MEDIUM LENGTH STORIESNaa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 4 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 4 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories – 4 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్
Naa Autograph Sweet Memories – 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

తాతయ్య…..మీరు కూడా మీ చిన్నప్పటి విషయాలు చెప్పరా,” అన్నాడు హర్ష.
“అరేయ్….మీరందరు ముందు నన్ను తాతయ్యా అని పిలవడం ఆపండి….నాకు ఏదో లాగా ఉన్నది….” అన్నాడు రాము.
“అయితే….మిమ్మల్ని ఏమని పిలవాలో మీరే చెప్పండి,” అన్నాడు వినయ్.
రాము కొద్దిసేపు ఆలోచించినట్టు నటించి, “అన్నయ్యా….అని పిలవండి,” అన్నాడు.
“అన్నయ్యా…..వరస ఎలా కుదురుతుంది…..” అన్నాడు శివరామ్.
“ఇప్పుడు వరసల గురించి మన ఇంటి వరకే తెలుసు….మన కుటుంబంలో జరిగిన నిజం బయట ఎవరికి చెప్పినా నమ్మరు….పైగా పిచ్చివాళ్ళను చూసినట్టు చూస్తారు…..అంతెందుకు నేను జరిగింది చెబితే మా అమ్మా, నాన్నలు కూడా నమ్మరు….అందుకని బయట ఎవరికీ సందేహం లేకుండా నాది కూడా మీ ఏజ్ గ్రూప్ కాబట్టి…..అన్నయ్యా….అని పిలవండి,” అన్నాడు రాము.
రాము చెప్పిన దానికి అందరూ తల ఊపారు…..కాని విశ్వ, రఘు మాత్రం రాము వైపు చూసి, “వాళ్ళను అన్నయ్యా అనమన్నారు బాగానే ఉన్నది….మరి మేము ఏమని పిలవాలి అది కూడా చెప్పండి,” అన్నారు ఇద్దరూ.
“ఇది కూడా చెప్పేదేంటిరా….మేనల్లుడనో….ఏదో ఒకటి చూడండి….ఇంత పెద్ద బిజినెస్ మేన్ లు ఒక్క రిలేషన్ విషయంలో తలలు బద్దలు కొట్టుకుంటున్నారు,” అన్నాడు రాము.
దాంతో విశ్వ, రఘు ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకుని మెదలకుండా ఉన్నారు.
అంతలో కరుణ ముందుకు వచ్చి, “మామయ్య గారు…..మీరు అత్తయ్య గారిని ఎలా కాపాడారు, పెళ్ళి చేసుకున్నారు….మొత్తం వివరంగా చెప్పరా,” అనడిగింది.
“ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా…..మీ అత్తయ్య రోజూ చెబుతుందంట కదా….మళ్ళీ ఇందులో కొత్తేమున్నది…..అయినా గడిచిపోయిన విషాదాన్ని ఎవరూ గుర్తు చేసుకోరు,” అన్నాడు రాము.
“అత్తయ్య గారు…..తనకు తెలిసింది చెప్పారు…..ఇప్పుడు మీరు ఎలా ఆమెను రక్షించారు….మీ మాటల్లో చెప్పండి….అత్తయ్య గారు రోజు చెబుతున్న కధే అయినా….మాకు మీరు చెబుతుంటే వినాలని ఉన్నది….” అన్నది కరుణ.
కరుణ అలా అనగానే మిగతా వాళ్ళు కూడా జరిగింది చెప్పమని రాముని ఫోర్స్ చేసారు.
దాంతో ఇక రాము కూడా తప్పదన్నట్టు చెప్పడం మొదలుపెట్టాడు.
(ప్లాష్ బ్యాక్ మొదలు)
కాలేజీ అయిపోయిన తరువాత అలా రాము జీవితంలో చూస్తుండగానే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.
రాము MBA చదవడం పూర్తి అయిన తరువాత ఒక పక్క తన తండ్రికి అవసరం అయినప్పుడు బిజినెస్ లో హెల్ప్ చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు.
అలా కొద్దిరోజుల తరువాత సివిల్స్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తూ తన తండ్రి వ్యాపారాలను చూసుకుంతూ ఆయనకు హెల్ప్ చేస్తున్నాడు.
రాము జీవితం అలా సంతోషంగా గడిచిపోతున్న టైంలో ఒకరోజు తన క్లయింట్లతో కలిసి హోటల్ లో కాన్ఫరెన్స్ లో ఉన్న రాముకి వాళ్ళ నాన్న దగ్గర నుండి ఫోన్ వచ్చింది.
దాంతో రాము మీటింగ్ ని తన బాబాయ్ కి అప్పజెప్పి కాన్ఫరెన్స్ రూమ్ నుండి బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి….
రాము : హలో….నాన్నా…..
నాన్న : ఏరా….ఎక్కడున్నావు….
రాము : ఆఫీస్ లో ఉన్నా నాన్నా….ఏంటి సంగతి….
నాన్న : ఏం లేదు….ఈ మధ్య మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టాం….నీకు తెలుసుకదా….
రాము : అవును….బాగానే ఉన్నది కదా….
నాన్న : బాగానే ఉన్నది….మనకు ఈ మధ్య మనకు పూనా దగ్గర ఒక ఒబెరాయ్ విల్లా అమ్మమని వచ్చింది…
రాము : మంచిదే కదా….
నాన్న : అంతవరకు బాగానే ఉన్నది….కాని….
రాము : ఏమయింది నాన్నా….విషయం చెప్పండి….
నాన్న : ఆ ఒబెరాయ్ విల్లా కొనడానికి ఒక పార్టీ కూడా రెడీ అయింది….కాకపోతే రిజిస్ట్రేషన్ ఇంకో రెండు రోజులు ఉందనగా అక్కడ  పనిచేసే పని వాడు చనిపోయాడు….అది విన్న buyer సెంటిమెంట్ గా ఫీలయ్యి కొనడానికి జంకుతున్నాడు….ఇదే సందని అక్కడ గిట్టని వాళ్ళు….అతను వేరే కారణం వలన చనిపోయాడని పుకారు లేపారు….
రాము : ఏం పుకారు లేపారు…..
నాన్న : చెప్తే భయపడవు కదా….
రాము : భయమెందుకు నాన్నా….విషయం తెలిస్తే దానికి సొల్యూషన్ తెలుసుకోవచ్చు….
నాన్న : ఆ పుకారు విన్న తరువాత మీ బాబాయిలు, మామయ్య కాని అక్కడకు వెళ్ళడానికి భయపడుతున్నారు. అందుకని నీకు ఫోన్ చెయ్యాల్సి వచ్చింది.
రాము : ఫరవాలేదు నాన్నా….నా మీద నమ్మకం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది.
నాన్న : నాకు తెలుసురా….
రాము : ఇంతకు ఆ పుకారేంటో చెప్పలేదు….
నాన్న : అవును కదా…మాటల్లో పడి మర్చిపోయాను…అక్కడ…ఆ…ఒబెరాయ్ విల్లాలో ఒక దెయ్యం ఉన్నదని పుకారు ఉన్నది.
రాము : దెయ్యమా…..
నాన్న : అవును….భయమేస్తున్నదా….
రాము : దెయ్యమా….దెయ్యాలా……(అంటూ నవ్వాడు)
నాన్న : అంటే ఏంటిరా నీ ఉద్దేశ్యం….
రాము : అదే నాన్న…..ఒక్క దెయ్యమా….లేక ఫ్యామిలీ మొత్తం ఉన్నదా…..
రాము అలా వినగానే వాళ్ళ నాన్న కూడా ఒక్కసారిగా నవ్వాడు….
నాన్న : లేదురా…ఆ విషయం తెలియదు….ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే…మొన్న రిజిస్ట్రేషన్ కేన్సిల్ అయింది…అందుకని ఇంకో వారం రోజుల్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారు…నువ్వు వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యేంత వరకు అక్కడే ఉండి ఆ పని చేయాలి….
రాము : అలాగే నాన్నా….ఎప్పుడు బయలుదేరాలి…..
నాన్న : భయం వేయడం లేదా…..
రాము : లేదు నాన్నా…..ఈ రోజుల్లో దెయ్యాలు ఏంటి…..
నాన్న : అదే నేను చెబుతున్నాను…..కాని మీ అమ్మ నిన్ను పంపించడానికి భయపడుతున్నది.
రాము : అమ్మ భయపడటం సహజమే నాన్నా…ఇంతకు ఎప్పుడు బయలుదేరమంటారు….
నాన్న : నీకు ఆఫీస్ లో ఇంపార్టెంట్ పనులు ఏమైనా ఉంటే బాబాయ్ కి అప్పజెప్పి రేపు బయలుదేరు.
రాము : అలాగే నాన్నా….నాకు అడ్రస్ మెసేజ్ పంపించండి.
నాన్న : అలాగే పంపిస్తాను….ఒబెరాయ్ విల్లాకు సంబంధించిన పేపర్లు అన్నీ అక్కడ ఒబెరాయ్ విల్లా ఓనర్ దగ్గరే ఉన్నాయి.
రాము : అలాగే…..
నాన్న : మరి నీకు తోడు ఎవరినైనా తీసుకువెళ్తావా….నీ ఫ్రండ్స్ ని ఎవరినైనా….
రాము : వద్దు నాన్నా….అసలు విషయం చెబితే భయపడతారు…..అందుకని నేను ఒక్కడినే వెళ్తాను…..
నాన్న : ఒక్కడివేనా….
రాము : అవును నాన్నా….అదీకాక అక్కడ ఎవరో ఒకరు తోడు ఉంటారు కదా….
నాన్న : సరె….కాని….జాగ్రత్త….అక్కడకు వెళ్ళిన తరువాత రోజూ ఫోన్ చేయాలి….
రాము : తప్పకుండా చేస్తాను….
నాన్న : సరె….జాగ్రత్తగా వెళ్ళిరా…..బై….
రాము : బై నాన్నా…..
అని ఫోన్ పెట్టేసి రాము ఒక్కసారి ఆలోచనల్లో పడ్డాడు.
అలా ఆలోచిస్తూ రాము చిన్నగా నడుచుకుంటూ అక్కడ ఉన్న చైర్ లొ కూర్చుని, “అసలు అక్కడ ప్రాబ్లం ఏంటి. బాబాయ్ లు, మామయ్య అంతగా భయపడుతుంటే ఖచ్చితంగా అక్కడ దెయ్యం కాకపోయినా ఏదో ప్రాబ్లం ఉన్నది. అది ఏంటో కనిపెట్టాలి…..” అని ఆలోచిస్తున్నాడు.
*********
ఇంటికి వచ్చిన తరువాత అనితకు, శ్యామలకు అంతా చెప్పి అనితకు ఖర్చులకు డబ్బులు ఇచ్చి….కారు తీసుకుని బయలుదేరాడు.
అలా బయలుదేరిన రాముకి అతని జీవితం తాను ఊహించని దారుణమైన మలుపు తిరగబోతుందని తెలియదు.
సరదాగా ఫ్రండ్స్, అమ్మాయిలతో తిరిగే అతని జీవితంలో చాలా విలువైన ప్రేమ, వాటి వల్ల వచ్చే సంతోషం, బాధ ఎలా ఉంటాయో బాగా తెలిసివస్తాయని అప్పుడు కార్లో ట్రావెల్ చేస్తున్న రాముకి తెలియదు.
అది తెలియని రాము పొద్దున్నే కారు తీసుకుని తన తండ్రి పంపించిన అడ్రస్ కి బయలుదేరాడు.
ఆ ఒబెరాయ్ విల్లా ఉన్న ఊరు అక్కడ నుండి దాదాపు ఐదు గంటల జర్నీ ఉంటుంది.
అలా నాలుగు గంటలు హైవే మీద ట్రావెల్ చేసిన తరువాత ఒక గంట సేపు హైవే పక్కనుండి లోపలికి వెళ్తే తాను చేరవలసిన ఊరు వస్తుంది.
అంతసేపు జర్నీ చేసేసరికి రాము టీ తాగుదామనిపించి అక్కడ ఉన్న దాబా ముందు కారు ఆపి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు.
రాము కూర్చున్న ఐదు నిముషాలకు సర్వర్ అతని దగ్గరకు వచ్చాడు.
సర్వర్ : సార్….ఏం తెమ్మంటారు….పరోటా తీసుకురమ్మంటారా….
రాము : టిఫిన్ ఏమీ వద్దు గానీ….టీ….బిస్కెట్లు తీసుకొచ్చెయ్….
సర్వర్ : అలాగే సార్…..
అంటూ సర్వర్ వెళ్ళి ఒక ప్లేట్ లో బిస్కెట్లు, గ్లాసులో టీ తీసుకుని వచ్చి రాము ముందు పెట్టి వెళ్లాడు.
రాము తన సెల్ లో what’s up మెసేజ్ లు చూసుకుంటూ….వాటికి రిప్లై ఇస్తున్నాడు.
అంతలో దాబాలో క్యాష్ కౌంటర్ దగ్గర ఓనర్ ఒకతన్ని గట్టిగా అరుస్తున్నాడు.
అతను చూడటానికి దాదాపుగా బతికి చెడ్డవాడిలా ఉన్నాడు….ఒంటి మీద కోటు అక్కడక్కడా చినిగిపోయి ఉన్నది.
దాబా ఓనర్ : వెళ్ళు….ఇక్కడనుండి…..మాట్లాడకు….
బాబా : అయ్యా….ఒక్క రొట్టె ఇవ్వండయ్యా….
దాబా ఓనర్ : ఏదో ఒకసారి జాలిపడి రొట్టె ఇస్తే….నీకు అదే పనిగా అడగటం అలవాటైపోయింది….
అంటూ సర్వర్ వైపు చూసి….
దాబా ఓనర్ : ఇకనుండి వీడు వస్తే ఒక్క రెట్టె కూడా….ఏదీ ఇవ్వమాకండి….
అంటూ కౌంటర్ నుండి బయటకు వచ్చి ఆ బిచ్చగాడిని దాబా నుండి బయటకు తోసాడు.
దాంతో ఆ బాబా దాబాలో నుండి బయటకు వచ్చి అక్కడకు కార్లు, బైక్ లు పార్క్ చేసే చోట కూర్చున్నాడు.
ఇదంతా గమనిస్తున్న రాముకి అతని మీద జాలి కలిగింది.
మళ్ళీ తన సెల్ లో వచ్చిన మెసేజ్ లకు రిప్లై ఇవ్వడం మొదలుపెట్టాడు.
టీ తాగిన తరువాత రాము కొద్దిసేపు దాబాలోనే కూర్చుని కౌంటర్ లో డబ్బులు కట్టి బయటకు వచ్చాడు.
అలా రాము ఒబెరాయ్ విల్లా గురించి ఆలోచిస్తూ కారు దగ్గరకు వచ్చి లాక్ ఓపెన్ చేసి డోర్ తీయబోయి….అక్కడకు దగ్గరలో ఇందాక తాను చూసిన బాబా కనిపించాడు.
రాము కారు దగ్గర నుండి అతని దగ్గరకు వెళ్ళి జేబులో వంద రూపాయలు తీసి అతనికి ఇస్తూ….
రాము : బాబా….తీసుకో….ఏదైనా తిని…..
కాని అతను రాము చేతిలో డబ్బులు తీసుకోకుండా తల ఎత్తి రాము మొహంలోకి చూస్తూ నవ్వాడు.
అతను ఎందుకలా నవ్వుతున్నాడో అర్ధం కాక రాము బిచ్చగాడి వైపే చూస్తున్నాడు.
బాబా : నాకు ఇప్పుడు డబ్బులతో అవసరం లేదు….నిన్ను చూడగానే నా ఆకలి తీరిపోయింది….
అంటూ లేచి నిల్చుని తన చేతులతో రాము భుజాలను పట్టుకుని సంతోషంగా చూస్తూ…
బాబా : నువ్వు చాలా లేటు చేసావు….నిన్ను ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది….అల్లా నిన్ను పంపించినందుకు….ఆయనకు ధన్యవాదాలు తెలుపుకోవాలి….ఇప్పటికైనా వచ్చావు….నాకు అదే చాలా ఆనందంగా ఉన్నది….
రాముకి అతను ఏం చెబుతున్నాడో అర్ధం కాక అతని వైపు అయోమయంగా చూస్తున్నాడు.
బాబా : అది నువ్వే….నేను నీ కోసమే ఎదురుచూస్తున్నాను….నీ వల్లనే అవుతుంది….ఆ పని నువ్వొక్కడివే చేయగలవు….
అంటూ బాబా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
రాముకి అతను ఏం చెప్పాడో అర్దం కాక అతను వెళ్ళిన వైపే చూస్తున్నాడు.
అంతలో దాబా ఓనర్ రాము దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి చిన్నగా తట్టాడు.
అసలే ఒబెరాయ్ విల్లా ఆలోచనల్లో ఉన్న రాము….ఇప్పుడు బాబా కూడా అర్ధం కాకుండా మాట్లాడి వెళ్ళే సరికి అలాగే అతను వెళ్లిన వైపు అలా చూస్తూ ఆలోచనల్లో ఉన్నాడు.
దాబా ఓనర్ తన భుజం మీద చెయ్యి వేసి తట్టేసరికి రాము ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆలోచనల నుండి బయటకు వచ్చి అతని వైపు చూసాడు.
దాబా ఓనర్ : అతని మాటలు పట్టించుకోకండి సార్….వాడు ఒట్టి పిచ్చివాడు….
రాము : ఏంటేంటో మాట్లాడాడు….అదే అర్ధం కాలేదు….
దాబా ఓనర్ : వదిలేయండి సారు….ఎక్కువగా ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button