Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 49 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 49 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories – 49 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

రెండు నిముషాల తరువాత రేణుక తన పెదవులను విడిపించుకుని తుడుచుకుంటూ రాము వైపు చూసి చిలిపిగా నవ్వుతూ, “ఇక పదా….ఇంకా ఇక్కడే ఉంటే ఏం చేస్తావో అర్ధం కావడం లేదు….టిఫిన్ చేసిన తరువాత కావాలంటే ఇక్కడకు వద్దాం,” అంటూ డోర్ తీసుకుని బయటకు వచ్చింది.

రేణుక వెనకాలే రాము కూడా బయటకు వచ్చాడు.
రేణుక బయటకు రాగానే ఆమె మేనత్త మళ్ళీ, “ఏంటే…..వెంటనే వచ్చేసావు….నువ్వు ఇందాక పెట్టిన కేకకి మీరిద్దరూ బయటకు రావడం లేటవుతుందేమో అనుకున్నాను….” అన్నది.

ఆమె అలా అనగానే రేణుక ఆమె వైపు కొంచెం కోపంగా చూసింది….కాని ఆ చూపులో కోపం కంటే సిగ్గు ఎక్కువగా కనిపిస్తున్నది.
మేనత్త వెంటనే రాము వైపు చూసి, “ఏంటి బాబు….కళ్ళు ఎర్రగా ఉన్నాయి…..సరిగ్గా నిద్ర పోలేదా….” అనడిగింది.
దానికి రాము ఆమె వైపు చూసి నవ్వుతూ దగ్గరకు వచ్చి ఆమె పక్కనే కూర్చుని, “మీరు నాకు వరసకి ఏమవుతారు,” అని అడిగాడు.
“నేను రేణుక మేనత్తని బాబూ….అంటే నీకు పిన్నిని అవుతాను…అవును బాబూ…ఇందాక తలుపు దాకా వచ్చి తలుపు తీయకుండా చిన్నగా కొడుతున్నారేంటి,” అనడిగింది.
ఆమె అలా అనగానే రేణుక గుండె ఒక్కసారి ఝల్లుమన్నది.
వెంటనే రేణుక తన మనసులో, “ఓసినీ…ఇదేంటి….లోపల అంతా చూసినట్టు చెబుతున్నది….” అని అనుకుంటూ, “ఏంలేదు అత్తా….తలుపు దగ్గర పౌడర్ డబ్బా కింద పడింది….ఆ శబ్దం వచ్చి ఉంటుంది,” అన్నది.
రేణుక అలా చెప్పగానే రాము చిన్నగా నవ్వాడు.
రాము నవ్వడం చూసి….రేణుక మేనత్తకు తలుపు వెనకాల ఏం జరిగిందో అర్ధంమయింది.
“బాబూ….నీ బుగ్గన ఎర్రగా ఏంటి….” అంటూ రాము బుగ్గ మీద రేణుక నుదుట పెట్టుకున్న కుంకుమ అంటుకోవడం చూసి ఏమీ తెలియనట్టు అడిగింది ఆమె.
రాము బుగ్గ మీద తన కుంకుమ అంటుకున్న సంగతి వాళ్ళిద్దరు గమనించలేదు.
దాంతో రేణుక గబగబా దాదాపుగా పరిగెత్తుకుంటున్నట్టు రాము దగ్గరకు వచ్చి తన పైట కొంగుతో రాము బుగ్గని శుభ్రంగా తుడిచింది.
అలా తుడుస్తున్నంత సేపు రేణుక రాము కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయి….కుంకుమ మరక పోయిన సంగతి కూడా పట్టించుకోలేదు.
దాంతో మేనత్త రేణుక భుజం మీద తడుతూ, “ఇక చాల్లేవే…..మరీ అంతలా తుడవక్కర్లేదు….అబ్బాయి బుగ్గ అరిగిపోయిద్ది….” అంటూ గట్టిగా నవ్వింది.
ఆమె మాటలు వినగానే రేణుక ఒక్కసారిగా ఉలిక్కిపడి, “రాము నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు….టిఫిన్ చేద్దాం రా,” అన్నది.
కాని రాము మాత్రం రేణుక మాటలు పట్టించుకోకుండా ఆమె మేనత్త వైపు చూసి, “ఏం చేస్తాం పిన్నీ…రాత్రంతా అసలు నిద్ర పోనివ్వలేదు….నీ మేనకోడలు….” అని చిన్నగా గుసగుసలాడినట్టు చెప్పాడు.
దాంతో ఆమె కూడా చిన్నగా నవ్వింది.
రాము అలా అనడంతో రేణుక ఇంకా సిగ్గు పడుతూ, “ఏంటి రాము….నువ్వు కూడా ఈమెతో కలిసి అల్లరి చేస్తున్నావు,” అంటూ కొట్టడానికి అన్నట్టు మీదకు వచ్చింది.
రాము కూడా రేణుక వైపు చూసి నవ్వుతూ, “నువ్వు సిగ్గు పడితే చాలా అందంగా ఉంటావు రేణూ….” అంటూ ఆమెను దగ్గరకు లాక్కుని పెదవుల మీద ముద్దుపెట్టుకున్నాడు.
రాము అలా ముద్దు పెట్టుకుంటాడని ఊహించని రేణుక ఒక్కసారిగా బిత్తరపోయి, “ఏంటి రాము….అందరు ఉన్నారు….” అన్నది.
అంతలో మేనత్త చైర్ లోనుండి పైకి లేచి రేణుక భుజం మీద చెయ్యి వేసి, “పర్లేదులే రేణుక…..అబ్బాయికి నువ్వంటే ఎంత ఇష్టమో చెప్పాడు….నువ్వు కూడా అబ్బాయి అంటే ఎంత ఇష్టమో నీ పద్దతిలో చెప్పు,” అన్నది.
దాంతో రేణుక ఆమె వైపు చూసి, “అక్కర్లేదు…..నాకు రాము అంటే ఎంత ఇష్టమో ఎప్పుడో చెప్పాను….” అంటూ రాము చెయ్యి పట్టుకుని డైనింగ్ హాల్లోకి లాక్కెళ్ళింది.
తరువాత రేణుక వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టింది.
అలా పెళ్ళి అయిన తరువాత వారం రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి….రాము కూడా రాత్రి అనే కాకుండా పగలు కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు రేణుకని బెడ్ మీదకు లాక్కుని అనుభవిస్తున్నాడు.
ఒకరోజు ఇద్దరూ బెడ్ మీద చేసిన యుధ్ధంలో అలసిపోయి పడుకుని ఉండగా రాము ఆలోచనల్లో పడ్డాడు.
అది చూసి రేణుక రాము దగ్గరకు వచ్చి అతని ఛాతీ మీద చేత్తో నిమురుతూ, “ఏంటి రాము ఆలోచిస్తున్నావు,” అనడిగింది.
రాము తన భార్య రేణుకని దగ్గరకు లాక్కుని ఆమె నుదురు మీద ముద్దుపెట్టుకుని, “అదేం లేదు రేణూ….నా గురించి తెలిసి కూడా పెళ్ళి చేసుకున్నావు…..పిచ్చి పని చేసావేమో అని అనిపిస్తున్నది,” అన్నాడు.
రేణుక తల ఎత్తి రాము కళ్ళల్లోకి చూస్తూ, “నీకెందుకలా అనిపించింది….” అనడిగింది.
“ఏం లేదు…నేను నువ్వున్న కాలంలోకి ఎలా వచ్చానో తెలియదు…మళ్ళీ నా కాలంలోకి ఎలా వెళ్తానో…ఎప్పుడు వెళ్తానో తెలియదు….ఎవరైనా అమ్మాయి జీవితాంతం తనకు తోడుగా ఉండే అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది….కాని నువ్వు మాత్రం ఎన్ని రోజులు నీతో ఉంటానో తెలియని నన్ను పెళ్ళి చేసుకున్నావు….నీకు చాలా ధైర్యం ఎక్కువ,” అన్నాడు రాము.
“నాకు నువ్వంటే చాలా ఇష్టం రాము….” అన్నది రేణుక.
“ఎందుకు….నిన్ను ఆ ప్రొఫెసర్ బారి నుండి రక్షించాననా….” అనడిగాడు రాము.
ఆ మాట వినగానే రేణుక రాము చెంప మీద కొంచెం గట్టిగానే కొట్టింది.
రేణుక ఎందుకలా కొట్టిందో అర్ధంకాక రాము అయోమయంగా ఆమె వైపు చూస్తూ, “ఏంటే….అలా కొట్టావు….” అనడిగాడు.
“మరి పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేస్తే కొట్టక ముద్దెట్టుకుంటారా….ప్రొఫెసర్ సుందర్ చనిపోక ముందే నీకు నా లవ్ గురించి చెప్పాను నీకు గుర్తు లేదా,” అనడిగింది రేణుక.
“అది కాదు రేణూ….నాకు గుర్తు ఉన్నది….నేను నా గురించి ఎన్ని సార్లు నీకు చెప్పినా నమ్మలేదు….కాని సూఫీ బాబా నా గురించి చెప్పిన తరువాత కూడా నా గురించి ఆలోచించి డ్రాప్ అవుతావనుకున్నాను….కాని నేను ఊహించినట్టు జరగకపోగా నా మీద ఇంకా ప్రేమను పెంచుకున్నావు….ఒక వేళ నేను అనుకోని పరిస్థితుల్లో వెళ్ళిపోతే ఏం చేస్తావు,” అన్నాడు రాము. 

“నీకు ఒక విషయం అర్ధం కాలేదా రాము…..” అనడిగింది రేణుక.“ఏ విశయం….” అనడిగాడు రాము.
“జరిగినదంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకో….సూఫీ బాబా ఏం చెప్పాడు షాపూర్ గుడిలో ఉన్న బావిలో ఏది వేసినా అది చేరాల్సిన చోటకు వెళ్తుందని చెప్పాడు కదా…..” అన్నది రేణుక.
“అవును….నేను కూడా ఆ విషయం చెప్పేటప్పుడు విన్నా కదా….అందులో కొత్తగా ఆలోచించే విషయం ఏమున్నది,” అనడిగాడు రాము.
రాము తన మనసులో రేణుక ఏం చెప్పదలుచుకున్నదో అర్ధం కావడం లేదు.
“అదే రాము…..నువ్వు తాడు అక్కడున్న గుమ్మానికి కట్టేసి బావిలోకి దిగి లాకెట్ ని నీళ్ళల్లోకి వేయగానే ప్రొఫెసర్ సుందర్ ప్రేతాత్మ బావిలో పడిపోయింది…లాజిక్ ప్రకారం అయితే ఆ పని అయిపోగానే నువ్వు కూడా ఆ బావిలో పడి నీ కాలానికి వెళ్ళిపోవాలి….దానికి తగ్గట్టే ఆ రోజు నువ్వు గుమ్మానికి కట్టిన తాడు నీ బరువుకి ఆ పాడుబడిన గుమ్మం జరిగి తాడు లూజయి పోయి అప్పుడే బావిలో పడబోయావు….గుర్తుందా….” అనడిగింది రేణుక.
“అవును….అప్పుడే నువ్వు తాడు పట్టుకుని నేను బావిలో పడకుండా పైకి లాగావు….” అన్నాడు రాము.
“అదే…..నా లెక్క ప్రకారం నువ్వు ఆరోజే నువ్వు నీ కాలానికి వెళ్ళిపోవాల్సిన వాడివి….కాని నేను తాడు పట్టుకుని పైకి లాగడం వలన నేనున్న కాలంలోనే ఆగిపోయావు….దీన్ని బట్టి నాకు అర్ధమయిందేందంటే నువ్వు నీ కాలానికి వెళ్ళడానికి ఇంకా టైం ఉన్నది….తరువాత ఇదే మాట నువ్వు గుడి పనుల మీద బిజీగా ఉన్నప్పుడు నేను వెళ్ళి సూఫీ బాబాను కలిసాను….ఆయన కూడా ఇదే మాట చెప్పాడు….కాని ఏదో ఒక రోజు నువ్వు నన్ను వదిలివెళ్ళిపోతావని…. నువ్వు ఇంకా నేనున్న కాలంలో ఉన్నావంటే ఏదో కారణం ఉండి ఉంటుందని అన్నాడు,” అన్నది రేణుక.
“చాలా బాగా ఆలోచించావు రేణూ….అయినా ఎంత కాలం ఉంటానో తెలయని వ్యక్తితో జీవనం అంటే….” అన్నాడు రాము.
“నేను ఇంతకు ముందే చెప్పా కదా రాము….నీతో ఒక్కరోజు భార్యగా ఉన్నా నాకు సంతోషమే,” అన్నది రేణుక.
ఆమె అలా అనగానే రాము తన భార్యని దగ్గరకు లాక్కుని ఇంకా గట్టిగా వాటేసుకుని పడుకున్నాడు.

తరువాత వరసగా వాళ్ళిద్దరికీ ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టారు.
రాము తన కొడుకులల్లో పెద్ద వాడికి విశ్వ, రెండో వాడికి రఘు, అమ్మాయికి సంజన అని పేరు పెట్టాడు.

అలా వాళ్ళందరూ సంతోషంగా రోజులు గడుపుతున్నారు…..అప్పటికి రాము, రేణుకల పెళ్ళి అయ్యి ఐదేళ్ళు అయింది.
పెళ్ళి అయిన దగ్గర నుండి ఫ్యామిలీ మొత్తం ప్రతి సంవత్సరం షాపూర్ దర్గాలో సూఫీ బాబాను, తమను కాపాడిన గుడికి వెళ్ళి అక్కడ అమ్మ వారి దర్శనం చేసుకునే వాళ్ళు.
అలాగే ఆ ఏడు కూడా అమ్మవారి దర్శనం చేసుకుందామని బయలుదేరి అలవాటు ప్రకారం షాపూర్ లో ఉన్న దర్గాకు వెళ్ళి సూఫీ బాబాను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని గుడికి బయలుదేరి వెళ్ళారు.
అలా గుళ్ళోకి వెళ్ళిన తరువాత అందరూ అమ్మవారికి పూజ చేయించి….బావి దగ్గరకు వచ్చి లోపలికి చూసాడు రాము.
బావి లోపలికి చూసిన రాముకి ఒక్కసారిగా గతం మొత్తం గిర్రున తిరిగింది…..బావి దగ్గర నిల్చుని ఆలోచిస్తున్న రాముని చూసి రేణుక దగ్గరకు వచ్చి రాము భుజం మీద చెయ్యి వేసింది.
ఆలోచనల్లో ఉన్న రాము ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి తన భార్య రేణుక నిలబడి ఉండటం చూసి చిన్నగా నవ్వాడు.
రేణుక రాము దగ్గరకు వచ్చి, “ఏంటి రాము ఆలోచిస్తున్నావు….” అనడిగింది.
“ఏం లేదు రేణూ…..బావి లోపలికి చూసేసరికి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది….” అన్నాడు రాము.
రేణుక కూడా ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుని, “నిజంగా ఆ సంఘటన తల్చుకుంటేనే ఇప్పటికీ వెన్నులో వణుకు వస్తున్నది…” అన్నది.
ఇద్దరూ అక్కడ నిల్చుని మాట్లాడుకుంటుంటే రాము బావి గట్టుకి ఆనుకుని రేణుకతో మాట్లాడుతున్నాడు.
అలా కొద్దిసేపు మాట్లాడుకుంటుండగానే ఎవరూ ఊహించని విధంగా రాము నిల్చున్న చోట బావి గట్టు విరిగిపోయి నీళ్ళల్లో పడిపోయింది.
దాంతో రాము కూడా బేలన్స్ తప్పి బావిలో పడిపోయాడు.
అంతా కళ్ళ ముందు కన్ను మూసి తెరిచేలోపు జరిగిపోయే సరికి రేణుక కూడా రాముని పట్టుకోలేకపోయింది.
బావి గట్టు దగ్గర నిల్చుని లోపలికి పడిపోతున్న రాము వైపు చూసి ఏడుస్తూ, “రాము……” అని గట్టిగా అరుస్తున్నది.
రేణుక అలా గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న అందరూ బావి దగ్గరకు వచ్చారు.
కాని అప్పటికే రాము బావిలో పడిపోతూ రేణుక వైపు బాధగా చూస్తూ నీళ్ళల్లో పడిపోయి మునిగిపోయాడు.
అలా తన భర్త రాము బావిలో పడిపోతుంటే కాపాడలేక బాధపడుతూ ఇక రాము తన కాలానికి వెళ్ళిపోతున్నాడని అర్ధమై ఏడుస్తూ అలాగే రాము వైపు చూస్తూ ఉన్నది.
అలా బావిలో పడిన రాముకి ఒక్కసారిగా తన మీద సూర్య కిరణాలు పడటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు.
వెంటనే తను నేల మీద నుండి లేచి కూర్చుని అయోమయంగా చుట్టూ చూసాడు.
వెంటనే తానున్నది ఒబరాయ్ విల్లా ముందు ఉన్నానని….తన కాలానికి వచ్చేసాడని రాముకి అర్ధమయింది.
కాని నమ్మకం కుదరక వెంటనే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి విల్లాలో మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళాడు.
అక్కడ పార్కింగ్ లో తన కారు ఉండటం చూసి దాని దగ్గరకు వెళ్ళి చేతులతో తడుముతూ ముందు వైపుకు వచ్చి తన కారు నెంబర్ ప్లేట్ వైపు చూసి అది తనదే అని నిర్ధారణకు వచ్చి…మళ్ళీ విల్లా లోపలికి వెళ్ళి తను పడుకునే బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.
అక్కడ బెడ్ మీద తన బ్యాగ్, లాప్ టాప్ అన్నీ ఉండే సరికి ఇక తను తన కాలానికి వచ్చేసినట్టు రాముకి పూర్తిగా అర్ధం అయింది.
ఇప్పుడు రాము మనసులో తన కాలానికి వచ్చేసినందుకు ఆనందపడాలో లేక తన భార్యా పిల్లల్ని పోగొట్టుకున్నందుకు బాధ పడాలో అర్ధం కాక అలాగే బెడ్ మీద కూలబడిపోయాడు.

please like our new face book page

https://www.facebook.com/jabbardasth1
twitter link
 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button