోడు సిగిరెట్ తాగడం కూడా మొదలుపెట్టాడు…. రాము, ప్రసాద్ ఇద్దరూ ఆమె చెప్పేది పూర్తిగా విన్న తరువాత కొన్ని డౌట్లను అడిగి వాటిని క్లియర్ చేసుకుని ఆమెను పంపించారు. ఆమె వెళ్ళిన తరువాత వాళ్ళు తమ ఇన్వెస్టిగేషన్ రూమ్ లోకి వెళ్ళి అక్కడ వైట్ బోర్డ్ మీద ఉన్న అశోక్ ఫోటో మీద రాము రెడ్ మార్కర్ తీసుకుని ఇంటు గుర్తు పెట్టి Dead అని మార్క్ చేసాడు. రాము ఒక్క నిముషం ఆ వైట్ బోర్డ్ మీద ఉన్న ఫోటోలను ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తుల పేర్లను అలాగే కన్నార్పకుండా చూస్తూ ఆలోచిస్తున్నాడు. అలా చూస్తున్న రాము టీవి యాక్ట్రస్ చనిపోయినప్పటి ఫోటోలు తీసుకుని చూస్తూ పక్కనే ఉన్న కానిస్టేబుల్‍తో, “నువ్వు వెళ్ళి ఈ టీవి సీరియల్ హీరోయిన్ హంస మేకప్ మేన్ భార్యని రమ్మని చెప్పు….” అన్నాడు. దాంతో కానిస్టేబుల్ అలాగే అని తల ఊపుతూ అక్కడ నుండి వెళ్ళి పోయాడు. అతను వెళ్ళి పోయిన తరువాత రాము తన ఎదురుగా ఉన్న ప్రసాద్ వైపు చూస్తూ….. రాము : ప్రసాద్…..నాకు ఎందుకో ఈ జిమ్ ట్రైనర్ భార్య హత్య కేసు, హంస హత్య కేసు రెంటికీ ఏదో లింక్ ఉన్నదని అనిపిస్తున్నది….. ప్రసాద్ : అది ఎలా సార్….ఈ రెండు హత్య కేసుల్లో హంతకులు వేరే వాళ్ళు….పైగా జిమ్ ట్రైనర్ అశోక్ మీ చేతుల్లో చనిపోయాడు….అతను చనిపోయిన తరువాత ఈ హీరోయిన్ హంస హత్య చేయబడింది….హంతకుడు కూడా మేకప్ మ్యాన్ అని తేలింది….అలాంటప్పుడు లింక్ ఎలా ఉంటుంది…. రాము : అదే ప్రసాద్….నాకూ అర్ధం కావడం లేదు….అశోక్ తన భార్యని హత్య చేసిన విధంగానే….మేకప్మేన్ కూడా ఈ హంసను హత్య చేసాడు….అంటే అశోక్ తన భార్యని హత్య చేసిన పేట్రన్ లోనే హంస హత్య జరిగింది….రెండు హత్యలు ఒకేలాగా జరిగినప్పుడు చేస్తే ఒకే వ్యక్తి చేస్తేనే అది మ్యాచ్ అవుతుంది….కాని ఇక్కడ మొదటి హత్య చేసిన వాడు నా చేతిలో చనిపోయాడు….మనం ఎక్వైరీ చేసిన దాన్ని బట్టి ఈ మేకప్ మేన్‍కి, అశోకి అసలు సంబంధం లేదు… అసలు పరిచయం కూడా లేదు….వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తెలియను కూడా తెలియదు….నా డౌట్లు అన్నీ ఇక్కడకు వచ్చి ఆగిపోతున్నాయి….పైగా అశోక్ చనిపోవడానికి ముందు పది రోజుల నుండీ వాడి లైఫ్ స్టైల్ పూర్తిగా ఛేంజ్ అయిందని అతని భార్య, తల్లి చెబుతున్నారు….ఎలా వీలవుతుంది….అదీకాక ఈ మేకప్ మేన్ ఫోటో కూడా లేదు…. ప్రసాద్ : మీరు అనవసరంగా ఈ రెండు కేసులను లింకప్ చేసి ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తున్నది సార్...ఇక మేకప్ మేన్ ఫోటో లేదు సార్…. రాము : లేదు ప్రసాద్….హత్య జరిగిన పధ్ధతులు రెండూ బాగా….బాగా కాదు….ఒకేలా ఉన్నాయి….కాని ఇక్కడ హత్య చేసిన హంతకులు మాత్రం వేరుగా ఉన్నారు….అందుకే ఈ మేకప్ మేన్ భార్యని రమ్మన్నాను…. ప్రసాద్ : ఆమె ఎందుకు సార్….ఆమెకు ఈ కేస్కి అసలు సంబంధం లేదు కదా….. రాము : సంబంధం ఎందుకు ఉండదు ప్రసాద్….ఆమె హంతకుడి భార్య….అదీ కాక ఒక మగాడి గురించి పూర్తిగా తెలిసింది భార్యకు మాత్రమే…. ప్రసాద్ : అవును సార్….మీరు చెప్పింది కరేక్టే….నేను అసలు ఈ విషయం గురించి ఆలోచించలేదు…అయినా ఈమెను పిలిచి ఏం అడుగుతారు…. రాము : ఈ చనిపోయిన అశోక్ గురించి తల్లి, పెళ్ళాం చెప్పిన దాని ప్రకారం చనిపోవడానికి పది రోజుల ముందు చాలా oddగా ప్రవర్తిస్తున్నాడని చెప్పారు….ఇప్పుడు ఈ మేకప్ మేన్ భార్యని కూడా పిలిపించి వీడు ఎలా ఉన్నాడో కనుక్కుందామని అనికుంటున్నా….ఏదైనా క్లూ దొరకొచ్చుకదా…. అలా వాళ్ళిద్దరూ కేసు పేపర్లు ఇంకా డీప్‍గా చూస్తున్నారు. ఒక అరగంటకు కానిస్టేబుల్ వచ్చి రాముకి సెల్యూట్ చేసి, “సార్….మేకప్ మేన్ భార్యని పిలిపించాను సార్…లోపలికి పంపించమంటారా,” అనడిగాడు. రాము ఆమెను లోపలికి పంపించమన్నట్టు సైగ చేసాడు. దాంతో కానిస్టేబులు బయటకు వెళ్ళి మేకప్ మేన్ భార్యని లోపలికి పంపించాడు. 25-11-2019, 08:13 PM ఆమె భయపడుతూ లోనికి వచ్చి రాముకి, ప్రసాద్‍కి నమస్కారం చేసి, “నన్ను రమ్మన్నారంట….ఎందుకు సార్,” అనడిగింది. ఆమెతో పాటు ఇంకొకతను కూడా లోపలికి వచ్చి వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ఆమె పక్కనే నిల్చున్నాడు. రాము ఆమె వైపు చూసి, “నీ పేరు ఏంటి,” అనడిగాడు. ఆమె : అయ్యా….నా పేరు….అమీషా అండీ…. రాము : అతను ఎవరు….(అంటూ పక్కనే నిల్చున్నతని వైపు చూసాడు.) అమీషా : ఈయన మా అన్న అబ్దుల్ అయ్యా…. రాము : సరె….ఇంతకు మీ ఆయన మేకప్ మేన్ సుబాని హీరోయిన్ హంస దగ్గర...