Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 42 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 42 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 42 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ రాము ముందుకు జరిగి రేణుక దగ్గరకు వచ్చి తన రెండు చేతులను ఆమె భుజం మీద వేసి దగ్గరకు లాక్కుంటూ తన చేతులను రేణుక భుజాల మీద నుండి పైకి తీసుకొచ్చి మెడ వెనక ఒక చెయ్యి వేసి నిమురుతూ, ఇంకో చేతిని ఆమె జుట్టులోకి పోనిచ్చి నిమురుతూ ఆమె మొహం మీద మొహం పెట్టి కళ్ళల్లోకి చూస్తూ, “రేణూ….నాకదంతా తెలియదు….నీ మీద ప్రేమో….ఆకర్షణో నాకు తెలియదు….కాని నాకు మాత్రం నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించడం లేదు….ఎప్పుడూ నీతోనే ఉండాలి అనిపిస్తున్నది….కాని ఒకటి మాత్రం నాకు తెలుసు….ఇప్పుడు నాకు నేనంటె కూడా నువ్వే ఇక్కువ ఇష్టంగా అనిపిస్తున్నది. ఇదే ఫీలింగ్ ప్రేమ అయితే….నాకు నువ్వంటే చెప్పలేనంత ప్రేమ…..రేణూ….నిన్ను చూస్తుంటే నీకంటే అయిన వాళ్ళు ఇష్టం అయిన వాళ్ళు ఎవరు లేరనిపిస్తున్నది….” అంటూ తన పెదవులను ఆమె పెదవుల దగ్గరకు తీసుకొస్తున్నాడు. రాము పెదవులు తన మీదకు రావడం చూసి రేణుక కూడా తన మొహాన్ని ముందుకు తీసుకొచ్చి పెదవులతో రాము పెదవులను మూసేసింది. అలా కొద్దిసేపు ఇద్దరూ ఒకరి పెదవులను ఒకరు ముద్దు పెట్టుకుంటూ ఎంతసేపు అలా ఉన్నారో కూడా తెలియలేదు. ***********ఇక్కడ విల్లా దగ్గర రాము వాళ్ళు ఇంతకు ముందు కలిసిన చర్చి ఫాదర్ తన చైర్ లో కూర్చుని జీసెస్ ఎదురుగా కూర్చుని భక్తితో ప్రార్ధన చేస్తున్నాడు. దాంతో సునీత (సుందర్ ప్రేతాత్మ) ముందుకి వెళ్ళలేకపోతున్నది. ఒక్క క్షణం తాను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నానో అర్ధం కాక సునీత (సుందర్ ప్రేతాత్మ)….ఎక్కడ రేణుక తనకు కాకుండా పోతుందో అన్న ఆలోచన రాగానే పెద్దగా అరుస్తూ రాము, రేణుక ఇద్దరూ ఎక్కడకు వెళ్ళారో తెలియక పిచ్చెక్కినట్టు అరుస్తూ ఆ అడవిలో అక్కడక్కడే తిరుగుతున్నది. కొద్దిసేపటికి సునీత (సుందర్ ప్రేతాత్మ) ఆవేశం తగ్గిన తరువాత ఒకచోట కూర్చుని కళ్ళు మూసుకుని తనను ఆపుతున్నది ఎవరా అని చూసింది. సునీత (సుందర్ ప్రేతాత్మ) కళ్ళకి కి చర్చిలో ఫాదర్ ప్రేయర్ చేయడం కనిపించింది. వెంటనే సునీత (సుందర్ ప్రేతాత్మ) గాల్లో తేలుకుంటూ చర్చి దగ్గరకు వెళ్ళి లోపలికి వెళ్ళబోయింది. కాని అది దైవ ప్రదేశం కావడంతో సునీత (సుందర్ ప్రేతాత్మ) లోపలికి వెళ్ళలేకపోయి….ఆ ప్రేయర్ ని ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నది. అలా ఆలోచిస్తున్న సునీత (సుందర్ ప్రేతాత్మ) కి ఎదురుగా ఒక పాము కనిపించింది. దాన్ని వెంటనే తన చేతిలోకి తీసుకుని దాని ఒంటి మీద చేత్తో చిన్నరా రాస్తూ చర్చిలోకి వదిలిపెట్టింది. దాంతో ఆ పాము తిన్నగా ఫాదర్ ప్రేయర్ చేస్తున్న చోటకు వెళ్ళి ఎదురుగా తన పడగ ఎత్తి ఫాదర్ వైపు చూస్తున్నది. కళ్ళు మూసుకుని ప్రేయర్ చేస్తున్న ఫాదర్ తన ముందు ఏదో కదులుతున్నట్టు, బుస కొడుతున్నట్టు అనిపించడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసాడు. ఎదురుగా నల్లగా నిగనిగలాడిపోతూ త్రాచుపాముని చూసేసరికి ఫాదర్ ఒళ్ళంతా చెమటలు పట్టాయి. దాని నుండి తప్పించుకుందామని ఫాదర్ చైర్ లో నుండి లేచి పరిగెత్తబోయాడు. కాని ఫాదర్ కంటే స్పీడుగా త్రాచుపాము గాల్లోకి ఎగిరి ఫాదర్ మెడ మీద కాటు వేసింది. దాంతో ఫాదర్ ఒంట్లో విషం తొందరగా ఎక్కి అక్కడికక్కడే చనిపోయాడు. ఫాదర్ చనిపోయాడని తెలిసిన సునీత (సుందర్ ప్రేతాత్మ) ఇక తనకు అడ్డం లేదని అక్కడ నుండి బయలుదేరి రాము, రేణుక ట్రావెల్ చేస్తున్న అడవి వైపు బయలుదేరాడు. *************** అలా ఇద్దరూ కొద్దిసేపు ముద్దు పెట్టుకున్న తరువాత రాము రేణుకు పెదవులను వదిలి, “నీ ఒక్కదానికేనా ప్రేమ ఉండేది….నాకు నీ మీద లేదనుకున్నావా….” అన్నాడు. “అది కాదు రాము….నా గురించి నీ ప్రాణాలు రిస్క్ లో పెట్టడం నాకు ఇష్టం లేదు…..అందుకని….” అంటూ చెప్పబోయింది రేణుక. కాని రాము ఆమెను మధ్యలోనే ఆపుతూ, “నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా…” అనడిగాడు. “ఇష్ట పడుతున్నాను కాబట్టే….నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటున్నాను,” అన్నది...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker