Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 30| ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 30| ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories – 30| ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్
Naa Autograph Sweet Memories – 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

సుమిత్ర : ఈ బాల్ ఎక్కడ అయితే ఆగుతుందో అక్కడ అస్థికలు దాచారు….మనం వెతుకుదాం పదండి…..
అంటూ లోపలికి అడుగులు వేస్తున్నది….ఆమె వెనకాలే రాము కూడా లోపలికి వెళ్ళ బోతుంటే….మహేష్ వెంటనే రాము చెయ్యి పట్టుకుని ఆపుతూ….
మహేష్ : అరేయ్…ఇంకో సారి ఆలోచించుకోరా….ఇదంతా మనకవసరా….హాయిగా పబ్ లో మందు కొట్టి పడిపోదాంరా….
ఆ మాట వినగానే సుమిత్ర వెనక్కి తిరిగి మహేష్ వైపు చూసి నవ్వుతూ….
సుమిత్ర : ఇంత దూరం వచ్చిన తరువాత భయపడతావేంటి….అయినా నీకు ముందే చెప్పాం కదా…వెనక్కు వెళ్ళిపోమని….
మహేష్ : అంటె…..అప్పుడు చాలా ధైర్యంగా ఉన్నది….ఇప్పుడు చీకటిలో ఈ మహల్ చూస్తుంటే ఒక పక్క గుండె లబ్ డబ్ అంటున్నది…..

రాము : ఏం పర్లేదు….లోపలికి రా….మనం ఆ ప్రేతాత్మ అస్థికలు తీసుకుని వెళ్లిపోదాం…..

మహేష్ : ఏంటిరా…నువ్వు చెప్పేది….ఎలా చెబుతున్నావంటే….మనం ఏదో బ్యాంక్ కి వచ్చి లాకర్లో ఉన్న వస్తువులు తీసుకుని వెళ్ళిపోదాం అన్నట్టు చెబుతున్నావు…..మనం ఇక్కడకు వచ్చింది ఒక ప్రేతాత్మ అస్థికలు తీసుకెళ్ళడానికి వచ్చాం….
రాము : ఏం పర్లేదురా….ఆ ప్రేతాత్మ సుందర్ తొ బిజీగా ఉన్నదిలే….మనల్ని పట్టించుకోదు….నువ్వు మాతో వచ్చేయ్….(అంటూ లోపలికి నడిచాడు.)

మహేష్ కూడా రాము వెనకాలే వస్తూ….
మహేష్ : అరేయ్….అది సుందర్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా మనం ఇక్కడకు వచ్చామని తెలిస్తే అది ఇక్కడకు రావడానికి ఒక్క క్షణం చాలురా…..మన లాగా దానికి కార్లో ట్రావెల్ చేయాల్సిన పని లేదు….వెంటనే వచ్చేస్తుంది….ఎన్ని సినిమాల్లో చూసాం…
రాము : అబ్బా….నీ నస ఆపరా బాబు….ఇంత భయపడే వాడివి ఎందుకు వచ్చావు….
మహేష : అబ్బా….ఛా….మీ ఇద్దరు కూడా భయపడుతున్నారు….అది మీ మొహాల్లో క్లియర్ గా కనిపిస్తున్నాది…కాకపోతే మీరు బయట పడటం లేదు….నేను ఓపెన్ గా చెబుతున్నాను….అంతే తేడా…..
సుమిత్ర : సరె….సరె….మా వెనకాలే వచ్చేయ్….నువ్వు తప్పిపోయావంటే ఇంత పెద్ద మహల్ లో ప్రేతాత్మ అస్థికలు వెదకడం మానేసి….నీకోసం వెదకాల్సి వస్తుంది….అప్పుడు నువ్వు పబ్ లో తాగి పడిపోవాల్సిన నువ్వు….ఇక్కడ రాజమహల్ లో భయంతో పడిపోవాల్సి వస్తుంది…..
దాంతో మహేష్ వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ల వెనకాలే నడుస్తూ ఫాలో అయ్యాడు.
అలా వాళ్లు ముగ్గురూ బాల్ వెళ్ళిన వైపు ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్తుంటే మహేష్ రాజ్ మహల్ లో చుట్టూ చూస్తూ కొంచెం వెనకబడ్డాడు.
అంతలో రాము, సుమిత్రలకు ఇద్దరికీ బాల్ కనిపించేసరికి దాని దగ్గరకు వెళ్లారు.
మెల్లగా నడుస్తున్న మహేష్ కి వాళ్ళిద్దరూ కనిపించకపోయేసరికి గబగబా నడుస్తూ వచ్చిన అతనికి వాళ్ళిద్దరూ బాల్ దగ్గర ఉండటం చూసి…..
మహేష్ : ఏంటిరా…..ఒక మగాడిని అలా వదిలేసి వెళ్ళిపోతారేంటి…..
అంటూ మహేష్ పరిగెత్తుకుంటూ వాళ్ల దగ్గరకు వచ్చాడు…
సుమిత్ర తల ఎత్తి మహేష్ వైపు చూసి నవ్వుతూ….
సుమిత్ర : ఇక్కడే ఎక్కడో అస్థికలు ఉంటాయి….వెదుకు…
రాము వాళ్ళిద్దరి మాటలు వింటూ అక్కడ ఎక్కడ దాచిపెట్టి ఉంటారు అని ఆలొచిస్తూ అక్కడ అంతా వెదుకుతున్నాడు.
రాము : ఇక్కడ ఎక్కడ దాచిపెట్టి ఉంటారు…..అదీ కాక ఇక్కడ ఏదో వర్క్ జరుగుతున్నట్టు ఉన్నది….
సుమిత్ర : అవును….ఏదో పెయింటింగ్ పని జరుగుతున్నది….కాని ఆ అస్థికలు ఇక్కడే ఎక్కడో తప్పకుండా ఉంటాయి….అది ఏ ప్లేస్ అనేది మనం కనిపెట్టాలి…
దాంతో ముగ్గురూ అక్కడ తలా ఒక వైపుకు వెళ్ళి వెదుకుతున్నారు….
అక్కడ గోడ మీద శిల్పాలు చెక్కి ఉన్నాయి….ఆ శిల్పాలు చాలా అందంగా ఉండే సరికి వాటిని చూస్తూ చుట్టూ వెదుకుతున్నారు.

అలా వెదుకుతున్న రాముకి అక్కడ గోడ మిద ఉన్న పెళ్ళి మండంపంలో అబ్బాయి, అమ్మాయి పెళ్ళి చేసుకుంటున్న శిల్పాలు అక్కడ చుట్టూ ఉన్న బొమ్మలు బాగా ఆకర్షించాయి….
రాము ఆ బొమ్మల్లో పక్కనే ఉన్న ఒకదాని మీద ఒకటి పేర్చిఉన్న కుండల వైపు చూస్తూ….దాని దగ్గరకు వెళ్ళి తాకుతూ….
రాము : పెళ్ళి మండపంలో ఎన్ని కుండలు పేర్చుతారు

ఆ మాట వినగానే సుమిత్ర వెనక్కు తిరిగి రాము వైపు ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అన్నట్టు విసుగ్గా చూసింది.
కాని మహేష్ మాత్రం వెంటనే, “ఏడు కుండలు ఉంటాయి….” అన్నాడు.
రాము ఆ శిల్పాల్లో ఉన్న కుండల వైపు చూసి, “కాని ఇక్కడ ఎనిమిది ఉన్నాయి….” అన్నాడు.
దాంతో సుమిత్ర, మహేష్ కూడా అక్కడకు వచ్చి ఆ కుండల వైపు చూసారు…..ఆ కుండల్లో పై కుండ మాత్రం చెక్కిన శిల్పాల్లా కాకుండా నిజం కుండ పెట్టినట్టు వేరేగా ఉన్నది.
రాము వెంటనే అక్కడ ఉన్న సుత్తి, శానం తీసుకుని అక్కడ ఉన్న స్టూల్ ఆ బొమ్మల దగ్గర వేసి ఆ కుండని తీయడానికి తన చేతిలో ఉన్న శానాన్ని పెట్టి దాని మీద సుత్తితో కొట్టబోయాడు….
కాని అంతలో వాళ్ళు నిల్చున్న చోట నుండి కొద్దిదూరంలో ఎవరో అరుస్తున్నట్టు వినిపించడంతో ముగ్గురూ అటు తిరిగి చూసారు.
వాళ్ళు చూస్తుండగానే వాళ్ళకు కొద్ది దూరంలో వాళ్ళు ఎక్కి వచ్చిన పడవ తాలూకు తాళ్ళు పడ్డాయి.
అది చూసి మహేష్ భయంతో, “అరేయ్….నువ్వు ఇక్కడ కుండ మీద చెయ్యి పెట్టగానే….ఆ ప్రేతాత్మ వచ్చేసిందిరా….అదేనా…. సుమిత్రా,” అంటూ సుమిత్ర వైపు చుస్తూ అడిగాడు.

సుమిత్ర మహేష్ వైపు చూసి, “నీకు ఇంకా డౌట్ గా ఉన్నదా….అదే వచ్చేసింది….(అంటూ రాము వైపు తిరిగి) రామూ….నేను పడవ దగ్గరకు వెళ్తాను….పడవ వెళ్ళిపోయిందంటే మనం ఇక్కడ నుండి వెళ్ళలేము….నువ్వు ఎట్టి పరిస్థితుల్లోను దాని అస్థికలు ఉన్న కుండను ప్రేతాత్మకు చిక్కనివ్వకు….దాన్ని ఇక్కడ నదిలో కలిపితేనే దానికి ముక్తి లభిస్తుంది….నువ్వు కానివ్వు….” అంటూ అక్కడనుండి పరిగెత్తుకుంటూ కింద పడి ఉన్న తాడు తీసుకుని  వెళ్ళింది.
దాంతో రాము తన చేతిలొ ఉన్న సుత్తి తో అక్కడ కుండ చుట్టూ జాగ్రత్తగా శానంతో చెక్కి వాటిని కింద పడేసి కుండని బయటకు తీసాడు.
సుమిత్ర పరిగెత్తుకుంటూ రాజ్ మహల్ నుండి బయటకు వచ్చి తాము బోట్ కట్టేసిన చోటకు వచ్చింది….కాని అప్పటికే అది నదిలో దూరంగా వెళ్ళిపోయింది.
అలా గట్టు మీద నిల్చున్న సుమిత్ర ఏం చేయాలో తోచక అలాగే చూస్తుంటే….కింద నుండి ఒక చెయ్యి పైకి వచ్చి సుమిత్ర కాలిని పట్టుకుని కిందకు లాగింది.
సుమిత్ర ఒక్కసారిగా కింద పడిపోయింది….ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఆ మోహిని ప్రేతాత్మగా మారిపోయి సుమిత్ర కాళ్ళను పట్టుకుని నదిలోకి ఈడ్చుకు పోయింది.
లోపల రాజ మహల్ లొ రాము తన చేతిలో ఉన్న కుండని కింద పెట్టి దాని పైన మూతని తీసి చూసాడు.
లోపల అస్థికలు ఉందటంతో రాము మళ్ళీ కుండ మీద మహేష్ ఇచ్చిన కర్చీఫ్ ని జాగ్రత్తగా కట్టేసి చేతుల్లోకి తీసుకుని పైకి లేవగానే ఎదురుగా సుమిత్ర రావడం చూసారు.
రాము : సుమిత్రా….అస్థికలు దొరికాయి….
సుమిత్ర : సరె….పదండి వెళ్దాం….
అంటూ వెనక్కు తిరిగి బయటకు నడుస్తుండటంతో రాము, మహేష్ కూడా ఆమె వెనకాల నడవడం మొదలుపెట్టారు.

కాని మహేష్ కి మాత్రం మనసులో ఎక్కడో డౌట్ గా ఉన్నది….ఇంత ప్రశాంతంగా ఉండటం చూసి చుట్టూ చూస్తూ నడుస్తూ సుమిత్ర వైపు చూసాడు.
ఎప్పుడూ గలగల మాట్లాడె సుమిత్ర ఏం మాట్లాడకుండా నడుస్తుండే సరికి డౌట్ వచ్చి రాము వైపు చూసి…..
మహేష్ : అరేయ్….సుమిత్ర ఏంటిరా….మాట్లాడకుండా మెదలకుండా నడుస్తున్నది

అని అతనితో గుసగుసగా అంటుండగానే సుమిత్ర ఒక్కసారిగా నడవడం ఆపి కదలకుండా నిల్చున్నది.
సుమిత్ర ఎందుకు ఆగిందో అర్ధం కాక వాళ్ళిద్దరూ కూడా ఆగి ఆమె వైపు చూస్తున్నారు.
సుమిత్ర ఒక్కసారిగా వెనక్కు తిరిగింది….ఆమె మొహం మొత్తం వికృతంగా మారిపోయింది.

అది చూసి మహేష్, “అరేయ్ రాము….దీన్ని ఆ మోహిని ఆవహించిందిరా….నిన్న నా ఆత్మ జైల్లో ఈమెను చూసినప్పుడు చాలా అందంగా ఉన్నదిరా అనుకున్నాను….కాని ఇప్పుడేంటిరా ఇలా భయంకరంగా ఉన్నది…..” అన్నాడు కంగారుగా.
రాము : అరేయ్….నాక్కూడా అర్ధమవుతున్నది…ముందు ఏం చేద్దామో చెప్పు….మనం ఎలాగైనా ఈ మహల్ నుండి బయటకు వెళ్ళగలిగితే చుట్టూ నది ఉన్నది కాబట్టి నీళ్లల్లో ఈ అస్థికలను ఈజీగా కలపొచ్చు…..
మహేష్ : ఏంటిరా చెప్పేది….సుమిత్రను చూస్తుంటేనే ఇక్కడ ఫ్యాంట్ తడిచిపోతున్నది….దాని అస్థికల సంగతి తరువాత….ముందు మన అస్థికలు నీళ్ళల్లో కలవకుండా చూసుకోవాలి….
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే సుమిత్ర వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ….
సుమిత్ర : ఎక్కడికి తీసుకెళ్తున్నార్రా నా అస్థికలను…..(అంటూ తన మొహాన్ని ఇంకా భయంకరంగా మారుస్తూ రాము వైపు కోపంగా చూస్తూ) నా అస్థికలు నాకు ఇచ్చేయ్…..
సుమిత్రను అలా చూసేసరికి రాముకి ఏం చేయాలొ అర్ధం కాలేదు….దాంతో ముందు అక్కడ నుండి తప్పించుకుపోవాలని అనుకుంటూ తప్పించుకునే దారి కొసం చుట్టూ చూస్తున్నాడు.
అలా రాము ఆలోచిస్తుండగానే సుమిత్ర రాము దగ్గరకు వచ్చి అతని చేతిలో ఉన్న కుండని లాక్కోవడానికి ట్రై చేస్తున్నది.
అంతలో మహేష్ కూడా తేరుకుని ఆ కుండని సుమిత్రకు అందనివ్వకుండా రాముతో పాటు కుండ సుమిత్ర  చేతుల్లోకి వెళ్లకుండా ఆమెను తోస్తున్నాడు.
దాంతో సుమిత్ర కోపంతో ఒక చేత్తో మహేష్ ని బలంగా తోసేసరికి ఎగిరి దూరంగా పడిపోయాడు.
అలా ఎగిరి పడటంతో మహేష్ పైకి లేవలేక నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు.
ఇంతలో సుమిత్ర ఒక చేత్తో రాము గొంతుని గట్టిగా పట్టుకుని గోడకు ఆనించి పైకి లేపి ఇంకొ చేత్తో రాము చేతిలొ ఉన్న కుండను అందుకోవడానికి ప్రయత్నిస్తూ, “నా అస్థికలు నాకిచ్చేయ్,” అంటూ కుండను లాక్కోవడానికి ట్రై చేస్తున్నది.
రాము తన చేతిలో ఉన్న కుండని సుమిత్రకు అందకుండా పైకెత్తి పట్టుకుని తన గొంతుని గట్టిగా పట్టుకున్న ఆమె చేతిని పట్టుకుని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ మహేష్ వైపు చూసాడు.
అప్పుడే మహేష్ కూడా పైకి లేవడంతో రాము తన చేతిలో ఉన్న కుండను మహేష్ వైపుకి విసిరేసాడు.
దాంతో మహేష్ వెంటనే కుండను పట్టుకున్నాడు.
సుమిత్ర వెంటనే రాముని వదిలేసింది…..కాని సుమిత్రకు మాత్రం తనను మోహిని ఆవహించిందని అర్ధమవుతున్నది.
దాంతో తనలో ఉన్న మోహిని మళ్ళీ రాముని పట్టుకోకుందా ఉండటానికి తన శక్తి నంతా కూడగట్టుకుని తన ఎడమ చేత్తో కుడి చేతిని పట్టుకుని ఆపడానికి ట్రై చేస్తున్నది.

కాని మోహిని ప్రేతాత్మ ముందు సుమిత్ర మానవ శక్తి చాలడం లేదు.
సుమిత్ర అలా తనలొ ఉన్న మోహిని ప్రేతాత్మని ప్రతిఘటించడం చూసి రాము భయంతో పైకి లేచి నిల్చున్నాడు.
అది చూసి సుమిత్ర, “రామూ….వెంటనే ఇక్కడ నుండి వెళ్ళు…..” అంటూ అక్కడ ఉన్న స్తంభాన్ని పట్టుకుని తనను తాను కంట్రోల్ చేసుకోవాడానికి ప్రయత్నిస్తున్నది.
కాని ఆమెలో ఉన్న ప్రేతాత్మ మాత్రం సుమిత్ర ఒంటిని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నది

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button