Tollywood NewsTrending News

క్లైమాక్స్ సన్నివేశాల్లో మెగాస్టార్

క్లైమాక్స్ సన్నివేశాల్లో మెగాస్టార్

క్లైమాక్స్ సన్నివేశాల్లో మెగాస్టార్

 క్లైమాక్స్ సన్నివేశాల్లో మెగాస్టార్
క్లైమాక్స్ సన్నివేశాల్లో మెగాస్టార్
చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మెహెర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పతాక సన్నివేశాలను హైదరాబాద్ లోని మూసాపేట ప్రాంతంలో చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది.

మెగాస్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi) నటిస్తున్న ‘భోళాశంకర్’ (BholaaShankar) శరవేగంగా పూర్తి చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. మెహెర్ రమేష్ (MeherRamesh) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అజిత్ (AjithKumar) నటించిన ‘వేదాలమ్’ (Vedalam) సినిమాకి రీమేక్. ఇందులో కీర్తి సురేష్ (KeerthySuresh) చిరంజీవికి చెల్లెలుగా చేస్తుంటే, తమన్నా (TamannaahBhatia) కథానాయకురాలిగా వేస్తోంది. ఈ సినిమా ఆగష్టు 11 న విడుదల అవుతుందని ఈ చిత్ర నిర్వాహకులు అప్పుడే ప్రకటించేశారు కూడా.

chiranjeevikeerthysuresh.jpg

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పతాక సన్నివేశాలను ఇప్పుడు చిత్రీకరిస్తున్నట్టుగా తెలిసింది. హైదరాబాద్ లోని మూసాపేట ప్రాంతంలో గత కొన్ని రోజులనుండి ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరణ జరుగుతున్నట్టుగా యూనిట్ సభ్యులు తెలియచేసారు. ఈ షూటింగ్ రాత్రి పూట చేస్తున్నట్టుగా తెలిసింది. చిరంజీవి, కీర్తి సురేష్, సుశాంత్ (Sushanth), మురళి శర్మ (MuraliSharma), రవి శంకర్ ఇలా కొంతమంది ఈ షూటింగ్ లో పాల్గొన్నట్టుగా తెలిసింది. చిరంజీవి కి విలన్స్ కి మధ్య జరిగే క్లైమాక్స్ సన్నివేశాలను మూసాపేట లోని ఒక ప్రాంతంలో అనుకూలంగా ఉండటం వలన అక్కడ చిత్రీకరిస్తున్నటుగా తెలిసింది.

bholaashankar2.jpg

మెహెర్ రమేష్ చాలా కాలం తరువాత దర్శకత్వం చేస్తున్నాడు ఈ సినిమాతో. ఇందులో చిరంజీవి గెటప్ చాలా మాసీ గా ఉంటుందని కూడా తెలిసింది. ఇందులో టాక్సీ డ్రైవర్ గా కనపడతారు కాబట్టి, ఆ సన్నివేశాలు చాలా ఎంటర్ టైన్ గా వుంటాయని, చిరంజీవి తమన్నా మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగుంటాయని యూనిట్ సభ్యులు అంటున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button