Vikram-Rich Rich – 19 | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast
Vikram-Rich Rich - 19 | విక్రమ్--రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

Vikram-Rich Rich – 19 | విక్రమ్–రిచి రిచ్ | telugu dengudu kathalu jabardast

అర్ధ రాత్రి విక్రమ్ ఫోన్ చేసేవరకి అప్పటి వరకు వాడి ఊహల్లో ఉన్న నాకు నిద్ర మొత్తం ఎగిరిపోయింది, ఆనందంగా ఎత్తాను కానీ వాడి మాటలు విన్నతరువాత ఎందుకో భయంగా ఉంది, విక్రమ్ ఇప్పటి వరకు ఎ రోజు అలా భయంగా మాట్లాడిందే లేదు, మానసంతా ఏదో భయం భయంగా అనిపించింది, విక్రమ్ లేని ఇన్ని రోజులు ఆనందం గానే వాడి ఊహల్తో గడిపేస్తునాన్ను కానీ ఈ అర్ధ రాత్రి నాకు ఇప్పుడు భయం వేస్తుంది, మానస దెగ్గరికి వెళ్ళడానికి బట్టలు సర్దుకున్నాను….
ఇంకా సునీల్ గారు రాలేదు…. తలుపు కొట్టిన చెప్పుడు విని డోర్ తెరిచాను ఎదురుగా ఎవరో ఒక పది మంది ఉన్నారు అందరు నల్ల డ్రెస్ లోనే ఉన్నారు కొంచెం భయంగానే ఉన్నా ధైర్యంగా నిల్చున్నాను.
“భయపడకండి నా పేరు రవి విక్రమ్ అన్న పంపించాడు ”
అను : హో రవి అంటే మీరేనా అన్నయ్య, మీరంటే విక్రమ్ కి చాలా ఇష్టం, మీ గురించి చాలా చెప్పారు, మానసకి మీకు పెళ్లి అనుకుంటున్నారట కదా…
రవి : ముందు అక్కడికి వెళదాం…
అను : ఒక్క నిమిషం అన్నయ్య వస్తున్నాను…
రవి అనుని కార్ ఎక్కించుకుని సునీల్ ఇంటి వైపు కాకుండా వేరే దిక్కుగా వెళ్లడం గమనించి “అన్నయ్య సునీల్ గారి ఇల్లు అటు వైపు కదా?”
రవి : మానస అక్కడ లేదు మానస పూజ అందరు మా ఇంటిదేగ్గరే ఉన్నారు, ఇప్పుడు మా ఇంటికే వెళ్తున్నాము.
అను : (ఇంటికా కానీ మానసకి ఎవ్వరు లేరుకదా నాకు తెలియకుండా తనెప్పుడు ఇల్లు కట్టుకుంది, విక్రమ్ నాతో చెప్తాడు కదా) కార్ కాళీ స్థలం లో ఫ్లైట్ ముందు ఆగింది ఫ్లైట్ చూడగానే కొంచెం భయం వేసింది ఇది ఎక్కడికి తీసుకెళతుందో తెలీదు ఎందుకో మనసులో విక్రమ్ కి దూరంగా వెళ్తున్నట్టు ఉంది ఫ్లైట్ ఎక్కాలనిపించలేదు..
రవి అనురాధా ఇబ్బందిని గమనించి మానస కి ఫోన్ చేసి అనుకి ఇచ్చాడు.
అను : హలో
మానస : అను భయపడకు, నేను జాగ్రత్తగానే ఉన్నాను ఇక్కడికి రా నీకు కొన్ని నిజాలు తెలియాలి అని కాల్ కట్ చేసింది.
ఎందుకో మానసతో మాట్లాడిన తరువాత కొంచెం భయం తగ్గినా మనసులో ఏదో తెలియని భయంగానే ఉంది, ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాను…
ఫ్లైట్ స్టార్ట్ అయింది బ్యాగ్ లోనుంచి సంధ్య అమ్మ ఫోటో తీసాను, విక్రమ్ కి ఏ పని చేసిన వాళ్ళ అమ్మని తలుచుకోడం అలవాటు, ఎందుకో అమ్మ ఫోటో తీసి చూడాలనిపించింది, విక్రమ్ ఎక్కుడున్నవ్ నువ్వు నా పక్కన ఉంటే బాగుండు అనుకుని సంధ్య అమ్మ ఫోటో మళ్ళీ బ్యాగ్ లో పెట్టి కళ్ళు మూసుకున్నాను ఎందుకో నీరసంగా ఉంది రాత్రి నుంచి, తెగ బాత్రూం వస్తుంది, వాసనా మంచి నీళ్ల టేస్ట్ అన్ని వేరేగా ఉన్నాయ్….
అక్కడనుంచి మూడు గంటల తరువాత ఒక దీవిలో ల్యాండ్ అయ్యింది..
చుట్టూ సముద్రం జన సంచారం లేదు ఎదురుగా పెద్ద కొండలు మధ్యలో మెట్లు అందరు వెళ్తున్నారు వాళ్ళ వెనకాలే వెళ్ళాను చాలా మెట్లు ఎక్కిన తరువాత పెద్ద డోర్స్ రెండూ తెరుచుకున్నాయి… లోపలికి వెళ్ళాను అన్ని ఇల్లు ఒక చిన్న రాజ్యమే ఉంది ఇక్కడ, కార్ ఎక్కి ఎదురుగా ఒక రెండూ కిలోమీటర్స్ ఉంటుందేమో పెద్ద పాలస్ లాగా ఉంది అక్కడికి తీసుకెళ్లారు… మొత్తం ఎటు చూసినా సెక్యూరిటీ లోపలికి వెళ్ళాము, స్వర్గం లా ఉంది ఆ పాలస్, ఇలాంటి ఇంత అందమైన కట్టడం నేను ఇప్పటివరకు చూడలేదు…
……………………………………………………..
మానస : అమ్మా రవి అన్నయ్య అనురాధ ని తీస్కోచాడు..
దేవి : నాకెందుకు చెప్తున్నావ్ అస్సలు అక్కడే చంపేయాల్సింది, ఇక్కడి దాకా అనవసరంగా తీసుకొచ్చారు చంపేయండి.
మానస : అమ్మా ఆ విషయమే నీతో మాట్లాడాలి..
దేవి : కోపంగా “ఏంటి?”
మానస : అనురాధ ని చంపడానికి నేను ఒప్పుకోను, తనని వదిలేయండి….
దేవి : నాకే ఎదురు తిరుగుతున్నావా, ఎదురు తిరిగి బతుకుదామానేనా…?
మానస : రెండూ మోకాళ్ళ మీద కూర్చుని “అమ్మ నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమడగలేదు, మీకోసం నా ప్రేమని త్యాగం చేశాను, నా ప్రాణానికి ప్రాణం నేను ప్రేమించిన నా విక్రమ్ ని మోసం చేశాను, తనని చంపుకున్నాను ఇవన్నీ నేను మీకోసం చేసిన త్యాగాలుగా చెప్పట్లేదు, మీ వల్ల నేను చాలా కోల్పోయాను నేను చేసిన మోసం నన్ను నా జీవితాంతం వెంటాడుతుంది దానికి బదులుగా నేను అడిగింది ఒక్క ప్రాణం మాత్రమే ”
“అను చాలా సున్నిత మనస్కురాలు ఇవేమి తనకీ తెలియవు తన వల్ల ఎటు వంటి ఆపద కలుగదు నేను మాట ఇస్తున్నాను ”
దేవి : అలాగేలే పో ఇంతకీ నా వదిన ఎలా ఉంది?
మానస : ఇందాకే అత్తని కలిసాను, విక్రమ్ చనిపోయాడని చెప్పాను, ముందు కంగారు పడ్డా విక్రమ్ చనిపోయాడంటే నమ్మట్లేదు, మొండి పట్టు మీద ఉంది చిన్నా బతికే ఉన్నాడని.
దేవి : నేను నమ్మట్లేదు నా అల్లుడు చనిపోయాడంటే, మీరు చెప్పడమే కానీ కంఫర్మ్ గా కాదు వాడిది ఈ వంశపు రక్తమే కదా అందుకే నమ్మలేకపోతున్నాను.
మానస : అమ్మ ఒక వేళ చిన్నా బ్రతికే ఉంటే కత్చితంగా నన్ను, అను ని వెతుక్కుంటూ కత్చితంగా వస్తాడు..
దేవి : అంత నమ్మకమా వాడంటే, వాడు కూడా నిన్ను ప్రేమించాడా?
మానస : లేదు నాలో అత్తని చూసుకున్నాడు, నేనే బావని ప్రేమించాను…
దేవి : ఏడుస్తున్నావా?
మానస : లేదు అదీ నువ్వు నాకు నేర్పించలేదు.
దేవి : నీ మొహం చూస్తూనే అర్ధమవుతుంది నువ్వు వాడి వల్ల ఎంతగా మారిపోయావో… ఇక్కడనుంచి వెళ్ళిపో…
మానస మోకాళ్ళ మీద నుంచి లేచి బైటికి వచ్చింది…. అక్కడ అను కనిపించింది….
పెద్ద హాల్ లాగా ఉండే ప్రదేశానికి వచ్చాము ఎదురుగా మానస వచ్చింది తన డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంది, పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాను, విడిపించుకుంది ఏమైందా అన్నట్టు చూసాను.
మానస : ఎలా ఉన్నావ్ అను.
అను : బానే ఉన్నాను మానస కానీ ఏంటి ఇదంతా, నీకు మేము తప్ప ఎవ్వరు లేరు కదా ఈ దీవి, ఈ పాలస్ నీ డ్రెస్ ఏంటి ఇదంతా??
మానస : అన్ని తరువాత చెప్తాను, ముందు నీకు తెలియాల్సిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయ్ అన్ని వివరంగా తెలుస్తాయి….
అని పాలస్ వెనక్కి చాలా దూరం తీసుకెళ్ళింది.
మానస : అను నువ్వు ఉండ బోయేది ఇక్కడే నువ్వు జీర్ణించుకోవాల్సిన విషయం విక్రమ్ చనిపోయాడు…
ఆ మాట వినగానే నాకు నవ్వు వచ్చింది “ఏంటి మానస ప్రాంక్ హా, విక్రమ్ ఎక్కడ చూసి దాదాపు రెండు నెలలు అవుతుంది ఎక్కడ దాక్కున్నాడు నా మొగుడు “.
మానస : అనురాధ నువ్వు నమ్మినా నమ్మకపోయినా విక్రమ్ ఇక మనకి లేడు, లోపల విక్రమ్ అమ్మ గారు ఉన్నారు వెళ్లి పలకరించు కానీసం నిన్ను చూస్తే అయినా తను కొంచెం కుదుట పడుతుంది అని అక్కడనుంచి వెళ్ళిపోయింది అనుని చూడకుండా కళ్ళ నిండా నీళ్లతో….
అనుకి ఒక్కసారిగా ఎం అర్ధం కాలేదు ఇప్పటి వరకు తను విన్నదంతా నిజమేనా కళ్ళు తిరిగి పడిపోయింది…. తను పడిన శబ్దానికి మానస వెనక్కి తిరిగి చూసింది వెనకే మానస అత్త సంధ్య అనురాధ ని పట్టుకుని ఉంది, తన చెయ్యి పట్టుకుని పరీక్షించి చూసింది.
మానస వైపు చూసి : మానస ఈ అమ్మాయి ప్రేగ్నన్ట్, ఎవ్వరు ఈ అమ్మాయి ఇంకేంతమందిని పొట్టన పెట్టుకుంటారు మీ దూరశ కోసం, పాపం ఏ కన్న తల్లి బిడ్డో సంతోషంగా ఉండాల్సిన సమయంలో మీ వల్ల ఇక్కడ చిక్కుకుపోయింది….
మానస కళ్ళలో నీళ్లు ఆగలేదు అక్కడ్నుంచి పారిపోయింది, ఎవరో వెంటాడినట్టు ఉంది, ఎవ్వరో కాదు నేను చేసిన పాపలే నన్ను వెంటాడుతున్నాయి నాకు బతకాలని లేదు…విక్రమ్ నన్ను క్షమించు రా, వచ్చే జన్మలో అయినా నీకు పెళ్ళాం గా పుట్టి నీకు సేవలు చేసుకుంటాను…..
సంధ్య కళ్ళు తిరిగి పడిపోయిన అనురాధ ని లోపలికి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది…..
సంధ్య ఆశ్చర్య పడిన విషయం ఏంటంటే అనురాధ విక్రమ్ పేరు కలవరించడం… ముందు ఆశ్చర్యపోయిన తరువాత అనురాధ లేచే వరకు ఓపికగా తననే చూస్తూ ఉండిపోయింది….
సంధ్య : ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు అదీ ఇప్పుడు మాములు మనిషివి కావు, ఏ సంబంధం లేకుండా నిన్ను ఎందుకు తీసుకొచ్చారు, చూస్తే మా మనిషిలా కూడా లేవు, కానీ ఎందుకో నిన్ను చూస్తుంటే నా సొంత మనిషిలా అనిపిస్తున్నావ్ ఎవరు నువ్వు, చూస్తే నీకు ఎలాంటి శక్తులు లేనట్టున్నాయ్, మాములు బాడీ ఇలాంటి కృరుల చేతిలో ఎలా చిక్కావ్….. నిన్ను ఆ దేవుడే కాపాడాలి…
అనురాధ చిన్నగా కళ్ళు తెరిచింది తన కళ్ళు ఎదురుగా ఉన్న మనిషిని చూసి నమ్మలేకపోయింది ఎందుకంటే ఎదురుగా ఉన్నది సంధ్య కాబట్టి… తనని చూస్తూ అమ్మా అని పిలిచి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయింది.
ఇప్పుడు ఆశ్చర్యపోవడం సంధ్య వంతు అయ్యింది….
అనుకి మళ్ళీ మెలుకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి సంధ్య అను నే చూడటం గమనించి వెంటనే లేచి కూర్చుంది….
సంధ్య : తల్లి జాగ్రత్త నువ్వు ప్రేగ్నన్ట్ వి..
ఆ విషయం విన్న అనుకి ఆనందం ఆగలేదు, సంధ్యని కౌగిలించుకొని నవ్వుతూనే గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది, ఆ రోదనకి సంధ్య బెదిరినా అనుని సముదాయించి మంచం మీద కూర్చోబెట్టి కళ్ళు తుడిచింది….
అను : అమ్మా విక్రమ్ చనిపోయాడని చెప్తున్నారు అని ఇంకా గట్టిగా ఏడవటం మొదలు పెట్టింది…
సంధ్య : అంటే తల్లి నువ్వు….?
అను : విక్రమ్ భార్యని, నీ కోడల్ని అమ్మా…. అని ఏడుస్తూనే చెప్పింది.
సంధ్యకి కన్నీళ్లు ఆగలేదు, నా కోడలా నా బిడ్డ పెళ్లి చేసుకున్నాడా.. అంటే నీ కడుపులో ఉంది నా వారసులా? ఎంత సంతోషంగా ఉందొ చెప్పలేను….
అను : అమ్మా???
సంధ్య : తల్లీ భయపడకు చిన్నాకి ఎం కాలేదు ఆరోగ్యంగా ఉన్నాడు, నేను చెప్తున్నా కదా నా చిన్నాకి ఎం కాలేదు…
అను : కానీ వాళ్ళు……
సంధ్యా : ష్ ష్…. నేను చెప్తున్నా కద తల్లీ చిన్నాకి ఎం కాలేదని, వాడికి ఏమైనా అయితే ఈ గుండె ఆగిపోతుంది… ఈ పాటికి నీ కోసం వెతుకుతుంటాడు, నేను బతికే ఉన్నా అని తెలిసిన ఇరవై నాలుగు గంటల్లో మన ముందు ఉంటాడు, నీ భర్త ఇంకా ఇక్కడ ఇంకా లేడంటే ఏదో ముఖ్యమైన పని మీద ఉండి ఉంటాడు, లేదా నీ జాడ ఇంకా తెలియకుండా అయినా ఉండాలి..
అను సంధ్య చెప్పేది అంత ఏడుపు ఆపేసి వింటుంది కొంచెం ధైర్యంగా నే ఉన్నా భయం గా కూడా ఉంది.
అను నీరసాన్ని గమనించిన సంధ్య తల్లీ ఏమైనా తిందువు లే అని లోపలి నుంచి ఫ్రూట్స్ కోసుకొచ్చింది, అను ఇంకా బాధపడటం చూసి…
సంధ్య : తల్లీ నీ పేరెంటమ్మా?
అను : అను…. అనురాధ..
సంధ్య : అనురాధ… చక్కటి పేరు ఇంద కొంచెం తిను అస్సలే కడుపు తో ఉన్నావు, నీకు చిన్నా కడుపులో ఉన్నప్పుడు విషయాలు చెప్పనా?
అను : హ్మ్మ్…..
సంధ్య : కట్ చేసిన పళ్ళు అనుకి తినిపిస్తూ “చిన్నా కడుపులో ఉన్నప్పుడు నాతో మాట్లాడే వాడు తెలుసా…
అను : ఎలా?
సంధ్య : అదీ అంతే తల్లికి బిడ్డకి సంబంధించిన విషయం, వాడు నన్ను మొదటసారి తన్నినప్పుడు నా ఆనందం వర్ణించలేనిది, నేను రోజు ఒక కొత్త విషయం వాడితో మాట్లాడేదాన్ని… చెప్పిన విషయం మళ్ళీ చెప్పామనుకో తన్నే వాడు…. వాడు పుట్టాకే నా జీవితంలో ఆనందం, సుఖం అన్ని అనుభవించాను వాడు నన్ను మొదటి సారి అమ్మ అని పిలిచినప్పుడు ఈ లోకాన్నే మర్చిపోయాననుకో…
పాలు తాగిన తరువాత వాడే నా జాకెట్ ఉక్స్ పెట్టి నా పైట కనిపించకుండా నా చుట్టూ కప్పి వెళ్ళేవాడు…
నీకింకోటి చెప్పనా చిన్నా అస్సలు మధ్యాహ్నం పూట పడుకోడు మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలీదు కానీ మధ్యాహ్నం పూట చిన్నా ని బలవంతంగా పడుకోపెట్టినా మనల్ని నిద్రపుచ్చి వాడు బైటికి వెళ్లిపోయేవాడు, మాయోడు ఎప్పుడు మాయ చేస్తూ ఉంటాడు…..అని మురిసిపోయింది.
చిన్నా లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా, మనం క్వశ్చన్ కి ఆన్సర్ ఫస్ట్ స్టెప్ వేసేలోపు చిన్నా ఆన్సర్ రాసేస్తాడు, అంత ఫాస్ట్, ఇంతకీ చిన్నా ఎం చదువుకున్నాడు, బలంగా ఉంటాడా, సున్నితంగా ఉంటాడా రఫ్ గా ఉంటాడా, ఇప్పటివరకు ఎవరితో అయినా గొడవ పడ్డాడా, పడే ఉంటాడు వాడికి కోపం చాలా ఎక్కువ, జోకులు వేస్తాడా సీరియస్ గా ఉంటాడా, అవతలి వాళ్ళతో ఎలా మాట్లాడతాడు, పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తాడా, వాడికి కంపెనీ రాసిచాను వాళ్ళని కలిశాడా, ఇప్పుడు ఎలా ఉన్నారు.
నీతో ఎలా ఉంటాడు, నిన్ను ఆటపట్టిస్తాడా? నన్నయితే తెగ ఆడించేవాడు… ఏదైనా అనుకున్నాడంటే మాత్రం సాధించేదాకా వదలడు నా బంగారు కొండ… వాడికి ఆలు ఫ్రై పప్పు చారు అంటే చాలా ఇష్టం నీతో చేపించుకుంటాడా…. నేను లేకుండా ఎన్ని కష్టాలు పడ్డాడో నాకోసం ఎంత ఏడ్చి ఉంటాడో….
అను కళ్లార్పకుండా వినడం చూసి “ఏమైంది అను”… అంది.
అను : మీ అబ్బాయి కూడా ఇంతే మిమ్మల్ని ఇలానే తలుచుకునేవాడు.
సంధ్య : అవునా నేను గుర్తున్నానా వాడికి?
అను : గుర్తుండడమా అస్సలు మిమ్మల్ని తలుచుకోకుండా లేవడు, లేవంగానే మనసులో మిమ్మల్ని తలుచుకుని ఆ తరువాతే లేస్తాడు, ఏ పని చెయ్యాలన్న మిమ్మల్ని తలుచుకుంటాడు, చాలా సార్లు ఒంటరిగా పిచ్చి వాడిలా మీతో మాట్లాడుకోడం చూసాను… నాకైతే ఒక్కోసారి చికాకు వచ్చేసేది అమ్మ అమ్మా అని గోలకి….
అనుక్షణం మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు ఏదైనా తినేటప్పుడు కూడా వంకాయ ఫ్రై అంటే మా అమ్మకి ఎంత ఇష్టమో అని… ప్రతి పనిలో ఆలోచనలో విక్రమ్ అన్ని పనుల్లో మీరే ఉంటారు….
సంధ్య ఆనందానికి అవధులు లేవు, అలాంటి కొడుకు పుట్టినందుకు దేవుడికి దండం పెట్టుకుంది.
అను అదీ చూసి నవ్వుకుంది.
సంధ్య : ఇంకా చెప్పు విక్రమ్ గురించి మీరిద్దరూ ఎలా కలిశారు ఎలా పెళ్లి చేసుకున్నారు అయినా నీ మెడలో తాళి లేదేంటి, నీ చేతికి ఉంగరం కూడా లేదు నా బిడ్డ గురించి నీకు తెలిసినదంతా నాకు చెప్పవా?
అను : అమ్మా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు చనిపోయారని మిమ్మల్ని మా వాళ్లే చంపేసారని విన్నాను, కానీ ఇదంతా ఎలా మీకేం కాకపోతే విక్రమ్ మీ నుంచి ఎలా దూరం అయ్యాడు, అస్సలు ఈ పాలస్, ఈ మనుషులు ఎవ్వరు వీళ్లంతా, ఇక మానస తన గురించి నాకేం అర్ధం కావట్లేదు అస్సలు ఇక్కడ ఎం జరుగుతుంది…..
సంధ్యా : ఇదంతా పెద్ద కద తీరికగా చెప్పుకుందాం ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు చాలా అలిసిపోయావ్ మనకి ఇక్కడ మాట్లాడుకోడం తప్ప వేరే పని ఉండదు, ముందు ఫ్రెష్ అవ్వు పో……
అను ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళింది….. మానస లోపలికి వచ్చింది.
సంధ్య : మానస ఎందుకోచ్చావ్…
మానస : అను ఎలా ఉందొ చూద్దామని….
సంధ్య : మీరు వదిలేస్తే బతుకుద్ది అయినా నీకు అను ఎలా తెలుసు ఎం చెప్పి మోసం చేసావు… మీకు అలవాటే కదా నమ్మించి మోసం చెయ్యడం..
నా కొడుకు వచ్చేంత వరకే మీ ఆటలు.
నా కొడుకు నన్ను చూసిన రోజే ఈ సామ్రాజ్యం, మీరు, మీ దురాశలు అన్ని అంతం అవుతాయి…
మానస అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
కొంచెం సేపటికి అను బైటికి వచ్చింది.
సంధ్య : అను మానస నీకెలా పరిచయం…
అను : మానస నాకు కాదు విక్రమ్ కి పరిచయం తనలో నిన్ను చూసుకునే వాడు, మానసకి కూడా విక్రమ్ అంతే వాళ్ళిద్దరినీ చూస్తే అమ్మ కొడుకులేమో అనుకుంటారు ఎవరైనా….
సంధ్య : ఇలా కాదు మొత్తం మొదటి నుంచి నాకు అంతా తెలియాలి…
అను : అమ్మా ముందు మీరు చెప్పండి అస్సలు మీరు బతికుండడం ఎలా??? ఏంటి ఇదంతా..?
సంధ్య : సరే చెపుతాను విను….
సంధ్య : మేము మండీలం…. మిగతా ప్రపంచంతో సంబంధాలు ఉన్నా బయటి ప్రపంచాన్ని ఎప్పుడు మా దెగ్గరికి రానివ్వలేదు….మేము మాములు మనుషుల కంటే కొంచెం బలంగా, మాకు బుద్ధి బలం బాహుబలం మిగతా వాళ్ళ కంటే రెండు రెట్లు ఎక్కువ….మా వంశం లో పుట్టిన వారందరు అంతే…
మా తాత గారు రుద్ర తేజ ఆయనకి ఇద్దరు కొడుకులు…
మా నాన్న గారు రాజా రవీంద్ర ఆయనే మా రాజ్యానికి రాజు, వారికి మేము ముగ్గురము… నేను, మా అన్న, నా చిన్ని చెల్లెలు …
మా పెద్ద నాన్న గారు తేజా రవీంద్ర ఆయనకి ఒక కొడుకు, కూతురు…..
పెద్దవారు అయన ఉండగా మా నాన్నకి రాజ్యం ఎందుకు అప్పచెప్పారో మాకు తెలియదు కానీ ఆ విషయంలో మా పెద్దనాన్న కి మాకు అప్పుడప్పుడు గొడవలు జరుగుతు ఉండేవి…
మా వంశనికి మేము ఐదుగురమె వారసులం మిగతా వారంతా ఒక్కక్కారుగా చనిపోసాగారు… మిగిలినది మేమే….
ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు కానీ మొదటి సారి నేను పుట్టడంతో అందరికి భయం పట్టుకుంది…. ఎందుకంటే నేను వీళ్ళలా బలంగా లేను నాకు వీళ్ళలా యుద్ధ విద్యలు అబ్బలేదు అందుకే నన్ను దూరంగా పెట్టేవారు, ఇంట్లో అందరు భోజనం చేసేటప్పుడు కూడా నన్ను పిలిచే వారు కాదు అలా చిన్నప్పటి నుంచి నా రూమ్ కే పరిమితమాయ్యను….. అప్పుడే మా తాత గారు పోతు పోతు నన్ను చూసి భయపడి… అందరిని పిలిచి తనకీ తెలిసిన పరిష్కారం చెప్పారు….
“ఇలాంటి ఒక కష్ట కాలం వస్తుందని మా గురువుగారు మాకు ముందే సెలవిచ్చారు…. ” అని మా ఐదు గురికి ఐదు రంగుల రత్నాలు గల ఉంగరాలు ఇచ్చాడు….. ఈ పాలస్ వెనుక ఒక ఇరవై కిలోమీటర్ల దూరం లో ఒక పెద్ద కొండ దాని లోనికి వెళ్తే ఒక పెద్ద దీపం మధ్యలో చిన్న రంద్రం…. అందులో ఈ ఐదు ఉంగరాలు వేస్తే పక్కనే ఉన్న చిన్న లాకర్ లాంటిది తెరుచుకుంటుంది… అందులో ఉందట ఈ అమృతం దానిని మా ఐదుగురిని సమానం గా పంచుకోమని అదీ మా అందరికి 21 ఏళ్ళు నిందాకే ఆ అమృతం తాగాలని మా దెగ్గర మాట తీసుకుని అయన కాలం చేసారు.
అను : అమ్మా ఐదు రాళ్లు ఎందుకు వెయ్యాలి ఒక ఉంగరం వేస్తే ఎవ్వరి అమృతం వాళ్ళకి వస్తుంది కదా…
సంధ్య : అత్యాశ కొద్దీ మా పెద్ద నాన్న గారు అలానే చేసారు, దాని వల్ల అయన ప్రాణం పోయింది….
ఐదు ఉంగరాలు విభిన్నమైనవి ఒకొక్క ఉంగరపు రత్నం ఒక్కో వెయిట్ లో ఉంటుంది అన్ని కలిసి వేస్తేనే ఆ వెయిట్స్ అన్ని కాల్క్యూలేట్ అయ్యి అప్పుడే ఆ లాకర్ తెరుచుకుంటుంది కాదని ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయి అని మాత్రమే తెలుసు ఎలా పోతాయో ఎవ్వరికి తెలియదు…
మాకు ఉంగరాలు ఇచ్చేటప్పటికే మా పెద్ద నాన్న కొడుకు, మా పెద్దన్నయ్య కి పెళ్లి అయిపోయింది తన భార్య పేరే దేవి… మానస, రవి వాళ్ళ అమ్మ….
అను : అశ్చర్యంతో “అమ్మా అదేంటి మానసకి రవికి పెళ్లి కూడా అనుకున్నారు వాళ్లిద్దరూ ఒక తల్లీ బిడ్డలా???”
సంధ్య : అవును మిమ్మల్ని మోసం చెయ్యటానికి ఆ వేషాలు వేసి ఉంటారు…. ముందు నన్ను చెప్పని ఆ తరువాత నీకు తెలిసినది చెప్పు…
ఇదంతా తెలిసిన మా వదినకి దురాశ పుట్టింది మా అన్నకి లేని పోనివి చెప్తూ సంవత్సరాలుగా మా మధ్య దూరం పెంచింది…. ఇదంతా మా తల్లీ తండ్రులు గమనిస్తూనే ఉన్నారు కానీ అందరికంటే వీళ్ళు పెద్దవాళ్ళు అవటంతో ఏమి చెయ్యలేక పోయారు…..
అలానే మా పెద్దన్నయ్య చెల్లెలు (వయసు వ్యత్యాసం ఎక్కువ) అమూల్య ని తనతో కలిపేసుకుంది తన దెగ్గర ఉన్నది పింక్ రంగు ఉంగరం……
మా అమ్మ నాన్నకి విషం పెట్టారు అదీ మా అమ్మ వాళ్ళు తెలుసుకునే సరికి చాలా ఆలస్యం అయిపోయింది, నా పచ్చ రంగు ఉంగరం నా మెడలో వేసి నన్ను ఈ దీవి నుంచి దూరంగా పంపించేశారు…. మా అమ్మ వాళ్ళ మనుషులు నన్ను రోడ్ మీదగా వెళ్తున్న ఒక లారీ ఎక్కించి వాళ్ళు తప్పించుకున్నారు…. అలానే ఏడ్చుకుంటూ లారీ ఎక్కిన నేను ఒక ఐదు గంటల తరువాత పెద్ద శబ్దనికి ఉలిక్కి పడి లేచాను, టైర్ పంక్చర్ అయింది, వాళ్ళని చూడగానే భయం వేసింది లారీ దిగి ఎవ్వరికి కనిపించకుండా రోడ్ ఎమ్మట పరిగెత్తాను.
చుట్టూ అడవి ప్రాంతం…అలా పరిగెత్తికుంటూ వెళ్తున్న నాకు వెనుక ఏదో తరుమూతుంది అనిపించి అడివి లోకి వెళ్లాను ఎంత దూరం పరిగెత్తానో తెలీదు కానీ దూరం గా ఒక మంట కనిపించింది అక్కడికి వెళ్తుండగా ఒక రాయిని తట్టుకుని కింద పడి దొర్లుకుంటూ కింద పడి స్పృహ కోల్పోయాను….
లేచే సరికి నేను తెగ ప్రజల మధ్యలో ఉన్నాను ముందు భయపడ్డా వాళ్ళని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను…. వాళ్ళు ముద్రగడ తెగ ప్రజలు ఒక వారం అక్కడే ఉన్నాను కోలుకున్నాక నాకు అక్కడ ఉండాలనిపించలేదు, అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకున్నాను అలాగే ఆ ఉంగరాన్ని కూడా వదిలించుకోవాలని దాన్ని అక్కడే వదిలేసి అక్కడనుంచి తప్పించుకుని రోడ్ మీద ఒక లారీ కనపడితే అదీ ఎక్కేసాను….
రెండు రోజులు తిండి లేదు వాళ్ళకి కనపడకుండా అలానే లారీ లో నక్కి కూర్చున్నాను, లారీ నేరుగా వైజాగ్ వెళ్లి ఆగింది, నీరసం గానే లారీ దిగి చూసాను ఎదురుగా ఒక అనాధ ఆశ్రమం, అది అనాధ ఆశ్రమం అని కూడా నాకు తెలియదు ఎవరో ఒక అమ్మాయి లోపల ఆడుకుంటూ ఉంది లోపలికి వెళ్లి తన ముందు స్పృహ కోల్పోయి పడి పోయాను, తానే స్వాతి నా ప్రాణ స్నేహితురాలు….
అక్కడే అనాధ లాగే బతికాను, నాకు స్వాతికి స్నేహం బాగా కుదిరింది ఎన్నో సార్లు నా గతం గురించి అడిగేది కానీ నేనేం చెప్పలేదు, నా గతాన్ని ఇంకొకరితో పంచుకుని దాన్ని పెద్దది చేయదల్చుకోలేదు, స్వాతికి అడిగి అడిగి ఇక అడగడం మానేసి ఆ విషయం గురించి మర్చిపోయింది….
నాకున్న తెలివితేటలతో బానే స్థిరపడ్డాను, నా తో పాటే స్వాతి కూడా….. అప్పుడే శ్రీకాంత్ పరిచయం అయ్యాడు డబ్బు లేకపోయినా పరవాలేదు ప్రేమగా చూసుకుంటే చాలు అనుకుని తనని పెళ్లి చేసుకున్నాను, ఆ తరువాతే తెలిసింది తను నన్ను చేసుకుంది డబ్బు కోసం అని అది కాక ఇంకొకరితో అక్రమ సంబంధం ఉంది అని….కుంగిపోయాను, మోసాన్ని తట్టుకోలేకపోయాను….విక్రమ్ ని చూసుకుంటూ బతికేద్దామని అనుకున్నాను కానీ నా కష్టాన్ని ఎగరేసుకుపోతుంటే చూస్తూ ఊరుకోలేక పోయాను ఎదురు తిరిగాను, ఒక రోజు స్వాతితో ఫోన్ లో మాట్లాడుతుంటే వెనక నుంచి ఎవరో కొట్టినట్టు అనిపించింది తిరిగి లేచి చూస్తే ఇక్కడ ఉన్నాను…..
నా ఉంగరం వీళ్ళకి దొరకదు, అది దొరికేదాకా వీళ్ళు నన్ను ఏమి చెయ్యలేరు, ఆ ధైర్యంతోనే నా కొడుకు కోసం ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను…..
ఇది నాకు తెలిసినది నాకు జరిగినది ఇక నువ్వు చెప్పు…….
అను : నాది మీ లాంటి కథే, పెద్ద ఫ్యామిలీ కానీ మా నాన్న ఎందుకు పనికి రాకుండా పొయ్యాడని మేమంటే చులకన…. అప్పుడే మా కంపెనీ అప్పుల పాలయింది, మా ఇంటికి విక్రమ్ వచ్చాడు డబ్బులు వచ్చాయి….వాటితో పాటు విక్రమ్ నాన్న మా అత్తని పెళ్లి చేసుకున్నాడు….. విక్రమ్ ని నాకు ఇచ్చి పెళ్లి చేసారు…
విక్రమ్ వచ్చిన కొత్తల్లో ముభవంగా ఉండేవాడు తనని ఒక పనివాణ్ణి చేసేసారు… పని వాళ్ళైనా ఒక టైం వరకే కానీ విక్రమ్ అలా కాదు కాళ్ళు కూడా పట్టించుకునేవారు తన మొహం ఎప్పుడు చూసినా కళ్ళ కింద ఏడుపు చారలు కనిపించేవి…. ఆ తరువాత ఒకరిని ఒకరం అర్ధం చేసుకున్నాం…. మొదట్లో ముభవంగా ఉండే విక్రమ్ సడన్ గా ధైర్యంగా ఎలా మారిపోయాడో అర్ధం అయ్యేది కాదు, కానీ తరువాత తెలిసింది మీరు ఒకరికి చేసిన హెల్ప్ విక్రమ్ కి కలిసి వచ్చింది అని, కానీ మానస విక్రమ్ చదివే స్కూల్ లో పరిచయం అయ్యింది నాకు మొన్నటిదాకా మానస గురించి ఏమి తెలియదు, కానీ విక్రమ్ ముందు మానస ని ఏమైనా అంటే చంపేస్తాడు…..అలానే రవి మానస కాబోయే వాడని అలానే తన చెల్లెలు రజినీ….
మానస లో మిమ్మల్ని చూసుకునే వాడు, మానస కూడా విక్రమ్ ని కొడుకు లానే చూసుకునేది, నేను ఎన్నో సార్లు మానస ని చూసాను వాళ్ళది, స్నేహమా కమామ అని కానీ నాకు అది ఎప్పుడు కనిపించలేదు… ఒక్కటి మాత్రం తెలుసు మానస మాత్రం విక్రమ్ విషయం లో నటించలేదు… మీకు నాకు ఇంకా ఎం అవ్వలేదంటే కత్చితంగా దాని వెనక మానస హస్తం ఉండే ఉంటుంది…..
మీరు చనిపోడానికి కారణం మా అత్తయ్య అని, విక్రమ్ కి ఆ గతి పట్టడానికి మా వాళ్లే కారణం అని మానస నాకు చెప్పింది, నాకు తెలిసినవి ఇంతే…. విక్రమ్ ఇండియా లోనే అతి పెద్ద కంపెనీ ఓనర్ అని కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది, ఎందుకు దాచిపెట్టాడో తెలియదు ఏది నిజామో ఏది అబద్ధమో అర్ధం కావట్లేదు అంతా అయోమయంగా ఉంది…
సంధ్యా మానస గురించి ఆలోచించడం మొదలు పెట్టింది…. ఈలోగా గొలుసుల తో ఒకరిని లోపలికి తీసుకొచ్చారు….. ఆ వెనుకే దేవి తన వెనుకే అమూల్య కూడా వచ్చింది….
అను భయపడుతు చూస్తుండగా సంధ్య ఏడుస్తూ గట్టిగా ఆ సంకెళ్ళ లో ఉన్న ఆమెని కౌగిలించుకుంది…. శశి అని ఏడుస్తూ…..
శశి : అక్కా ఏడవకు నా కళ్ళలోకి చూడు…
82c