ఆ శబ్ధం వచ్చిన రూమ్ దగ్గరకు వచ్చి చూసేసరికి అంతకు ముందు ఆ రూమ్ కి వేసిన తాళం గడితో సహా ఊడి కింద పడి ఉండటం గమనించాడు.
రాము చిన్నగా రూమ్ వైపు చూస్తూ కింద పడి ఉన్న తాళాన్ని గడితో సహా చేతిలోకి తీసుకుని, “ఎవరూ లేకుండా డోర్ కి వేసున్న తాళం….గడితో సహా ఎలా ఊడింది…..” అని అనుకుంటూ దాన్ని చూస్తున్నాడు.
ఆ గడిని చేతిలోకి తీసుకుని ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూసాడు….కాని ఎవరూ కనిపించలేదు.
మళ్ళి రాము ఆ రూమ్ వైపు చూసి చిన్నగా వణుకుతున్న గుండెతో వెళ్దామా వద్దా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు.
లోపల అంతా చిందరవందరగా ఉన్నది….అలా చూస్తున్న రాముకి అక్కడ చైర్ లో ఒక పెద్ద ఫోటో మీద క్లాత్ కప్పి ఉండటంతో దాని దగ్గరకు వెళ్ళి క్లాత్ తీసాడు.
ఫోటో ఫ్రేమ్ మీద క్లాత్ తీయగానే ఆ ఫోటోలో ఉన్న ఆమెను చూడగానే రాము కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి.
ఆమె చాలా అందంగా ఉన్నది…మొహంలో ప్రశాంతత, పెదవుల మీద అందమైన చిరునవ్వు, కలువ పూలలాంటీ పెద్ద కళ్ళు… ఆమెను అలా చూస్తుంటే ఎవరైనా సరె ఆమె కళ్ళు, పెదవులు అలాగే చూస్తూ ఆనందంగా చనిపోవచ్చు అన్నంత అందంగా ఉన్నది.
రాము ఫోటోలో ఉన్న ఆమె వైపు అలాగే కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు.
ఆమెను అలా చూడగానే రాము మనసులో అదో రకమైన ప్రేమ భావం కనిపించి….అలాగే ఆరాధనగా చూస్తున్నాడు.
రాము అలా చూస్తుండగా వెనకాల డోర్ దగ్గర ఉన్న కిటికీ అద్దం మీద ఎవరో ఒకరు అక్కడ నిల్చుని తన చేతిని అద్దం మీద పెట్టినట్టు ఒక చేతి గుర్తు పడటం….ఆ చేతి గుర్తుతో పాటు ఎవరో అక్కడ నిల్చున్నట్టూ ఊపిరి వదులుతున్నట్టు అద్దం మీద పొగ లాగా పడుతుండటం అటు వైపు తిరిగి ఫోటో వైపు చూస్తున్న రాము గమనించలేదు.
రాము ఆ ఫోటో ముందు నిల్చుని ఫోటోలో ఉన్న ఆమె వైపు చూడటం అక్కడ అదృశ్యంగా ఎవరో నిల్చుని రాము చూస్తున్నారు.
ఆ చూడటం కూడా కోపంగా చూస్తున్నట్టు అతని ఊపిరి వదలడం ద్వారా తెలుస్తున్నది.
అలా కొద్దిసేపు ఆ ఫోటో చూసిన తరువాత రాము, “ఎంత అందంగా ఉన్నదో….ఎవరై ఉంటారు,” అని అనుకుంటూ తన చేతిలో ఉన్న గొళ్లాన్ని అక్కడ టేబుల్ మీద పెట్టి తన బెడ్ రూమ్ లోకి వచ్చి పడుకుని నిద్ర పోయాడు.
అప్పటికే అనసూయతో బెడ్ మీద కష్టపడి అలసిపోయిన రాముకి పడుకున్న వెంటనే బాగా నిద్ర పట్టేసింది.
అలా గాఢమైన నిద్రలో ఉన్న రాముకి ఒక్కసారిగా ఏదో పడినట్టు శబ్దం వినిపించేసరికి వెంటనే మెలుకువ వచ్చి బెడ్ మీద నుండి లేచి కూర్చున్నాడు.
రాము బెడ్ మీద కూర్చుని చుట్టూ చూసాడు….చీకటిగా ఉండటంతో ఏమీ కనిపించడం లేదు.
ప్రక్కనే ఉన్న తన సెల్ తీసుకుని టైం చూసాడు….అప్పటికి టైం అర్ధరాత్రి మూడు గంటలు అయింది.
వెంటనే సెల్ లో టార్చ్ ఆన్ చేసి శబ్దం వచ్చిన వైపు చూసాడు.
ఆ గదిలో ఉన్న బుక్ షెల్ఫ్ లోనుండి ఒక బుక్ కింద పడి ఉండటం గమనించాడు.
అది చూసి రాము విసుక్కుంటూ బెడ్ మీద నుండి కిందకు దిగి షెల్ప్ దగ్గరకు వెళ్ళి కింద పడిన బుక్ ని తీసుకుని షెల్ఫ్ లో పెడుతున్న అతనికి ఇందాక తాళం ఊడి పడిన గదిలో నుండి ఏదో శబ్దం వినిపించి తన గదిలోనుండి బయటకు వచ్చాడు.
బయట ఎవరూ కనిపించలేదు….దాంతో రాముకి ఆ శబ్దం ఇందాక తాను ఫోటో చూసిన గదిలో నుండి వచ్చినట్టు అర్ధమయింది.
రాములో చిన్నగా భయం మొదలయింది….గుండె కొట్టుకునే వేగం పెరగడంతో తన గుండే శబ్దం తనకే వినిపిస్తున్నది.
దాంతో రాము తనలో ఉన్న ధైర్యాన్ని కూడగట్టుకుని గట్టిగా, “ఎవరు….” అని అరిచాడు.
కాని ఏ విధమైన సమాధానం రాకపోయే సరికి రాము చిన్నగా ముందుకు అడుగులు వేస్తూ, “ఎవరు….ఎవరున్నారక్కడ,” అని అరుస్తూ బయటకు కారిడార్ లోకి వచ్చాడు.
అలా రాము మెల్లగా అడుగులు వేసుకుంటూ శబ్దం ఎక్కడ నుండి వస్తుందా అని ఆలోచిస్తున్న అతనికి ఒక్కసారిగా ఒక ఆడగొంతు గట్టిగా అరిచినట్టు వినిపించేసరికి…ఒక్కసారిగా అదిరిపడి వెంటనే ధైర్యం తెచ్చుకుని ఏదైతే అది అయిందని అరుపు ఎక్కడ నుండి వినిపిస్తుందో అర్ధం కాక కింద కారిడార్ అంతా తిరిగి మళ్ళి కారిడార్ లోకి వచ్చి చుట్టూ చూస్తున్నాడు.
అలా చూస్తున్న రాముకి ఇందాక తాళం ఊడిపడిన గదిలో నుండి లైట్లు వెలుగుతూ ఆరుతున్నట్టు చూసాడు.
ఆ లైట్లు కూడా చాలా స్లోగా వెలుగుతున్నట్టు, మళ్ళీ అంతే స్లోగా ఆరిపోతున్నట్టు గమనించాడు.
దాంతో రాము చిన్నగా తన గుండె చిక్కబట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గది దగ్గరకు వెళ్ళాడు.
అలా వెళ్ళిన అతను ఆ గది కిటికి మీద ఇందాక తాను ఫోటో చూస్తున్నప్పుడు ఒక అదృశ్య వ్యక్తి నిల్చున్న చేతి గుర్తుని కిటికీ అద్దం మీద చూసాడు.
ఆ చేతి ముద్రను చూడగానే రాము కళ్ళు ఆశ్చర్యంతో, భయంతో పెద్దవయ్యాయి.
అ చేతి ముద్రను అలాగే తీక్షణంగా చూస్తూ రాము కిటికీ ఆద్దం దగ్గరకు వెళ్ళాడు.
అలా ఆ చేతి ముద్రను చూస్తున్న రాముకి హఠాత్తుగా రక్తంతో తడిచిన చెయ్యి అద్దం మీద పడుతూ మళ్ళీ ఒక అమ్మాయి భయంకరంగా అరుస్తున్నట్టు వినిపించి…..రక్తంతో తడిచిన చేయి వెంటనే మాయమయింది.
ఊహించని పరిణామానికి రాము భయంతో ఒక్కసారిగా నాలుగడుగులు వెనక్కి పడ్డాడు.
మళ్ళి వెంటనే లేచి ఆ రూమ్ లోకి పరిగెత్తి ఆ చీకటిలోనే అంతా కర్టెన్ల వెనకాల, ఆ గది మూలమూలలా వెదుకుతున్నాడు.
అలా వెదుకుతున్న రాముకి బెడ్ కింద ఒక అమ్మాయి కాలు కనిపించింది…..కాని అంతలోనే ఆ కాలు లోపలికి వెళ్ళడం చూసాడు.
రాము మొహంలో ఇక్కడ ఏదో జరుగుతుందని అర్ధం అయింది.
బెడ్ మీద దుప్పటి సగం కిందకు నేల మీదకు జారి ఉన్నది….రాము అదురుతున్న గుండెతో చిన్నగా బెడ్ దగ్గరకు వచ్చాడు.
రాము చిన్నగా మోకాళ్ళ మీద కూర్చుని వణుకుతున్న చేత్తో బెడ్ మీద నుండి కిందకు వేలాడుతున్న దుప్పటిని పైకి లేపాడు.
కాని బెడ్ కింద ఇందాక కనిపించిన అమ్మాయి కాలు గాని…..రక్తం మరకలు గాని ఏమీ కనిపించలేదు.
దాంతో రాము కొద్దిసేపు అలాగే అక్కడ అంతా చుట్టూ చూసి వెంటనే తన గదిలోకి వచ్చి పడుకున్నాడు.
బెడ్ మీద రాము పడుకున్నాడే కాని నిద్ర పట్టలేదు…..తన మనసు మొత్తం ఇందాక జరిగిన సంఘటన గురించే ఆలోచిస్తున్నది.
“అసలు ఈ ఒబెరాయ్ విల్లాలో ఏం జరుగుతున్నది…..ఎవరో ఉన్నారు….అది నాకు తెలుస్తున్నది….అంత భీకరంగా, బాధగా అరిచిన ఆ గొంతు ఎవరిది….బెడ్ కింద కనిపించి మాయమైపోయిన కాలు ఎవరిది…..రంగ చెప్పినట్టు నిజంగానే ఈ ఇంట్లో దెయ్య ఉన్నదా? అనవసరంగా ఇక్కడకు వచ్చి రిస్క్ చేస్తున్నానా…..” అని రాము రకరకాలుగా ఆలోచిస్తున్నాడు.
అలా ఆలోచస్తూనే రాము తనకు తెలియకుండానే నిద్రపోయాడు.
పొద్దున్నే తొమ్మిది గంటలకు రాముకి మెలుకువ వచ్చింది…..వెంటనే అతనికి రాత్రి జరిగింది గుర్తుకొచ్చింది.
వెంటనే బెడ్ మీద నుండి దిగి గబగబ స్నానం చేసి రెడీ అయ్యాడు.
అలా బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చిన రాముకి అనసూయ కిచెన్ లో టిఫిన్ చేస్తూ కనిపించింది.
ఆమెను చూసిన రాము ఆశ్చర్యంగా కిచెన్ లోకి వెళ్ళి….
రాము : లోపలికి ఎలా వచ్చావు….మెయిన్ డోర్ లాక్ చేసి ఉన్నది కదా…
అనసూయ : డోర్ గడి వేసి లేదు బాబు….దగ్గరకు వేసి ఉన్నది….లోపలికి వచ్చి చూస్తే మీరు మంచి నిద్రలో ఉన్నారు….సరె…. లేపడం ఎందుకులే అని టిఫిన్ రెడీ చేస్తున్నాను.
రాము : నేను తలుపు వేసే పడుకున్నాను….నాకు బాగా గుర్తున్నది.
అనసూయ : లేదు బాబు….మర్చిపోయి ఉంటారు….
రాము : లేదు అనసూయ….ఇంట్లో ఏదో జరుగుతున్నది….
అంటూ డైనింగ్ హాల్లోకి వచ్చి కూర్చుని ఆలోచిస్తున్నాడు.
అనసూయ దోసెలు వేసుకుని ప్లేట్లో పెట్టుకుని వచ్చి రాము ముందు టేబుల్ మీద పెట్టింది.
కాని రాము తన వైపు కాని….వచ్చినదగ్గర నుండి తనను నలిపేయడం కాదుకదా….తన వైపు సరిగ్గా చూడను కూడా చూడకపోవడం…పైగా టిఫిన్ కూడా చేయకుండా ఆలోచిస్తూ కూర్చున్న రాముని చూసి ఏదో జరిగిందని అనసూయకు అర్ధమయింది.
అనసూయ చిన్నగా రాము భుజం మీద చెయ్యి వేసి….
అనసూయ : ఏం జరిగింది బాబు…..
రాము తల ఎత్తి అనసూయ వైపు చూసి రాత్రి తాను చూసింది….విన్నది మొత్తం వివరంగా ఆమెకు చెప్పాడు.
అది విన్న అనసూయ కూడా అక్కడ చుట్టూ చూస్తూ భయపడుతున్నది.
అనసూయ : నేను ముందే చెప్పా కదా బాబు…ఈ ఇంట్లో దెయ్యం ఉన్నదని…మీరు వెంటనే ఈ బంగ్లా నుండి బయటకు వెళ్ళిపోండి.
రాము : లేదు అనసూయ….మా నాన్న ఇక్కడ ఏదో జరుగుతుందనే నన్ను పంపించారు….నేను బయలుదేరేటప్పుడు ఇదంతా ఒట్టి పుకారు అనుకున్నాను….కాని నాకు రాత్రి ఎదురైన సంఘటనతో మా నాన్న భయడింది….నీ మొగుడు రంగ చెప్పింది నిజమే అనిపిస్తున్నది…..
అనసూయ : మీరు ఈ బంగ్లా లో ఒంటరిగా ఉంటానని నా మొగుడితో అనగానే ఆయన బాగా భయపడ్డారు బాబు….ఇంటికి వచ్చిన తరువాత చాలా సార్లు రాత్రి మీకు భోజనం పెట్టి వెళ్ళిన తరువాత నా మొగుడు చాలా సార్లు మీ గురించే భయపడుతున్నాడు.
ఆమె అలా మాట్లాడుతుంటే రాముకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది.
రాము : అనసూయ….ఈ బంగ్లా ఓనర్ ఎక్కడ ఉంటాడు….
అనసూయ : ఎందుకు బాబు….
రాము : ఆయనతో మాట్లాడితే అసలు విషయం ఏంటో తెలుసుకోవచ్చు….
ఆ మాట వినగానే అనసూయ కోపంతో…..
అనసూయ : ఏంటి బాబూ….రాత్రి జరిగింది కళ్ళారా చూసిన తరువాత కూడా మాట వినకుండా ఓనర్ని కలుస్తానంటారేంటి….
రాము : చూడు అనసూయా…..ఇప్పుడు నేను వెనకడుగు వేయలేను….ఈ ఒబెరాయ్ విల్లాలో ఇలాంటి లిటికేషన్ ఉన్నది కాబట్టె ఇంత తక్కువ రేటుకి అమ్మకానికి వచ్చింది….అదీ కాకా మాకు ఈ డీల్ చేసినందుకు కోట్లలో లాభం వస్తుంది.
అనసూయ : డబ్బు కన్నా ప్రాణం గొప్పది బాబు….నా మాట విని మీరు ఇక్కడ నుండి మీ ఊరికి వెళ్ళిపోండి….బతికుంటే డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు….
రాము : చూడు….నీకు చెప్పినా అర్ధం కాదు…అసలు ఇక్కడ ఏం జరుగుతుందో….ఎందుకు జరుగుతుందో తెలుసుకోకుండా మా ఊర్లో కూడా ప్రశాంతంగా ఉండలేదు….నువ్వు నీ మొగుడికి ఫోన్ చేసి ఈ ఒబెరాయ్ విల్లా ఓనర్ అడ్రస్ అడుగు….
అంటూ తన ఫోన్ అనసూయకు రంగకు ఫోన్ చెయ్యమన్నట్టుగా ఇచ్చి టిఫిన్ ప్లేట్ దగ్గరకు లాక్కుని తింటున్నాడు.
అనసూయ : మొండి ఘటం….చెప్తే అర్ధం కాదు….
అని విసుక్కుంటూ తన మొగుడికి ఫోన్ చేసి ఒబెరాయ్ విల్లా ఓనర్ అడ్రస్ కనుక్కుని రాముకి చెప్పింది.
రాము టిఫిన్ తినడం పూర్తి చేసి….కార్ కీస్ తీసుకుని బయలుదేరుతూ….
రాము : అనసూయా….నువ్వు ఒక్కదానివే ఇప్పుడు ఒబెరాయ్ విల్లాలో ఉండొద్దు….నాతో వచ్చేయ్….మీ ఇంటి దగ్గర దింపుతాను….
రాము చెప్పిన దానికి అనసూయ కూడా సరె అన్నట్టు తల ఊపుతూ కిచెన్ అంతా సర్దేసి మెయిన్ డోర్ తాళం వేసి రాముకి ఇచ్చి కారులో కూర్చున్నది.
అనసూయ వాళ్ళీంటి ముందు కారు ఆపాడు….అనసూయ కారు దిగి….
అనసూయ : బాబుగారు…..ఇప్పటికైనా నా మాట వినండి….మీ ఊరు వెళ్ళిపోండి….
రాము : లేదు అనసూయా….ఇదేంటో తెల్సుకోవాల్సిందే….
అంటూ కారు స్టార్ట్ చేసి అనసూయ చెప్పిన ఓనర్ ఇంటి అడ్రస్ మధ్యలో ఇద్దరి ముగ్గురిని అడుగుతూ వాళ్ళింటికి చేరుకున్నాడు.
కార్ పార్క్ చేసి రాము ఇంట్లోకి వెళ్ళాడు…..ఒక మధ్య వయస్కుడు వచ్చి రాము వైపు ఎవరు అన్నట్టు చూసాడు.
దాంతో రాము తనను తాను పరిచయం చేసుకుని….ఒబెరాయ్ విల్లా పని మీద వచ్చినట్టు చెప్పాడు.
దాంతో అతను రాముకి షేక్ హ్యాండ్ ఇస్తూ…..అక్కడ కుర్చీ చూపించి కూర్చోమన్నాడు.
రాము కుర్చీలో కూర్చుంటూ, “ఎలా ఉన్నారు సార్,” అని అడిగాడు.
ఓనర్ : బాగానే ఉన్నాను రాము గారు…..ఒబెరాయ్ విల్లా ఎలా ఉన్నది….బాగున్నదా…..
రాము : మీరు నాకన్నా పెద్దవారు….మా నాన్న వయసున్న వారు….నన్ను రాము అని పిలవండి చాలు….
ఓనర్ : అలాగే రాము…..ఇంతకు ముందు మీ నాన్నగారిని చూసాను….చాలా బాగా మాట్లాడారు….రిజిస్ట్రేషన్ కి వస్తానన్నారు. కాని అంతలో ఆయనకు ఒంట్లో బాగుండలేదని విన్నాను….ఇప్పుడెలా ఉన్నది….
రాము : ఇప్పుడు ఫరవాలేదంకుల్….బాగానే ఉన్నది.
ఓనర్ : ఇప్పుడు చెప్పు రాము…..ఇలా వచ్చావేంటి….
రాము : నేను ఆ ఒబెరాయ్ విల్లా గురించి తెలుసుకోవాలని మీ దగ్గరకు వచ్చాను అంకుల్….
ఓనర్ : తప్పకుండా రాము….ఇక్కడ నాతో మాట్లాడటానికి ఎవరూ లేరు….నువ్వు నాతో మాట్లాడతానంటే ఎందుకు వద్దంటాను.
అంటూ ఆయన ఏదో జోక్ వేసినట్టు పెద్దగా నవ్వాడు.
దాంతో రాము కూడా చిన్నగా నవ్వాడు.
రాము : సరె అంకుల్….మీకు ఆ ఒబెరాయ్ విల్లా వంశపారం పర్యంగా వచ్చిందా….లేక ఎవరిదగ్గర నుంచైనా కొన్నారా….
ఓనర్ : లేదు రాము….మా తాతగారు….సుమారు 30 ఏళ్ల క్రితం ఒక జమీందార్ ఫ్యామిలీ నుండి ఈ ఒబెరాయ్ విల్లాను కొన్నారు. ఆ తరువాత వాళ్ల వారసుడిగా నాకు వచ్చింది…..ఆ ఒబెరాయ్ విల్లాను మీ ద్వారా మిట్టల్ గ్రూప్ వారికి అమ్మాను…..అంతే….ఇందులో తెలుసుకోవాల్సినంతగా ఏమున్నది….
రాము : ఆ సంగతులు మొత్తం నేను ఇక్కడకు వచ్చే ముందు మా నాన్నగారి దగ్గర నుండి తెలుసుకున్నాను….నాకు కావల్సింది ఈ విషయాలు కాదు….ఆ ఒబెరాయ్ విల్లా వెనక దాగున్న రహస్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను….అది తెలుసుకుందామనే మీ దగ్గరకు వచ్చాను.
రాము మాట విని ఓనర్ నవ్వుతూ….
ఓనర్ : రహస్యమా….ఆ ఒబెరాయ్ విల్లాలో రహస్యం ఏమున్నది….అది ఇందులో నీకు చెప్పకూడనిది ఏమీ లేదు….
రాము : ఆ ఇంట్లో దెయ్యం ఉన్నది…..అది మీకు తెలుసా…..
ఓనర్ : ఏయ్ రాము…..ఏం మాట్లాడుతున్నావు….ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉన్నాయంటే నమ్ముతావా….ఇంత ఫూలిష్ గా మాట్లాడతావని అసలు అనుకోలేదు…..(అంటూ రాము వైపు వెటకారంగా చూస్తూ నవ్వుతున్నాడు.)
అతని నవ్వులో భావం అర్ధమయినా…..రాము ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా….
రాము : నేను కేవలం చూసిన దాన్నే నమ్ముతాను…..పైగా నేను అందరూ పుట్టించిన పుకార్లను నమ్మను…..నేను నా కళ్ళతో చూసినదాన్నే నమ్ముతాను…..
ఓనర్ : నువ్వు అలా చెబుతుంటే నాకు నవ్వొస్తున్నది రాము…..ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఏమీ చదువుకోని ఒక మూర్ఖుడు మాట్లాడుతున్నట్టు ఉన్నది…..పొద్దున్నే ఏమైనా తాగి వచ్చావా….
రాము : లేదు సార్….నాకు తాగుడు అలవాటు ఉన్నది….కాని ఏం మాట్లాడుతున్నానో తెలుసుకోలేనంతగా తాగే అలవాటు లేదు. నేను చదువురాని వాడిని కాదు….అంతకు మించి తెలివితక్కువవాడిని కూడా కాదు…..నేను MBA పూర్తి చేసాను….దానికితోడు నేను దేశం మొత్తం తిరిగాను….దెయ్యలకు, వాస్తవానికి మధ్య తేడా నాకు బాగా తెలుసు…..కాని ఆ ఒబెరాయ్ విల్లాలో ఏదో జరుగుతుంది….అది మీకు తెలుసు….కాని అదేంటో మీరు నాకు సరిగ్గా చెప్పడం లేదు….
రాము అలా సీరియస్ గా చెప్పేసరికి ఓనర్ మొహంలో అప్పటి దాకా కనిపించిన నవ్వు మాయమైంది.
ఓనర్ : చూడు రాము….నేను ఒక సలహా చెబుతాను విను….ఈ ఒబెరాయ్ విల్లా మొత్తం ఖరీదు 200 కోట్లు….ఈ ఒబెరాయ్ విల్లా అమ్మడం వలన నీకు వచ్చే బ్రోకరేజీ 4 కోట్లు….నేను ఒక బిజినెస్ మేన్ ని….నువ్వు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వి…..ఇందులో నీ డబ్బులు నీకు వచ్చేసాయి….అయిన మన అగ్రిమెంట్ లో మనం అమ్మబోయే ఇల్లు దెయ్యలు లేకుండా ఉండాలని ఏమీ రాసుకోలేదు కదా…. అంతగా నీకు ఆ ఒబెరాయ్ విల్లాలో దెయ్యాలు ఉన్నాయని అనిపిస్తే దాన్ని ప్రూవ్ చెయ్యి…..
ఆయన ఆ మాట అనగానే ఇక ఆయనతో మాట్లాడటం వలన ఉపయోగం లేదని అర్ధమయ్యి రాము అక్కడ నుండి వచ్చేసాడు.
అలా బయటకు వచ్చిన రాము కారు డ్రైవ్ చేస్తూ ఎలా ప్రూవ్ చెయ్యాలా అని ఆలోచిస్తూ అక్కడ ఒక కెమేరా షాప్ కనిపించేసరికి దాని ముందు కారు ఆపి తనకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కొని తిన్నగా ఎక్కడా ఆగకుండా ఒబెరాయ్ విల్లాకు వెళ్ళిపోయాడు.
ఒబెరాయ్ విల్లా ముందు కారు ఆపి ఇంతకు ముందు తాను కొన్న కెమేరాలు, వాటికి సంబంధించిన వాటిని తీసుకుని తిన్నగా ఇంతకు ముందు తాను అరుపులు విన్న గదిలోకి వెళ్ళి లోపల నాలుగు వైపులా కెమేరాలు గది మొత్తం కనిపించేలా ఫిక్స్ చేసాడు.
ఒక కెమేరా మాత్రం ఇంతకు ముందు తాను కుర్చిలో చూసిన ఫోటో ఫ్రేమ్, పియానో కనిపించేట్టుగా ఫిక్స్ చేసి తన బెడ్ రూమ్ లో కూర్చుని ఏం జరగబోతుందా అన్న టెన్షన్ తో ఎదురుచూస్తున్నాడు.
అలా చూస్తుండగానే రాత్రి అయింది…..అనసూయను రావద్దని చెప్పడంతో తాను తెచ్చుకున్న మీల్స్ పార్సిల్ ఓపెన్ చేసి భోజనం చేసాడు.
అలాగే అలోచిస్తూ డైనింగ్ టేబుల్ మీద తలపెట్టి నిద్ర పోయాడు రాము.
రాత్రి మూడు గంటలు అయ్యేసరికి మంచినిద్రలో ఉన్న రాముకి హఠాత్తుగా మెలుకువ వచ్చింది.
అతని చెవులకు ఎవరో ఒకామె పాట పడుతున్నట్టు వినిపించింది.
రాము ఆ పాట వింటూ చిన్నగా డైనింగ్ రూమ్ లోనుండి బయటకు వచ్చి తాను ఇంతకు ముందు కెమేరాలు పిక్స్ చేసిన గది దగ్గరకు వెళ్తున్నాడు.
ఆ పాట కూడా ఆ గదిలో నుండే వినిపిస్తున్నది.
రాము చిన్నగా శబ్దం కాకుండ ఆడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిన అతనికి ఆ రూమ్ డోర్ అద్దాలతో ఫిక్స్ చేసి ఉండటంతో, ఆ అద్దం లోనుండి ఆ గదిలో పియానో ముందు ఒకామె కూర్చుని పియానో ప్లే చేస్తూ పాట పాడుతుండటం చూసాడు.
అది చూసిన రాము భయంతో ఏం చూస్తున్నానో అర్ధం కాక అలా ఆమెను చూస్తూ రెండడుగులు వెనక్కు వేసి….మళ్ళి ధైర్యంగా ఆమెనే చూసూ ముందుకు అడుగులు వేసుకుంటూ తలుపు దగ్గరకు వచ్చాడు.
రాము అడుగులు తలుపు దగ్గరకు పడుతున్నకొద్దీ ఆమె గొంతు ఇంకా స్పష్టంగా వినిపిస్తున్నది.
రాము చిన్నగా వణుకుతున్న చేతులతో ఆ గది తలుపులు తెరిచి లోపలికి వెళ్ళి పియానో వైపు చూసాడు.
కాని ఆశ్చర్యంగా తాను ఇంతకు ముందు పియానో ప్లే చేస్తూ పాట పాడిన ఆమె కనిపించలేదు.
పియానో దగ్గరకు వెళ్ళి చుట్టూ చూసాడు….కాని ఏమీ కనిపించలేదు….
అంతలో గది బయట కారిడార్ లోనుండి ఒకామె అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్లడం రాము గమనించాడు.
దాంతో రాము కూడా వెంటనే ఆ గదిలో నుండి బయటకు వచ్చి శబ్దం వినిపించిన వైపు అతను కూడా పరిగెత్తాడు.
అలా పరిగెత్తిన రాము కారిడార్ చుట్టూ తిరిగి మళ్ళి ఇంతకు ముందు తాను కెమేరాలు పెట్టిన గది దగ్గరకు రాగానే ఆ గది తలుపులు వాటంతట అవే మూసుకుని లాక్ అయిపోయాయి.
ఆ లాక్ అయిపోయిన గదిలో నుండి ఎవరో అమ్మాయి బాధతో, భయంతో అరుస్తున్నట్టు కేకలు వినిపిస్తున్నాయి.
రాము ఆ గది డోర్ లాక్ ఓపెన్ చేద్దామని ట్రై చేస్తున్నప్పటికి అది రావడం లేదు.
లోపల గదిలో డోర్ కి ఉన్న అద్దాలలో నుండి ఏవో నీడలు కదలాడటం….వాటితో పాటు అమ్మాయి బాధతో కేకలు పెట్టడం రాము అంతా చూస్తున్నాడు.
కాని రాముకి లోపల ఏం జరుగుతుందో అర్ధం కాక….ఒబెరాయ్ విల్లా లో నుండి బయటకు వచ్చి ఇంకో వైపుకు వచ్చి ఆ గదిలొకి చూసేసరికి ఒకామె ఆ గదిలో ఉరేసుకుని వేలాడటం చూసాడు.
దాంతో రాము మళ్ళి ఒబెరాయ్ విల్లాలోకి వచ్చి అ గది దగ్గర ఉన్న స్టూల్ ఒకటి తీసుకుని ఆ డోర్ కి ఉన్న అద్దాలు పగలగొడదామని పైకి ఎత్తాడు.
కాని అంతలోనే ఆ గది తలుపులు చిన్నగా తెరుచుకున్నాయి….రాముకి ఏం జరుగుతుందో అర్ధం కాక తన చేతిలో ఉన్న స్టూల్ కింద పెట్టి గబగబ నడుచుకుంటూ ఆ గదిలోకి వెళ్ళి అంతా చూసాడు.
కాని తాను బయట నుండి చూసినప్పుడు ఉరేసుకుని వేలాడుతున్న అమ్మాయి కనిపించలేదు….ఆ అమ్మాయి ఉరేసుకున్నట్టు కనిపించిన షాండియానా గాలికి ఊగుతూ కనిపించింది.
రాము అయోమయంగా చుట్టూ చూసాడు….అక్కడ ఆ రూమ్ లో బాత్ రూమ్ లో నుండి సన్నగా ఏదో శబ్దం వస్తుండే సరికి బాత్ రూమ్ డోర్ తీసుకుని లోపలకి చూసాడు.
అలా చూస్తున్న రాముకి ఒక మూలగా విడిచిన బట్టలు వేసే పెద్ద బుట్టలాంటి దానిలో నుండి శబ్దం వస్తుండే సరికి…..దాని దగ్గరకు వెళ్ళి ఆ బుట్ట పైన ఉన్న మూత తీసి చూసాడు.
అంతే….అందులో ఒకామె తల మొండెం లేకుండా కనిపించేసరికి రాము భయంతో బాత్ రూమ్ లోనుండి వెనక్కు పరిగెత్తుతూ కాలికి కింద ఉన్న కార్పెట్ తట్టుకుని కింద పడ్డాడు.
రాము బిత్తర పోయి బాత్ రూమ్ వైపు చూస్తుండగా ఇందాక గాలికి ఊగిన షాండియానా ఒక్కసారిగా ఊడి తన మీద పడటం గమనించిన రాము ఏమాత్రం ఆలస్యం చేయకుండా పక్కకు తప్పుకున్నాడు.