Trending News

వనితా విజయ్ కుమార్ మూడో భర్త మృతి.. అదే కారణమంటూ?

వనితా విజయ్ కుమార్ మూడో భర్త మృతి.. అదే కారణమంటూ?

వనితా విజయ్ కుమార్ మూడో భర్త మృతి.. అదే కారణమంటూ?

వనితా విజయ్ కుమార్ మూడో భర్త మృతి.. అదే కారణమంటూ?
వనితా విజయ్ కుమార్ మూడో భర్త మృతి.. అదే కారణమంటూ?

Vanitha Vijaykumar: నటి వనిత విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈమె తర్వాత మళ్లీ తెలుగులో కనిపించనే లేదు. ఈమె సీనియర్ నటుడు విజయ్ కుమార్, మంజుల ల కూతురు. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా నటించింది.

ఇక ఈమె తన వ్యక్తిగత విషయాలలో ఎన్నోసార్లు వార్తల్లోకెక్కింది. ఆమె మూడో పెళ్లి చేసుకున్న తర్వాత మరిన్ని వివాదాలు ఎదుర్కొంది. అప్పటికి రెండు పెళ్లిళ్లు చేసుకొని పిల్లలను కని వారిని వదిలేయగా.. కొంతకాలం కిందట పీటర్ పాల్ అనే వ్యక్తిని ప్రేమించి క్రిస్టియన్ పద్ధతిలో మూడవ పెళ్లి చేసుకుంది.

ఆ సమయంలో ఎంతోమంది తనను పలురకాలుగా విమర్శించారు. నిజానికి అతను వనిత విజయ్ కుమార్ ను తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వక ముందుకే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని తన మొదటి భార్య బయట పెట్టగా వార్తల్లో తెగ హల్ చల్ గా మారింది. కానీ కొంతకాలానికే ఈ జంట మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.

ఇక అప్పటినుంచి వనిత సింగిల్ గా బతుకుతుంది. ప్రస్తుతం కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన లైఫ్ తాను చూసుకుంటుంది. అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తన మూడో భర్త పీటర్ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. ఈ నేపథ్యంలో వనిత విజయ్ కుమార్ అతని మరణం పట్ల సంతాపం తెలిపింది.

 

మీరు ఎదుర్కొంటున్న చెడ్డ వ్యక్తులు.. గాయాలతో మీరు ఎంత పోరాటం చేశారో నాకు తెలుసు. ఈ ప్రపంచంలో నుంచి మీరు వెళ్లిపోయినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. కచ్చితంగా మీరు ఓ మంచి స్థానంలో ఉన్నారని నాకు తెలుసు.. అక్కడైనా సంతోషంగా ఉండండి అంటూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అయితే ఆమె అతని నుండి విడిపోవడానికి కారణం అతడు బాగా తాగుబోతు అని తెలిసింది.

తమ హనీమూన్ టైంలో గోవా కి వెళ్ళినప్పుడు బాగా తాగాడు అని.. తిరిగి చెన్నైకి వచ్చేవరకు తాగుతూనే ఉన్నాడు అని.. ఇంట్లోకి తీసుకురావడానికి మనుషులు కావలసి వచ్చిందని అప్పట్లో తెలిపింది వనిత విజయ్ కుమార్. ఇతడు బాగా తాగడం వల్లే ఆరోగ్యం క్షీణించిందని.. అందుకే అతడికి హార్ట్ ఎటాక్ వచ్చిందని.. హాస్పిటల్లో జాయిన్ చేయగా పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు అని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button