Srungara Kathamaalika

Srungara Kathamaalika – 54 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 54 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 54 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

 

రాత్రంతా తమ్ముడుని గుంటూరుకు తీసుకెళ్లి ఎలా సంతోషం పంచాలో అని ఆలోచిస్తూనే పడుకున్నట్లు తెల్లవారకముందే లేచి నా నుదుటిపై వెచ్చని ముద్దుపెట్టి , నెమ్మదిగా బెడ్ దిగి కింద అమ్మ రూంలోకివెళ్లి లేపిమరీ విషయం చెప్పి రెడీ అవ్వమని చెప్పింది . 

చాలా సంతోషం తల్లి స్నానం చేసి వంట చేస్తాను తిని వెళదాము అనిచెప్పడంతో ,

లవ్ యు అమ్మా అంటూ కౌగిలించుకుని బస్ 8 గంటలకు వచ్చేస్తుంది అంతలోపు టిఫిన్ తినేసి బస్ స్టాప్ లో ఉండాలి అంటూ ఉత్సాహంతో పైకివచ్చి , నేను ఇంకా హాయిగా నిద్రపోతుండటం చూసి , లేచేలోపు స్నానం చేసి రెడీ అవుదాము అని డ్రెస్ టవల్ తీసుకుని బాత్రూమ్లోకి వెళ్ళింది . 

అక్కయ్య రెడీ అయ్యి రావడం , నేను మేల్కొని వొళ్ళువిరిచి కళ్ళుతెరవడం ఒకేసారి జరిగింది .

గుడ్ మార్నింగ్ తమ్ముడూ …………

పెదాలపై చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అక్కయ్యా …….., అప్పుడే స్నానం కూడా అయిపోయిందా , నేనే అన్నమాట దున్నపోతులా నిద్రపోయాను అని లేచి బాత్రూం వైపు నిద్రమత్తులోనే వెళుతుంటే అక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుకుని , నా నుదుటిపై ముద్దుపెట్టి టవల్ అందించింది .

అర గంటలో తల స్నానం చేసి వచ్చాను .

తమ్ముడూ బూస్ట్ అంటూ టేబుల్ పై ఉంచి మరొక టవల్ అందుకొని నా తడి వెంట్రుకలను తుడిచి డ్రెస్ అందించింది .

అక్కయ్యా ……….అటువైపు తిరుగు అంటూ సైగచేసాను . 

సరే సరే ……….అంటూ ముసిముసినవ్వులతో అటువైపు తిరిగి , తమ్ముడూ అయ్యిందా ……..

లేదు అక్కయ్యా ………

అయ్యిందా ……….నవ్వుకుంటూ,

ఇంకా లేదు , తిరగొద్దు ……….

ఇప్పుడు ………మరింత నవ్వుతూ వెనక్కు తొంగిచూసి ప్యాంటు వేసుకున్నావా …….

అక్కయ్యా ……….చూస్తున్నావుకదూ ……

లేదు తమ్ముడూ ప్రామిస్ ఇప్పుడే చూసాను , అప్పటికే ప్యాంటు వేసేసుకున్నావు అంటూ తనలోతాను గుసగుసలాడి నవ్వుకుంటూ నా బుగ్గలను గిల్లింది . 

షర్ట్ వేసుకోగానే నాకు బూస్ట్ అందించి , దువ్వెన అందుకుని దువ్వి , ముఖానికి పొడర్ పట్టించి రెడీ చేసి కిందకు పిలుచుకొనివచ్చింది .

హాల్ లో పేపర్ చదువుతున్న నాన్నకు గుడ్ మార్నింగ్ చెప్పాను . 

పట్టించుకోకుండా పేపర్ వదిలేసి బయటకు వెళ్లిపోయారు .

నేనెక్కడ బాధపడతానో అని , నాన్నకు వినపడినట్లు లేదు ముందు వంటగదిలో ఉన్న అమ్మకు చెప్పుపో అని పంపించి , బయట వెళుతున్న నాన్నవైపు కోపంతో చూసింది .

అమ్మా ………గుడ్ మార్నింగ్ అనిచెప్పాను .

బుజ్జి రాత్రి బాగా నిద్రపట్టిందా …………..అంటూ హత్తుకొని వొంగి నుదుటిపై ముద్దుపెట్టింది .

అక్కయ్య జోకొడుతుంటే లాలిపాడినట్లు అనిపించింది అమ్మా , కొత్త చీర కట్టుకున్నారు ఎక్కడికైనా వెళుతున్నారా …………అని బాధతో అడిగాను .

వెళతారా కాదు వెళుతున్నాము గుంటూరుకు వెళుతున్నాము . నా బుజ్జి నాన్నకు కొత్త కొత్త బట్టలు తీసుకుని సాయంత్రం వరకూ సరదాగా గడిపబోతున్నాము . 

అవునా అమ్మా ………లవ్ యు అంటూ సంతోషంతో గట్టిగా కౌగిలించుకున్నాను .

ఇలా కూర్చో తొందరగా వంట చెయ్యాలి లేకపోతే మీ అక్కయ్య నన్ను తిట్టేస్తుంది . అంతలో అక్కయ్య లోపలకువచ్చి అమ్మా ఇంకా కాలేదా బస్ వచ్చే సమయం అయ్యింది అని కొప్పుడుతుంటే , 

చెప్పానా ……..అంటూ అమ్మ నవ్వింది . 

అమ్మతోపాటు ముసిముసినవ్వులు నవ్వుతుంటే , కట్టపై కూర్చున్న నాముందుకువచ్చి నా చేతులను తన తుజాలపై వేసుకుని , ఏమిటి అమ్మా కొడుకులు సంతోషంతో నవ్వుతున్నారు అని నా బుగ్గలను స్పృశిస్తూ అడిగింది .

ఇంట్లో ఎంతమంది ఉన్నా మా అక్కయ్యే యువరాణి , తను చెప్పిందే శాసనం అని అమ్మ చెబుతుంటే ఆనందంతో నవ్వుతున్నాము అక్కయ్యా ………

నా తమ్ముడు యువరాజు అంటూ హత్తుకొని నుదుటిపై పెదాలను తాకించింది .

ఇదిగో తల్లి , బుజ్జి ………టిఫిన్ రెడీ వెళ్లి డైనింగ్ టేబుల్ పై కూర్చోండి అని చెప్పింది . 

తమ్ముడుకి తినిపించాలి మరిచిపోయావా అమ్మా , మేము సోఫాలో కూర్చుంటాము ఒక్క ప్లేట్ లోనే వడ్డించుకునివచ్చెయ్ ముగ్గురూ తిందాము అని నా చేతినిపట్టుకొని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చుంది .

అమ్మ ప్లేట్ లో వడ్డించుకొనివచ్చి మా ఇద్దరికీ తినిపించి తానూ తినింది . 

అమ్మా సమయం లేదు అంటూ ఒక బ్యాగులో టవల్ తోపాటు అవసరమైనవి తీసుకుని ముగ్గురమూ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చామో లేదో బస్ స్టాప్ నుండి బస్ గుంటూరు వైపు వెళ్ళిపోయింది .

అంతే అక్కయ్య కోపంతో అమ్మవైపు చూస్తుంటే …………

Sorry తల్లి కళ్ళుమూసుకుని 10 కౌంట్ చెయ్యి కోపం తగ్గిపోతుంది అని నవ్వుతూ ముందుకువచ్చింది .

నేను చేస్తాను అంటూ నాకళ్ళు మూసుకుని 1 2 3 ………చెబుతుంటే , అక్కయ్య నవ్వుకుని కళ్ళుమూసి నాతోపాటు కౌంట్ చేస్తూ 10 అంటూ కళ్ళుతెరిచాము .

సడెన్ గా ఇంటిముందు కారు వచ్చి ఆగింది . అక్కయ్య ఆశ్చర్యపోతుంటే …….

మనకోసమే , నా ప్రాణమైన బుజ్జిని మొదటిసారి ఎంజాయ్ చెయ్యడానికి తీసుకెళుతున్నాము , బస్ లో పిలుచుకునివెళతాను అని ఎలా అనుకున్నావు , తల్లి ఇప్పుడెకదా అన్నావు నీ తమ్ముడు ఈ ఇంటి యువరాజు అని అని మాట్లాడుతుంటే ,

లవ్ యు అమ్మా అంటూ అమాంతం సంతోషంతో కౌగిలించుకుని , తమవైపు కళ్ళల్లో చెమ్మతో ఆరాధనతో చూస్తున్న నాదగ్గరకువచ్చి , ఏమైంది తమ్ముడూ అని అడిగారు.

లవ్ యు అమ్మా , అక్కయ్యా ……….అంటూ ఇద్దరినీ ఒకేసారి కౌగికించుకొని , ఆనందబాస్పాలు అక్కయ్యా అని ఉద్వేగంతో చెప్పాను . 

అమ్మా ఈ క్రెడిట్ మొత్తం నీదే , కారు మన సర్పంచి గారిది కదా ……

అవును తల్లి నువ్వు ఉదయం విషయం చెప్పగానే సోమయ్యకు డబ్బులిచ్చి పంపి ఈరోజు మొత్తం మనతో ఉండేలా సెట్ చేసాను . మన ఇష్టం ఎక్కడికీ వెళ్లాలనుకుంటే అక్కడికి వెళ్లొచ్చు , మనమిక సమయాన్ని వృధా చెయ్యకూడదు ప్రతి క్షణం మనకు ముఖ్యం , నా బుజ్జి పూర్తి ఎంజాయ్ చెయ్యాలి అని కారులో నాకు చెరొకవైపు అమ్మ అక్క కూర్చుని పోనివ్వమని డ్రైవర్ కు చెప్పి నా తలపై బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెడుతూ దారిలో తోటను మనదే అని చూపించి తొందరలోనే ఎక్కడకూ వెళదాము అని చెప్పి , ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నాకు చూపిస్తూ అర గంటలో గుంటూరు చేరుకున్నాము.

బాబు ముందు భ్రమరాంబ మల్లికార్జున గుడికి వెళ్ళమని అమ్మ చెప్పింది .15 నిమిషాలలో తీసుకెళ్లాడు .

అమ్మ అమ్మే ……..అంటూ అక్కయ్య నన్ను సంతోషంతో ముద్దుపెట్టి , ముగ్గురమూ కిందకు దిగి బయట పూలు టెంకాయ తీసుకుని లోపలకువెళ్లి నా పేరు మీద మరియు అక్క పేరుమీద పూజ జరిపించింది అమ్మ . తల్లి ఒకే ఒక కోరిక నా పిల్లలిద్దరూ ఎప్పుడూ సంతోషంతో ఉండాలి అని ప్రార్థించింది .

అక్కయ్య ……..నా తమ్ముడు , అమ్మ సంతోషంతో ఉండాలని ,

నేను నా ప్రాణమైన అక్కయ్య , అమ్మ సంతోషంతో ఉండాలని ప్రార్థించి ……. ముగ్గురమూ ఒకేసారి కళ్ళుతెరిచి మిగిలిన ఇద్దరూ ఏమి కోరుకున్నారో మనసుకు తెలుసు అన్నట్లు ప్రాణంలా చూసుకుని ఆనందించాము .

కాసేపు ప్రశాంతమైన వాతావరణం గల గుడిలో కూర్చుని ప్రసాదం తిని మరొకసారి ప్రార్థించి బయటకువచ్చి కారులో కూర్చున్నాము .

అమ్మగారు ఎక్కడకు పోనివ్వమంటారు అని డ్రైవర్ అడిగాడు .

ఇక వీళ్ళ ఇష్టం అని అమ్మ నవ్వి చెప్పడంతో , 

లవ్ యు అమ్మా ఇస్కాన్ టెంపుల్ కు కూడా వెళదాము అని చెప్పి డ్రైవర్ ను పోనివ్వమంది .

అక్కడ కూడా ప్రార్థించి , అక్కయ్య ఒక కాలేజ్ దగ్గరకు వెళ్ళమని చెప్పింది .

10 గంటలు అవుతుండటంతో అందరూ కాలేజ్ కు వస్తున్నారు .

తమ్ముడూ ఇదే మా కాలేజ్ అని చూపించి , మా కోతులు ఎవరైనా మనతోపాటు వేస్తారేమో చూద్దాము అని 5 మందికి కాల్ చేసింది . 

ఐదుగురిలో ఇద్దరే కాలేజ్ కు వచ్చారు , ఆ ఇద్దరు కూడా క్లాస్ లో ఉన్నామే గంట పడుతుంది , ఈ సోదిగాడి గురించి తెలుసుకదా అని క్లాస్ జరుగుతున్నట్లు గుసగుసలాడారు .

వీళ్లంతా కాదు తమ్ముడూ నీ బుగ్గలను గిల్లి గిల్లి పెట్టే నా క్లోజ్ ఫ్రెండ్ కు కాల్ చేస్తాను అని చేసి , బయట వైట్ కలర్ కారులో ఉన్నాము అని చెప్పి మెయిన్ గేట్ వైపు చూస్తుంటే ………

వెనుక నుండి వచ్చి విండో తట్టింది . ఒసేయ్ సునీతా అంటూ కారు దిగి స్కూటీ మీద ఉన్న తన ఫ్రెండ్ ను అక్కయ్య కౌగిలించుకుంది .

రెండు నిమిషాలు ఇక్కడే ఉండు స్కూటీ పార్క్ చేసి వస్తాను అని లోపలకు వెళ్లి వచ్చి ,ఇంతకీ నా హీరో ఎక్కడ అని అడిగింది .

ఇదిగో అంటూ అక్కయ్య డోర్ తెరిచి అమ్మతో మాట్లాడుతున్న నన్ను చూపించగానే ………

క్షణంలో లోపాలలు దూరిపోయి కూర్చుని హీరో ……….అంటూ నన్ను రెండుచేతులతో చుట్టేసి , ఇంటికి వెళ్లిన దగ్గర నుండి నీ క్యూట్ ఫేస్ , బ్యూటిఫుల్ స్మైల్ , ముద్దుముద్దు మాటలు …………అన్నీ నీ ఆలోచనలే నా బుర్రన్తా నిండిపోయాయి , ముఖ్యన్గా ఈ నోరూరించే బుగ్గలు ఉన్నాయి చూడు నావల్ల కాదు అంటూ గిల్లేసింది. 

స్స్స్………..అక్కయ్యా ……..అని కేకవేశాను . 

ఒసేయ్ అంటూ వెనుక నుండి తలపై ఒక దెబ్బ వేసి కిందకు దిగు అది నా ప్లేస్ అని చిరుకోపంతో చెప్పింది .

అమ్మా ………ముందే చెప్పాను కదా , ఎలాంటి ఛాన్స్ వదులుకోను అని నువ్వే ముందువెళ్లి కూర్చో అని అక్కయ్యను తోసేసి డోర్ వేసి నవ్వుతూ , sorry హీరో ఇప్పటి నుండి నెమ్మదిగా గిల్లుతాను . మరి ఏమి చెయ్యమంటావు వాటిని చూస్తే నా చేతులు అస్సలు ఊరుకోవు . Sorry sorry …………అంటూ నన్ను చుట్టేసి ఆప్యాయతతో తలపై ముద్దుపెట్టింది .

అక్కయ్య నవ్వుకుని వెళ్లి ముందర కూర్చోవడానికి అటువైపు వచ్చింది . 

అమ్మ కారు దిగి తల్లి నీ తమ్ముడి ప్రక్కన కూర్చో నేను ముందు కూర్చుంటాను అని చెప్పడంతో ఎక్కి కూర్చున్నారు .

ఒసేయ్ సునీతా ………ఇలా అయితే ok , అలాకాదని మరొకసారి గిల్లావో ఆ వేళ్ళను ఇరిచేస్తాను అని అక్కయ్య నవ్వుతూ వార్నింగ్ ఇచ్చింది .

ఒసేయ్ నా హీరోకి sorry చెప్పేసాను , అదంతా మా understanding అంతేకదా హీరో అంటూ గిల్లిన చోట ముద్దుపెట్టింది .

నీ ఇష్టం సునీతక్కా ………కానీ మీరు మాత్రం అక్కయ్యతో ఎప్పుడూ ఇలా సరదా సరదాతో కలిసే ఉండాలి , మీరంటే అక్కయ్యకు చాలా ఇష్టం అనుకుంటాను అని చెప్పాను .

ఇద్దరూ అమితానందంతో నన్ను చెరొకవైపు నుండి హత్తుకొని నుదుటిపై ముద్దులుపెట్టారు .

తల్లి ఎక్కడికీ అని అమ్మ అడిగింది .

అమ్మా తమ్ముడిని మా కాలేజ్ ప్రక్కనే ఉన్న స్కూల్ లో చేర్పించాలి . తమ్ముడూ నీకు ఇష్టమే కదా అని అక్కయ్య అడిగింది .

సోమవారం నుండి మా అక్కయ్య కాలేజ్ కు వెళుతుంది , నేను ఇంట్లో ఒంటరిగా మా అక్కయ్యను వదిలి ఉండటం వల్ల అవుతుందా అని ఆలోచిస్తున్నాను . ఇప్పుడు అక్కయ్యతోపాటు నేను కూడా ఇక్కడకు రావచ్చు కాబట్టి నాకు ఇష్టమే అక్కయ్యా అంటూ అని సంతోషంతో బదులిచ్చాను .

అవును తమ్ముడూ నేను ఈ విషయం గురించి ఆలోచించనే లేదు నా బుజ్జి తమ్ముణ్ణి విడిచి నేను కాలేజ్ కు వచ్చేదాన్ని కాదేమో , ఇప్పుడు ఇద్దరమూ హ్యాపీ అంటూ నన్ను చుట్టేసి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .

కాలేజ్ కు అనుకున్న స్కూల్ లోపలికి వెళ్ళాము . పెద్ద గ్రౌండ్ , తోట , పిల్లలు ఆడుకోవడానికి అన్నిరకాలు ఉండటం చూసి ఆనందిస్తుంటే ………

తల్లి బుజ్జికి స్కూల్ నచ్చినట్లుంది అని అమ్మ చెప్పింది .

అంటీ ఈ స్కూల్ , మా కాలేజ్ ఒక్కరిదే ……….హీరో ఇక్కడి నుండి కాలేజ్ లోకి దారి కూడా ఉంది అని సునీతక్క మాట్లాడుతుంటే ……….

ఆతృతతో ఎక్కడ సునీతక్కా అని అడిగాను . 

హీరో ముందు జాయిన్ అయ్యి వచ్చి అన్నీ చూపిస్తాను అంటూ మెయిన్ బిల్డింగ్ లోపలికి ఆఫీస్ రూంలోకి వెళ్లి న్యూ జాయినింగ్ అనిచెప్పడంతో ఒకదగ్గరికి పంపారు.

అక్కడున్న మేడం అక్కయ్యలను చూసి మీరు మన కాలేజ్ స్టూడెంట్స్ కదా అని అడిగారు . అవును మేడం అంటూ చేతులు కలిపి , నా తమ్ముడు మహేష్ ని స్కూల్ లో జాయిన్ చేయించాలి అని చూపించింది . 

క్యూట్ బాయ్ అంటూ మేడం నా బుగ్గలను గిళ్లడంతో ………,

సునీతక్క చేతిని అడ్డుపెట్టుకుని ముసిముసినవ్వులు నవ్వింది . ఒసేయ్ ఆపు అంటూ అక్కయ్య తలపై కొట్టింది . 

ఏమైంది అని మేడం అడగడంతో ……….

ఏమీ లేదు మేడం దీనికి కాస్త తిక్క , మీరు చెప్పండి అని అక్కయ్య అడిగింది .

మహేష్ ఇంతకు ముందు ఏ స్కూల్ లో చదివేవాడివి , ఏ క్లాస్ అని అడిగింది .

నేను అక్కయ్యవైపు చూస్తుంటే , మేడం అంటూ నా గురించి మొత్తం వివరించింది . 

చాలా సంతోషం వాసంతి , మనం ఇప్పుడు ఏమిచేద్దామంటే మామూలుగా మహేష్ వయసు ప్రకారం 3rd క్లాస్ ఉండాలి , కానీ మహేష్ కు అంత knowledge ఉందొ లేదో టెస్ట్ చెయ్యాలి లేకపోతే క్లాస్ లో ఏమీ అర్థం కాదు అని ల్యాండ్ లైన్ నుండి థర్డ్ క్లాస్ మిస్ ను పిలిపించి , నన్ను చూపించి మొత్తం వివరించారు . 

మిస్ నన్ను మాత్రమే ప్రక్కనున్న రూంలోకి పిలుచుకొనివెళ్లి 15 నిమిషాల తరువాత వచ్చి , మేడం 4th క్లాస్ లో జాయిన్ చెయ్యొచ్చు అనిచెప్పి నవ్వుతూ నా తల నిమిరి వెళ్లిపోయారు .

మేడం తో పాటు మేమంతా ఆశ్చర్యపోయాము .

వాసంతి నిజం చెప్పు మహేష్ ఇప్పటివరకూ చదువుకోలేదా ……….

లేదు మేడం స్కూల్ లో ఎంటర్ అవ్వడం ఇదే తొలిసారి . 

ఇంత మంచి స్టూడెంట్ ను మాకు అందించినందుకు చాలా థాంక్స్ అంటూ 15 నిమిషాలలో జాయినింగ్ చేసుకున్నట్లు ఫారం ఇచ్చి క్యాష్ కౌంటర్లో కట్టి మర్నాడు Monday నుండి స్కూల్ కి రావచ్చు , ఏమేమి తీసుకురావాలో అక్కడ లిస్ట్ ఇస్తారు అని మళ్ళీ ఇంటెలిజెంట్ బాయ్ అంటూ బుగ్గలను గిల్లింది . 

స్స్స్……….అంటూ నా బుగ్గలను పట్టుకున్నాను .

సునీతక్క నవ్వు ఆగడం లేదు . మనకే కాదు హీరో బుగ్గలంటే మరొకరికి కూడా ఇష్టం అంటూ సంతోషంతో నవ్వుతూ అక్కయ్య బుగ్గలను ప్రేమతో స్పృశించి అమౌంట్ కట్టి లిస్ట్ తీసుకుని బయటకువచ్చి అన్నీ చూపించారు .

కారు ఎక్కి నెక్స్ట్ అని అడగడంతో ,

అమ్మా నా తమ్ముడి కోసం వాటర్ పార్క్ అని అక్కయ్య చెప్పగానే , డ్రైవర్ పోనిచ్చాడు .

15 నిమిషాలలో చేరుకున్నాము . నాలుగు టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళగానే వాటర్ రైడ్స్ , ఫౌంటెన్ , మినీ ట్రైన్ , స్విమ్మింగ్ పూల్ చూసి ఆనందం పట్టలేక అక్కయ్య చేతిని బిగిపెట్టాను . 

తమ్ముడూ నీఇష్టమొచ్చినంతవరకూ ఎంజాయ్ చెయ్యి వెళ్లు వాటర్ రైడ్స్ దగ్గర వదిలి పూల్ దగ్గర వచ్చి కూర్చున్నారు . 

పైకెక్కి జీవితంలో ఇలా చుట్టూ పిల్లలతో సరదాగా గడుపుతానని అనుకోలేదు , లవ్ యు అక్కయ్యా……….అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ , పైనుండి అక్కయ్యా ………అంటూ ప్రేమతో పిలిచి కిందకు జారాను . 

నా ఆనందం చూసి అమ్మ , అక్కయ్యలు పరవశించిపోతున్నారు . నీళ్ళల్లో పూర్తి తడిచి పైకివచ్చి అక్కయ్య దగ్గరకువెళ్లి లవ్ యు అక్కయ్యా ……….చాలా ఆనందంగా ఉంది అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , తుర్రుమంటూ ఈసారి రౌండ్స్ రైడ్ పైకి చేరి చుట్టూ తిరుగుతూ కిందకు జారుతూ వచ్చి నీళ్ళల్లో పడ్డాను . మళ్లీ పైకెక్కి లవ్ యు అక్కయ్యా …….అంటూ మరొక బుగ్గపై ముద్దుపెట్టి పైకి పరిగెత్తాను .

ఏంటే అలా చూస్తున్నావు అని అక్కయ్య సునీతక్కయ్యను ఆడిగింది . 

ఆలస్యం అయినా నువ్వు చాలా చాలా అదృష్టవంతురాలివే వాసంతి , నువ్వంటే ప్రాణమే వాడికి అంటూ సంతోషంతో చెప్పింది . 

అవును నా తమ్ముడు ఒక్క క్షణం కనపడకపోతే ఈ హృదయం కూడా తట్టుకోలేదు . అక్కయ్యా అని ప్రాణంలా ఒక్కొక్క ముద్దు పెడుతుంటే ఇన్ని సంవత్సరాలు ఏమి మిస్ అయ్యానో అర్థమైంది అంటూ నావైపు చేతిని ఊపి ఆనందబాస్పాలతో మురిసిపోతొంది .

నా తమ్ముడి సంతోషమే నా సంతోషం అంటూ నీళ్ల దగ్గరికి వచ్చి , నేను పైకి రాగానే లవ్ యు తమ్ముడు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , వెళ్లు తనివితీరేంతవరకూ ఆడు అని అక్కడే నిలబడింది .

అలా అర గంటవరకూ రైడ్స్ మరియు నీళ్ళల్లో ఎంజాయ్ చేసి , మరికొద్దిసేపు చాలామంది పిల్లలతో రైన్ డాన్స్ లో గెంతులేసి పైకివచ్చి చలికి వణుకుతూ ………అక్క….. య్యా చా. …..లు అని తడబడుతున్న మాటలతో చెప్పాను .

అమ్మా బ్యాగులో నుండి టవల్  అందుకొని నన్ను బెంచ్ పై కూర్చోబెట్టి , అమ్మ వీపుపై , సునీతక్క చేతులను రాస్తూ , అక్కయ్య టవల్ తో తల తుడిచి నా బాత్రాలు తీసుకుని changing రూమ్ దగ్గరకు తీసుకెళ్లి లోపలకు పంపింది . 

తడి బట్టలను విడిచి డ్రై అయ్యి అక్కయ్య అందించిన బట్టలను వేసుకుని ఉత్సాహంతో బయటకు వచ్చాను . 

తమ్ముడూ ఇప్పుడెలా ఉంది అని బుగ్గలపై చేతులతో నుదుటిపై వెచ్చని ముద్దుపెట్టింది . 

ఇప్పుడు వెచ్చగా ఉంది అక్కయ్యా ……… నీళ్ళల్లో చాలా ఎంజాయ్ చేసాను లవ్ యు అంటూ అక్కయ్య చేతిని రెండు చేతులతో పట్టుకుని అమ్మదగ్గరికి చేరుకున్నాము .

అక్కడి నుండి బంపింగ్ కార్స్ దగ్గరకు వెళ్లి రెండుసార్లు ఆడి ఎంజాయ్ చేసాను . మధ్యాహ్నం ఒంటి గంటవరకూ నేను ఏది చూపిస్తే అది , అన్నిచోట్లా తిరిగి ఎంజాయ్ చేసి అలసిపోయి అక్కయ్యా ………ఆకలి అని చెప్పాను .

ఓకేరోజులోనే ఇంత ఎంజాయ్ చేస్తే అలసిపోక ఏమవుతావు హీరో అంటూ బుగ్గలను కసిగా గిళ్లబోయి , వెనుక అక్కయ్య చెయ్యి తన వీపుపై పడుతుందని గుర్తుకొచ్చి అక్కడితో ఆగిపోయి నా కురులను ఆప్యాయంగా నిమిరింది .

అమ్మ నీళ్లు తాగించి తల్లి మాంచి స్టార్ హోటల్ కు వెళదాము అని బయటకువచ్చి కారులో హోటల్ చేరుకున్నాము .

డ్రైవర్ ను కూడా భోజనానికి పిలిచి మేము నలుగురూ ఒక టేబుల్ ఆక్రమించేసాము. తమ్ముడూ బిరియాని అని అడిగింది . 

పెదాలను తడుముకుని ఊ ఊ ………..అంటూ తల ఊపాను . మెనూ కార్డ్ అందుకొని ముందు నాకు ఐస్ క్రీమ్ ముగ్గురికీ కూల్ డ్రింక్స్ తెమ్మనిచెప్పి , బిరియానీతోపాటు చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసింది . ఆ ఐటమ్స్ పేర్లు వినడం అదే తొలిసారి .

ముందు ఐస్ క్రీమ్ , డ్రింక్స్ తీసుకురావడంతో క్షణాల్లో తినేసాను . ముగ్గురూ ఆశ్చర్యపోయి తమ్ముడూ ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా అని సునీతక్క అడిగింది .

చల్లగా , తియ్యగా చాలా బాగుంది అక్కయ్యా ……….., ఫస్ట్ టైం తినడం అందుకే అలా …………,

అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో ఒకేసారి మూడు flavours తెమ్మని చెప్పి , తమ్ముడూ ఒక పెద్ద ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకెళ్లి మన ఇంటి ఫ్రిడ్జ్ లో పెడతాను నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వెళ్లి తిను అని చెప్పి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి , మూడు పిల్లాడికే ఇవ్వండి అని అక్కయ్య చెప్పింది .

లవ్ యు అక్కయ్యా ………..అంటూ ఇష్టంతో రెండు తినేసి మరొకటి బిరియానీ తిన్న తరువాత తింటాను అని చెప్పడంతో ……..

నీ ఇష్టం తమ్ముడూ అని ముద్దుపెట్టింది . ఇంతలో ఆర్డర్ చేసినవన్నింటినీ టేబుల్ పై ఉంచడంతో , ఫస్ట్ టైం చూస్తున్నట్లు కుమ్మేయాలన్నంతలా అలా చూస్తుండిపోయాను.

అన్నీ నా తమ్ముడి కోసమే అంటూ తన ప్లేటులో వడ్డించి నాకు తినిపించి తానూ తినింది .

లవ్ యు అక్కా ………..అంటూ ఆవురావురుమంటూ కడుపునిండా తిని , కప్పులో కరిగిపోయిన ఐస్ క్రీమ్ తాగి అక్కయ్యా ………….కడుపు నిండిపోయింది అంటూ పొట్ట చూపించాను . 

అక్కయ్యలు అమ్మ సంతోషంతో నవ్వుకున్నారు . డ్రైవర్ తిన్నదానికి కూడా బిల్ కట్టేసి కారులోకి చేరాము.

తమ్ముడూ నెక్స్ట్ మూవీకి వెళదాము . టర్నింగ్ లో ఊరిలో ఏ సినిమాలు ఆడుతున్నాయో ప్రతి ఒక్క పోస్టర్ అతికించి ఉంటారు , నువ్వు దేనికి వెళదామంటే ఆ మూవీ చూద్దాము అని అడిగింది .

సంగీతక్క కళ్ళుమూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ , నేను తను అనుకున్న మూవీ పేరునే చెప్పాలి అని తనలో తానే మూట్లాడుతోంది .

అక్కయ్యా పోస్టర్లు చూసి అవసరం లేదు మనం సిటీలో తిరుగుతున్నప్పుడే చూసాను , నాకు స్పైడర్ మ్యాన్ చూడాలని ఉంది . వారం రోజుల ముందు రిలీజ్ అయ్యిందనుకుంటాను . రైల్వే స్టేషన్ టీవీ లలో చూసాను , మా అక్కయ్యకు కూడా ఇష్టమైతే వెళదాము అని బదులిచ్చాను .

నా మాటలను వింటూ షాక్ చెందినట్లు సునీతక్క కదలకుండా ఉండిపోయింది . డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి బాబు సూపర్ మూవీ అంట మన ఊరి స్టూడెంట్స్ మాట్లాడుతుంటే విన్నాను , సాలీడు హీరోని కొరకగానే అతడు స్పైడర్ మ్యాన్ ఆయిపోతాడంట , గ్రాఫిక్స్ అత్యద్భుతమని చెప్పారు అని ఆపకుండా మాట్లాడుతుంటే ………….

సునీతక్క తేరుకుని , హీరో నువ్వు నిజంగా నా హీరోనే మూడురోజుల నుండి కాలేజ్ బంక్ కొట్టి వెళదామంటే కుదరడం లేదు థాంక్యూ soooooo మచ్ హీరో నేను ప్రార్థించింది కూడా అదే అంటూ అమాంతం నన్ను సైడ్ నుండి చుట్టేసి బుగ్గను కొరికేసినంత పనిచేసింది . డ్రైవర్ అన్నయ్య కూడా నాలానే ప్రార్థించినట్లున్నాడు ……….

అవును అమ్మగారు , మీవలన మూవీ చూడొచ్చనే ఆనందంలో అలా అంటూ సిగ్గుపడుతూ పోనిచ్చాడు . 

నా తమ్ముడి ఇష్టమే నా ఫ్రెండ్ కు కూడా కోరుకుంటోంది కాబట్టి నాకు మరింత ఇష్టంగా ఉంది తొలిసారి కార్టూన్స్ తరువాత స్పైడర్ మ్యాన్ మూవీ వచ్చింది కాబట్టి దానికే వెళదాము తమ్ముడు అంటూ నా బుగ్గలను అందుకొని నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టింది . అమ్మా మీకు అని అడిగాను , గ్రాఫిక్స్ సినిమా ఇప్పటివరకూ చూడలేదు , నా బుజ్జి వలన ఆ కోరిక కూడా తీరబోతోంది అని సిగ్గుపడుతూ బదులిచ్చింది .

వో వో………. అంటీ మీకు కూడా కోరికలు ఉన్నాయి అంటూ సునీత అమ్మను ఆటపట్టించింది .

అమ్మగారు 15 నిమిషాల్లో గుంటూరులోని బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ థియేటర్ దగ్గరకు తీసుకెళతాను . రష్ ఎక్కువగా ఉంటుంది అయినా పర్లేదు లేడీస్ డైరెక్ట్ లోపలకు వెళ్లిపోవచ్చు అని చెప్పాడు . 

థియేటర్ చేరుకుని చూస్తే వీకెండ్ వలన రష్ ఎక్కువగానే ఉంది , కానీ లేడీస్ ను లోపలికి పంపిస్తుండటం చూసి వెళ్లి 5 టికెట్స్ తీసుకుని ఒకటి డ్రైవర్ కు ఇచ్చి లోపలకు వెళ్ళాము . 

అమ్మగారు నాకు ముందు ఉండి చూస్తేనే కిక్కు మాస్ అంటూ ముందు సీట్లోకి వెళ్ళిపోయాడు .

నాకు చెరొకవైపు అక్కయ్యలు , ప్రక్కనే అమ్మ కూర్చుంది . మూవీ స్టార్ట్ అవ్వగానే అక్కయ్య నా చేతిని చేతివేళ్ళతో పెనవేసి ఇంటరెస్ట్ గా చూస్తోంది . సునీత అక్కయ్య , అమ్మ అయితే మూవీ లో లీనమైపోయారు .

స్పైడర్ కొట్టడం ……..స్పైడర్ మ్యాన్ లా మారడం ……..హీరో తన శక్తులను టెస్ట్ చెయ్యడం ……….బిల్డింగ్ బిల్డింగ్ లు దాటుకుని వెళుతున్నప్పుడల్లా అక్కయ్య , స్పైడర్ మ్యాన్ కిందకు పడిపోతాడేమోనని నా చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని గుండెలపై హత్తుకుంటోంది . 

అక్కయ్యా ………..హీరో కదా ఏమీ కాదులే అని నవ్వుతూ ధైర్యం చెప్పడంతో , 

లవ్ యు తమ్ముడూ అంటూ నాచేతిపై ముద్దుపెట్టి నవ్వింది .

అంతలో ఇంటర్వెల్ పడటంతో అమ్మా ఇక్కడే ఉండు తమ్ముడు తినడానికి ఏమైనా తెస్తాము అని నన్ను పిలిచారు . 

అక్కయ్యా ………హోటల్ లోనే ఫుల్ అయిపోయింది లోపల కొద్దిగా కూడా ఖాళీలేదు అనిచెప్పాను . 

అయితే కూల్ డ్రింక్స్ ఒక్కటే తెద్దాము తమ్ముడూ అనిచెప్పడంతో……..

దానికైతే ఫుల్ గ్యాప్ ఉంది లోపల అంటూ నవ్వుకుంటూ ముగ్గురమూ వెళ్లి తీసుకొచ్చి కూర్చోగానే మూవీ స్టార్ట్ అయ్యింది .

సెకండ్ హాఫ్ మరింత అదిరిపోయింది . చుట్టూ ఉన్న జనాలంతా విజిల్స్ వేస్తుంటే ………….హీరోయిన్ ను కాపాడే scene కు అందరితోపాటు నేనుకూడా విజిల్ వేసాను .

హీరో నీకు విజిల్ వెయ్యడం వచ్చా ………ఎలాగో నాకు చూపించవా……… థియేటర్ లో వేయాలని చిన్నప్పటి నుండి కోరిక ………

అక్కయ్యా ………అంటూ అక్కవైపు చూసాను . 

నేర్పించు తమ్ముడూ లేకపోతే అది వదలదు అని నవ్వి కళ్లతో సైగచెయ్యడంతో అటువైపు తిరిగి నోటిలో వేళ్ళు ఎలా పెట్టుకుని వేయాలో చూపించాను . 

గాలిమొత్తం పీల్చి చేతులు నోట్లోకి దూర్చి విజిల్ వేసింది , మొదటిసారే థియేటర్ మొత్తం వినిపించేలా సౌండ్ రావడంతో , థాంక్స్ థాంక్యూ sooooo మచ్ హీరో అంటూ నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి వదిలింది .

అంతలో స్పైడర్ మ్యాన్ మేరీ జేన్ ను పైనుండి వచ్చి తను ఎవరో తెలీకుండా ముద్దు పెట్టే scene రావడంతో , థియేటర్ మొత్తం సైలెంట్ అయిపోయి కన్నార్పకుండా చూస్తున్నట్లు అనిపించింది .

అక్కయ్యలిద్దరికీ కూడా తెలిసిపోయినట్లు , అక్కయ్య సిగ్గుపడుతూ తల దించుకుంది , సునీతక్క మాత్రం నావైపు కొరుక్కుని తినేసేలా చూస్తుంటే , అక్కయ్యా ……….అంటూ చేతిని చుట్టేసాను . 

ఒసేయ్ చిన్నపిల్లాడితో ఏంటే సిగ్గులేదు నీకు అని ముసిముసినవ్వులతో చెప్పింది .

పెదవులు కలువగానే యూత్ అంతా లేచిమరీ విజిల్స్ తో థియేటర్ దద్దరిల్లేలా చేశారు .

చూడవే దాని పవర్ ………..ఇంత వయసు వచ్చింది , ఒక్క కిస్ టేస్ట్ చేసామా …………అంతా నీవల్లే , పెళ్లి తరువాతే అన్నీ అని నన్ను కూడా ఆపుతున్నావు . 

ఆ మాటలు అమ్మ విన్నట్లు సంతోషించింది . 

హీరో ఇంతకు ముందు scene చూసావా ………అని సునీతక్క చిలిపి నవ్వుతో అడిగింది .

ఒసేయ్ నిన్నూ అంటూ అక్కయ్య , సునీతక్క తలపై మొట్టికాయ వేసి తమ్ముడూ దాని మాటలు వినద్దు నువ్వు ఇటువైపురా అని లేచి నన్ను అమ్మ ప్రక్కన కూర్చోబెట్టింది . 

అద్భుతమైన ఫైట్ తో క్లైమాక్స్ సుఖాంతం అయ్యింది . హీరో మూవీ సూపర్ కదా అంటూ నెమ్మదిగా బయటకు వచ్చేసరికి డ్రైవర్ కారుని గేట్ దగ్గరికి తీసుకొచ్చాడు .

కారు ఎక్కగానే సమయం 5 అయ్యింది నన్ను కాలేజ్ దగ్గర వదళాలే వాసంతి ఇంటికి వెళ్లిపోవాలి అనిచెప్పింది . 

నాకు కూడా తెలుసే అంటూ కాయలేజ్ లో సునీతక్క దిగి , హీరో నీవల్ల చాలా తియ్యని గుర్తులు ఆస్వాదించి నీకు ఋణపడిపోయాను . ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చేస్తాను బై అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి కాలేజ్ నుండి స్టూడెంట్స్ ఇంటికి వెళుతుంటే సునీతక్క లోపలకు వెళ్లడం చూసి నవ్వుకున్నాము .

తమ్ముడూ ఇప్పుడు చూడు బుద్ధిమంతురాలిలా కాలేజ్ నుండి వస్తున్నట్లు ఎలావస్తుంది అని అక్కయ్యా చెప్పడం , అలాగే అక్కయ్య మిగిలిన ఫ్రెండ్స్ తో పాటు దర్జాగా బయటకు రావడం చూసి నవ్వుకున్నాము .

అందరూ కారుని చుట్టుముట్టి ఒసేయ్ ఒక్క గంట ఆగలేవా ……….ఎలా ఎంజాయ్ చేశారో ఇదిచెబుతుంటే అసూయ వచ్చేస్తోంది అంటూ అక్కయ్యపై నిందలు వేశారు .

ఒసేయ్ సునీత కంటే ముందు మీకే కాల్ చేసాను , మీకు అదృష్టం లేదు అంతే అంటూ నవ్వింది . 

ఇంతకీ మన క్యూట్ బాయ్ ఎక్కడ కారులో దాచేశావా …….మేమేమీ ఇప్పుడే ఎత్తుకెళ్లము లేవే దిగమని నువ్వే పిలుస్తావా ……. .లేక మేమే దాడి చెయ్యమంటావా అని ముందుకువస్తుంటే ,

అమ్మా తల్లులు ఆగండి మీరంతా కలిసి భయపెట్టేలా ఉన్నారే అంటూ డోర్ తీసి చెవిలో ear phones పెట్టుకుని అక్క మొబైల్ లో పాటలు వింటున్న నా బుగ్గపై ముద్దుపెట్టడంతో ,

అక్కయ్యా అంటూ మొబైల్ ప్రక్కన పెట్టాను . 

తమ్ముడూ నిన్ను వీళ్లంతా చూడాలంటున్నారు .

అక్కయ్యా………….నన్ను ఎక్కడపడితే అక్కడ గిల్లుతారు అని బదులివ్వడంతో , అమ్మతోపాటు నవ్వుకుని , తమ్ముడూ నేనున్నాను కదా అలాచేస్తే వాళ్ళను కొట్టేస్తాను అంటూ నా నుదుటిపై సంతోషంతో ముద్దుపెట్టి చెయ్యి అందుకొని కిందకు దిగడం ఆలస్యం ,

హ్యాండ్సమ్ , క్యూట్ బాయ్ ,మహేష్ ………….అంటూ మీదకు వస్తుంటే , అక్కయ్య నన్ను వెనుక నుండి హత్తుకొని , ఒసేయ్ మీ చేష్టలతో నా బుజ్జి తమ్ముణ్ణి ఏమైనా చేసారనుకో ఊరుకోను .

ఏమిచేస్తావే ఏమిచేస్తావే ……….అంటూ ముందు అక్కయ్యకు గిలిగింతలుపెట్టి , నన్ను తమవైపు లాగి , హీరో మమ్మల్ని ఏమిచెయ్యమంటావు నువ్వు అంత క్యూట్ గా ఉంటేనూ మాచేతులను మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము అంటూ బుగ్గలపై ముద్దులతో ముంచెత్తి , ఈరోజుకు మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుంటున్నాము అంటూ కంగారుపడుతున్న నా తలపై ఇష్టంతో స్పృశించి తమ తమ బ్యాగులలోనుండి పెద్ద పెద్ద chocolates తీసి ఇచ్చారు . 

నాపెదాలపై చిరునవ్వు చిగురించడం చూసి అక్కయ్య కూడా సంతోషించింది . 

స్కూల్ లో జాయిన్ అయ్యావట కదా రోజూ chocolates ఇస్తాము కానీ ఇంత సాఫ్ట్ గా కాదు ఎందుకంటే ఈరోజు లాగా కంత్రిల్ చేసుకోవడం మావల్ల కాదు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు . 

అక్కయ్యా …….అంటూ అందరి మధ్యలోనుండి అక్కయ్య వెనుక దాక్కున్నాను . 

ఒసేయ్ నేను కూడా ఈరోజు ఉన్నంతలా సాఫ్ట్ గా ఉండను అంటూ అక్కయ్య నవ్వుతూ వారికొక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది .

చూద్దామే ఈ యుద్ధం లో ఎవరు గెలిచి హీరోని చేజిక్కించుకుంటారో అని చెప్పడంతో లోపల ఉన్న అమ్మతోపాటు అందరూ నవ్వుకుని , ఇక వెళతాము అని అక్కయితను కౌగిలించుకుని , అక్కయ్య వెనుజ నుండి తొంగిచూస్తున్న నావైపు కన్నుకొట్టి వెళ్లిపోయారు .

నావైపు తిరిగి ఇద్దరమూ నవ్వుకుని ఎక్కి కూర్చుని అన్నా షాపింగ్ మాల్ కు వెల్లమని చెప్పింది .

నేరుగా తీసుకెళ్లి గుంటూరులోని బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ముందు కారుని ఆపాడు .

నాకు చెరొకవైపు అమ్మ అక్కయ్య చేతులను పట్టుకుని లోపల కిడ్స్ wear దగ్గరకు పిలుచుకొనివెళ్లి , సేల్స్ గర్ల్ కు నన్ను చూపించి ఇప్పటి ట్రెండ్ కు తగ్గ అన్ని డ్రెస్సెస్ చూపించండి అని చెప్పింది .

అమ్మా నువ్వు తమ్ముడికి ఏవి నచ్చితే అవి తీసుకో నేను ఆ డిస్ప్లే లో ఉంచినవి సెలెక్ట్ చేస్తాను అని సుమారు గంటసేపు సంవత్సరానికి సరిపోయే బట్టలను సెలెక్ట్ చేసాము .

నెక్స్ట్ స్కూల్ డ్రెస్సెస్ , నైట్ డ్రెస్ లు , షార్ట్స్ , చలికి జర్కిన్స్ , స్టైల్ కోసం క్యాప్స్ ……..ఇలా అన్నింటినీ నాకోసం తీసుకున్నారు .

చివరన తమ్ముడూ లోచెడ్డీలు వేసుకుంటావా అని చెవిలో అడిగింది . 

నేను సిగ్గుపడుతుంటే ………

ముసిముసినవ్వులు నవ్వి , స్కూల్ కు వెళతావు కదా వేసుకో మంచిది అని బనియన్స్ మరియు చెడ్డీలను తీసుకుని ఇంకా ఇంకా అని ఆలోచించి thats it అని చెప్పడంతో కౌంటర్ కు పంపించారు . 

అక్కయ్య బిల్ పే చేసేసింది , షాప్ లో ఉన్నవాళ్లు అన్నింటినీ బయటకు తీసుకొచ్చి కారులో వెనుక ముందు సర్దేశారు . 

అక్కడి నుండి బుక్ స్టోర్ కు వెళ్లి స్కూల్ లో ఇచ్చిన లిస్ట్ ప్రకారం బ్యాగ్ బుక్స్ తీసుకుని అటునుండి foot wear కు వెళ్లి స్కూల్ కోసం షూస్ , రీబాక్ షూస్ మరియు చప్పల్స్ తీసుకుని ప్రక్కనే ఉన్న పిజ్జా కార్నర్ లో పిజ్జా తినేసి , ఐస్ క్రీమ్ షాప్ లో రెండు పెద్ద పెద్ద ఐస్ క్రీమ్స్ తీసుకుని కారులోకి చేరిపోయి , అన్నా ఐస్ క్రీమ్ కరిగేలోపు ఊరికి చేరిపోవాలి అని అక్కయ్య చెప్పింది . 

చూస్తారుకదా అమ్మగారు అంటూ కారుని పోనిచ్చాడు .

సిటీ దాటి చీకటిలోనే 20 నిమిషాలలో ఊరికి దగ్గరకు చేరుకున్నాము అని అక్కయ్య నన్ను హత్తుకొని నుదుటిపై ముద్దుపెట్టి చెప్పింది .

అక్కయ్యా ……..ఉదయం అడుగుదామనుకున్నాను , మన ఊరి దగ్గర మాత్రం పొలాలు పండలేదు , సిటీకి దగ్గరవుతున్న కొద్దీ ఎక్కడచూసినా పచ్చదనం కనిపించింది అని అడిగాను . 

అవును తమ్ముడూ కొన్ని సంవత్సరాల క్రితం మన ఊరిలో అంతకంటే పచ్చదనం ఉండేది పంటలతో కలకలాడిపోయేవి కానీ మన వెనుక ఉన్న ఊరివాళ్ళతో గొడవలు అందుకే వాళ్ళు అక్కడ ఉన్న డ్యామ్ నుండి నీటిని మన కాలువల్లోకి వదలడం లేదు , వాళ్లకు రాజకీయంగా పలుకుబడి ఉండటంతో మన ఊరివాళ్ళు ఏమీచెయ్యలేకపోతున్నారు . 

మన తోట ఒకప్పుడు నీళ్లతో పళ్ళు కూరగాయల చెట్లతో నిండుగా ఉండేది , కానీ ఇప్పుడు ఎందుటాకులతో నిండిపోయింది , అందుకే నిన్ను తీసుకువెళ్లలేదు లేకపోతే నిన్ననే వెళ్ళేవాళ్ళము . లోపల నేను నీళ్ళల్లో స్విమ్ చేసేదాన్ని ఇప్పుడు ఒక్క చుక్క కూడా నీరు లేదు అని బాధపడుతూ చెప్పింది . అమ్మ కళ్ళల్లో కూడా కన్నీరు కారింది.

కారు ఇంటిముందు ఆగింది , సోమయ్య పరిగెత్తుకుంటువచ్చి మొత్తం లాగేజీని డ్రైవర్ సహాయంతో లోపలపెట్టేశాడు . 

మహేష్ నీవలన స్టార్ హోటల్ లో మొదటిసారి తిన్నాను , చూడాలనుకున్న మూవీ చూసాను థాంక్స్ అని డ్రైవర్ చెప్పాడు .

అన్నయ్యా ……   మీఇంట్లో పిల్లలు ఉన్నారా ……….

నీవయసున్న ఒక తమ్ముడు ఉన్నాడు బాబు ,

తమ్ముడూ ఐస్ క్రీమే కదా అంటూ రెండింటిలో ఒకటి నాకు అందించింది . 

దానిని డ్రైవర్ అన్నకు అందించి నా ఫ్రెండ్ కు ఇవ్వండి అని బై చెప్పి , అక్కయ్య దగ్గరకు వచ్చి లవ్ యు అక్కయ్యా ………అంటూ సంతోషంతో చేతినిపట్టుకొని లోపలకువెళ్లాము .

తల్లి , బుజ్జి మీరు ఫ్రెష్ అయ్యి రండి అంతలోపు వంట వండేస్తాను అని అమ్మ నా నుదుటిపై ముద్దుపెట్టి చెప్పింది . 

అమ్మా పిజ్జా తో నా కడుపు నిండిపోయింది ……….

కొద్దిగానే కదా బుజ్జి తినింది , నిద్ర సరిగ్గా పట్టదు . నాచేతులతో ప్రేమతో తినిపిస్తాను అనిచెప్పింది. 

మా అమ్మ తినిపిస్తానంటే నేనొద్దంటానా అలాగే అమ్మా అంటూ అక్కయ్యను లాక్కుంటూ పైకి వెళ్ళాము. ఇద్దరమూ అలసిపోయినట్లు సోఫాలో వాలిపోయి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాము . 

తమ్ముడూ నైట్ డ్రెస్ వేసుకో కంఫర్ట్ ఉంటుంది , కింద నుండి తీసుకొస్తాను అంతలోపు నువ్వు ఫేస్ వాష్ చేసుకో అనిచెప్పడంతో ,

సరే అక్కా అంటూ బాత్రూమ్లోకివెళ్లి టాయిలెట్ పోసి ముఖం కడుక్కుని తుడుచుకుంటూ బయటకు వచ్చాను . అక్కయ్య బట్టలను బెడ్ పై ఉంచి తనుకూడా బాత్రూమ్లోకివెళ్లి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ లో వచ్చింది . 

అవునక్కా హాయిగా ఉంది అంటూ కిందకు వెళ్లి వంట గదిలో అమ్మతో మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తూ , వంట అవ్వగానే అమ్మచేతి ముద్దలు తిని గుడ్ నైట్ కిస్ అందుకొని ,మనసారా అమ్మను హత్తుకొని అక్కయ్య చేతిని అందుకొని పైకివెళ్లి , నిన్నలానే టీవీ చూస్తూ అక్కయ్య ప్రాణమైన వెచ్చటి ముద్దుల్లో తడుస్తూ హాయిగా నిద్రలోకి జారుకున్నాను.

తరువాతి రోజు ఆదివారం స్నానం చేసి కిందకువచ్చి అమ్మ అక్కయ్య చేతులలో టిఫిన్ తింటుంటే , బయటి నుండి మహేష్ మహేష్ ………..అంటూ ఒక పిలుపు వినిపించింది .

తమ్ముడూ నువ్వుతిను నేను చూస్తాను అంటూ వెళ్లి నావయసున్న పిల్లాడితో లోపలకువచ్చి , అదిగో నీ ఫ్రెండ్ మహేష్ అని నావైపు చూపించింది .

Hi మహేష్ అంటూ నాదగ్గరకువచ్చాడు .

ఆశ్చర్యపోతూనే hi అని పలకరించి , నవ్వుతున్న అక్కయ్యవైపు చూసాను .

నిన్న ఐస్ క్రీమ్ ఇచ్చి ఫ్రెండ్ అయ్యావు కదా తమ్ముడూ …………

ఐస్ క్రీమ్ సూపర్ మహేష్ , ఫ్రెండ్ కాబట్టి థాంక్స్ చెప్పాను………నాపేరు కృష్ణ అంటూ చేతిని చాపాడు .

Hi కృష్ణ అంటూ చేతిని కలిపి , అక్కయ్యా………నా ఫ్రెండ్ కు కూడా టిఫిన్ అనిచెప్పాను .

అయ్యో………..అంటూ తలపై మొట్టికాయ వేసుకుని లోపలకువెళ్లి ప్లేట్ లో తీసుకొచ్చింది . 

అక్కయ్యా……..ఇంట్లో తినేసివచ్చాను , కృష్ణ నువ్వు తింటేనే నేను తినేది అని నోటిని మూసేశాను . 

సరే మహేష్ అంటూ అక్కయ్య చేతిలోనుండి అందుకున్నాడు .

నిమిషంలో అయిపోగొట్టేసాడు . 

ఏయ్ కృష్ణ ఆకలి లేదన్నావు , అక్కయ్యా……..ఈసారి ఎక్కువ అని చెప్పాను . 

అక్కయ్య నవ్వుకుంటూ వెళ్లి ప్లేట్ నిండా పెట్టుకునివచ్చింది .

టిఫిన్ చాలా tasty గా ఉంది మహేష్ ………

మా అమ్మ చేతివంట రుచి అద్భుతం తిను అంటూ , ఆ ……..అని నోరుతెరిచాను .

అమ్మ మురిసిపోయి పెద్ద పెద్ద ముద్దలు తినిపించింది .

ఆ ప్లేట్ కూడా ఖాళీ చేసి , నేను మాట్లాడేంతలో ……….. కడుపు నిండిపోయింది , అమ్మా చాలా రుచిగా ఉంది అంటూ వేళ్ళను సైతం నాకేశాడు .

నవ్వుకుని అమ్మా నాకు కూడా చాలు ………..

లాస్ట్ ముద్ద అంటూ ప్రేమతో పెద్దది తినిపించి , నీళ్లు అందించింది .

మహేష్ అందరమూ క్రికెట్ ఆడటానికి వెళుతున్నాము , నిన్నుకూడా పిలుచుకునివేళదామని వచ్చాను రా వెళదాము అని పిలిచాడు .

అక్కయ్యవైపు చూస్తే ……..

వెళ్ళిరా తమ్ముడూ కృష్ణతోపాటు అందరూ ఫ్రెండ్స్ అవుతారు అని నుదుటిపై ముద్దుపెట్టు చెప్పి , నా జేబులో 100 రూపాయలు పెట్టి  ఏమైనా తినండి అంటూ తాగడానికి వాటర్ బాటిల్ కూడా అందించింది .

లవ్ యు అక్కయ్యా అంటూ అక్కయ్యను , అమ్మను కౌగిలించుకుని కృష్ణతో మాట్లాడుతూ బయటకు వెళ్ళాము .

అక్కయ్య మెయిన్ గేట్ వరకూ వచ్చి మేము టర్నింగ్ అయ్యేంతవరకూ చూస్తూ నిలబడి సంతోషంతో లోపలకువెళ్లింది .

ఊరి బయట పెద్ద గ్రౌండ్ , ఊరంతా అక్కడే ఉన్నట్లు ఏజ్ కు తగ్గట్లు నలువైపులా ఆడుతున్నారు . కృష్ణ తన టీం దగ్గరకు వెళ్లి రేయ్ మహేష్ అని పరిచయం చేసేలోపల , అవునురా నిన్న ఫంక్షన్ లో చూసాము అంటూ చేతులుకలిపి పేర్లు చెప్పి ఫ్రెండ్స్ అయిపోయాము.

ఫ్రెండ్స్ అంతా సరిసమానంగా డివైడ్ అయ్యి నన్ను కూడా ఒక టీమ్ లో వేసుకున్నారు .

ఫ్రెండ్స్ నాకు క్రికెట్ ఆడటం రాదు , ఇప్పటివరకూ బ్యాటు కూడా పట్టుకోలేదు అనిచెప్పాను .

మహేష్ చూస్తే వచ్చేస్తుంది కష్టమేమీ కాదు మనది బ్యాటింగ్ ఓపెనర్స్ ఆడేది చూడు అంతే , మనం ఆడేది టెన్నిస్ బాల్ కాబట్టి తగిలినా ఏమీకాదు అని చెప్పారు .

సరే అంటూ కృష్ణ ప్రక్కనే కూర్చున్నాను . బౌలింగ్ వెయ్యడం , మా టీమ్ బ్యాటింగ్ ఆడటం చూస్తుంటే , రాము రన్స్ , ఫోర్స్ , సిక్స్ లు , ఔట్ , బోల్డ్ , క్యాచ్ గురించి మొత్తం వివరించడంతో ఈజీ నే అనిపించింది . 

కొడుతున్నారు , ఔట్ అయ్యి వస్తున్నారు , నెక్స్ట్ బ్యాట్స్ మాన్ వెళుతున్నాడు . ఇక చివర మిగిలింది రాము , నేను .

ఔట్ అవ్వడంతో రేయ్ కృష్ణ ఇంకా రెండు over లు ఉన్నాయి కుమ్మేయ్ రా అని పంపించారు . 

అంతే కృష్బ వచ్చిన బాల్ ను వచ్చినట్లు బ్యాటును ఎత్తెత్తి కొడుతున్నాడు .

చివరి ఓవర్ ఫస్ట్ బాల్ కు మరొక ఫ్రెండ్ బౌల్డ్ అవ్వడంతో మహేష్ వచ్చెయ్ అంటూ కృష్ణ కేకవేశాడు . కాస్త కంగారుపడుతూనే వెళ్లి బ్యాటు పట్టుకున్నాను . మహేష్ టచ్ చేసి ఇటువైపు పరిగెత్తేయ్ అనిచెప్పాడు . వెళ్లి వికెట్స్ ముందు బ్యాటు పట్టుకుని నిలబడ్డాను . 

ఫస్ట్ బాల్ డాట్ , సెకండ్ బాల్ డాట్ ………….కృష్ణ నాదగ్గరకువచ్చి , చేతి కండలు తాకి మహేష్ నాకంటే బలం ఉంది నీకు బాల్ టైమింగ్ చూసి నీదగ్గరకు రాగానే లాగిపెట్టి కొట్టు అని చెప్పాడు .

నెక్స్ట్ బాల్ వెయ్యగానే నాదగ్గరికి రాకముందే ఎక్కడ తగులుతుందో అని కళ్ళుమూసుకుని బ్యాటును వెనక్కు లాగి కొట్టాను . బాల్ సరిగ్గా తగిలి మాప్రక్కనే ఆడుతున్న మరొక మ్యాచ్ అవతల సిక్స్ దాటేసింది . 

అంతే మహేష్ అంటూ కృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చి సంతోషంతో కౌగిలించుకున్నాడు .

నాకు మరింత ఉత్సాహం వచ్చేసింది . అలాగే కొట్టబోయి బౌల్డ్ అయిపోయాను.

బాధపడుతుంటే ఫస్ట్ మ్యాచ్ లోనే సిక్స్ కొట్టావు గ్రేట్ ఇప్పుడు ఫీల్డింగ్ అని నన్ను బౌండరీ దగ్గర నిలబెట్టారు . నా ఘోరమైన ఫీల్డింగ్ వలన , క్యాచ్ లు వదిలెయ్యడం వలన మా సైడ్ మ్యాచ్ ఓడిపోయింది . 

మహేష్ ఏమి పర్లేదు మరొక మ్యాచ్ ఆడదాము , లాస్ట్ లో బానే ఆపావు బ్యాటింగ్ లో సిక్స్ కొట్టావు ఇంకెమికావాలి గెలిచింది కూడా మన ఫ్రెండ్సే కదా అనిచెప్పడంతో ,

అవునుకదా అంటూ గెలిచినవాళ్ళతోపాటు ఎంజాయ్ చేసి , ఫ్రెండ్స్ నన్ను మీ లో చేర్చుకున్నందుకు అందరికీ ఐస్ క్రీమ్స్ నేను ఇప్పిస్తాను అంటూ 100 రూపాయలతో కొనిచ్చాను .

థాంక్స్ మహేష్ అంటూ తినేసి మరింత ఉత్సాహంతో మరొక మ్యాచ్ మొదట మాది ఫీల్డింగ్ . అందరిలానే నాదగ్గరికి వచ్చిన బాల్ ను వధలకూడదు అని నిర్ణయించుకొని దూరం వెళుతున్నా రైల్వే స్టేషన్ లలో ఫ్లాట్ ఫారం లలో ట్రైన్ వస్తోందంటే టిఫిన్ అమ్మడానికి ఎలా పరిగెత్తేవాడినో అలా  పరిగెత్తుకుంటూ వెళ్లి పడిపోయి మరీ ఫోర్ వెళ్లే బంతిని ఆపాను .

నేను ఆపను అనే ధైర్యంతో మరొక రన్ కు పరిగెత్తుతుంటే , బలంకొద్దీ కీపర్ వైపు విసిరాను . కీపర్ అందుకొని ఔట్ చేసి మహేష్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి సూపర్ అంటూ అభినందించారు . ఇక ఉత్సాహం రెట్టింపవ్వడంతో 90% బాల్స్ ఆపి, రెండు క్యాచ్ లు కూడా పట్టాను . 

మహేష్ నువ్వేనా ……….అంటూ ఆశ్చర్యపోయి సంతోషంతో బ్యాటింగ్ మొదలెట్టాము . స్కోర్ chase చేస్తూ వికెట్స్ కూడా రెగులర్ గా పడుతున్నాయి . చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం , అంతలో మాంచి ఊపులో ఉన్న కృష్ణ కూడా ఔట్ అయిపోయాడు . రన్నర్ గా అటువైపు ఉన్న ఫ్రెండ్ కు కూడా నాలాగే కొత్త , ఇక ఆ మ్యాచ్ కూడా పోయిందనుకున్నారు . 

కృష్ణ మాత్రం కన్ఫిడెన్స్ కోల్పోక నాదగ్గరికివచ్చి మహేష్ అంతలా పది dive లు చేసినా నీకు ఏమీకాలేదు , అంతే ధైర్యంతో బాల్ తగులుతుంది అన్న భయం వదిలి కళ్ళుతెరిచి కొట్టు చూడు అంటూ నాచాతీపై ఒక గుద్దు గుద్ది నొప్పికాలేదు కదా , బాల్ తగిలినా అంతే అని నాకు తెలుసు నువ్వు కొడతావు అని మరొక దెబ్బవేసి వెళ్ళిపోయి టెన్షన్ టెన్షన్ తో చూస్తూ నిలబడ్డాడు .

మొదటి బాల్ వెయ్యగానే కళ్ళుమూసుకుని బ్యాట్ లేపాను మిస్ అయ్యింది . 

ఇక ఒడిపోయినట్లే అని కృష్ణ తప్ప మిగితావాళ్ళంతా ఆకలౌతోందని వెనుతిరుగుతుంటే , కృష్ణ మాత్రం రెండు చేతులతో నాలో ఉత్సాహం నింపాడు .

నెక్ట్ బాల్ వెయ్యగానే కళ్ళుతెరిచి కొట్టబోయాను నా భుజం పై బలంగా తగిలింది . నొప్పి అనిపించకపోవడంతో ఇక వెయ్యండి అంటూ చిరునవ్వుతో రెడీ అయ్యాను . 

బ్యాట్ పిచ్ పడగానే చూసి కాస్త ముందుకెళ్లి మిడ్ ఆఫ్ లో ఇంటికి వెళుతున్న మా ఫ్రెండ్స్ మీదుగా వాళ్ళ ముందు బాల్ పడింది . 

రేయ్ చెప్పాను కదరా అంటూ కృష్ణ సంతోషంతో ఎగిరి గెంతులేస్తుంటే , బాల్ అందుకొని అందరూ వెనక్కు వచ్చి two బాల్స్ 6 రన్స్ అంటూ టెన్షన్ పడుతూ చూస్తున్నారు .

కృష్ణ వచ్చి సింగిల్ మాత్రం వద్దు 2 or 4 or six వాడికి బ్యాటు కూడా పట్టుకోవడం రాదు అని చెప్పి వెళ్ళాడు . 

నెక్స్ట్ బాల్ కొట్టినా ఫీల్డర్ దగ్గరకు వెళుతుంటే సింగిల్ తిరగకుండా ఆపేసాము .

కృష్ణ చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ టెన్షన్ రెట్టింపైంది . బాల్ వెయ్యబోతుంటే రాముతోపాటు అందరూ మహేష్ కొట్టు మహేష్ కొట్టు please అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు . హాఫ్ మ్యాట్ పిచ్ రావడంతో బలంకొద్దీ మిడ్ ఆన్ వైపు కొట్టినా బంతి బౌండరీకు చాలా దూరంలో ఉన్న ముళ్ళకంపల్లో పడింది .

మహేష్ సిక్స్ అంటూ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి పైకి లేపి ఎంజాయ్ చేశారు . బౌలింగ్ ఫ్రెండ్స్ వచ్చి రేయ్ మాంచి ప్లేయర్ దొరికాడు నెక్స్ట్ వీక్ అన్నయ్యలతో మ్యాచ్ పెట్టుకుందాము అని కాసేపు ఎంజాయ్ చేసి అందరితో ఉన్న కొంత కొంత డబ్బుతో ఐస్ క్రీమ్స్ అందరికీ కొని జుర్రేస్తూ ఎండలో చెమట కారుస్తూ చిరునవ్వులు చిందిస్తూ తింటూ కృష్ణ తోపాటు ఇంటికి చేరుకుని , 

రారా అంటూ చెయ్యిపట్టుకొని లాక్కుని అక్కయ్యా అక్కయ్యా ………..అంటూ సంతోషంతో లోపలకు వెళ్ళాము . వంట గదిలోనుండి వచ్చిన అక్కయ్యను అమితానందంతో హత్తుకొని , అక్కయ్యా అక్కయ్యా ………అంటూ ఆయాసంతో నేను కృష్ణ తోపాటు క్రికెట్ ఆడాను ఒక మ్యాచ్ గెలిచాము అని చెప్పాను .

అమ్మా ఫ్రిడ్జ్ లో చల్లని నీళ్లు తీసుకురా అని కేకవేసి తన కొంగుతో నా చెమటను తుడుస్తుంటే ………..

అవునక్కా ……….మహేష్ వల్లనే గెలిచాము అని కృష్ణ ఆనందంతో చెప్పాడు . 

ఫస్ట్ మ్యాచ్ నావల్లనే కదా రాము ఓడిపోయింది అదికూడా చెప్పు అని చెప్పాను . 

అది నీకు క్రికెట్ గురించి తెలియనప్పుడు అంటూ మొదటి నుండి జరిగిందంతా చెప్పి చివరలో రెండు సిక్స్ లు కొట్టి గెలిపించగానే అందరమూ వెళ్లి మహేష్ ను పైకి ఎత్తేసాము అక్కా అని చెప్పాడు .

అక్కయ్యా ………అంతా కృష్ణ వల్లనే , కృష్ణ లేకపోయుంటే అలా జరిగేది కాదు , నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు , థాంక్స్ రా అంటూ కృష్ణని కౌగిలించుకున్నాను . 

ఉదయం నుండి నిన్ను రా , ఒరేయ్ ………అని పిలుద్దామనుకున్నాను కానీ నువ్వేమనుకుంటావో అని భయపడ్డానురా అంటూ కృష్ణ నన్ను మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు .

మా సంతోషాన్ని చూసి అక్కయ్య మురిసిపోయి చేతితో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , తమ్ముడూ అమ్మ నేను కలిసి బిరియాని చేసాము , కృష్ణని పైకి పిలుచుకొనివెళ్లి ఫ్రెష్ అయ్యి రండి తిందాము అనిచెప్పింది .

లవ్ యు అక్కయ్యా అంటూ రెండుచేతులతో చుట్టేసి హత్తుకొని రారా …….అంటూ పైకి పిలుచుకొనివేళ్ళాను.

రేయ్ ఇంటికి వెళతాను లేరా అని కృష్ణగాడి మాటలు విని , కృష్ణా నీ ఫ్రెండ్ కు క్రికెట్ నేర్పించావు ట్రీట్ వద్దా , మీ అన్నయ్యకు కావాలంటే ఫోన్ చేసి చెబుతాను మీరు ముఖం చేతులు కడుక్కుని రండి , తమ్ముడూ తీసుకెళ్లు ……..

రేయ్ అక్కయ్య చెప్పిందికదా తినాల్సిందే అంటూ రూంలోకివెళ్లి ఫ్రెష్ అయ్యి కిందకువచ్చాము . 

మాఇద్దరినీ డైనింగ్ టేబుల్ లో కూర్చోబెట్టి కృష్ణకు మొదట వడ్డించి , నాకు అక్కయ్య తినిపించింది .

అక్కయ్యా …………నిన్న హోటల్ లో తిన్న బిరియానీ కంటే అద్భుతంగా ఉంది , అవునురా మహేష్ ఇలాంటి బిరియానీ నేను ఇంతవరకూ తినలేదు అంటూ ఆతృతతో తింటున్నాడు . 

మరేమనుకున్నావురా అమ్మ అక్కయ్య కలిసి చేశారు , రిజల్ట్ ఇలానే ఉంటుంది . లవ్ యు అమ్మా అక్కయ్యా …….అని సంతోషంతో చెప్పాను .అమ్మ మురిసిపోయింది .

రేయ్ ఉదయం అమ్మ తినిపించడం చూసాను , ఇప్పుడు అక్క తినిపిస్తోంది అని కృష్ణగాడు అడిగాడు .

అక్కయ్య మొత్తం వివరించడంతో , sorry రా అంటూ నా చేతిని స్పృశించి బిరియానీని కుమ్ముతుంటే ,అక్కయ్యతోపాటు నవ్వుకున్నాను .

క్రికెట్ ఆడి చెమట చిందించడం వలన కడుపునిండా తిన్నాము . 

రేయ్ అమ్మ ఎదురుచూస్తుంటుంది మళ్లీ కలుద్దాము అని వెళ్ళిపోయాడు . 

తమ్ముడూ సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉండు , అమ్మ నేను తినేసి జాయిన్ అవుతాము అని చెప్పడంతో , 

సోఫాలో వచ్చి కూర్చుని టీవీ on చేసి స్ట్రెయిట్ స్పోర్ట్స్ ఛానెల్ వెతికిమరీ పెట్టుకుని ఓల్డ్ మ్యాచ్ చూస్తున్నాను .

అక్కయ్య ప్లేటులో వడ్డించుకొని వచ్చి నా ప్రక్కనే సోఫాలో కూర్చుని తింటుంటే , రెండు మ్యాచ్ లు ఆడటం , బిరియాని కుమ్మడాన్ వలన క్రికెట్ చూస్తూ చూస్తూ అక్కయ్య భుజం పై వాలిపోయి నిద్రలోకిజారుకున్నాను.

సాయంత్రం మళ్లీ కృష్ణగాడు వచ్చాడు అని అక్కయ్య నా బుగ్గలను ప్రేమతో స్పృశిస్తూ లేపింది .

పైకివెళ్లి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని వచ్చేసరికి అక్కయ్య , అమ్మ మరియు కృష్ణగాడు మధ్యలో క్యారెమ్ బోర్డ్ పెట్టి మూడువైపులా కూర్చుని , తమ్ముడూ నీకోసమే ఎదురుచూస్తున్నాము వచ్చి కూర్చో మనిద్దరమూ ఒక జట్టు అనిచెప్పింది .

అక్కయ్యా ఈ ఆట కూడా నాకు రాదు ఒడిపోతాము అని బదులిచ్చాను .

నా తమ్ముడితో కలిసి ఆడితే చాలు నాకు ఆనందం ఓడిపోయినా పర్లేదు అని అక్కయ్య చెప్పింది .

అయినా మనం ఒడిపోయేది అమ్మతో వీడితోనే కదా అంటూ రాత్రివరకూ ఆపకుండా నవ్వుతూ ఎంజాయ్ చేసాము . 

రాత్రి కూడా కృష్ణగాడు నాతోపాటు భోజనం చేసి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు .

తమ్ముడూ ఉదయం స్కూల్ గుర్తుందికదా ………..

మా అక్కయ్యతోపాటు అంటూ వెళ్లి అక్కయ్య ప్రక్కన కూర్చున్నాను . 

నన్ను కౌగిలిలో బిగించి నుదుటిపై ప్రాణంలా ముద్దుపెట్టి తొందరగా లేవాలి కాబట్టి తొందరగా వెళ్లి పడుకుందాము అని చెప్పడంతో ……..

అలాగే అక్కయ్యా అంటూ అమ్మకు గుడ్ నైట్ చెప్పి ముద్దు తీసుకుని పైకివెళ్లి పడుకున్నాము.

 52ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 54, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: