ప్రెగ్నెన్సీతో యాంకర్ లాస్య ఇబ్బందులు! ఎమోషనల్ వీడియో వైరల్!
ప్రెగ్నెన్సీతో యాంకర్ లాస్య ఇబ్బందులు! ఎమోషనల్ వీడియో వైరల్!
ప్రెగ్నెన్సీతో యాంకర్ లాస్య ఇబ్బందులు! ఎమోషనల్ వీడియో వైరల్!
ప్రెగ్నెన్సీ సమయంలో సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. నార్మల్ టైంలో సెలబ్రిటీలకు, కామన్ పీపుల్ కి తేడాలు కనిపిస్తాయేమో.. కానీ, గర్భం దాల్చాక ఆడవాళ్లు పడే కష్టాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. తాజాగా యాంకర్ లాస్య భర్తతో కలిసి ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.
సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. నార్మల్ టైంలో సెలబ్రిటీలకు, కామన్ పీపుల్ కి తేడాలు కనిపిస్తాయేమో.. కానీ, గర్భం దాల్చాక ఆడవాళ్లు పడే కష్టాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. మేడలు మిద్దెల్లో ఉండేవారు కూడా ప్రెగ్నెన్సీ సమయంలో మరో జన్మ ఎత్తినంతగా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత కష్టం వచ్చినా.. కడుపున పెరుగుతున్న బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడమే వారికి ముఖ్యం. తాజాగా ప్రముఖ టీవీ యాంకర్ లాస్య.. తాను ప్రెగ్నన్సీలో పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తూ.. భర్తతో కలిసి ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసింది.
లాస్యకి ఇది రెండో ప్రెగ్నెన్సీ. ఆమెకు ఆల్రెడీ జున్ను అని ఓ బాబు ఉన్నాడు. అయితే.. ఇటీవలే గ్రాండ్ గా సీమంతం జరుపుకున్న లాస్య.. త్వరలోనే రెండో బిడ్డకి జన్మనివ్వనుంది. కాగా.. ప్రెగ్నెన్సీ పీరియడ్ లో సహజంగా ఆడవాళ్లు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. ఎటు కదలాలన్నా.. లేచి నడవాలన్నా.. పడుకుని లేవాలన్నా.. కూర్చోవాలన్నా.. ప్రతి విషయంలో పెరిగిన పొట్ట కారణంగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో తాను ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉంది. కాబట్టి.. తన విషయంలో భర్త మంజునాథ్ కేరింగ్ ఎలా ఉందో వీడియోలో చూపిస్తూ.. సమయానికి చేయి అందించే తోడు ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా భరించవచ్చని చెప్పింది లాస్య.
ప్రస్తుతం లాస్య షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. ఆ వీడియోపై నెటిజెన్స్, లాస్య అభిమానులు కామెంట్స్ లో రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్ గా లాస్య సీమంతం జరుపుకోగా.. ఆ వేడుకలో చాలామంది బుల్లితెర సెలబ్రిటీలు, సీరియల్ ఆర్టిస్ట్ లు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకలో యాంకర్ లాస్య.. పట్టువస్త్రాలు ధరించి.. కుందనపు బొమ్మలా మెరిసింది. ఇక త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనున్న లాస్యకి.. నెటిజన్స్ విషెష్ తెలియజేస్తున్నారు. మరి బుల్లితెరపై యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న లాస్య.. ఆ తర్వాత సినిమాలలో కూడా ప్రయత్నాలు చేసింది. సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో మంజునాథ్ ని ప్రేమ పెళ్లి చేసుకుంది. ప్రెజెంట్ లాస్య వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి లాస్య గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.