Trending News

సెట్స్‌పై ఏడు సినిమాలు.. శ్రీలీల ప్లానింగ్ ఎలా? ఏం చేస్తోంది?

సెట్స్‌పై ఏడు సినిమాలు.. శ్రీలీల ప్లానింగ్ ఎలా? ఏం చేస్తోంది?

సెట్స్‌పై ఏడు సినిమాలు.. శ్రీలీల ప్లానింగ్ ఎలా? ఏం చేస్తోంది?

 సెట్స్‌పై ఏడు సినిమాలు.. శ్రీలీల ప్లానింగ్ ఎలా? ఏం చేస్తోంది?
సెట్స్‌పై ఏడు సినిమాలు.. శ్రీలీల ప్లానింగ్ ఎలా? ఏం చేస్తోంది.

టాలీవుడ్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ హీరోయిన్‌ అనగానే ఠక్కున గుర్తొచ్చే భామ.. శ్రీలీల. శాండిల్‌ వుడ్‌లో సాధారణ యువ కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌. ఇదేంటి మొన్నే వచ్చింది కదా.. అప్పుడే స్టార్‌ హీరోయిన్‌ అంటున్నారేంటి అనుకుంటున్నారా? అలా అనాల్సి వస్తోంది.. కారణం ఈ అమ్మడి లైనప్‌. శ్రీలీల పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్‌ లుక్‌లు చూస్తే ఈ విషయం మీకూ అర్థమైపోతుంది.

యువ హీరోలు, స్టార్‌ హీరోలు అనే తేడా లేకుండా వరుసగా పెద్ద హీరోలతో సినిమా చేసేస్తోంది. దీంతో ‘స్టార్‌ హీరోయిన్‌ అయ్యారు కదా.. మీ ఫీలింగేంటి?’ అని అడిగితే.. ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు. అయితే స్టార్‌ అని పిలిపించుకోవడానికి నేను ఇంకా చిన్నదాన్నే. ఇలాంటి ట్యాగ్‌లు గురించి కాకుండా నాపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా చూసుకోవాలి. ప్రస్తుతం అదే ఆలోచనతో సినిమాలు చేస్తున్నాను అని చెప్పింది.

స్టార్‌ హీరోలు, పెద్ద నిర్మాణ సంస్థలతో వరుసగా ఛాన్స్‌లు ఎలా? అని అడిగితే.. వెరైటీ పాత్రలతో దర్శకరచయితలు నా దగ్గరకు వస్తున్నారు. అవి నచ్చి నేను కథలు ఓకే చేస్తున్నాను. అలా ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తున్నాను. ప్రతి సినిమాలో నా నటనతో ఆకట్టుకుంటే చాలు అనేది నా ఆలోచన అని శ్రీలీల చెప్పింది. పనిలో పనిగా నటిగా కొనసాగుతారా లేక డైరెక్షన్‌, ప్రొడక్షన్‌ వైపు కూడా వెళ్తారా అంటే.. అలాంటి ఆలోచనలు ఏమీ లేవు అని క్లారిటీ ఇచ్చేసింది.

ప్రస్తుతం శ్రీలీల నటిగా కొనసాగుతూనే ఎంబీబీఎస్‌ చేస్తోంది. షాట్‌ గ్యాప్‌లో సెట్స్‌లో చదువుకుంటుందట. అలా ఇటు నటిగా, ఆటు చదువు పరంగా దూసుకుపోతోంది శ్రీలీల. అందుకే ఒకేసారి అన్నేసి సినిమాలు చేస్తోంది. మరి ఈ ప్లానింగ్‌ ఏంటి అని అడిగితే.. ఆ పనులన్నీ అమ్మ చూసుకుంటుంది అని చెప్పింది. షెడ్యూల్‌ ప్లాన్‌ చేయడం అమ్మ పని, నటించి మెప్పించడం నా పని అని నవ్వేసింది శ్రీలీల.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button