newsTollywood NewsTrending News

అలాంటివి సౌత్ సినిమాలలోనే ఎక్కువగా కనిపిస్తాయి!

అలాంటివి సౌత్ సినిమాలలోనే ఎక్కువగా కనిపిస్తాయి!

అలాంటివి సౌత్ సినిమాలలోనే ఎక్కువగా కనిపిస్తాయి!

 అలాంటివి సౌత్ సినిమాలలోనే ఎక్కువగా కనిపిస్తాయి!
అలాంటివి సౌత్ సినిమాలలోనే ఎక్కువగా కనిపిస్తాయి!

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ వర్సెస్ సౌత్ అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఒకానొక సమయంలో ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ చిత్రాలు మాత్రమే అని చెప్పుకునే వారు అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ఇండియన్స్ సినిమా అంటే సౌత్ సినిమాలు అనే స్థాయికి సౌత్ ఇండస్ట్రీ ఎదిగిందని చెప్పాలి. సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా బాలీవుడ్ సినిమాలు ఘోర పరాజయం అవుతున్నాయి.

ఇలా బాలీవుడ్ సినిమాలు డిజాస్టర్లుగా నిలవడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం సౌత్ సినిమాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ అనురాగ్ కస్యప్ తాజాగా చెన్నై వచ్చారు. ఈ క్రమంలోనే ఈయన సౌత్ సినిమాల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన డైరెక్టర్ గా మాత్రమే కాకుండా నటుడిగా కూడా పలు సినిమాలలో నటిస్తున్నారు.

ఈ సందర్భంగా (Director) అనురాగ్ మాట్లాడుతూ….కమల్ హాసన్ రజిని గారి సినిమాల వల్లే నాకు సౌత్ సినిమాల గురించి తెలిసిందని తెలిపారు. ఇక చిరంజీవి నాగార్జున వంటి హీరోలు నటించిన సినిమాలు హిందీలో డబ్ అయ్యేవి.నాగార్జున నటించిన గీతాంజలి సినిమాలో లేచిపోదామా అనే డైలాగ్ చాలా ఆసక్తికరంగా అనిపించడంతో సినిమా మొత్తం చూసానని ఈయన తెలియజేశారు. ఇటీవల తమిళ్ లో విక్రమ్ గారి తంగలాన్ టీజర్ చూశాను.

అలాంటి విజువల్స్ హిందీలో కనిపించవు. కేవలం సౌత్ సినిమాలలో మాత్రమే కనిపిస్తాయి సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు వారి మూలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మూలాలకు ప్రాధాన్యత ఇవ్వరు.బాలీవుడ్ సినిమాలలో సహజత్వం తగ్గిపోయిందని సినిమా షూటింగ్లోకి కూడా ఇతర దేశాలకు వెళ్లి షూటింగ్ చేస్తారని తెలిపారు. కానీ నెగెటివిటీ, సహజత్వం అనేది కేవలం సౌత్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కనిపిస్తుంది అంటూ ఈ సందర్భంగా అనురాగ్ కశ్యప్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button