Jr NTR wife Lakshmi Pranathi: ఆ టైంలో ఎన్టీఆర్ భార్యను సైతం ట్రోల్ చేశారట..!

Jr NTR wife Lakshmi Pranathi: ఆ టైంలో ఎన్టీఆర్ భార్యను సైతం ట్రోల్ చేశారట..!
Jr NTR wife Lakshmi Pranathi: ఆ టైంలో ఎన్టీఆర్ భార్యను సైతం ట్రోల్ చేశారట..!

నందమూరి తారకరామారావు గారి మనవడిగా, నందమూరి హరికృష్ణ గారి అబ్బాయిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్… సినీ పరిశ్రమలో ఎవరి వారసులకు సాధ్యం కాని విధంగా 20 ఏళ్ళలోపే స్టార్ డంని…. సంపాదించుకున్నాడు. స్టూడెంట్ నంబర్ 1, ఆది, సింహాద్రి వంటి సినిమాలు ఎన్టీఆర్ కు తిరుగులేని స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ ను వరుస ఫ్లాపులు పలకరించాయి. 2003 లోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ పారితోషికం అందుకున్న హీరోగా రికార్డులు సృష్టించాడు ఎన్టీఆర్. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ ను ఫ్లాపులు పలకరించాయి.

అదే టైంలో ఫ్యామిలీ కూడా ఇతన్ని దూరం పెట్టినట్టు కథనాలు వినిపించాయి. కానీ ఎన్టీఆర్ కు మంచి సంబంధం చూసి పెళ్లిని ఘనంగా చేసింది నందమూరి, నారా ఫ్యామిలీస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే పెళ్ళైన తర్వాత ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పై కూడా ఘోరంగా ట్రోలింగ్ జరిగిందట. ఎందుకంటే ఎన్టీఆర్ కు పెళ్లయ్యాక రిలీజ్ అయిన ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్యా, రభస వంటి సినిమాలు అభిమానులను సైతం నిరాశపరిచాయి.

బాద్ షా సినిమా డీసెంట్ హిట్ అనిపించుకున్నా… అది శ్రీను వైట్ల – బ్రహ్మానందం ఫామ్ వల్ల హిట్ అయ్యింది అనే విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పై విమర్శలు గుప్పించారట చాలామంది. ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే ఎన్టీఆర్ కు కలిసి రావడం లేదు అంటూ ఆమెను ఘోరంగా ట్రోల్ చేశారట.

అయితే టెంపర్ నుండీ ఆర్ ఆర్ ఆర్ వరకు ఎన్టీఆర్ కు ఫ్లాప్ లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. కాబట్టి.. ఇప్పుడు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతిని అదృష్ట దేవత అంటూ పొగిడేస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

Jr NTR wife Lakshmi Pranathi: ఆ టైంలో ఎన్టీఆర్ భార్యను సైతం ట్రోల్ చేశారట..!

Back to top button

Adblock Detected

please remove ad blocker