Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 29 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 29 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories – 29 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్
Naa Autograph Sweet Memories – 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

మంధర మాట విన్న మోహిని కళ్ళు తెరిచి….
మోహిని : రంజిత్ సింగ్ రాజ్యాభిషేకం అయిపోయిందా…..
[Image: images+%282%29.jpg]
మంధర : మీకు ఎలా తెలుసు….
మోహిని : నాకు అంతా తెలుసు…..అంతే కాక నాకు ఈరోజు చివరి రాత్రి అని కూడా తెలుసు….
మంధర : మీరు కనక ఒప్పుకుంటే నేను మన నమ్మకస్తుల ద్వారా మిమ్మల్ని ఇక్కడ నుండి తప్పించేస్తాను….
మోహిని : లేదు మంధర…..(అంటూ తన చేతిలో ఉన్న తాయెత్తు ఆమెకు చూపిస్తూ) ఈ తాయెత్తు నా దగ్గర ఉన్నంత వరకు నాకు అపాయం లేదు మంధర….కాని నాకు మాత్రం వాళ్ళు నన్ను చంపేయాలనే అనుకుంటున్నాను….
మంధర : లేదమ్మా….అలా జరగటానికి వీల్లేదు….నేను మిమ్మల్ని అలా చావనివ్వను….
మోహిని : అరే పిచ్చిదానా….ఎప్పటి వరకైతే ఈ తాయెత్తు నా దగ్గర ఉంటుందో నన్ను ఎవరూ చంపలేరు….నన్ను చంపలేకపోతే వీళ్ళు నన్ను ఇక్కడే కారాగారంలో బంధీగా ఉంచుతారు….కాని వాళ్ళకు ఒక్క విషయం తెలియదు మంధరా….శరీరాన్ని మాత్రం కారాగారంలొ ఉంచగలరు….కాని ఆత్మని బంధించలేరు కదా….నేను నా పగ తీర్చుకోవాలంటే….నేను ఈ శరీరాన్ని వదిలి ప్రేతాత్మని కావాల్సి ఉంటుంది….ఎలాంటి ప్రేతాత్మ అంటే దాన్ని ఎదుర్కోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి….దాన్ని ఎదుర్కోవడం సంగతి అలా ఉంచి దాని నుండి రక్షించుకొవడం కూడా అసాధ్యమే అవుతుంది….ఎంత ప్రమాదకరమైన ప్రేతాత్మలా మారతానంటే….రంజిత్ సింగ్ తరువాత రాబోయే తరాలు నా పేరు తలుచుకుంటేనే గడగడ వణికిపోవాలి….(అంటూ తన చేత్తో మంధర చేతిని పట్టుకుని ఆమె చేతిలో ఆ తాయెత్తుని పెట్టి) ఈ పనిలొ నువ్వు నాకు సహాయం చేస్తావా…..
మంధర : సహాయమా….కాని ఏం చేయాలి….మీ కోసం ఏదైనా చేస్తాను….
మోహిని : నా మాటలు చాలా జాగ్రత్తగా విను….వీళ్ళు నన్ను చంపేసి నా శరీరాన్ని కాల్చేసిన తరువాత…నువ్వు నా అస్థికలను తీసుకుని దాచిపెట్టెయ్….ఆ దాచిపెట్టే చోటు ఎవరికి తెలియకూడదు….నా అస్థికలు ఎప్పటి దాకా అయితే నదిలొ కలకుండా ఉంటారో అప్పటి దాకా నా ఆత్మకు ముక్తి అనేది ఉండదు…..ఎప్పటి దాకా అయితే నాకు ముక్తి లభించదో అప్పటి దాకా నేను ఈ రాజ కుటుంబానికి నా ప్రేతాత్మ నుండి విముక్తి ఉండదు….
అంతా విన్న తరువాత మంధర అక్కడ నుండి వెళ్ళి పోయి మోహిని చనిపోయిన తరువాత ఆమె అస్థికలను రహస్యంగా దాచేసింది.
(ప్లాష్ బ్యాక్ అయిపోయింది)
మొత్తం రికార్డర్ లో విన్న తరువాత రాము దాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తున్నాడు.
సుమిత్ర : ఇప్పుడు మోహిని ప్రేతాత్మని అంతం చేయాలంటే మనం ఆమె అస్థికలు ఎక్కడ ఉన్నాయో వెదికి వాటిని నీళ్లల్లో కలిపితే దాని పీడ శాశ్వతంగా అంతమైపోతుంది.
మహేష్ : కాని ఈ అస్థికలు ఎక్కడ దాచిపెట్టారు అనేది ఎలా తెలుస్తుంది….
[Image: 004887.jpg]
రాము : అదే నేను ఆ మంధర ప్లేసులో ఉన్నట్టయితే ఆ అస్థికలను రాజమహల్ లో అక్కడే దాచిపెడతాను….
సుమిత్ర : అవును….నాక్కూడా అస్థికలు అక్కడే ఉన్నాయని అనిపిస్తున్నది….కాని రాజమహల్ కి పగలు పూట వెళ్ళి అక్కడ వెదకడం కుదరదు….అంతే కాక ఆ రాజమహల్ నది మధ్యలో ఉన్నది….మనం పడవలో వెళ్ళాల్సి ఉంటుంది

మహేష్ : అయితే మనం రాత్రి వరకు ఎదురుచూడాల్సిందే…..అప్పటి వరకు రెస్ట్ తీసుకుందాం…..
దాంతో ముగ్గురూ రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు.
రాత్రి అయిన తరువాత ముగ్గురూ చిన్న పడవ తీసుకుని నది మధ్యలొ ఉన్న రంజిత్ సింగ్ రాజ మహల్ కి బయలుదేరారు.
[Image: two-men-and-a-woman-on-jetski-pictures__u10078128.jpg]
పడవలో రాము ముందు వైపు కూర్చుంటే మహేష్ ఇంకో వైపు కూర్చుని తెడ్డు వేస్తూ పడవ నడుపుతున్నాడు.
సుమిత్ర వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నది…..పడవ నడుపుతున్న మహేష్ వైపు చూసి….
సుమిత్ర : పడవ బాగానే నడుపుతున్నావు….బాగా experience ఉన్నది….
మహేష్ : ఏం చేస్తాం…ఏమనుకుంటూ వీడితో పెద్ద పోటుగాడిలా నేనూ వస్తాను అంటూ భారీ డైలాగులు చెప్పి మీతో బయలుదేరానో కాని అప్పటి నుండి రోజుకో వింత చూస్తున్నాను….ఇప్పుడు వీడు నా చేత పడవ నడిపిస్తున్నాడు….ఇంకా ఏం చేయిస్తాడో ఏంటో….(అంటూ సుమిత్ర వైపు చిలిపిగా చూసి నవ్వుతూ) కాని ఒక్క విషయంలొ మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉన్నది….
మహేష్ దేని గురించి అంటున్నాడో అర్ధం కాక సుమిత్ర అతని వైపు చూసి….
సుమిత్ర : ఏ విషయంలో హ్యాపీగా ఉన్నావు…..
మహేష్ : ఇంత అందమైన ఆడదాన్ని అనుభవించే ఛాన్స్ వచ్చింది….అందుకు చాలా హ్యాపీగా ఉన్నది.
ఆ మాట వినగానే సుమిత్ర వెంటనే సిగ్గు పడుతూ మొహం మీద కోపాన్ని తెచ్చుకుని మహేష్ ని కొట్టడానికి పైకి లేచింది.
మహేష్ : చూడు సుమిత్రా….మనం ఈ ప్రాబ్లం నుండి బయట పడిన తరువాత మనిద్దరం బెడ్ మీద తిరిగ్గా కొట్టుకుందాం…. ఇప్పుడు నువ్వు లేచావంటే పడవ కదులుతుంది….
దాంతో సుమిత్ర వెంటనే కదలకుండా కూర్చున్నది….వాళ్ళిద్దరినీ చూసి రాము నవ్వుతూ….
రాము : మీ ఇద్దరిని చూస్తుంటే మనం ఏదో పిక్నిక్ కి వెళ్తున్నట్టు ఉన్నది….
మహేష్ : ఏం చేస్తాం బాబూ….ఈవిడ గారు ముందే చెప్పారు కదా….ఎవరు ప్రాణాలతో ఉంటారో….ఉండరో….అందుకని ఏదో టైం ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము….
[Image: 005931.jpg]
అలా మాట్లాడుకుంటుండగానే రాజమహల్ దగ్గరకు వచ్చేసరికి ముగ్గురూ పడవ లోనుండి దిగిన తరువాత మహేష్ ఆ పడవని అక్కడ ఉన్న రాయికి తాడుతో గట్టిగా కట్టేసాడు.
అలా ముగ్గురూ రాజమహల్ లోపలికి వెళ్ళారు…సుమిత్ర తన హ్యాండ్ బాగ్ లో ఇంతకు ముందు షాపింగ్ కాంప్లెక్స్ లో లాగే ఏదో మంత్రాలు రాసి ఉన్న బంతిని తీసి కళ్ళు మూసుకుని ఏదో చదివి మహల్ లోకి విసిరేసింది.
ఆ బాల్ లోపలికి వెళ్ళి ఒక చోట ఆగింది….
రాము, మహేశ్ మళ్ళి ఆమె ఏం చెబుతుందా అన్నట్టు సుమిత్ర వైపు చూసారు….
సుమిత్ర : ఈ బాల్ ఎక్కడ అయితే ఆగుతుందో అక్కడ అస్థికలు దాచారు….మనం వెతుకుదాం పదండి…..
అంటూ లోపలికి అడుగులు వేస్తున్నది….ఆమె వెనకాలే రాము కూడా లోపలికి వెళ్ళ బోతుంటే….మహేష్ వెంటనే రాము చెయ్యి పట్టుకుని ఆపుతూ….
మహేష్ : అరేయ్…ఇంకో సారి ఆలోచించుకోరా….ఇదంతా మనకవసరా….హాయిగా పబ్ లో మందు కొట్టి పడిపోదాంరా….
ఆ మాట వినగానే సుమిత్ర వెనక్కి తిరిగి మహేష్ వైపు చూసి నవ్వుతూ….
సుమిత్ర : ఇంత దూరం వచ్చిన తరువాత భయపడతావేంటి….అయినా నీకు ముందే చెప్పాం కదా…వెనక్కు వెళ్ళిపోమని….
మహేష్ : అంటె…..అప్పుడు చాలా ధైర్యంగా ఉన్నది….ఇప్పుడు చీకటిలో ఈ మహల్ చూస్తుంటే ఒక పక్క గుండె లబ్ డబ్ అంటున్నది…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page