Rana: గోపీచంద్ రిజెక్ట్ చేస్తే రానా ఓకె చేశాడా..!
Rana: గోపీచంద్ రిజెక్ట్ చేస్తే రానా ఓకె చేశాడా..!
Rana: గోపీచంద్ రిజెక్ట్ చేస్తే రానా ఓకె చేశాడా..!
ఆ టైంలో గోపీచంద్ బిజీ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత గోపీచంద్ ఫోన్ ఎత్తడం మానేసినట్టు ఇటీవల రామబాణం ప్రమోషన్లో తేజ చెప్పాడు. ఆ సందర్భంలో గోపీచంద్.. ఆ కథ నేను మోయలేనిది, అందులో హీరోయిన్ పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది, మీ ఫోన్ ఎత్తితే నేను ఓకే చెప్పేస్తాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటూ గోపీచంద్ చెప్పాడు. అది నిజమే అన్నట్టు కూడా తేజ క్లారిటీ ఇచ్చాడు.
ఇదిలా ఉండగా.. తేజ ..రానా తమ్ముడు, దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అయిన అభిరామ్ తో అహింస అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో తన నెక్స్ట్ సినిమా రానా తో అని తేజ రివీల్ చేయడం జరిగింది. ఇలా అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో వెంటనే.. ఇది గోపీచంద్ రిజెక్ట్ చేసిన కథ అంటూ ప్రచారం మొదలైంది. కానీ ఈ ప్రచారంలో నిజం లేదని తేజ క్లారిటీ ఇచ్చాడు.
(Rana) రానాతో చేయబోయే సినిమా పేరు రాక్షస అనుకుంటున్నట్టు తెలిపాడు. సో అలివేలు మంగ వెంకటరమణ… అనే టైటిల్ కి రాక్షస అనే టైటిల్ కి చాలా తేడా ఉంది. పైగా రాక్షస టైటిల్ లో హీరోది మెయిన్ రోల్ అనే హింట్ కూడా ఉంది. సో రెండు కథలు వేరే వేరే . త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా లాంచ్ అవ్వనుంది.