Tollywood NewsTrending News

కేరళ అయిపోయింది… ఇప్పుడు బస్తర్‌ స్టోరీ చెబుతారట!

కేరళ అయిపోయింది… ఇప్పుడు బస్తర్‌ స్టోరీ చెబుతారట!

కేరళ అయిపోయింది… ఇప్పుడు బస్తర్‌ స్టోరీ చెబుతారట!

 కేరళ అయిపోయింది… ఇప్పుడు బస్తర్‌ స్టోరీ చెబుతారట!
కేరళ అయిపోయింది… ఇప్పుడు బస్తర్‌ స్టోరీ చెబుతారట!

సినిమా – వివాదం… ఈ కాంబినేషన్‌ వినగానే ఇటీవల కాలంలో మనకు గుర్తొచ్చే సినిమా ‘ది కేరళ స్టోరీ’. అదా శర్మ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలై మంచి విజయం అందుకుంది. తొలినాళ్లలో ఈ సినిమా మీద విమర్శలు వచ్చాయి. అవి కూడా ఈ సినిమా విషయంలో కలిసొచ్చాయి అని చెప్పాలి. దీంతో రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది అదరగొట్టింది ఈ సినిమా. ఇప్పుడు ఈ టీమ్‌ మరో సినిమాను అనౌన్స్‌ చేసింది. ఈసారి ‘బస్తర్‌’ ఏరియాను తీసుకుంది.

దర్శకుడు సుదీప్తో సేన్‌, నిర్మాత విపుల్‌ అమృత్‌లాల్‌ షా మరోసారి చేతులు కలుపుతూ.. ‘బస్తర్‌’ సినిమాను ప్రకటించారు. ఈ మేరకు సినిమా టైటిల్‌ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘మా నెక్స్ట్‌సినిమా ‘బస్తర్‌’ ద్వారా మరో వాస్తవ సంఘటనను చూడడానికి సిద్ధంగా ఉండండి’ అని ట్వీట్‌ చేశారు. ఏప్రిల్‌ 5, 2024న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తామని టీమ్‌ ప్రకటించింది కూడా.

అడవిలో ప్రశాంత వాతావరణం మధ్య ఎరుపు రంగుతో ఉన్న ఈ సినిమా టైటిల్‌ ఆసక్తి రేకెత్తిస్తుంది. ‘దేశాన్ని అల్లకల్లోలం చేసే దాగి ఉన్న నిజం’ అని ట్యాగ్‌ లైన్‌ రాస్తూ.. సినిమా కాన్సెప్ట్‌ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేసింది టీమ్‌. పోస్టర్‌ను కూడా అలానే డిజైన్‌ చేసింది కూడా. నక్సలిజం నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ సినిమాతో మ‌రో తేనె తుట్టెను క‌దుపుతున్నారా, మరో వివాదానికి శ్రీకారం చుడుతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.

‘ది కేరళ స్టోరీ’ విషయంలోనే రెండు మతాలు, రెండు వర్గాల మద్య చిచ్చు రేగింది. ఇప్పుడు (Bastar) ‘బస్తర్‌’ అని చెప్పిన నక్సలిజం నేపథ్యంలో భద్రత సంబంధమైన వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మరి సుదీప్తో సేన్‌ ఏ మేరకు ఈ సినిమాను గొడవలు లేకుండా హ్యాండిల్‌ చేస్తారో చూడాలి. ఈ విషయంలో అయితే ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభుత్వాలు సినిమాను ముందుకు వెళ్లనివ్వవు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button