
Mahesh.thehero
బుజ్జిపాపాయికి ఎండ వేడి తగలకుండా ఏర్పాట్లుచేసుకుని ఎత్తుకున్నాను – డ్రైవర్ కు పైకివెల్లమని చెప్పాను .
చెల్లి : అన్నయ్యా ……. సూర్యరశ్మి తగలడం మంచిదేలే , ఇంత ప్రాణంలా చూసుకునే మావయ్య ఉండటం దాని అదృష్టం అని ఆనందించారు .
బుజ్జిపాపాయీ ……. మీ అమ్మలు – అమ్మమ్మ చెప్పినట్లు నీకు ఎండ ఇష్టమేనా ? – బుజ్జిబుజ్జినవ్వులతో కాళ్ళూచేతులు కదిలించడం చూసి చెల్లెమ్మలూ ఇష్టమేనట అంటూ ముద్దుచేసాను – కొండల్లో జంతువులు చాలానే ఉన్నాయి – ఎంజాయ్ చేస్తూ వెళదాము – పాలు కావాల్సివచ్చినప్పుడు నా వెంట్రుకలను గట్టిగా లాగేయ్యి సరేనా ………
లవ్ యు అన్నయ్యా – అన్నయ్యా అంటూ అమ్మతోపాటు తొలిమెట్టును తాకి మొక్కుకోవడం చూసి , మా కోరిక తీరాలని మొక్కుకుని బుజ్జిపాపాయి బుజ్జిచేతిని మెట్టుకు తాకించి కాలినడక ప్రారంభించాము .
అక్కడ కాలేజ్ పిల్లలతోపాటు ఎంజాయ్ చేస్తూ బుజ్జాయిలు బాబు పిల్లలు బుజ్జితల్లులు జూ చేరుకున్నారు – మా బుస్సులోనుండి కేవలం కృష్ణగాడు మాత్రమే దిగి ఫాలో అవుతుండటం చూసి అనుమానం కలిగి నేరుగా వెళ్లి అడిగారు .
కృష్ణగాడు : బస్సులో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు .
బుజ్జితల్లి : అమ్మమ్మా – అమ్మలు కూడానా ……. అంకుల్ ? .
కృష్ణ : అదీ అదీ ……….
బుజ్జితల్లి : అంటే ఏదో కష్టమైన పనిమీదనే వెళ్లారు ……..
కృష్ణ : కష్టమైనది కాదు బుజ్జితల్లులూ ……. , ఇష్టమైన మొక్కు తీర్చుకోవడానికి ఏడుకొండలూ కాలినడకన వెళ్లాలని నిర్ణయించుకున్నారు .
బుజ్జితల్లులు : అంకుల్ ……. మేమూ ఇష్టంతో మా అమ్మలకోసం డాడీ తోపాటు ……. – అప్పుడు ఆ దేవుడు మరింత త్వరగా కరుణించేవారు కదా ……..
కృష్ణ : నిజమే బుజ్జితల్లులూ …….. , మీ డాడీ ……. మీరు చెప్పినట్లుగా కూడా ఆలోచించారు – మీరుకూడా కాలినడక సాగిస్తే సాయంత్రానికి బుజ్జిపాదాలు నొప్పివేస్తాయి , ఆ వెనుకే జ్వరం వస్తుంది , అప్పుడు అమ్మలందరూ బాధపడతారు మరియు మీరు మీ క్లాస్మేట్స్ తోపాటు ఇలా ఎంజాయ్ చేయలేరని ముందుగానే ఆలోచించి తప్పని పరిస్థితులలో ఇలా చేశారు – అయినా మీ డాడీ మొక్కు తీర్చుకుంటే మీరు తీర్చుకున్నట్లు కాదా చెప్పండి – మీ బుజ్జిమనసు మీ డాడీ తోకూడా ఉంటుందిలే నాకు తెలుసు – మీరు టూర్ ఎంత ఎంజాయ్ చేస్తే మీ డాడీ , అమ్మలు అంత సంతోషిస్తారు కదా …….
బుజ్జితల్లులు : సరే అంకుల్ …….. , అంకుల్ మనం బస్సులో కొండపైకి చేరుకునేసరికి డాడీ వాళ్ళు ……..
కృష్ణ : మనకంటే ముందుగానే ఉంటారు బుజ్జితల్లులూ …….. , బుజ్జిపాపాయి ఈ జంతువులను చూసి ఆనందించేది అని ఫీల్ అవుతారేమో – కాలినడక స్టెప్స్ కు ఇరువైపులా ఇక్కడున్న జంతువులన్నీ వస్తూ పోతూ ఉంటాయి – మీరు ఇక్కడున్న జంతువులకు ఫుడ్ వెయ్యండి , మన బుజ్జిపాపాయి అక్కడ కనిపించే జంతువులకు ఫుడ్ అందిస్తుంది .
అందరూ : wow సూపర్ అంకుల్ ……. అంటూ సంతోషంతో తమ తమ ఫ్రెండ్స్ ను చేరుకుని జంతువులను వీక్షిస్తూ , కృష్ణగాడు తెచ్చిఇస్తున్న ఫుడ్ వేస్తూ తినగానే చిందులువేస్తున్నారు .
ఇక్కడ అమ్మా – చెల్లెమ్మలు ……. మా అందరి ఏకైక స్వచ్ఛమైన కోరిక తీరాలని ప్రార్థిస్తూ ఒక్కొక్క మెట్టే భక్తితో ఎక్కుతున్నారు , భక్తితో మొక్కును ఎంత త్వరగా తీర్చుకుంటే అంత త్వరగా మా కోరిక తీరుతుందని అమ్మా – చెల్లెమ్మలు ఒక్కదగ్గర కూడా ఆగి రెస్ట్ తీసుకోకుండా మెత్తుమెత్తుకూ మరింత ఉత్సాహం – భక్తితో ముందుకువెళుతున్నారు .
వెనుకే బుజ్జిపాపాయికి జింకలను చూయిస్తూ బుజ్జిచేతితో తాకించి నవ్విస్తూ ఫుడ్ వేస్తూ ……. , మధ్యమధ్యలో అమ్మా – చెల్లెమ్మలకు వాటర్ బాటిల్స్ తెచ్చి అందిస్తూ లంచ్ సమయానికి ఏడుకొండల పైకి చేరుకున్నాము .
అక్కడ మేడం గారు – టీచర్స్ ……. జూ తోపాటు మరికొన్ని ప్రదేశాలను పిల్లలకు చూయించాలని ప్లాన్స్ వేసుకున్నా , పిల్లలు తమకిష్టమైన జూ వదిలి వస్తారా చెప్పండి – దర్శన సమయం దగ్గరపడటంతో పిల్లలను జూ నుండి బయటకు తీసుకురావడానికి తలప్రాణం దిగివచ్చి మేడం – స్టాఫ్ నవ్వుకున్నారు .
మేడం గారు : కృష్ణా ……. వంటవాళ్లకు వంట చెయ్యడానికి సమయం సరిపోదంటున్నారు .
కృష్ణ : మేడం ……. ఎలానో పిల్లలు ఫ్రెష్ అవ్వాలికదా , హోటల్ కు వెళ్లి అక్కడే డిన్నర్ చేసేసి కొండపైకి చేరుకుందాము .
మేడం గారు :థాంక్యూ sooooo మచ్ కృష్ణా ……..
కృష్ణ : అక్కడితో ఆపేయ్యండి మేడం గారూ ……. , మీరు థాంక్స్ చెప్పారని మహేష్ కు తెలిస్తే నా వీపు విమానం మ్రోగుతుంది , సమయానికి చేరికోవాలి కదా పిల్లలూ కమాన్ కమాన్ బస్సెస్ ఎక్కండి .
పిల్లలతోపాటు బుజ్జితల్లులు బుజ్జాయిలు ఎక్కారు .
మేడం గారు : మేము చెయ్యాల్సినవన్నీ మీరే చేసేస్తున్నారు …….థాంక్
కృష్ణ : మళ్ళీనా అమ్మో ఎలాగో మహేష్ లేడు కాబట్టి సరిపోయింది అని వీపు తడుముకున్నాడు .
మేడం గారు : నవ్వుకున్నారు – కృష్ణా ……. మనం వెళ్ళేటప్పటికి మహేష్ – అమ్మ – చెల్లెమ్మలు అక్కడ ఉంటారుకదూ ……
కృష్ణ : ఖచ్చితంగా ఉంటారు మేడం ……. వెళదాము అంటూ హోటల్ చేరుకుని పిల్లలు ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేశాక బస్సులో బయలుదేరారు .
టీచర్స్ ……. కొండకు ఇరువైపులా చూయిస్తూ గొప్పతనాన్ని – భక్తిని వివరిస్తుంటే పిల్లలందరూ శ్రద్ధగా వింటూ పచ్చదనాన్ని అక్కడక్కడా దూరంగా కనిపిస్తున్న జంతువులను చూసి సంతోషంతో కేకలివేస్తూ పైకి చేరుకున్నారు .
బస్సు దిగగానే ఎదురుగా కనిపించడంతో డాడీ – అమ్మలూ – అమ్మమ్మా …….. అంటూ పరుగునవచ్చి గుండెలపైకి చేరారు .
బుజ్జితల్లులు : అమ్మమ్మ బుంగమూతిపెట్టేలోపు మిమ్మల్ని గట్టిగా హత్తుకుని ముద్దులుపెట్టేస్తాము అని నవ్వుకున్నాము .
Sorry లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ …….. , మీ కోపం చల్లారేదాకా మీ ఇష్టం అంటూ చేతులను విశాలంగా చాపాను .
బుజ్జితల్లులు : మా డాడీ మొక్కు తీర్చుకుంటే మేము తీర్చుకున్నట్లే కదా డాడీ అంటూ నా చేతులను వారి చుట్టూ వేసుకుని ముద్దులుపెట్టారు .
కృష్ణగాడివైపు చూసి లవ్ యు రా అంటూ సైగలుచేసాను .
కృష్ణ : గుండెలపై చేతినివేసుకుని నవ్వుకున్నాడు .
అమ్మ : బుజ్జితల్లులూ ……. నా పర్మిషన్ లేకుండా ……..
బుజ్జితల్లులు : డాడీ నే వదలడం లేదు అమ్మమ్మా చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నారో కౌగిలిలో ……. , డాడీ వదులుతారా లేదా అంటూ బుగ్గలపై కొరికేసి చిరునవ్వులు చిందిస్తూ వెళ్లి చెల్లెమ్మల కౌగిలిలోకి చేరారు .
కృష్ణ : కమాన్ కమాన్ పిల్లలూ …… అందరూ ఒక్కదగ్గరే ఉండండి దర్శనానికి వరుసలో వెళ్ళాలి .
రేయ్ ఇంకా సమయం ఉందికదరా ……..
కృష్ణ : నాకోసం please please ఎందుకన్నది తరువాత చెబుతాను రేయ్ – మేడం గారూ వెళదాము ………
సరే అంటూ పిల్లలందరినీ జాగ్రత్తగా కంపార్టుమెంట్ కు తీసుకెళ్లాము . మా టికెట్స్ – చిన్న చిన్న పిల్లలను చూసి రష్ తక్కువగా ఉండటం వలన నేరుగా లోపలికివదిలారు .
అందరమూ భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ వెళ్లి కనులారా స్వామివారి దర్శనం చేసుకున్నాము – ఆ క్షణం ఎంత సంతోషం వేసిందో చెప్పలేం – అమ్మ , చెల్లెమ్మలు , బుజ్జితల్లులు ……. అందరమూ అందరమూ కళ్ళుమూసుకుని ఒకే ఒక కోరిక కోరుకున్నాము .
పిల్లల వలన ఎవ్వరికీ కలుగని అదృష్టం మాకు కలిగింది – సుమారు కొన్ని నిమిషాలపాటు స్వామివారి దర్శనంతో పరవశించిపోయాము . గోవిందా గోవింద అని జపిస్తూ బయటకువచ్చాము – పిల్లలందరూ ఇంటికి తీసుకెళ్లడానికి లడ్డూలు తీసుకున్నారు – దగ్గరుండి అందించాము .
కృష్ణ : స్వామి లడ్డూ ప్రసాదం తీసుకొచ్చి బుజ్జితల్లులూ – బుజ్జాయిలూ – పిల్లలూ – బాబు …….. ఆకలేస్తూ ఉంటుంది స్వామి ప్రసాధమైన ఈ లడ్డూలు తినండి .
అమ్మ : కృష్ణా ……. బుజ్జాయిలు లంచ్ చెయ్యలేదు కదూ ……..
బుజ్జితల్లులూ ……..
జాహ్నవి : అమ్మమ్మా – డాడీ మీరు చేశారా ? , మొక్కు తీర్చుకునేంతవరకూ మీరు తిని ఉండరని మాకు తెలుసు ……..
కృష్ణ : అవును మహేష్ ……. , మొక్కు తీర్చుకుని దర్శనం చేసుకునేంతవరకూ డాడీ తోపాటు మేము కూడా తినము అన్నారు నాకేమి చెయ్యాలో తోచక అందుకే సమయానికి ముందే దర్శనానికి తీసుకెళ్ళాను .
లవ్ యు కృష్ణా అంటూ కౌగిలించుకున్నాను – అమ్మావాళ్ళు …….. బుజ్జాయిలందరికీ లడ్డూ తినిపించారు .
కృష్ణ : మహేష్ …….. , మన కోరిక తీరాలని మేడం గారు కూడా భోజనం చెయ్యలేదు .
మేడం గారూ – తల్లీ – అక్కయ్యా ……….
మేడం : ఈ పిలుపుల వలన నేనూ …… మీలో ఒకరిని కదా , మా ఆక్కయ్యలు సంతోషంగా ఉండాలని నేనూ కోరుకుంటున్నాను – మొక్కు విషయం జూ వెళ్ళాక తెలిసింది లేకపోయుంటే నేనూ కాలినడకన వచ్చేదానిని – స్వామీ ……. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మొక్కు తీర్చుకుంటాను – మా అక్కయ్యలను …… అమ్మ , మహేష్ , పిల్లల దగ్గరికి చేర్చండి అని ప్రార్థించారు .
అమ్మా – చెల్లెమ్మలు ఆనందబాస్పాలతో వెళ్లి కౌగిలించుకుని లడ్డూ తినిపించారు . మేడం ……. అమ్మావాళ్లకు తినిపించారు – బుజ్జితల్లులు …… నాకు – కృష్ణగాడికి తినిపించారు .
చుట్టూ పిల్లలందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు .
టీచర్స్ : పిల్లలూ ……. చూడాల్సినవి చాలా ఉన్నాయి అంటూ సాయంత్రం వరకూ మ్యూజియం – ఆకాశగంగా – పాపవినాశనం – టీటీడీ గార్డెన్స్ …….. చూయించి చీకటిపడేలోపు కిందకు తీసుకెళ్లారు .
కింద తిరుపతిలో గోవిందరాజస్వామి టెంపుల్ – ఇస్కాన్ చూసి హోటల్లో డిన్నర్ చేసి 10 గంటలకు బెంగళూరు ప్రయాణానికి చెక్ ఔట్ అయ్యి బయటకువచ్చాము .
పిల్లలందరూ తమ తమ బస్సెస్ ఎక్కి కూర్చున్నారు . అందరూ ఉన్నారని నిర్ధారించుకున్న తరువాత స్టూడెంట్స్ కు గుడ్ నైట్ చెప్పేసి మేడం గారు వారి పిల్లలతోపాటు మా దగ్గరికివచ్చారు . మహేష్ ……. మాతోపాటు మీరుకూడా పిల్లలను చూసుకుంటున్నారు కాబట్టి ఈ స్పెషల్ బస్ లో ఈ రాత్రికి ప్రయాణించాలని నిర్ణయించుకున్నాను .
మనసారా స్వాగతం పలుకుతున్నాము మేడం …….
బుజ్జాయిలు – పిల్లలు – బాబు …….. సంతోషంతో తమ ఫ్రెండ్స్ అయిన మేడం పిల్లల చేతులను అందుకుని బస్ లోపలికి పిలుచుకునివెళ్లారు .
తల్లీ – అక్కయ్యా ……. రండి అంటూ అమ్మా – చెల్లెమ్మలు ప్రేమతో ఆహ్వానించారు .
మేడం మీరు స్టూడెంట్స్ గురించి ఏమాత్రం ఆలోచించకండి నేను – కృష్ణ వెళ్లి వాళ్లకు తోడుగా ఉంటాము – హ్యాపీగా జర్నీ చెయ్యండి .
కృష్ణ : మహేష్ ……. ఇద్దరం ఎందుకు ? , అయినా ఇక్కడ ఒక్కరైనా లేకపోతే ఎలా , నేను వెళతాను – నువ్వు బుజ్జాయిల దగ్గర ఉండు .
అయితే నేను వెళతానులే నువ్వు చెల్లెమ్మతో ఉండు – రేయ్ అధికాదురా నిన్న కూడా మీ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేసి పాపం చేసాను ……..
కృష్ణ : ఓహ్ దానిగురించి బాధపడుతున్నావా …… ? , నేను చెప్పేది విను ఆ ప్లాన్ కూడా ఎప్పుడో లైన్లో ఉంది – బెంగళూరుకు 4 గంటల్లో చేరిపోతాము అంటే 2 గంటలకు బెంగళూరులోని లగ్జరీయస్ హోటల్లో నేను – నా దేవత అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయాడు .
పక్కా ప్లాన్ లోనే ఉన్నావన్నమాట నవ్వుకుని ఒక్కొక్క బస్ లో ఎక్కాము – బస్సెస్ బయలుదేరాయి .
అప్పటికే మా బస్ ఎక్కిన మేడం గారు ఇది బస్సేనా లేక రోడ్ మీద వెళ్లే స్వర్గమా అంటూ మొత్తం రౌండ్ వేసివచ్చి అమ్మా – చెల్లెమ్మలూ ……. సూపర్ …….
చెల్లెమ్మలు : అక్కయ్యా ……. బస్ నచ్చిందన్నమాట …….
మేడం గారు : పిచ్చపిచ్చగా చెల్లెళ్ళూ ……..
చెల్లెమ్మ : అక్కయ్యా ……. బస్ మనదే , ఎప్పుడైనా మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తే రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యండి మరుక్షణంలో ఇంటి ముందు ఉంటుంది.
మేడం గారు : wow నిజమా మహేష్ …….
ఒక్కసారి కాదు మేడం గారూ …….. ఎన్నిసార్లైనా ఎక్కడికి వెళ్లాలన్నా at your సర్వీస్ ……. అని గుండెలపై చేతినివేసి చెప్పాను .
మేడం గారు : ఎందుకు మహేష్ , చేసిన చిన్న సహాయానికి నన్ను ఇంతలా అభిమానిస్తున్నారు .
మీకిరువైపులా ఉన్న అమ్మ – చెల్లెమ్మలు – బుజ్జాయిల పెదాలపై ఇంత సంతోషమైన చిరునవ్వులు చూడటానికి ఎన్నాళ్ళు పడుతుందోనని లోలోపలే బాధపడేవాళ్ళం – మీ మంచి మనస్సు వలన అనతి కాలంలోనే చూడగలిగాను – ఇదిచాలదా మేము జీవితాంతం మీకు ఋణపడిపోయాము అని చెప్పడానికి ……..
మేడం గారు ఉద్వేగానికి లోనయ్యి అమ్మ – చెల్లెమ్మలను కౌగిలించుకున్నారు .
చెల్లెమ్మ : అక్కయ్యా ……. మీ ఫెవరేట్ సీరియల్స్ ఉంటే చూద్దాము – నిద్రపోవాలంటే లోపలపడుకుందాము .
మేడం గారు : మన రెండు స్టేట్స్ లో ఫేవరేట్ సీరియల్ 7:30pm సీరియల్ కదా అని నవ్వుకున్నారు . నిన్నటిది – ఈరోజుది మొబైల్లో చూసి నిద్రపోదాము .
చెల్లెమ్మ : బస్సుల్లో The ఫాస్టెస్ట్ వైఫై సౌకర్యం ఉంది అక్కయ్యా ……. రండి కలిసి చూద్దాము అని వెనుక సోఫాలో కూర్చున్నారు .
హమ్మయ్యా ……. బుజ్జితల్లులతో కూర్చోవచ్చు అని పిల్లిలా వెళ్లి మధ్యలో కూర్చున్నాను .
వెనకనుండి అమ్మ చూసి నవ్వుకున్నారు – బుజ్జాయిలు బాబు పిల్లలు కార్టూన్స్ చూస్తున్నారు – డాడీ డాడీ ……. అమ్మలు , పిన్నమ్మలకు గ్రూప్ వీడియో కాల్ చేద్దాము అని చెరొకవైపు నా చేతులను చుట్టేసారు – హిమగారిని కూడా తీసుకోబోతే బుజ్జితల్లులూ ప్రస్తుతానికి వద్దు అమ్మ …… నన్ను తోసేసాక కాల్ లోకి తీసుకోండి .
బుజ్జితల్లులు : ఎందుకు డాడీ మా బుజ్జి అమ్మను దూరం పెడతారు – ఇబ్బంది పడతారు , అమ్మమ్మ చెప్పారుకదా బుజ్జిఅమ్మ కూడా మీ దేవతల్లో ఒకరు అని , సరే సరే మీ ఇష్టం …… దేవతలు కనిపించగానే మనసు పులకించిపోతోంది – చిన్న వదిన మాత్రం కనిపించడం లేదు .
అడిగితే నిద్రపోతున్నారని చెప్పారు వదినమ్మ – వదినమ్మ కూడా అసౌకర్యంగా నిమిషానికొకసారి కన్నీళ్లను తుడుచుకుంటున్నారు మాకు కనిపించకుండా ……..
బుజ్జితల్లులు : అమ్మా …… ఏమైంది – డాడీ …… అమ్మ ఎందుకో బాధపడుతున్నారు అని నావైపు చూస్తే ఎప్పుడో నా కళ్ళల్లోనుండి కన్నీళ్లు కారుతుండటం చూసి డాడీ డాడీ అంటూ బుజ్జిచేతులతో తుడిచి ముద్దులుపెట్టారు.
బుజ్జితల్లుల మాటలకు అమ్మా – చెల్లెమ్మలు – మేడం గారు – పంకజం గారు కంగారుపడుతూ వచ్చి చూసి తల్లీ – అక్కయ్యా ……. ఏమైంది ఏమైంది అని కన్నీళ్ళతో అడిగారు .
అమ్మకు ముద్దులుపెట్టి ఓదార్చడానికి మనం లేము బుజ్జితల్లులూ ……. అని బుజ్జితల్లులను ప్రాణంలా హత్తుకున్నాను – మల్లీశ్వరి గారూ …… ఏమైంది ? , ఆ మూర్ఖులు ఏమైనా ………
అదీ అదీ …….. అంటూ మల్లీశ్వరి గారి మాటలు వినిపించాయి – వీడియో కాల్ లో వదినలు కూడా బాధ – కంగారు పడుతున్నారు .
వదినమ్మ : మల్లీశ్వరీ …… అలాంటిదేమీ బేబీ – బుజ్జితల్లులూ – చెల్లెళ్ళూ – అమ్మా ……. కళ్ళల్లో నలుసు పడింది , మల్లీశ్వరి తీస్తున్న సమయంలో కాల్ వచ్చింది అంతే అంతే చెప్పు మల్లీశ్వరీ చెప్పు ……..
మల్లీశ్వరి గారు : అదీ మహేష్ సర్ ……. కొన్ని క్షణాల తరువాత అంతే అంతే మహేష్ సర్ ……. నలుసును గాలి ఉబుతూ తీస్తున్నానా ? – అందుకే కళ్ళల్లో కన్నీళ్లు ……..
బుజ్జితల్లులు : అంటీ ……. నలుసును తీసేసారు కదా …….
మల్లీశ్వరి గారు : ఆ ఆ ఇప్పుడే తీసేసాను బుజ్జితల్లులూ ……. , ఇందూ మేడం గారికి – అధిచూసి సునీత మేడం గారికి చాలా నొప్పి కలిగింది అందుకే ఈ కన్నీళ్లు ………
వదినమ్మ : బుజ్జితల్లులూ ……. బేబీ ని – మిమ్మల్ని చూసానుకదా ఇప్పుడు నొప్పి పూర్తిగా మాయమైపోయింది అని చిరునవ్వులతో టూర్ విశేషాలు చెప్పమని టాపిక్ డైవర్ట్ చేసారు .
దేవతలతో మాట్లాడుతూ మాట్లాడుతూనే మొదట బుజ్జాయిలు – బుజ్జితల్లులు మా ఒడిలో – మేము సోఫాలలోనే నిద్రపోయాము .
మళ్లీ మెలకువ వచ్చినది కృష్ణ వచ్చి లేపి బెంగళూరు హోటల్ చేరుకున్నామని చెప్పడంతో …….. – నాతోపాటు బుజ్జితల్లులు కళ్ళుతెరిచి డాడీ డాడీ ……. అంటూ మరింత హత్తుకున్నారు – మాకు ……. మా డాడీ దగ్గరే నిద్రపోవాలని ఉంది .
అమ్మను మాయచేసైనా ……..
కన్నయ్యా ……. వినిపించిందిలే , తథాస్తు అని వెనుక నుండి వెంట్రుకలపై ముద్దుపెట్టి , నవ్వుతూ బుజ్జాయిలను ఒక్కొక్కరిని ఎత్తుకుని కిందకుదిగారు .
బుజ్జితల్లులూ ……. మీ అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేసింది మీరు లోపలికివెళ్లి మీ కిష్టమైన గదిని సెలెక్ట్ చేసుకోండి బుజ్జాయిలను మీ అమ్మల దగ్గరికి చేర్చి వచ్చేస్తాను అని మిగిలిన బుజ్జాయిలను ఎత్తుకుని అమ్మ గదిలోకి చేర్చాను .
మేడం గారు: మహేష్ …… కొంతమంది పిల్లలు పాపం హాయిగా నిద్రపోతున్నారు – లేపడానికి మనసు రావడం లేదు .
వన్ మినిట్ మేడం అంటూ కిందకువచ్చి కృష్ణ – డ్రైవర్స్ సహాయంతో ఇద్దరిద్దరినీ నెమ్మదిగా ఎత్తుకునివెళ్లి ఒక్కొక్క గదిలో ముగ్గురు నలుగురిని పడుకోబెట్టాము – చివరగా మేడం గారి పిల్లలను ఎత్తుకునివెళ్లి వారి గదిలో బెడ్ పై పడుకోబెట్టాను .
గుడ్ నైట్ చిల్డ్రన్స్ అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి వెనక్కు తిరిగాను .
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మహేష్ అంటూ మేడం గారు ఆనందబాస్పాలతో ఆరాధనతో చూస్తూ ఎందుకో తెలియదు దేనికో కంట్రోల్ చేసుకుంటున్నట్లు పిడికిళ్ళు గట్టిగా బిగించారు .
మేడం గారూ ……. ఇంకొక్కసారి థాంక్స్ చెబితే నాకు నేను లెంపలేసుకుంటాను అంతే ……..
మేడం గారు ఒక్కసారిగా నవ్వేశారు .
మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి – అక్కడ బుజ్జితల్లులు వెయిటింగ్ ఆలస్యమైన ఒక్కక్క సెకనుకు ఒక్కొక్క దెబ్బ పెరుగుతుంది గుడ్ నైట్ ……….
మేడం గారు : గుడ్ నైట్ మహేష్ ……. అని సంతోషంతో చెప్పారు .
పరుగున బుజ్జితల్లుల గదిలోకి చేరుకున్నాను .
హమ్మయ్యా ……… వచ్చావా రెండు రోజులుగా కంట్రోల్ చేసుకుంటున్నాను ఇక ఒక్క క్షణం కూడా ఆగలేను అంటూ బుజ్జితల్లతోపాటు సోఫాలో కూర్చుని మాట్లాడుతున్న చెల్లిని అమాంతం ఎత్తుకుని సిగ్గుపడుతున్న చెల్లెమ్మ బుగ్గను కొరికేస్తూ బయటకు వెళ్ళిపోయాడు .
బయట నుండి ఇద్దరి గుడ్ నైట్ లు వినిపించాయి .
బుజ్జితల్లులు ముసిముసినవ్వులతో లేచి నన్ను హత్తుకున్నారు . బెడ్ పైకి చేరి ఇద్దరి నుదుటిపై ముద్దులుపెడుతూ – వారి బుజ్జిచేతుల లాలనను ఆస్వాదిస్తూ ……
బుజ్జితల్లి : డాడీ ……. , అమ్మలకు మీరంటే – మీకు అమ్మలంటే అదే అదే మీ దేవతలంటే ఎందుకంత ఇష్టం ప్రేమ ప్రాణం …….. , ఇప్పటివరకూ మాకు చెప్పనేలేదు .
వదినమ్మ – వదినలు …… నా దేవతలు అంటూ ఉత్సాహం తారాస్థాయికి చేరిపోయింది . వద్దులే నేను చెప్పినా – మీ అమ్మలు పిన్నమ్మలు చెప్పినా కాస్త ఓవర్ – బిల్డప్ అని అనుకోవచ్చు , మీ అమ్మమ్మ ఉందికదా దగ్గరుండి చూసింది – మీ అమ్మలు ……. నన్ను తనకంటే ప్రాణంలా చూసుకునేవాళ్ళని అసూయ చెందని రోజంటూ లేదు , రోజూ అలకలే ……. మీ అమ్మమ్మ చెబితేనే పసందుగా ఉంటుంది – మొదలెడితే రోజులైనా సరిపోవు , రేపు – మర్నాడు రెండు రోజులు బెంగళూరు మొత్తం తిరిగెయ్యాలంటే మీకు రెస్ట్ అవసరం సో హాయిగా నిద్రపోండి . మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చెయ్యగా ఏదైనా సమయం మిగిలితే మీ అమ్మమ్మను చుట్టేయ్యండి – నాకు తెలిసి మీరు కోరిక కొరగానే నావైపు గుర్రుగా చూస్తారు …….
బుజ్జితల్లులు సంతోషంగా నవ్వుతూనే గుడ్ నైట్ చెప్పి నా గుండెలపై జోకొడుతూ నిద్రలోకి జారుకున్నారు .
గుడ్ నైట్ మై లవ్లీ ఏంజెల్స్ అంటూ ముద్దులుపెడుతున్న సెల్ఫీలు తీసుకుని దేవతలకు పంపించి నిద్రపోయాను .
మొబైల్ మ్రోగడంతో చూస్తే 5:30 – మేడం గారి నుండి …….. , మహేష్ ……. పిల్లలను ఇంత త్వరగా లేపడం తప్పే కానీ బెంగళూరు వీక్షించాలంటే 7 గంటలకల్లా హోటల్ నుండి కదలాలి …….. – స్టాఫ్ అందరూ రూమ్ రూమ్ కు వెళ్లి లేపడానికి రెడీగా ఉన్నాము – మేము మాత్రమే సరిపోము …….
కరెక్ట్ గా చెప్పారు మేడం – నిమిషంలో అక్కడ ఉంటాను .
మేము కూడా డాడీ గుడ్ మార్నింగ్ అంటూ బుజ్జితల్లులు ముద్దులుపెట్టి లేచారు .
లవ్లీ గుడ్ మార్నింగ్ ఇన్ బెంగళూరు అని ఒక్కొక్క గదికి వెళ్లి అమ్మాయిలు పాపాయిలను …… బుజ్జితల్లులు – అబ్బాయిలు పిల్లలను …… నేను ఆప్యాయంగా లేపి విషయం చెప్పాము .
వండర్ లా వండర్ లా అంటూ ఉత్సాహం హుషారుతో లేచి బాత్రూములలోకి దూరడం చూసి ఆనందిస్తూ , అటువైపు నుండి పూర్తిచేసుకుని వచ్చిన మేడం వారిని కలిసాము .
మేడం గారు థాంక్స్ చెప్పబోయి నోటికి తాళం వేసేశారు .
మేడం గారూ ……. నేను దెబ్బలు వేసుకోవడం మీకు ఇష్టం అనుకుంటాను కదూ ………
మేడం గారు : నో నో నో అంటూ నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి వారి గదిలోకి వెళ్లారు .
బుజ్జితల్లులతోపాటు అమ్మావాళ్ళ డ్యూయల్ డబల్ బెడ్స్ గల బిగ్గెస్ట్ రూమ్ లోకి వెళ్ళాను .
సర్ప్రైజ్ ……. మేమెప్పుడో రెడీ డాడీ – మావయ్యా – అక్కయ్యలూ ……. , ఇక రెడీ అవ్వాల్సినది అమ్మమ్మా – అమ్మలే అని బుజ్జాయిలు గుడ్ మార్నింగ్ చెప్పి చప్పట్లు కొట్టారు .
బుజ్జితల్లులూ ……. వెళ్లి రెడీ అవ్వండి . నేను – అంకుల్ వెళ్లి కింద రెస్టారెంట్ లో అందరికీ వేడివేడిగా కోరిక బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేలా హోటల్ మేనేజర్ ను కలుస్తాను అని బుజ్జితల్లులను మా గదిలోకి వదిలి లగేజీ అందించాను . ఇంతకీ వీడు చెల్లి మైకం నుండి బయటపడ్డాడో లేడో , కృష్ణగారూ – హీరో కృష్ణగారూ ……. తెల్లవారింది సర్ – మళ్లీ రాత్రివరకూ కంట్రోల్ చేసుకోండి – బయటకువస్తే ……..
ప్యాంటు వేసుకుంటూ బయటకువచ్చాడు . తిరుపతి నుండి ప్రయాణం నాలుగు గంటలు – నా చెల్లెమ్మ కౌగిలిలో ప్రయాణం నాలుగు గంటలు భలేగా ప్లాన్ అండ్ ఎంజాయ్ చేశావన్నమాట అని వాడి భుజం చుట్టూ చేతినివేసి కిందకువెళ్లి , పిల్లలు రెస్టారెంట్ కు రాగానే ఏమాత్రం ఆలస్యం కాకుండా వీలైనంతమంది చెఫ్ లను రెడీ చెయ్యమని చెప్పి రెడీ అయ్యాము .
మేడం గారి టైమింగ్ ప్రకారం 6:30 కు పిల్లలంతా రెస్టారెంట్ లో ఉన్నారు – గంటలో తృప్తిగా బ్రేక్ఫాస్ట్ చేసి బస్సెస్ లో చేరిపోవడం – 7:30 కు బస్సెస్ కూడా కదిలిపోయాయి .
మేడం గారు : ఫస్ట్ ఎక్కడికి వెళదాము పిల్లలూ ……..
వండర్ లా వండర్ లా వండర్ లా అంటూ పిల్లలందరి మాట ఒకటే అయినట్లు బస్సెస్ టాప్స్ లేచిపోయేలా కేకలువేశారు .
మేడం గారు : నవ్వుకుని , రోజంతా అక్కడే ఉంటామని మాత్రం గోల చెయ్యకూడదు ఎందుకంటే వండర్ లా కంటే సూపర్ టూరిస్ట్ places చాలా ఉన్నాయి – మనకున్న టైం రెండు రోజులే కాబట్టి లంచ్ వరకూ మీ ఇష్టం ok నా స్టూడెంట్స్ ……..
థాంక్యూ థాంక్యూ sooooo మచ్ మేడం అంటూ సంతోషంతో చప్పట్లు కొట్టారు .
మేడం గారు : గుడ్ స్టూడెంట్స్ ……..
30 నిమిషాలలో ” Wonderla Amusement Park ” చేరుకున్నాము . ఎంట్రన్స్ చూసి పిల్లలు సంతోషం ఉత్సాహంతో కేకలు వేస్తూనే ఉన్నారు .
రేయ్ కృష్ణా ……. లోపల మొత్తం గేమ్స్ కు పే చేసెయ్యి – పిల్లలకు ఇష్టమైనవి ఇష్టమొచ్చినంతసేపు ఆడుకునేలా ……..
మేడం గారు : కృష్ణ కృష్ణ …….. తప్పుగా అనుకోవద్దు please please use this అంటూ కార్డ్ ఇచ్చారు – కాలేజ్ ఫీజ్ తో పాటు టూర్ మనీ కూడా పే చేశారు కదా మీకూ చెప్పాను please please ……. , అవసరమైనప్పుడు మోహమాటపడకుండా అడుగుతాను కదా …….
అలా అయితే ok మేడం కానీ రిక్వెస్ట్ కాదు ఆర్డర్ …….
కృష్ణ కార్డ్ తీసుకెళ్లి ఓవర్ అల్ టికెట్ తీసుకున్నాడు . వంద మంది పిల్లల మెడలో ఐడెంటిటీ కార్డ్స్ చేరాయి – పిల్లలూ ……. ఈ కార్డ్ తో ఏ గేమ్ ఎన్నిసార్లైనా ఆడవచ్చు లెట్స్ గో అనడం ఆలస్యం లోపలికి పరుగులు తీశారు .
డాడీ డాడీ ……..
మీ అమ్మమ్మా – అమ్మలతోపాటు వెళ్లి ఎంజాయ్ చెయ్యండి .
లవ్ యు డాడీ అంటూ వాళ్ళ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ తోపాటు లోపలికివెళ్లారు .
కృష్ణ : మహేష్ ఆఫీస్ నుండి మేనేజర్ కాల్ ……. , అర్జెంట్ మీటింగ్ ……..
లాప్టాప్స్ ఫుల్ ఛార్జింగ్ లో ఉన్నాయికదా లోపలికి తీసుకువెళదాము – బుజ్జాయిల ఆనందాలనూ చూడవచ్చు , మీటింగ్ కూడా అటెండ్ అవ్వవచ్చు …….
లోపల బుజ్జితల్లులు – బుజ్జాయిలు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తోపాటు ఫన్ రైడ్స్ – వాటర్ గేమ్స్ – రోలర్ కోస్టర్ గేమ్స్ ……..
బుజ్జాయిలకు ఎదురుగానే అమ్మ – చెల్లెమ్మలు – పంకజం గారు – మేడం గారు ……. బుజ్జాయిలతో సమానంగా చిన్న పిల్లల్లా మారిపోయి ఎంజాయ్ చేస్తుండటం చూసి మురిసిపోతూ మీటింగ్ మధ్యలో వెళ్లి ఫోటోలు తీసి దేవతలకు పంపించాను – లైవ్ వీడియో కాల్స్ ద్వారా కూడా ఆ ఆనందాలను పంచుకున్నాను .
గంటలు నిమిషాలలో గడిచిపోతున్నాయే అన్న బాధ తప్ప పిల్లలు తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు .
బుజ్జితల్లులు ……. మా దగ్గరికివచ్చి , డాడీ – అంకుల్ ……. మీటింగ్ పూర్తయిందా లేదా ? , లాప్టాప్స్ అందుకుని మేనేజర్స్ ……. ఇక వండర్ లా లో అర గంట మాత్రమే ఉంటాము – ఈ కొద్దిసమయం కూడా మా డాడీని మాతోపాటు ఉండనివ్వరా అని బుజ్జి ఆధిపరాశక్తులలా కోపం ………
మేనేజర్ : sorry sorry బుజ్జి చైర్మన్స్ ……. , ఇప్పుడే సైన్ ఔట్ అవుతున్నాము .
బుజ్జితల్లులు : Thats గుడ్ అంటూ లాప్టాప్స్ క్లోజ్ చేసేసారు .
లవ్ యు లవ్ యు బుజ్జితల్లులూ అంటూ లాప్టాప్స్ …… డ్రైవర్ కు అందించి వెళ్లి బుజ్జితల్లులు – అమ్మ – చెల్లెమ్మలు – మేడం గారితోపాటు లంచ్ టైం వరకూ ఎంజాయ్ చేసాము .
సాయంత్రం వరకూ లాల్ బాగ్ – స్నో సిటీ లో బుజ్జాయిలు బుజ్జితల్లులు బాబు పిల్లలు అమ్మావాళ్ళు మేడం గారు అందరూ ఫుల్ గా ఎంజాయ్ చేసారు .
స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేసినట్లు బస్సులో మేడం కు – టీచర్స్ కు థాంక్స్ చెబుతూ , పేరెంట్స్ కు కాల్ చేసి సంతోషపు కబుర్లు చెప్పారు . హోటల్ కు చేరేంతవరకూ సంతోషంతో కేకలువేస్తూనే ఉన్నారు . రూమ్ కు చేరి ఫ్రెష్ అవ్వగానే బాగా అలసిపోయినట్లు తెలిసి డిన్నర్ చేస్తూనే నిద్రమత్తులో తూగుతున్నారు . మేడం గారు – టీచర్స్ …… స్టూడెంట్స్ అందరూ తినేలా చూసి వారి వారి గదులలోకి వదలగానే 7 గంటలకే బెడ్ పై హాయిగా నిద్రపోయారు .
బుజ్జాయిలు – బాబు – పిల్లలు అయితే మా మా గుండెలపై ఎప్పుడో నిద్రపోయారు . స్టూడెంట్స్ అందరూ తిన్న తరువాత మేడం గారు – టీచర్స్ తోపాటు మేమూ తిని బుజ్జాయిలను ఎత్తుకుని , నిద్రమత్తులో నడుస్తున్న బుజ్జితల్లులను జాగ్రత్తగా బిగ్గెస్ట్ రూంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాము .
అమ్మా ……. మీ ప్రాణమైన బుజ్జితల్లులు బుజ్జాయిలతో ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా , నేను చూసానులే అంటూ సోఫాలో కూర్చున్న అమ్మ చేతిని చుట్టేసాను . .
అమ్మ : లవ్ యు sooooo మచ్ కన్నయ్యా అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టి ఆ వెంటనే బుగ్గలను గిల్లేసి గుండెలపై కొడుతున్నారు .
చెల్లెమ్మలు – పంకజం గారు నవ్వుతున్నారు .
కృష్ణగాడు ……. మా ఆనందాలను చూసి మురిసిపోతున్నాడు .
అమ్మా అమ్మా అమ్మా …….. అంతలోనే ఏమైంది అమ్మా ……. అంటూ బుగ్గలపై ముద్దులవర్షం కురిపించాను .
అమ్మ : అదీ అదీ బుజ్జితల్లులు వచ్చి అమ్మమ్మా ……. డాడీ కి , మీ కంటే వారి దేవతలంటేనే మా అమ్మలు – పిన్నమ్మలు అంటేనే ఎందుకు ప్రాణం కంటే ఎక్కువ అని అడిగారు . నువ్వే అడగమన్నావు అన్నావట …….
నాకైతే నవ్వు ఆగడం లేదు – ఈ విషయం కూడా చెప్పానమ్మా ……. అలా అడుగగానే మీరు వాయించేస్తారని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……..
చెల్లెమ్మలు : అమ్మా అమ్మా …….. ఆ మధురాతి మధురమైన ప్రేమలను మాకూ వినాలని ఉంది .
అమ్మ : చూశావా కన్నయ్యా …… ఇప్పుడు చెల్లెమ్మలు కూడా అంటూ మళ్లీ ఒక రౌండ్ వేసుకున్నారు ( అమ్మా అమ్మా అంటూ దెబ్బలను రుద్దుకుంటూ అమ్మ ఒడిలో తలవాల్చాను ) . పెదాలపై చిరునవ్వులతో నా కురులలో స్పృశిస్తూ , తల్లులూ ……. అంటూ చేతులు అందుకుని ముందర కూర్చోబెట్టుకున్నారు – నా కన్నయ్య తల్లుల వలన భువిపైనే అత్యద్భుతమైన స్వర్గం చూసి తరించిపోయాను – ప్రతీరోజూ ఒక అందమైన మధురానుభూతిని పంచారు . ఇప్పుడు చెప్పవచ్చు కానీ మొదట ఆడిగినది మేము కదా అమ్మమ్మా అని మనపై దండయాత్రకు వేస్తారేమో బుజ్జితల్లులు …….
చెల్లెమ్మలు : అవునవును నిజమే అమ్మా ……. , అందరికీ ఒకేసారి ఆ మధురానుభూతులను పంచండి .
అమ్మ : లవ్ యు తల్లులూ ……. , కన్నయ్యా ……. నా తల్లులు కాదు కాదు నీ దేవతలను ఒకసారి చూడాలనిపిస్తోంది .
లవ్ టు అమ్మా ……. అంటూ జేబులోనుండి మొబైల్ తీసి వీడియో కాల్ చేసేంతలో ………
పంకజం గారి నుండి వాట్సాప్ మెసేజ్ వచ్చింది చూస్తే వీడియో ……. , అమ్మా – చెల్లెమ్మలూ ……. ఖచ్చితంగా నా దేవతల సంతోషమైన చిరునవ్వులు చిందించే వీడియో అయి ఉంటుంది అని ప్లే చేసాను .
షాకింగ్ వదినమ్మ – చిన్నవదిన కన్నీళ్ల వీడియో ……..
స్టోరీ నచ్చితే 1 రూపాయీ డొనేట్ చేయండి –pdfs2@ybl
Donate ===>>UPI ID :pdfs2@ybl
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి …. for Free only
Admin account id :Facebook links UMESH KING
TelegraM :JABBARDASTH
PAGE LINK Telugu Srungara Kathalu
GROUP LINK : ROLE PLAY PLOT
Twitter linkUMESH KING
Continue parts kosam naa facebook ki message cheyandi]