Sadhvi Prachi: స్వర భాస్కర్ పై సాధ్వి ప్రాచి షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?
Sadhvi Prachi: స్వర భాస్కర్ పై సాధ్వి ప్రాచి షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?
Sadhvi Prachi: స్వర భాస్కర్ పై సాధ్వి ప్రాచి షాకింగ్ కామెంట్స్.. ఏమైందంటే?
Sadhvi Prachi: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ వివాహంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్వరా భాస్కర్‌పై విశ్వహిందూ పరిషత్ నేత సాద్వీ ప్రాచీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్వరా భాస్కర్ ఎప్పుడూ హిందూ మతానికి వ్యతిరేకంగా ఉంటారని ఆమె తెలిపారు. అందువల్ల ఆమె వేరే మతస్తున్ని వివాహం చేసుకుంటుందని తాను ముందే ఊహించానన్నారు.
బాలీవుడ్ నటి స్వరభాస్కర్.. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అత్యంత రహస్యంగా ఈ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాతనే పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే వీరిది ఆదర్శ వివాహం అని చాలా మంది అంటున్నారు. అయితే ఈ జంటపై వీహెచ్‌పీ నేత సాథ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వరభాస్కర్ ముందు నుంచీ హిందూ మత వ్యతిరేకి అని, దాంట్లో వింతేమీ లేదన్నారు. కానీ మరో మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పు అని అన్నారు. ఒకవేళ స్వర భాస్కర్ జాగ్రత్తగా లేకుంటే.. ఆమె భవిష్యత్తులో శ్రద్ధా వాల్కర్ పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు ప్రాచి హెచ్చరించింది.
స్వరభాస్కర్ తన పెళ్లి నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ను చూసి ఉండాలన్నారు. అయినా అది ఆమె పర్సనల్ ఛాయిస్ అని, దీంట్లో తానేమీ చెప్పేదిలేదన్నారు. కానీ శ్రద్ధాకు ఏం జరిగిందో అదే పరిస్థితిని స్వర కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లు ప్రాచి అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధ్వి ప్రాచి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ట్విట్టర్‌లో షేర్ అవుతున్నాయి.