సాయంగా ఉంటాడని పనిలో పెట్టుకుంటే.. భార్యపై కన్నేశాడు
సాయంగా ఉంటాడని పనిలో పెట్టుకుంటే.. భార్యపై కన్నేశాడు

సాయంగా ఉంటాడని పనిలో పెట్టుకుంటే.. భార్యపై కన్నేశాడు
అక్రమ సంబంధాలు నేటి వివాహ జీవితానికి తూట్లు పొడుస్తున్నాయి. భార్యా, భర్తల మధ్య గొడవలకు, కుటుంబ కలహాలకు, సంసారం విచ్ఛిన్నమవ్వడానికి కారణాలవుతున్నాయి. ఇవే అనేక దారుణాలకు ఒడిగట్టేలా చేస్తున్నాయి. క్షణిక శారీరక సుఖం కోసం కట్టుకున్న వారిని కడతేరుస్తున్నారు. భాగస్వామి వద్ద లభించని పడక సుఖం.. తప్పు దారిలో నడుస్తూ, కుటుంబాన్ని కోసం ఇటీవల జరుగుతున్న అఘాయిత్యాల్లో చాలా వరకు అక్రమ సంబంధాల చుట్టూ తిరుగుతున్నవే. ముఖ్యంగా స్నేహితుల భార్యపై కన్నేసి, వారితో రిలేషన్ పెట్టుకుని నమ్మక ద్రోహనికి ఒడిగడుతున్నారు. తాజాగా ఏపీలో ఓ వ్యక్తి హత్యకు కారణమైంది అక్రమ సంబంధమే అని తెలుస్తోంది. ఈ హత్య రెండు జిల్లాలను వణికించింది.
ఈ క్రమంలో వారిద్దరికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈలోగా గౌరీసాయి జైలు నుంచి వచ్చాడు. అదే సమయంలో శివకు తనకన్నా మంచి పేరు రావడంతో పాటు అతడు కదలికలపై అనుమానం రావడం మొదలైంది. అయితే భార్యతో సన్నిహితంగా మెలుగుతున్న విషయాన్ని తెలుసుకున్న గౌరీ.. శివను చంపేయాలనుకున్నాడు. గౌరీసాయి, అతని స్నేహితులు కలిసి శివను మాట్లాడేందుకు పిలిచారు. అతడిని విశాఖ నుండి శ్రీకాకుళం జిల్లాకు తీసుకెళ్లారు. చినకొవ్వాడ సమీపంలోని రొయ్యల చెరువుల వద్దకు మద్యం, గంజాయి తీసుకున్న తర్వాత అంతా కలిసి బీచ్ ఒడ్డు ఉన్న సరుగుడు తోటలోకి వెళ్లారు.అక్కడ ముందుగా సిద్ధం చేసుకున్న గోతిలో శివను పడేసి, రాయితో తలపై కొట్టి హత్య చేశారు. అనంతర పూడ్చి పెట్టారు.
మార్చి 4న ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే తన కుమారుడు నెలరోజులుగా కనిపించడం లేదని శివ తల్లి లక్ష్మి పోలీసులను ఫిర్యాదు చేసింది. గౌరీ సాయిని విచారించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. నిందితుడిని వెంటబెట్టుకుని ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్ సీఐ హెచ్. మల్లేశ్వరరావు, క్లూస్ టీం సహా పోలీసులు శనివారం చినకొవ్వాడ తీరానికి వచ్చి.. మృత దేహాన్ని వెలికి తీశారు. అప్పటికే శివ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. పంచనామా అనంతరం వైద్యులను పిలిపించి అక్కడే పోస్టుమార్టం చేయించారు. హత్య కేసులో నిందితుడితో పాటు పది మంది పాత్ర ఉందని, వారిలో కొందరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సీఐ చెప్పారు. అయితే ఇది ఆధిపత్య పోరు మధ్య జరిగిన హత్యగా పోలీసులు చెబుతున్నారు. వీరిద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేసి ఉందని తెలిపారు.